Brahmamudi March 1st Episode: కోర్టులో కమలేష్ సాక్ష్యం..అడ్డంగా బుక్కైన అనామిక, నిజం వెలుగులోకి

అప్పూని టార్గెట్ చేయకపోవడం ఆపకుంటే మా ముగ్గురు అక్కాచెల్లెళ్లం కలిసి మిమ్మల్ని టార్గెట్ చేస్తామని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఉదయాన్నే దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా రాజ్ గురించి బాధపడుతుండగా అపర్ణని తీసుకుని సుభాష్ కోర్టుకు బయల్దేరతాడు.

జైళ్లో ఉన్న రాజ్‌కి భోజనం తీసుకుని వస్తుంది కావ్య. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుచేసుకోమ్మని రాజ్‌కు చెప్పగా.. క్వార్టర్ కమలేష్ అనే వ్యక్తి గురించి చెబుతాడు రాజ్. ఈ విషయాన్ని వెంటనే అప్పూకి చెబుతుంది కావ్య. కోర్టులో నన్ను అనామికే ఈ కేసులో ఇరికించిందని న్యాయమూర్తికి చెబుతాడు రాజ్. క్వార్టర్ కమలేష్‌ను వెతుక్కుంటూ వైన్ షాపుకు వెళ్తారు అప్పూ, కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 1వ తేదీ .. ఎపిసోడ్ 658లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 658 March 1st 2025 Here is full story

కావ్య - అప్పూ వెతుకుతున్న క్వార్టర్ కమలేషన్ వారి వద్దకే వచ్చి మందు తాగడానికి డబ్బులు అడుగుతాడు. దీంతో అప్పూ కోప్పడుతుంది.. ఇక్కడి నుంచి వెళ్లకపోతే స్టేషన్‌లో పడేస్తానని వార్నింగ్ ఇస్తుంది. మధ్యలో కావ్య కలగజేసుకుని వాడికి డబ్బులు ఇచ్చి పంపేస్తుంది. అయితే కమలేష్ అనే వాడు క్వార్టర్‌కి డబ్బులు అడుగుతాడని ఒకతను చెప్పాడు కదా వాడు వీడేనా అని కావ్య డౌట్ పడుతుంది. వెంటనే కమలేష్ అని పేరు పెట్టి పిలవగా.. కమలేష్ కాదు , క్వార్టర్ కమలేష్ అంటాడు ఆ తాగుబోతు.

నన్ను కేసులో ఇరికించింది చనిపోయిన సామంత్ ప్రియురాలు అనామికేనని రాజ్ కోర్టులో చెప్పడంతో రాజ్ లాయర్ .. అనామిక గత చరిత్ర చెబుతాడు. రాజ్‌పై కక్షతో ఆమె ఎన్నో మోసాలకు పాల్పడటంతో పాటు దాడులు చేయించిందని వివరిస్తాడు. ఆమె కొత్త ప్రియుడు సామంత్‌కు అనామిక వల్ల పెద్ద ఎత్తున నష్టం రావడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని లాయర్ అంటాడు. ఆ కోపంలో సామంత్‌ని హత్య చేసి ఆ కోపాన్ని రాజ్ మీదకు నెట్టి ఉండొచ్చని లాయర్ అనుమానిస్తాడు.

డిఫెన్స్ వారు ఈ కేసును పక్కదోవ పట్టించడానికి సంబంధం లేని విషయాలను వెలికి తీస్తున్నారని అంటాడు అనామిక లాయర్. ఆ కేసుకు , ఈ కేసుకు సంబంధం లేదని చెప్పగా.. న్యాయమూర్తి కోప్పడతాడు. ఈ కేసు విచారణ పూర్తయి, తీర్పు వచ్చే వరకు ఖచ్చితంగా కోర్టుకు హాజరవుతూనే ఉండాలని న్యాయమూర్తి ఆదేశిస్తారు. ఈ మాటలతో అనామిక షాక్ అవుతుంది. డిఫెన్స్ వారు వాచ్‌లు, పెన్నులు పారేసుకుని మ్యాజిక్‌లు చేయడం తప్పించి ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించలేదని అంటాడు అనామిక లాయర్. ఈ ముద్దాయే అసలైన హంతకుడని ఇతనికి కఠిన శిక్ష విధించాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తాడు.

అటు కమలేష్‌తో రాజ్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయాన్ని గుర్తుచేస్తారు అప్పూ - కావ్య. నేను చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుంటానని , నాకు గుర్తులేదని వెళ్లిపోబోతాడు కమలేష్. దీంతో కావ్య వాడిని ఆపి నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తానని కొంచెం గుర్తుచేసుకోమని అంటుంది. కమలేష్‌కు డబ్బులు ఇచ్చి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. నేను మందు తాగడానికి డబ్బులు లేక పిచ్చివాడిలా తిరుగుతుండగా ఓ కారు వచ్చి ఆగిందని, అందులో ఓ అమ్మాయి, నలుగురు మనుషులు ఉన్నారని చెబుతాడు కమలేష్.

