Brahmamudi February 26th Episode : అనామిక దెబ్బకి వణికిన రుద్రాణి.. దుగ్గిరాల ఫ్యామిలీకి అప్పూ గుడ్‌న్యూస్
సామంత్‌ను బెదిరించాలని వార్నింగ్ ఇచ్చామని.. చంపడానికి కాదని కోర్టులో చెబుతుంది కావ్య. నా క్లయంట్ కారులో శవం దొరికినంత మాత్రాన రాజ్‌నే హంతకుడిగా ఎందుకు అరెస్ట్ చేశారని అప్పూని ప్రశ్నిస్తాడు లాయర్. తన క్లయంట్‌కు బెయిల్ మంజూరు చేయాలని రాజ్ తరపు లాయర్ కోరతాడు.
రాజ్‌కు ఆస్తి, అంతస్తు, పలుకుబడి ఉన్నాయని ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేయగలరని అనామిక లాయర్ అంటారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి .. రాజ్‌కు బెయిల్ నిరాకరిస్తాడు. నీ సాక్ష్యం వల్లే రాజ్ జీవితం తలకిందులైందని కావ్యపై అరుస్తుంది అపర్ణ. దీంతో ఇందిర కలగజేసుకుని కావ్యకి అండగా నిలుస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 26వ తేదీ .. ఎపిసోడ్ 655లో ఏం జరిగిందంటే..

బావగారిని ఈ కేసులో నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదేనని చెబుతుంది అప్పూ . నాకు తోడుగా మా అక్క ఉందని అది చాలని అంటుంది. కేసు ఫైల్ ముందు పెట్టుకుని ఎటు నుంచి దర్యాప్తు చేయాలని అప్పూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావడంతో దానిని కావ్యకి చెబుతుంది. సామంత్‌ని ఎవరో ఐరన్ రాడ్ లాంటి వెపన్‌తో కొట్టి చంపినట్లుగా రిపోర్ట్ వచ్చిందని.. మనకి ఆ రాడ్ దొరికితే ఈ కేసులో అసలు హంతకుడు బయటికి వస్తాడని అంటుంది. ఈ కథ మొదలైంది నా భర్త ఫ్యాక్టరీకి వెళ్లొచ్చిన తర్వాతేనని .. మనం అక్కడి నుంచి మొదలుపెడితే ఏదైనా క్లూ దొరకొచ్చని అప్పూతో కావ్య చెబుతుంది.
వాళ్లకి కావాల్సింది ఫ్యాక్టరీని తగలబెట్టడం కాదని.. బావని ఫ్యాక్టరీకి రప్పించడం లాంటిదని అప్పూ అంటుంది. తెలివిగా సామంత్ డెడ్ బాడీని బావ కారులో పెట్టి ఆయనను ఇరికించారని అంటుంది. ఈ కథకు త్వరలోనే ముగింపు పలుకుతానని చెబుతుంది. ఇంతలో అనామికకు రుద్రాణి ఫోన్ చేసి మెచ్చుకుంటుంది. మరి నన్ను చేతకాని దానిలా చూశారని, నానామాటలు ఎందుకు అన్నారని ప్రశ్నిస్తుంది అనామిక. నీ గురించి తెలియక, నీ ప్లానింగ్ తెలియక అలా అన్నానని సారీ చెబుతుంది రుద్రాణి.
అప్పూ చేతితోనే రాజ్‌ని అరెస్ట్ చేయించడం హైలైట్‌గా నిలిచిందని అంటుంది రుద్రాణి. మీకు రావాల్సిన వాటా తీసుకుని త్వరగా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేయండి అని చెబుతుంది అనామిక. అంతా బాగానే ఉంది కానీ నీ పగ కోసం సామంత్ చావుని కూడా వాడుకున్నావ్ అని అంటుంది రుద్రాణి. నా పగ కోసం కట్టుకున్న భర్తని వదిలేసినా, కాబోయే భర్తని బలిచ్చినా తేడాయే లేదని చెబుతుంది అనామిక. పగ కోసం మనుషుల ప్రాణాల తీయడానికి కూడా వెనుకాడటం లేదు అనామికతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది రుద్రాణి.
ఉదయాన్నే అప్పూ, కావ్యలు ఫ్యాక్టరీకి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. నన్ను కొట్టి కొందరు వ్యక్తులు ఫ్యాక్టరీని తగలబెట్టబోయారని నేను వెంటనే రాజ్ సర్‌కు ఫోన్ చేశానని వాచ్‌మెన్ చెబుతాడు. సార్ వాళ్లని తరుముకుంటూ బయటికి వచ్చారని.. కానీ అప్పటికే దుండగులు పారిపోయారని అంటాడు. అనంతరం అప్పూ తన సిబ్బందితో ఫ్యాక్టరీ మొత్తం గాలిస్తుండగా వారికి ఐరన్ రాడ్ కనిపిస్తుంది. దీని మీద ఉన్న వేలిముద్రలను బట్టి నిందితుడు ఎవరో తేలిపోతుందని చెబుతుంది అప్పూ.
రాజ్ గురించి ఏడుస్తున్న అపర్ణకి జ్యూస్ తీసుకొచ్చి తాగమని చెబుతుంది ఇందిర. ఇంతలో అప్పూ వచ్చి బావగారు తప్పకుండా బయటికి వస్తాడని అంటుంది. నువ్వేమైనా జ్యోతిష్యం నేర్చుకున్నావా? అంటూ రుద్రాణి సెటైర్లు వేస్తుంది. మీలాంటి వాళ్లు జోక్యం చేసుకోకుండా ఉంటే బావగారు నిర్దోషిగా బయటికి వస్తారని చెబుతుంది. బావ విడుదల కావడానికి కావాల్సిన కీలక సాక్ష్యాధారం దొరికిందని, దాని మీదున్న ఫింగర్ ప్రింట్స్ ఎవరివో బయటికి వస్తే నేరస్తుడెవరో తేలిపోతుందని అంటుంది. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీ చాలా సంతోషిస్తుంది.
అప్పూ మాటలతో రాజ్ బయటికి వచ్చేస్తాడా అని రుద్రాణి టెన్షన్ పడుతుంది. స్టేషన్‌లో ఉన్న రాజ్‌కి భోజనం తీసుకొస్తుంది కావ్య. మీకేం భయం లేదా అని కావ్య అడగ్గా.. నువ్వు చాలాసార్లు నన్ను కాపాడావని, ఇందులో నుంచి కూడా బయటపడేస్తావని చెబుతాడు రాజ్. తర్వాత రాజ్‌కి భోజనం తినిపిస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











