Brahmamudi February 20th Episode : ఉచ్చు బిగిస్తోన్న అనామిక.. దుగ్గిరాల ఫ్యామిలీకి మరో పెద్ద కష్టం
సీతారామయ్య కాళ్లపై పడి మమ్మల్ని ఇంట్లో నుంచి పంపొద్దని అంటుంది రుద్రాణి. స్వప్న కూడా నేను ఒంటరిగానే ఉంటానని, తాతయ్య ఇచ్చిన ఆస్తితో హాయిగా బతికేస్తానని చెబుతుంది. కానీ నీ బిడ్డకు తండ్రి లేని లోటు ఉంటుందని , వాళ్లకి ఓ అవకాశం ఇవ్వమని సీతారామయ్యతో అంటుంది కావ్య. ఆమె మాటకు విలువనిచ్చి రుద్రాణికి ఓ ఛాన్స్ ఇస్తారు సీతారామయ్య - ఇందిర. అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి పంపేయాలని అనుకుంటారా? మీ అందరి అంతు చూస్తానని రగిలిపోతుంది రుద్రాణి.
అప్పూని కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చావంటూ కళ్యాణ్‌ని మెచ్చుకుంటారు రాజ్ - కావ్య. కానీ వాడు ఇంకా బానిసలాగే బతుకుతున్నాడంటూ ధాన్యలక్ష్మీ అన్న మాటలతో అప్పూ బాధపడుతుంది. నువ్వు చేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో పాటు నాకు కోట్లలో నష్టం వచ్చిందని అనామికపై మండిపడతాడు సామంత్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 20వ తేదీ .. ఎపిసోడ్ 650లో ఏం జరిగిందంటే..

నేను నెల తప్పాలని అనుకుంటున్నానని.. అందుకే మనం బూత్ బంగ్లాకే వెళ్లాలని చెబుతుంది కావ్య. నాక్కూడా నువ్వు నెల తప్పాలనే ఉందని అంటాడు రాజ్. దానికి బూత్ బంగ్లా వరకు అక్కర్లేదంటూ భార్యాభర్తలిద్దరూ రొమాన్స్‌లో మునిగి తేలతారు. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే కళ్యాణ్‌కి మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతాడు. ఎందుకని కళ్యాణ్ అడగ్గా.. నా నెక్ట్స్ మూవీకి మొత్తం నువ్వే పాటలు రాస్తున్నావని చెప్పడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. కానీ అవకాశం వచ్చింది కదా అని గురువు గారికి ఇచ్చిన మాట తప్పనని అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు ఇంకా నచ్చావని చెబుతాడు మ్యూజిక్ డైరెక్టర్.
నమ్మినవాళ్లని వెన్నుపోటు పొడిచి అవకాశాలు చేజిక్కించుకుంటున్నారని కానీ నీలాంటి నిజాయితీపరులు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యకరంగా ఉందని కళ్యాణ్‌ని మెచ్చుకుంటాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్. నీకు ఈ అవకాశం ఇవ్వమని స్వయంగా మీ గురువుగారే నాకు ఫోన్ చేసి చెప్పారని అనడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. కావాలంటే ఒకసారి మీ గురువుగారికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోమని చెబుతాడు. వెంటనే లక్ష్మీకాంత్‌కి ఫోన్ చేసి నిజమేనా అని అడగ్గా ఔను అంటాడు లిరిక్ రైటర్.. ఆ మాటలతో కళ్యాణ్ షాక్ అవుతాడు.
నా అగ్రిమెంట్ టైమ్ ఇంకా పూర్తి కాలేదని.. అప్పుడే నాకు అవకాశం ఎందుకిచ్చారని కళ్యాణ్ అడుగుతాడు. నీ టాలెంట్ నచ్చి నిన్ను ప్రోత్సహించాలనే ఇలా చేశానని చెబుతాడు లక్ష్మీకాంత్. ఇంత త్వరగా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని అంటుండగా పక్కనే ఉన్న అప్పూని చూస్తాడు లక్ష్మీకాంత్. నీ అగ్రిమెంట్‌ని చించేస్తున్నానని, నీ నెంబర్ కూడా డిలీట్ చేస్తున్నానని అంటాడు. ఇంకోసారి అమాయకుల్ని వాడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని లక్ష్మీకాంత్‌కి వార్నింగ్ ఇస్తుంది అప్పూ.
డల్‌గా మెట్లు దిగుతున్న కళ్యాణ్‌ని ఏం జరిగిందని అడుగుతాడు ప్రకాశం. గట్టిగా పీకమంటావా నిజం చెబుతావా అని రాజ్ బెదిరించడంతో నాకు ఒక సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం వచ్చిందని చెప్పడంతో అందరూ సంతోషించి కంగ్రాట్స్ చెబుతారు. నీ కొడుకు వాడిని వాడు సొంతంగా నిరూపించుకున్నాడని ధాన్యలక్ష్మీతో అంటుంది ఇందిర. కావ్య వచ్చి స్వీట్స్ తీసుకొచ్చి తినిపిస్తుంది. స్వీట్స్ ఒక్కటేనా అని స్వప్న అడగ్గా.. నా తమ్ముడి కోసం రాత్రికి పెద్ద పార్టీ ఇస్తానని అంటాడు రాజ్.

రాత్రికి కేక్ తీసుకొచ్చి కట్ చేయమని కళ్యాణ్‌ని అందరూ అడగ్గా.. అప్పూని కూడా రమ్మని అంటాడు కళ్యాణ్. పానకంలా పుడలా ఈమెందుకు అంటూ ధాన్యలక్ష్మీ సూటిపోటీ మాటలు అంటుంది. కళ్యాణ్ ఒక్కడే కాదని.. నువ్వు కూడా కట్ చేయాలని అంతా అప్పూని అడుగుతారు. పోలీస్ ఆఫీసర్‌గా డ్యూటీ తీసుకున్న మొదటి రోజునే మమ్మల్ని , ఇంటిని కాపాడావని అప్పూని అంతా మెచ్చుకుంటారు. దాంతో ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు. రాహుల్ కేక్ తినిపించడానికి రాగా అప్పూ కోపంగా చూడటంతో నేనేం తప్పు చేయలేదని అంటాడు.
కేక్ కటింగ్ తర్వాత అంతా ఆటపాటలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో మీ ఫ్యాక్టరీకి ఎవరో మంటలు అంటిస్తున్నారని రాజ్‌కు ఫోన్ రావడంతో అతను కంగారుగా బయల్దేరి వెళతాడు. భర్తలో కంగారు చూసిన కావ్య ఏం జరిగిందో కనుక్కోవాలని అనుకునేలోపు రాజ్ వెళ్లిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










