Brahmamudi March 4th Episode: రాజ్ జీవితంలోకి మాజీ ప్రియురాలు..అనామికను మించిన సైకో, కావ్యపై గురి

సామంత్‌ను చంపడంతో పాటు రాజ్‌ను నేరంలో ఇరికించినందుకు గాను అనామికకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు న్యాయమూర్తి. రాజ్ విడుదల కావడంతో అప్పూ - కావ్యలను సుభాష్, అపర్ణ, కళ్యాణ్‌లు ప్రశంసిస్తారు. ఇంతలో కోర్టు నుంచి బయటికి వస్తూ నన్ను ఏడిపించిన మీ ఫ్యామిలీ అంతు చూస్తానని వార్నింగ్ ఇస్తుంది అనామిక. ఇకనైనా మారి మనిషిగా బ్రతకమని కావ్య కూడా కౌంటర్ ఇస్తుంది. ఇంతలో రాజ్‌కు తను కాలేజీలో ప్రేమించిన మాజీ లవర్ యామిని కనిపించడంతో టెన్షన్ పడతాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లేసరికి కనిపించదు.

జైలు నుంచి విడుదలైన రాజ్‌కి ఇంటి దగ్గర హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది కావ్య. అనామిక అనామకురాలిగా మిగిలిపోయిందని, ఇకపై ఆమె నుంచి మనకు ఏ సాయం అందదని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్న సమయంలో మన ఇంటికి మరో కొత్త సమస్య వస్తే ఏం చేస్తారని ప్రశ్నించి బాంబు పేలుస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 4వ తేదీ .. ఎపిసోడ్ 660లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 660 March 4th 2025 Here is full story

ఇంత ఆనందం చూస్తుంటే నాకు భయమేస్తోంది.. ఆ రోజు కూడా ఇలాగే పార్టీ చేసుకున్నాం, తెల్లారే కారులో శవం దొరికిందని అంటుంది రుద్రాణి. ఆ నోటి నుంచి ఎప్పటికీ మంచి మాట రాదా అని ప్రకాశం , అపర్ణ మండిపడతారు. ఆస్తులు పోవడానికి మా నాన్న , అప్పుల పాలు అవ్వడానికి రాజ్ - కావ్యలు , రాజ్ అరెస్ట్ కావడానికి అనామిక కారణమయ్యారని గుర్తుచేస్తుంది. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడదని రుద్రాణి చెప్పేసరికి అంతా షాక్ అవుతారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా నా కొడుకు కోడలు ధైర్యంగా నిలబడారని అపర్ణ అంటుంది. ఈసారి ఎవరి చేతుల్లో లేనిది జరుగుతుందేమోనని హెచ్చరిస్తుంది రుద్రాణి.

రాజ్‌కు కోర్టు దగ్గర కనిపించిన యామిని అనే అమ్మాయి కారులో వాళ్లింటికి వస్తుంది. ఇంతలో వాళ్ల నాన్న వచ్చి అమ్మాయికి దిష్టి తీయిస్తాడు. నేను ఫారిన్‌కు వెళ్లింది చదువుకోవడానికో, ఎంజాయ్ చేయడానికో కాదని.. ట్రీట్‌మెంట్ తీసుకోవడానికని అంటుంది. ఫ్లైట్ దిగి చాలాసేపు అయ్యింది.. అయినా ఇంత ఆలస్యంగా వచ్చావా అని ప్రశ్నిస్తాడు వాళ్ల నాన్న. ఒక పాత ఫ్రెండ్‌కి కనిపించి సర్‌ప్రైజ్ ఇద్దామని వెళ్లానని అంటుంది. మత్తు పదార్ధాలకి అలవాటై చావు వరకు వెళ్లొచ్చానని.. ఇకపై ఏ చెడు అలవాట్ల జోలికి వెళ్లనని ఆ అమ్మాయి మాట ఇస్తుంది.

మేం కోరుకున్నట్లుగానే పెళ్లి చేసుకుంటావా అని వాళ్ల అమ్మ అడుగుతుంది. ఖచ్చితంగా చేసుకుంటానని ఆమె చెబుతుంది. వెంటనే బేబీకి మంచి సంబంధం చూడమని ఆమె తన భర్తతో అంటుంది. మీరు అంత కష్టపడొద్దని.. నేను ఆల్రెడీ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పి రాజ్ ఫోటోని చూపించడంతో తల్లిదండ్రులు షాక్ అవుతారు. మళ్లీ రాజ్ ఫోటో చూపిస్తున్నావ్, తను దక్కలేదనే కదా మళ్లీ చావు వరకు వెళ్లొచ్చావని వాళ్ల నాన్న మండిపడతాడు. నేను లైఫ్‌లో ఒక్కరినే ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను.. అది రాజ్‌ని మాత్రమేనని తేల్చి చెబుతుంది. నేను అమెరికాకు వెళ్లింది నా అలవాట్లను వదిలేయ్యడానికి.. నా ప్రేమను వదిలేయ్యడానికి కాదు, రాజ్‌ను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోనని అంటుంది.