నేను డబ్బులు అడగ్గా ఆ అమ్మాయి తన మనుషులతో నన్ను పక్కకి గెంటేసిందని , కానీ ఓ సారు మాత్రం 55 రూపాయలు అడిగితే రూ.500 ఇచ్చాడని అంటాడు. ఆ సారు ఫోటో నా గుండెల్లో ప్రింట్ అయ్యిందని ఆయనని మరిచిపోనని చెబుతాడు. జీవితాంతం వద్దు కానీ ఇంకో గంట మాత్రం గుర్తుపెట్టుకో అంటుంది కావ్య. ఏం జరిగిందని కమలేష్ అడగ్గా.. కావ్య, అప్పూలు జరిగినదంతా చెబుతారు. సార్ కోసం కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతానని అంటాడు కమలేష్.

రాజ్ నేరం గురించి అనామిక లాయర్ చెబుతుండగా కమలేష్‌తో కలిసి కోర్టుకొస్తారు కావ్య , అప్పూ. ఇప్పటికిప్పుడు సాక్షి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడని లాయర్ ప్రశ్నిస్తాడు. అనంతరం కమలేష్‌ని బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తాడు అనామిక లాయర్. ఆ బోనులో ఉన్న వ్యక్తి తెలుసా అని రాజ్ గురించి అడుగుతాడు. ఆయన నా దేవుడని మందుకోసం రూ.500 ఇచ్చాడని చెబుతాడు క్వార్టర్ కమలేష్. ఇంతలో రాజ్ తరపు లాయర్ జోక్యం చేసుకుని కమలేష్‌ని ఎంక్వైరీ చేస్తాడు. సార్‌ని ఎక్కడ చూశావని అడగ్గా.. ఓ రోజు రాత్రి కారు దిగి హడావుడిగా లోపలికి పరిగెత్తాడని అంటాడు. తర్వాత ఏం జరిగిందని అడగ్గా.. ఇంకో కారు వచ్చి ఆగిందని, అందులో ఓ కత్తిలాంటి అమ్మాయి ఉందని చెబుతాడు కమలేష్. ఆ మాటలతో అనామిక షాక్ అవుతుంది.

అనామిక లాయర్ లేచి .. ఈ తాగుబోతు సాక్ష్యం చెల్లదని, ఇతనికి ఆ అమ్మాయి ఎవరో తెలియదని డిఫెన్స్ వారే ఈ దొంగ సాక్షిని తీసుకుని వచ్చాడని ఆరోపిస్తాడు. నేను తాగుబోతునని, గాలికి తిరుగుతానని కానీ అబద్ధాలు మాత్రం చెప్పనని అంటాడు కమలేష్. నువ్వు అక్కడే ఉన్నావు అనడానికి సాక్ష్యం ఏంటని అడగ్గా.. నా ఫోన్ అని చెబుతాడు. ప్రతిరోజు రాత్రి పాట పాడుతూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకోవడం నాకు అలవాటని అంటాడు కమలేష్. దీంతో సెల్‌ఫోన్‌ని టీవీకి కనెక్ట్ చేయమని న్యాయమూర్తి ఆదేశిస్తాడు. అందులో రాజ్ హడావుడిగా ఫ్యాక్టరీ దగ్గరికి రావడం ఆ వెంటనే మరో కారులో అనామిక దిగడం కనిపిస్తుంది. దీంతో అనామికను బోనులో నిలబెట్టాలని న్యాయమూర్తి ఆదేశిస్తారు.

సామంత్‌ని హత్య చేసింది ఈ రాజేనని కేసు పెట్టింది నువ్వేనా అని అనామికని ప్రశ్నిస్తారు న్యాయమూర్తి. నీ కాబోయే భర్త చనిపోయే సమయంలో ఫ్యాక్టరీ దగ్గర ఏం చేస్తున్నావ్ అని అడుగుతారు. ఆ రోజు రాత్రి జరిగినదంతా చెబుతుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన అదృష్టానివని అనుకున్నానని.. కానీ నువ్వు దరిద్రానివని అంటాడు సామంత్‌ . నీతో జాగ్రత్తగా ఉండమని ఆరోజే అప్పూ అలర్ట్ చేసిందని.. అప్పుడు నా బల్బ్ వెలగలేదని , నేను నిన్ను గుడ్డిగా నమ్మి ఇక్కడిదాకా తెచ్చుకున్నానని అంటాడు.

ఇప్పుడు ఆ నందా గాడు పోలీసులతో జరిగినదంతా చెబితే నా కెరీర్ క్లోజ్ అని చెబుతాడు సామంత్. దీనింతటికి కారణం నువ్వేనని.. ఆడదానిని అడ్డుపెట్టుకుని బతుకుతున్నావ్ అంటూ మండిపడుతుంది అనామిక. నిన్ను తిట్టడం కాదు, కొట్టడం కాదు చంపేయాలని దగ్గరిలో ఉన్న రాడ్ తీసుకుని అనామిక వెంటపడతాడు సామంత్. ఇంతలో సామంత్ చేతుల్లోంచి రాడ్ లాక్కొని కొట్టడంతో అతను చనిపోతాడు. దీంతో టెన్షన్ పడ్డ అనామిక .. ఈ నేరం రాజ్ చేశాడని నిరూపించి వాడిని జైలుకు పంపాలని అనుకున్నట్లు కోర్టులో నిజం చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X