Brahmamudi February 28th Episode : అనామికకి షాకిచ్చిన రాజ్.. కావ్య చేతికి కీలక ఆధారం, రంగంలోకి అప్పూ
జైళ్లో ఉన్న రాజ్‌కి భోజనం తినిపిస్తుంది కావ్య. ఎంత కష్టమైనా మిమ్మల్ని విడిపిస్తానని రాజ్‌తో అంటుంది కళావతి. ఉదయాన్నే రాజ్‌ను కోర్టులో హాజరుపరచడంతో పాటు ఫ్యాక్టరీలో దొరికిన ఐరన్ రాడ్, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేస్తుంది. అయితే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినట్లు జడ్జి చెప్పడంతో అంతా షాక్ అవుతారు
రాజ్ తరపు లాయర్ చిన్న లాజిక్ చెప్పి సరైన సాక్ష్యాధారాలు సమర్పించేందుకు కోర్టును సమయం కోరతాడు. సాక్ష్యాన్ని తీసుకొచ్చి నువ్వే మీ బావగారిని మరింత ఇరికించావని , రాజ్‌కు ఫేవర్‌గా ఎలాంటి సాక్ష్యాలు దొరకవని అతనికి యావజ్జీవ జైలు శిక్షేనని చెబుతుంది అనామిక. ఇంటికొచ్చాక అప్పూని నానామాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 28వ తేదీ .. ఎపిసోడ్ 657లో ఏం జరిగిందంటే..

మీకు ఆ అనామిక ఫ్రెండే కదా? అక్కడ ఏం జరిగిందో కొంచెం కనుక్కుని చెప్పమని రుద్రాణిని నిలదీస్తుంది కావ్య. నేను నోరు విప్పితే వేరే లెవల్‌లో ఉంటుందని, మీకు మీ కొడుకు తప్పించి కనీసం మీ మనవరాలి మీదైనా ప్రేమ పుట్టిందా అని ప్రశ్నిస్తుంది. అప్పూని టార్గెట్ చేయడం ఆపకపోతే.. మేం ముగ్గురుం టార్గెట్ చేస్తే మీరు తట్టుకోలేరని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. దీంతో సుభాష్‌కి కంప్లయంట్ చేస్తుంది రుద్రాణి. ఈ గొడవలు కాదని మనం 24 గంటల్లో అసలు హంతకుడిని పట్టుకోకపోతే జీవితాంతం రాజ్ జైళ్లోనే బతకాల్సి ఉంటుందని అంటాడు సుభాష్.
రాజ్‌కి భోజనం తీసుకొస్తుంది కావ్య. నేను మీకు సాయం చేయకపోగా.. సమస్యని మరింత పెద్దది చేశానని బాధపడుతుంది. నేను తొందరగా బయటికి రావాలి మనం బూత్ బంగ్లాకి వెళ్లాలి, పిల్లల్ని కనాలని సెటైర్లు వేసి నవ్విస్తాడు రాజ్. ఆ రాత్రి ఏం జరిగింది? బాగా గుర్తుచేసుకుని చెప్పమని రాజ్‌ను అడుగుతుంది కావ్య. మనం ఎక్కడో ఏదో వదిలేశామని అదేంటో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి అని బతిమలాడుతుంది. కారు ఎక్కడ పెట్టారు? బయటికి రావడానికి ఎంత సేపు పట్టిందని ప్రశ్నిస్తుంది. ఇంటిలో కారు పార్క్ చేసి పార్టీకి వచ్చారు? సెక్యూరిటీ గార్డ్ బయటే ఉన్నాడు? అంత ధైర్యంగా డోర్ తీసుకుని సామంత్ బాడీని లోపల పెట్టేంత అవకాశం ఉండదని అంటుంది కావ్య.
మీరు ఫ్యాక్టరీ బయటికి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరా అని ప్రశ్నిస్తుంది . ఇంతలో రాజ్‌కు ఆ రోజు రాత్రి ఓ తాగుబోతు గుర్తొస్తాడు. నాలుక బాగా డ్రై అయ్యిపోయిందని ఒకడొచ్చి తాగడానికి డబ్బులు అడిగాడని, చిరాకులో ఉండి కసురుకున్నానని చెబుతాడు. వదలకుండా వెంటబడటంతో 500 నోటు ఇచ్చి పంపించానని అంటాడు రాజ్. మీరు బయటికి వచ్చేసరికి వాడు బయటే ఉన్నాడు కాబట్టి.. కారులో బాడీ పెట్టడం వాడు చూసే ఉంటాడని అనుమానిస్తుంది కావ్య. వాడి పేరు ఏంటని అడగ్గా క్వార్టర్ కమలేష్ అని చెబుతాడు రాజ్.
