Brahmamudi February 24th Episode : అప్పూకి బాసటగా కళ్యాణ్ .. లాయర్ ప్రశ్నలతో కావ్య ఉక్కిరిబిక్కిరి
రాజ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తుంది. రాజ్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని కనకానికి ఫోన్ చేసి చెబుతుంది అప్పూ. పోలీస్ స్టేషన్‌లో రాజ్‌ను ఇంటరాగేషన్ చేస్తుంది అప్పూ . ఫ్యాక్టరీని ఎవరో తగలబెడుతున్నట్లుగా తనకు ఫోన్ వస్తే బయటికి వెళ్లానని , అక్కడ తనను చూసి దుండగులు పారిపోయారని చెబుతాడు రాజ్.
సాక్ష్యాలన్నీ బావగారికి వ్యతిరేకంగా ఉన్నాయని స్టేషన్‌కొచ్చిన కావ్య- సుభాష్‌లకు చెబుతుంది అప్పూ. తనను ఎవరో ప్లాన్ ప్రకారం ఈ కేసులో ఇరికించారని కావ్యతో అంటాడు రాజ్. స్టేషన్ బయట సుభాష్ - కావ్యలకి అనామిక ఎదురై రాజ్‌ను ఉరికంభం ఎక్కించే వరకు వదిలిపెట్టనని అంటుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చిన అప్పూని రాజ్‌ని ఎందుకు అరెస్ట్ చేశావంటూ ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 24వ తేదీ .. ఎపిసోడ్ 653లో ఏం జరిగిందంటే..

రాజ్‌ను అరెస్ట్ చేసేందుకు అనామిక దగ్గర ఎంత తీసుకున్నావ్ అంటూ రుద్రాణి అనేసరికి అప్పూ మండిపడుతుంది. బావ నా భర్తకు అన్నగారే కాదు.. నా అక్కికి భర్త అని నా ప్రాణం పోయినా అలాంటి పనులు చేయనని అంటుంది అప్పూ. నిన్ను , కళ్యాణ్‌ని ఇంటికి తీసుకురమ్మని అందరికన్నా మా అక్కే ఎక్కువ చెప్పిందని.. ఇప్పుడు మా అక్కకి అన్యాయం చేశావని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. అప్పూ ప్లేస్‌లో ఎవరున్నా ఇలాగే చేసేవారని అంటాడు కళ్యాణ్. నా భర్తను నిర్దోషిగా బయటికి తీసుకొద్దామని, నా చెల్లెలు చట్టానికి లోబడి ఆయనను అరెస్ట్ చేసిందని ఆమెను తప్పుగా అనుకోవద్దని అంటుంది కావ్య.
రాజ్ జైల్లోకి వెళ్లడంతో ఇందిర- సీతారామయ్య, సుభాష్ - అపర్ణ, కావ్యలు రాత్రి బాధపడతారు. ఏడుస్తున్న అపర్ణ దగ్గరికి భోజనం తీసుకుని వస్తుంది. ఆయన ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుసునని.. రేపు జైలు నుంచి ఇంటికొచ్చాక నవ్వుతూ ఎదురెళ్లాలంటే మీ ఆరోగ్యం బాగుండాలిగా అని అంటుంది కావ్య. రాజ్‌ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదేనని.. అప్పూ, నేను అదే పనిలో ఉన్నామని చెబుతుంది. ఈ మాటలను విన్న అప్పూ గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. నేను పోలీస్ అయ్యింది ఇందుకేనా? నా కుటుంబాన్నే నేను శిక్షించుకుంటున్నా అంటూ కళ్యాణ్‌ని పట్టుకుని ఏడుస్తుంది. నువ్వు ఏ తప్పూ చేయలేదని కళ్యాణ్ చెబుతున్నా వినిపించుకోకుండా అప్పూ బాధపడుతుంది. అన్నయ్య నిర్దోషని ఈ సమాజానికి చూపించమని ఆమెకు కళ్యాణ్ చెబుతాడు.
రాజ్‌ను తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా .. చిక్కు ప్రశ్నలు అడుగుతాడు లాయర్. సామంత్‌ని హత్య చేసి శవాన్ని మాయం చేసే క్రమంలో రాజ్ దొరికిపోయాడని అంటాడు. డిఫెన్స్ లాయర్ మాట్లాడుతూ.. నా క్లయంట్ రాజ్‌ను ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ హత్యలో ఇరికించారని ఆరోపిస్తాడు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయా? అని న్యాయమూర్తి ప్రశ్నిస్తారు. గుణగణాలు , ఫ్యామిలీ గ్రౌండ్‌ని బట్టి నిర్దోషిగా చెప్పేస్తారా అంటూ ప్రాసిక్యూటర్ మండిపడతాడు. ఇంతలో ఇద్దరు లాయర్లు గొడవ పడతారు. తన వాచ్ పోయిందని.. ఈయన నా మీదకి వచ్చారు కాబట్టి, ఈయనే దొంగతనం చేశారంటూ రాజ్ తరపు లాయర్ అంటాడు.
దీంతో పీపీగారి జేబుని చెక్ చేయమని ఆదేశిస్తారు న్యాయమూర్తి. కానిస్టేబుల్ వచ్చి చెక్ చేయగా ఆ వాచ్ అనామిక లాయర్ జేబుతో దొరకడంతో అంతా షాక్ అవుతారు. ఇది నా వాచేనని ఈయనే దొంగని చెబుతాడు రాజ్ లాయర్. వాచ్ నా జేబులో దొరికితే నేను దొంగని అవుతానా అని అనామిక లాయర్ ఎదురు ప్రశ్నిస్తాడు. ఈ కేసు విషయంలోనూ ఇలాగే జరిగిందని నేనే ఆయన జేబులో ఆ వాచ్ వేశానని అది ఆయనకు కూడా తెలియదని , నేను వాచ్ పెట్టినట్లే నా క్లయంట్ రాజ్ కారులో సామంత్ డెడ్ బాడీని ఎవరో పెట్టారని అంటాడు లాయర్.
డిఫెన్స్ లాయర్ చాలా చాకచక్యంగా నన్ను ముద్దాయిని చేసి ముద్దాయిని జెంటిల్‌మెన్‌గా చేశారని అంటాడు అనామిక లాయర్. రాజ్ ఎంత ఆవేశపరుడో, మృతుడిపై ఎలా దాడి చేశాడో చెప్పడానికి తాను కావ్య గారిని ప్రశ్నించాలని అనుకుంటున్నట్లు జడ్జి అనుమతి తీసుకుంటాడు . దీంతో కావ్య బోనులోకి వచ్చి నిలబడుతుంది. మీరిద్దరూ కలిసి సామంత్ ఇంటికి ఆవేశంగానే వెళ్లారా లేదా అని లాయర్ నిలదీసేసరికి కావ్య కంగారు పడుతుంది. ఆవేశంగా వెళ్లిన మాటే నిజమే కానీ, నందా మా చిట్‌ఫండ్ కంపెనీని మోసం చేశారని దీంతో సామంత్‌కి వార్నింగ్ ఇవ్వాలనే అక్కడికి వెళ్లామని చెబుతుంది కావ్య.


Click it and Unblock the Notifications










