Brahmamudi February 21st Episode : సామంత్ హత్య.. రాజ్‌ని అరెస్ట్ చేసిన అప్పూ, ఉరి తీయిస్తానంటూ అనామిక

కావ్య - రాజ్‌లు ఏకాంతంగా ఒక్కటవుతారు. ఉదయాన్నే నిద్రలేచిన కళ్యాణ్‌కి మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి నీకు నా సినిమాలో మొత్తం పాటలు రాసే అవకాశం ఇస్తున్నట్లు చెబుతారు. ఈ విషయాన్ని నమ్మని కళ్యాణ్ వెంటనే రైటర్ లక్ష్మీకాంత్‌కి ఫోన్ చేస్తాడు. నేనే నీకు అవకాశం ఇవ్వమని చెప్పినట్లు కళ్యాణ్‌తో అంటాడు లక్ష్మీకాంత్ . నువ్వు చెప్పినట్లే చేశానని పక్కనే ఉన్న అప్పూతో చెబుతాడు లక్ష్మీకాంత్.

తనకు రైటర్‌గా ఛాన్స్ దొరికినట్లు ఇంట్లో వాళ్లకి కళ్యాణ్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. సాయంత్రం తన తమ్ముడి కోసం గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేస్తాడు రాజ్ . కళ్యాణ్ - అప్పూలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వారికి తినిపిస్తారు. ఇంతలో ఓ వ్యక్తి రాజ్‌కి ఫోన్ చేసి మన ఫ్యాక్టరీకి ఎవరో నిప్పు పెడుతున్నారని చెప్పడంతో కంగారుగా వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 21వ తేదీ .. ఎపిసోడ్ 651లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 651 February 21st 2025 Here is full story

రాజ్ హడావుడిగా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసరికి కొందరు దుండగులు ఫ్యాక్టరీపై పెట్రోల్ పోసి నిప్పు అంటించేందుకు ప్రయత్నిస్తుంటారు. రాజ్‌ని చూసి వాళ్లు పారిపోతుండగా ఓ రాడ్డు తీసుకుని వారి వెనుక పరిగెత్తుతాడు రాజ్. దుగ్గిరాల ఫ్యామిలీ ఆనందంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన రుద్రాణి వెంటనే అనామికకి ఫోన్ చేస్తుంది. అది చేస్తా ఇది చేస్తానని అన్ని ఫెయిల్ చేస్తున్నావని మండిపడుతుంది రుద్రాణి. 100 కోట్ల ష్యూరిటీ గురించి నాకు ముందే చెబితే నా వాటా నేను తీసుకుని సేఫ్ జోన్‌లోకి వచ్చేదాన్నని అంటుంది రుద్రాణి. పగ తీర్చుకునేవాళ్ల లక్షణాలు నీలో కనిపించడం లేదని అనడంతో రుద్రాణిపై మండిపడుతుంది అనామిక

ఈసారి ఆ ఇంట్లో కురుక్షేత్రం కాదు ఏకంగా లంకా దహనమే జరగబోతోందని.. రేపు ఆ ఇంట్లో చీకట్లు అలుముకుంటాయని అంటుంది అనామిక. జరగబోయేది చూస్తూ ఉండమని చెబుతుంది. రాత్రి వచ్చిందెవరు? కంపెనీని ఎందుకు తగలబెట్టాలని అనుకున్నారని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఉదయాన్నే కాఫీ తీసుకోమని వచ్చిన కావ్యను వద్దంటూ కోప్పడతాడు . రాజ్ వైఖరితో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. ఉదయం నుంచి అందరి మీదా ఇలాగే అరుస్తున్నావ్? ఏదైనా పొరపాటు పని చేశావా అని రుద్రాణి ప్రశ్నించడంతో నీ పని నువ్వు చేసుకో అంటూ మండిపడతాడు రాజ్.