నువ్వు మారావ్, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావ్ అని సంతోషిస్తుంది వాళ్ల అమ్మ. ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని పెళ్లి సంబంధం గురించి మాట్లాడతానని అంటుంది . మీరు ఒప్పించాల్సింది అతని పేరేంట్స్‌ని కాదని, అతని భార్యని అని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు. నేను ఫారిన్‌లో ఉన్నప్పటికీ రాజ్ గురించి తెలుసుకుంటూనే ఉన్నానని.. తనకు కావ్య అనే అమ్మాయితో పెళ్లయ్యిందని, కావ్య రాజ్ జీవితంలోకి రావడానికి ముందే రాజ్ నాకు భర్త అయిపోయాడని అంటుంది ఆ అమ్మాయి. ఆ కావ్యని దూరం చేస్తే రాజ్ నా సొంతం అవుతాడు కదా అని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు.

నువ్వు తప్పు చేస్తున్నావని.. రాజ్‌ని మరిచిపో, నేనే నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని తండ్రి ఎంత నచ్చచెబుతున్నా వినిపించుకోదు. నన్ను ప్రేమించి, జీవితాంతం కలిసుంటానని మాట ఇచ్చాడని అలాంటి వాడిని ఎలా వదిలేస్తానని ప్రశ్నిస్తుంది. నాది అనుకున్నది దక్కి తీరాలని, ఆ దేవుడే దిగొచ్చినా జరిగేది ఆపలేడని అంటుంది. ఆ మాటలతో తల్లిదండ్రులు షాక్ అవుతారు. వెంటనే డాక్టర్‌ని కలిసి అసలు యామిని కండీషన్ ఏంటో తెలుసుకోవాలని భార్యాభర్తలిద్దరూ అనుకుంటారు.

రాజ్‌కు కోర్టు దగ్గర యామిని కనిపించడంతో అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య వచ్చి నాలుగు రోజులు పోలీస్ స్టేషన్‌లో ఉంటే ఈ భార్య విలువ తెలిసొచ్చిందన్న మాట అని అంటుంది. ఇంతలో కావ్యని దగ్గరికి తీసుకుని మనిద్దరి మధ్యలోకి ఎవ్వరూ రారు అని చెబుతుంది. మరోవైపు.. యామిని తల్లిదండ్రులు వెంటనే డాక్టర్‌ని కలిసి తనకు ఏ ప్రాబ్లం లేదని చెప్పారని కానీ తను ఏమాత్రం మారలేదని అంటుంది తల్లి. తను అనుకున్నది జరగకపోయినా, తను కోరుకున్నది దక్కకపోయినా యామిని మనసు డిస్ట్రబ్ అవుతుందని చెబుతాడు డాక్టర్.

తను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తుందని.. తన చిన్నప్పుడు పెంచుకున్న కుక్కపిల్ల తన మాట వినలేదని చంపేసిందని గుర్తుచేస్తాడు డాక్టర్. రాజ్‌ను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందని.. అలా కాదని తనకు ఎవరైనా అడ్డుపడితే తను చనిపోవడానికి కూడా వెనకాడదని హెచ్చరిస్తాడు డాక్టర్. తనను మామూలు మనిషిని చేయలేమా అని యామిని తండ్రి ప్రశ్నించగా.. తనకు నచ్చినట్లుగా ఉంటున్నట్లు నటించాలని చెబుతాడు.

తన రూమ్‌లో కావ్య ఫోటోని తగలబెడుతుంది యామిని. రాజ్ - కావ్య నిద్రలో ఉండగా రాజ్ ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. దానిని చూడగా హలో మై డియర్ రాజ్ అంటూ యామిని వాయిస్ గొంతు వినిపించడంతో రాజ్ షాక్ అవుతాడు. పక్కకొచ్చి వాయిస్ మెసేజ్ వింటాడు. నా వాయిస్ విని షాక్ అయ్యావా? సర్‌ప్రైజ్ అయ్యావా ? అసలు నేను నీకు మెసేజ్ చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేశావా? అని ఆ మెసేజ్‌లో ఉంటుంది. నేను కోర్టు దగ్గరికి వచ్చాను, నిన్ను చూశానని చెబుతుంది. నీకోసం స్పెషల్ గిఫ్ట్ పంపించానని, అందరూ వెళ్లి చూసేలోపు నువ్వు వెళ్లి చూడు అని మెసేజ్‌లో ఉంటుంది. దాంతో రాజ్ కంగారుగా కిందకి వెళతాడు . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X