Brahmamudi February 19th Episode : పగతో రగిలిపోతోన్న రుద్రాణి.. ఆస్తి మొత్తం కొట్టేసే కుట్ర
ఆస్తిని పంచొద్దని ఎప్పటిలాగే అందరం కలిసే ఉందామని అంతా చెప్పడంతో సీతారామయ్య తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. కళ్యాణ్- అప్పూని తీసుకురావాలని చెప్పడంతో ధాన్యలక్ష్మీ - ప్రకాశంలు కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అప్పూతో కలిసి ఇంటికొస్తారు. ఇద్దరూ ఇంట్లోకి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.
మనమంతా సంతోషంగా ఉండాలంటే రుద్రాణి ఈ ఇంట్లో ఉండకూడదని ఇందిర చెప్పడంతో సుభాష్, ప్రకాశం, అపర్ణ, స్వప్న, రాజ్‌లు సహా అంతా ఓకే అంటారు. చివరికి సీతారామయ్య కూడా రుద్రాణి, రాహుల్‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటారు. దీంతో నా ఆస్తి నాకు పంచితే తీసుకుని వెళ్లిపోతామని అంటుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 19వ తేదీ .. ఎపిసోడ్ 649లో ఏం జరిగిందంటే..

ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పడంతో రుద్రాణి వెళ్లి సీతారామయ్య కాళ్ల మీద పడుతుంది. ఇంట్లో గొడవలు నా వల్లే జరిగాయని ఇప్పుడు ఉన్నపళంగా వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్లమని అడుగుతుంది. నా కోడలు, దాని బిడ్డను చూసైనా క్షమించమని అడుతుంది. నా గురించి అంత దిగులు చెందాల్సిన అవసరం లేదని.. తాతయ్య గెట్ ఔట్ అన్నది మీ ఇద్దరినీ.. నన్ను కాదు అంటు స్వప్న పంచ్‌లు వేస్తుంది. నేను నా చెల్లెళ్లతో కలిసి జీవితాంతం ఇక్కడే ఉంటానని అంటుంది. మా అత్తది ఏడుపు కాదు.. నటన మీరు మాత్రం క్షమించొద్దు అని చెబుతుంది స్వప్న.
ఇక నుంచి ఈ ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోమని.. ఒక్క అవకాశం ఇవ్వండి అంటుంది రుద్రాణి.
మేం అంతా మా భర్తలతో హ్యాపీగా ఉంటుంటే .. నువ్వు నీ బిడ్డతో ఒంటరిగా ఉంటావా అని చెబుతుంది కావ్య. నీకు రాహుల్ వల్ల ఎలాంటి సుఖం, సంతోషం లేకపోయినా నీ బిడ్డకు తండ్రి కావాలని అంటుంది. అయితే మా అత్తని పంపించేసి, రాహుల్‌ని ఇక్కడే ఉంచండి అని చెబుతుంది స్వప్న. వాళ్ల వల్ల మా అక్క విసిగిపోయి అలా మాట్లాడుతోందని.. రుద్రాణి గారు చేసిన తప్పు వల్ల ఆ బిడ్డ తండ్రికి దూరమై బతకాల్సి వస్తుందని అంటుంది కావ్య. రుద్రాణి - రాహుల్ వెళ్లిపోతే అంతా మనశాంతిగా ఉంటామేమో కానీ ఆ బిడ్డకి అన్యాయమే జరుగుతుందని చెబుతుంది.
కావ్య చెబుతున్న దానిలో నిజముందని ఇందిరతో అంటాడు సీతారామయ్య. ఇక నుంచైనా బుద్ధిగా ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇందరి చెబుతుంది. రుద్రాణి తండ్రి నాకు జీవితాంతం ఎంతో సేవ చేశాడని, కంపెనీ విషయాల్లోనూ సలహాలు ఇచ్చి నా ఎదుగుదలకు దోహదపడ్డాడని అంటాడు. ఆయన మీద గౌరవంతో ఆఖరి అవకాశం ఇస్తున్నానని.. జాగ్రత్తగా ఉండమని రుద్రాణితో అంటాడు సీతారామయ్య. అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి పంపేయాలని చూస్తారా? మీ ఎవ్వరినీ వదిలిపెట్టనని రుద్రాణి కోపంతో రగిలిపోతుంది. నేను ఇంట్లో నుంచి అడుగుపెట్టిన నెక్ట్స్ మినట్ దుగ్గిరాల నిలయం స్మశానంగా మారుతుందని అంటుంది.