ఓ దారి దొరికిందని వెంటనే ఈ విషయాన్ని అప్పూతో చెప్పాలని కావ్య అనుకుంటుండగా .. నువ్వు భోజనం చేశావా? లేదా? అని అడుగుతాడు రాజ్. దీంతో భార్యకి భోజనం తినిపిస్తాడు. రాజ్ కేసు గురించి ఆలోచిస్తున్న అప్పూ దగ్గరికి వచ్చిన కావ్య .. క్వార్టర్ కమలేష్ గురించి చెబుతుంది. ఇలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్లు పదే పదే తమ పేర్లు చెప్పుకుని అందరినీ డబ్బులు అడుగుతారని చెబుతుంది అప్పూ. ఆ ఏరియాలో వెతికితే ఖచ్చితంగా అతని ఆచూకీ దొరుకుతుందని అంటుంది.
ఉదయాన్నే అంతా రాజ్ కోసం బాధపడుతుంటారు. కోర్టుకు వస్తున్నావా? లేదా? అని అపర్ణని అడుగుతాడు సుభాష్. తీర్పు అనుకూలంగా వస్తే సంతోషమే.. కానీ వ్యతిరేకంగా వస్తే తట్టుకోలేనని బాధపడుతుంది అపర్ణ. ధాన్యలక్ష్మీ - రుద్రాణిలు సూటిపోటి మాటలు అనడంతో ఇందిర మండిపడుతుంది. రాజ్‌కి ధైర్యం చెప్పడానికైనా నువ్వు కోర్టుకు రావాలని చెప్పి భార్యను తీసుకెళ్తాడు సుభాష్. అప్పూ- కావ్యలు సాక్ష్యాలు తీసుకొస్తారా అని రాహుల్ అడగ్గా.. అది అసాధ్యమని, రాజ్ జైలుకెళ్లడం ఖాయమని అంటుంది రుద్రాణి.
వైన్స్ దగ్గరికి వచ్చిన కావ్య - అప్పూలని చూసి మందుబాబులు షాక్ అవుతారు. కోర్టులో అప్పూ- కావ్యల కోసం రాజ్ లాయర్ ఎదురుచూస్తుంటారు. ఎంతసేపటికీ రాకపోవడంతో కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు లాయర్. ఇదంతా అనామిక గమనిస్తుంటుంది. ఇంతలో ఓ తాగుబోతు కనిపించి క్వార్టర్ కమలేష్ గురించి అప్పూ - కావ్యలకి చెబుతాడు. కోర్టు ప్రారంభం కాగానే .. మీరు ఇప్పటికైనా మీ నేరాన్ని ఒప్పుకుంటారా? అని అనామిక లాయర్ రాజ్‌ని ప్రశ్నిస్తాడు. మీతో ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా అని న్యాయమూర్తిని అడుగుతాడు రాజ్.. దీనికి జడ్జి సరేనని అంటారు.
తాను నిర్దోషినని చెబుతాడు రాజ్. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసని చెప్పడంతో .. ఎవరు చేయిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నిస్తారు. చనిపోయిన సామంత్ ప్రియురాలు అనామిక అని రాజ్ చెప్పడంతో అనామిక షాక్ అవుతుంది. అసలు ఇదంతా చేయాల్సిన అవసరం ఆమెకేంటీ? అని న్యాయమూర్తి ప్రశ్నిస్తారు. ఇంతలో రాజ్ లాయర్ లేచి నేను చెబుతానని అంటాడు. అనామిక ఒకప్పుడు రాజ్ తమ్ముడి భార్య అని .. చిన్న చిన్న విషయాలకే అనుమానపడి , భర్తను రాచి రంపాన పెట్టి తనే కోర్టుకెక్కి విడాకులు తీసుకుందని గుర్తుచేస్తాడు.
అప్పుడు వేసిన కేసుల్లో రాజ్ తమ్ముడికి తీర్పు అనుకూలంగా వచ్చిందని చెబుతాడు. అప్పుడు తమ్ముడికి అండగా రాజ్ నిలబడ్డారని, ఆ కేసును నేనే వాదించానని చెబుతాడు లాయర్. ఆ కేసులో ఆమె క్రిమినల్ మెంటాలిటీ మొత్తం బయటపెట్టానని గుర్తుచేస్తాడు. అదే పగ, అదే కక్ష్య మనసులో పెట్టుకుని రాజ్ కుటుంబం మీద వ్యాపారపరంగా, వ్యక్తిగతంగా నష్టాలు జరిగేలా మోసాలు చేయించిందని చెబుతాడు లాయర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