ఇంతలో అప్పూ తన సిబ్బందితో కలిసి లోపలికి వస్తుంది. సామంత్‌ కనిపించడం లేదని, నీ మీద అనుమానంగా ఉన్నట్లు అనామిక కంప్లయింట్ ఇచ్చిందని చెబుతుంది. ఇల్లు సోదా చేసేందుకు సెర్చ్ వారెంట్‌తో వచ్చానని అప్పూ చెప్పడంతో.. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? అంటూ ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. నేను ఈ ఇంటి కోడలిగా రాలేదని, ఓ బాధ్యత గల పోలీస్ ఆఫీసర్‌గా వచ్చానని చెబుతుంది అప్పూ. సామంత్ కనిపించకపోవడానికి, నాకు ఏంటి సంబంధం ? అనామిక నన్ను అనుమానించడం ఏంటి అని నిలదీస్తాడు రాజ్.

సంబంధం ఉందని అనామిక లోపలికి వస్తుంది. నంద విషయంలో సామంత్‌తో గొడవ పడ్డావని, అతనిని చంపేస్తానని బెదిరించావని చెబుతుంది. నువ్వే ఏదో చేసి ఉంటావ్? సామంత్‌ని ఎక్కడ దాచావని నిలదీస్తుంది అనామిక. సెర్చ్ వారెంట్‌తో వచ్చి సైలెంట్‌గా ఉన్నారేంటి ? బంధాలు, బంధుత్వాలు మీ డ్యూటీకి అడ్డొస్తున్నాయా అంటూ అప్పూపై మండిపడుతుంది . నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు పాటించమని కావ్య, సీతారామయ్యలు అప్పూకి చెబుతారు. ఆ వెంటనే ఇళ్లంతా సోదాలు చేయమని కానిస్టేబుల్స్‌కి ఆర్డర్ వేస్తుంది అప్పూ. ఎక్కడా ఏం దొరకలేదని కానిస్టేబుల్స్ చెప్పగా.. సెర్చ్ చేయమంటే లోపలే కాదు బయట కూడా చేయాలని అంటుంది అనామిక.

బయట కూడా వెతకమని అనామిక కానిస్టేబుల్స్‌కి చెప్పడంతో ఇళ్లంతా వెతుకుతారు. చివరికి రాజ్ కారుని సెర్చ్ చేస్తుండగా.. డిక్కీలో సామంత్ డెడీ బాడీ కనిపించడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఎంత కోపం వస్తే మాత్రం ప్రాణం తీస్తావా అంటూ రాజ్ చొక్కా పట్టుకుని నిలదీస్తుంది అనామిక. మీ కుటుంబం చాలా గొప్పదని విలువల కోసం ప్రాణాలు ఇస్తామని చెబుతారు కదా అంటూ సీతారామయ్యపైనా మండిపడుతుంది. ఇంతలో మీడియా ప్రతినిధులు వచ్చి ఏం జరిగిందని చెప్పడంతో సామంత్ గ్రూప్ ఎండీ సామంత్‌ని స్వరాజ్ గ్రూప్ ఎండీ రాజ్ చంపేశాడని దారుణంగా హత్య చేశాడని అంటుంది.

ఇదంతా అబద్ధమని, నా భర్త నిండు ప్రాణం తీసేంత దుర్మార్గుడు కాదని కావ్య ఏడుస్తూ చెబుతుంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని ఎవరో కుట్ర చేస్తున్నారని రాజ్ అంటాడు. ఆఫీసుకొచ్చి సామంత్‌ని చంపేస్తానని బెదిరించాడని, అన్నట్లుగానే చంపేశాడని ఇతనిని ఇలాగే వదిలేస్తే సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తాడని అంటుంది అనామిక. బావని అరెస్ట్ చేయక తప్పదని అప్పూ అనడంతో అంతా షాక్ అవుతారు. అంతా అప్పూపై మండిపడటంతో చట్టాన్ని గౌరవించి రాజ్‌ని అప్పగించాల్సిందేనని సుభాష్ అందరికీ నచ్చచెబుతాడు. దీంతో రాజ్‌ చేతికి బేడీలు వేసి అప్పూ అరెస్ట్ చేస్తుంది. నిన్ను ఉరికంభం ఎక్కించే వరకు వదలనని అనామిక హెచ్చరిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X