మీ నాన్న గారి లక్షణం నీకు ఒక్కటి కూడా రాలేదని.. నువ్వు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకమని సెటైర్లు వేస్తుంది స్వప్న. నువ్వు మీ అమ్మ వెనకాల తిరిగితే రేపో మాపో ఇంట్లో వాళ్ల అందరి కాళ్లు పట్టుకునేలా చేస్తుందని అంటుంది. ఆస్తిలో వాటా కాదు.. ఇకపై ఆస్తి మొత్తం నా పేరు మీదకి తెచ్చుకుంటానని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. మీరు రావడం చాలా సంతోషంగా ఉందని కళ్యాణ్‌తో అంటుంది కావ్య. నేను సెటిలయ్యే వరకు ఈ ఇంటికి రాకూడదనే అనుకున్నానని చెబుతాడు కళ్యాణ్. అమ్మానాన్న స్వయంగా వచ్చి పిలవడంతో రాక తప్పలేదని అంటాడు.
నీ కష్టంతో అప్పూని పోలీస్ ఆఫీసర్‌ని చేసి నాకన్నా మంచి పేరు సాధించావని కళ్యాణ్‌ని మెచ్చుకుంటాడు రాజ్. మీ తమ్ముణ్ని తన గురించి తాను ఆలోచించుకోమ్మని చెప్పమని అంటుంది ధాన్యలక్ష్మీ. దుగ్గిరాల వారి వారసుడంటే రాజ్ లాగా పేరు సంపాదించి పేపర్‌లోకి ఎక్కాలని .. తాను రాసుకున్న పేపర్‌ని చూసి మురిసిపోకూడదని చెబుతుంది. ఆమె మాటలతో అప్పూ ఒంటరిగా బాధపడుతుండగా కావ్య వస్తుంది . నన్ను కష్టపడి పోలీస్‌ని చేసి అందరూ నన్ను పొగుడుతుంటే తను పొంగిపోతున్నాడని.. అదే కళ్యాణ్ కూడా మంచి పొజిషిన్‌లో ఉండి ఉంటే అత్తయ్య కూడా సంతోషించేదని అంటుంది అప్పూ. మూడేళ్లు అగ్రిమెంట్ రాస్తే కళ్యాణ్ ఎప్పుడు ఎదుగుతాడని అప్పూతో అంటుంది కావ్య. ఇక నేను చూసుకుంటానంటూ కావ్యతో చెబుతుంది అప్పూ.

అనామికను లాగిపెట్టి కొడతాడు సామంత్. నువ్వు తోపువని, పెద్ద పుడింగివని ఇన్ని రోజులు నువ్వు చేసే ప్రతి పనికి నేను గొర్రెలా తల ఊపానని మండిపడతాడు. నన్ను నా ఇంట్లోనే ఆ రాజ్‌గాడు కొట్టేలా చేశావని ఫైర్ అవుతాడు. ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నా పేరు మీదకి వచ్చేలా చేస్తానని మాట ఇచ్చావని , అవన్నీ గాల్లో కలిసిపోయాయని అంటాడు. నాకు నీ మీద నమ్మకం పోయిందని, ఇంత జరిగాక నేను నీతో ఎందుకుంటానని మండిపడతాడు సామంత్. నీ పగలు, ప్రతీకారాల కోసం నా జీవితాన్ని సర్వ నాశనం చేశావని అంటాడు. నన్నే అవమానిస్తావా? నీ లెక్కలు, ఆ దుగ్గిరాల ఫ్యామిలీ లెక్కలు తేలుస్తానని మండిపడుతుంది అనామిక.
స్వీట్స్, ఆపిల్స్, క్యాండిల్స్ సిద్ధం చేస్తున్న కావ్యని ప్రశ్నిస్తాడు రాజ్. మీకు నాకు బూత్ బంగ్లా తప్ప ఏ స్థలం కలిసి రాలేదని అంటుంది కావ్య. నేను నెల తప్పాలి, మా అక్క లాగే పాపనో, బాబునో ఎత్తుకోవాలని ఉందని చెబుతుంది . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











