Brahmamudi February 22nd Episode : రాజ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోన్న అనామిక.. విలన్‌లా మారిన అప్పూ, కావ్య కంటతడి

ఫ్యాక్టరీ తగలబడుతున్నట్లు ఫోన్ రావడంతో రాజ్ హడావుడిగా బయల్దేరతాడు. రాజ్ వెళ్లేసరికి వాచ్‌మెన్ దెబ్బలతో పడి ఉంటాడు.. అతనిని చూడగానే దుండగులు భయంతో పరుగులు తీస్తారు. ఇంట్లో వాళ్ల ఆనందం చూడలేకపోతున్నానని ఏదో ఒకటి చేయమని అనామికతో అంటుంది రుద్రాణి. రేపు నేను పేల్చబోయే దెబ్బకి దుగ్గిరాల వారింటిలో లంకా దహనమే అంటుంది.

ఉదయాన్నే కాఫీ ఇస్తున్న కావ్యపై మండిపడతాడు రాజ్. ఇంతలో అప్పూ తన సిబ్బందితో కలిసి దుగ్గిరాల వారింటికి వస్తుంది. సామంత్ కనిపించడం లేదని బావగారిపై అనుమానంతో అనామిక కంప్లయింట్ ఇచ్చిందని చెబుతుంది అప్పూ . నీ డ్యూటీ నువ్వు చేయమని సీతారామయ్య పర్మిషన్ ఇస్తాడు. అనామిక వచ్చి ఇళ్లంతా సెర్చ్ చేయమని చెప్పడంతో పోలీసులు ఇళ్లంతా వెతుకుతుండగా రాజ్ కారులో సామంత్ డెడ్ బాడీ దొరుకుతుంది. అనుమానంతో రాజ్‌ను అరెస్ట్ చేస్తుంది అప్పూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 22వ తేదీ .. ఎపిసోడ్ 652లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 652 February 22nd 2025 Here is full story

రాజ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుంది అప్పూ.. నిన్ను ఉరికంభం ఎక్కించే వరకు వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది అనామిక. ఇంతలో అనామిక వైపు అనుమానంగా చూస్తుంది రుద్రాణి. సామంత్ హత్య , రాజ్ అరెస్ట్ విషయం గురించి కనకానికి ఫోన్ చేసి చెబుతుంది స్వప్న. అల్లుడు గారు అలాంటి వారు కాదని కనకం అనగా.. రాజ్ కారులో సామంత్ శవం దొరికిందని, సాక్ష్యాధారాలన్నీ అతనికి ప్రతికూలంగా ఉన్నాయని అంటుంది స్వప్న. ఇప్పుడిప్పుడే పరిస్ధితులు చక్కబడుతున్నాయని కానీ అప్పూ ఇప్పుడు అందిరికీ శత్రువుగా మారిపోయిందని బాధపడుతుంది కనకం. కావ్య అంత తేలిగ్గా వదిలే రకం కాదని , ఎలాగైనా రాజ్‌ని కాపాడుతుందని అంటుంది స్వప్న.

మీరు ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది అప్పు. తనకు ఫ్యాక్టరీ తగలబెడుతున్నట్లుగా కాల్ వచ్చిందని ఈ విషయం ఇంట్లో చెబితే అంతా డిస్ట్రబ్‌ అవుతారని నేను ఒక్కడినే అక్కడికి వెళ్లినట్లు చెబుతాడు రాజ్. ఎవరు వాళ్లు? ఎందుకు ఫ్యాక్టరీ తగలబెట్టాలని అనుకున్నారని? అప్పు ప్రశ్నిస్తంది. అది తెలుసుకుందామనే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లానని , వారిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించానని అంటాడు రాజ్.

సామంత్‌ని చంపేస్తానని బెదిరించారని, కోపంలో మీరే చంపేశారా అని ప్రశ్నిస్తుంది అప్పూ. నేను ఏ హత్య చేయలేదని కోపంగా చెబుతాడు రాజ్. నా ప్రాణం పోయినా ఇంకోకరి ప్రాణం తీసే మనిషిని కాదని అంటాడు. నా కుటుంబం, నా ఉద్యోగులు నా మీదే ఆధారపడి ఉన్నారని.. నేనేం పనిచేసినా వీళ్లందరినీ గుర్తు చేసుకుంటానని అంటాడు రాజ్. ఎవరో కావాలనే నన్ను ఇరికించారని చెబుతాడు. సుభాష్ - కావ్యల ముందే రాజ్‌ని జైల్లో వేస్తుంది అప్పూ. సాక్ష్యాలన్నీ బావకి వ్యతిరేకంగానే ఉన్నాయని.. సామంత్ డెడ్ బాడీని పోస్ట్‌మార్టానికి పంపించామని ఒక్క క్లూ దొరికినా బావని బయటికి తీసుకొస్తానని చెబుతుంది.

జైల్లో రాజ్‌ను కలిసి బాధపడతారు సుభాష్ - కావ్య. పోలీసులు, అనామిక, మీడియా ప్రతినిధులు వెంట వెంటనే మనింటికి రావడం వెనుక ఏదో కుట్ర ఉందని రాజ్ అనుమానిస్తాడు. ఇదంతా అనామిక పనేనని డౌట్‌గా ఉందని అంటాడు రాజ్. అంటే సామంత్‌ని కూడా అనామికే చంపి ఉంటుందా అని కావ్య ప్రశ్నిస్తుంది. పగ, ప్రతీకారాల కోసం ఏమైనా చేయొచ్చు అని అంటాడు రాజ్. నిన్ను మేం విడిపించుకుంటామని చెబుతాడు సుభాష్. నేను ఏ తప్పు చేయలేదని, త్వరలోనే తిరిగొస్తానని తాతయ్యతో చెప్పమని అంటాడు రాజ్.

స్టేషన్ బయట సుభాష్ - కావ్యలకు అనామిక ఎదురుపడుతుంది. ఈ హత్య కూడా నీ పనేనని అంటాడు సుభాష్. నా గురించి తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన సామంత్‌ని నేనెందుకు చంపుకుంటానని అంటుంది అనామిక. నాకు కాబోయే భర్తను చంపిన రాజ్‌ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది. నిజం ఎప్పటికైనా బయటికొస్తుందని.. ఇదంతా చేసింది నువ్వేనని తెలిసిన రోజున నిన్ను వదిలిపెట్టనని అంటుంది కావ్య. త్వరలోనే రాజ్ హంతకుడని కోర్ట్ తీర్పు ఇస్తుందని , ఆ తర్వాత జీవితాంతం అతను జైల్లో ఉండాల్సిందేనని చెబుతుంది అనామిక.

రాజ్ జైలుకు వెళ్లడంతో ఇంట్లో అంతా బాధపడుతుంటారు. ఇంతలో డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చిన అప్పూని ఆగమని కోప్పడుతుంది ధాన్యలక్ష్మీ. ఈ ఇంటికి నిన్ను రప్పించడం కోసం రాజ్ ఎంతో కష్టపడ్డాడని, అలాంటిది నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టగానే మా రాజ్‌ని అరెస్ట్ చేశావని మండిపడుతుంది. అనామిక ఎలాంటిదో నీకు తెలియదా? ఇప్పటిదాకా ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో నీకు తెలియదా? అని ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మీ. రాజ్‌ను అరెస్ట్ చేయమని నా కొడుకు నిన్ను పోలీస్‌ని చేశాడా అంటూ మండిపడుతుంది. ఇంటి మనిషిని అరెస్ట్ చేసి ఎన్ని మెడల్స్ సాధించావని సెటైర్లు వేస్తుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X