Brahmamudi March 5th Episode: యామిని టార్చర్.. గతం గుర్తు చేసుకున్న రాజ్, పసిగట్టేసిన రుద్రాణి
రాజ్ విడుదల కావడంతో ఇంట్లో వాళ్లంతా ఆనందంగా ఉండటం చూసిన రుద్రాణి.. ఈ సంతోషం శాశ్వతం కాదని ఏదో ఒక సమస్య రాకుండా పోతుందా అని అంటుంది . ఆ మాటలతో ఇంట్లో వాళ్లంతా ఆమెకు చీవాట్లు పెడతారు. ఆ నోటీ నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా అని అంతా మండిపడతారు.
ఏం జరిగినా, ఎన్ని కష్టాలొచ్చినా రాజ్ - కావ్యలు తట్టుకుని నిలబడతారని అపర్ణ అంటుంది. ఏమో.. ఈసారి వచ్చే సమస్యల్ని తట్టుకోవడం ఎవరి వల్లా కాదేమోనని రుద్రాణి జోస్యం చెబుతుంది. ఇంతలో కోర్టు నుంచి రాజ్ మాజీ లవర్ యామిని నేరుగా ఇంటికెళ్తుంది. ట్రీట్‌మెంట్ తీసుకుని చావుని జయించి వచ్చిన కూతురిని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు.
ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటుండగా.. మీకు అంత కష్టం ఉండదని, నేనే నాకు కాబోయే వాడిని వెతుక్కున్నానని అంటుంది యామిని. ఆ వెంటనే రాజ్ ఫోటో చూపించడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు. తాను రాజ్‌ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెబుతుంది. దీంతో యామినికి ట్రీట్‌మెంట్ చేసిన సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి ఆమె గురించి అడుగుతారు తల్లిదండ్రులు. యామిని అనుకున్నది సాధించకపోతే తను చనిపోవడానికి కూడా వెనుకాడదని డాక్టర్ హెచ్చరిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 5వ తేదీ .. ఎపిసోడ్ 661లో ఏం జరిగిందంటే..

ఉదయాన్నే రాజ్ ఫోన్‌కి వాయిస్ మెసేజ్ వస్తుంది. అది యామిని నుంచి వచ్చిందని తెలుసుకున్న రాజ్ షాక్ అవుతాడు. నీ కోసం నట్టింట్లో ఓ సర్‌ప్రైజ్ పెట్టానని చెప్పడంతో రాజ్ కిందకి వెళ్లి చూసే సరికి రాజ్ - యామిని కలిసున్న ఫోటోలు కనిపిస్తాయి. ఈ ఫోటోలను నీ భార్య, ఇంట్లో వాళ్లు చూస్తే ఏమవుతుందో తెలుసు కదా.. వాటిని తీసేయకుంటే నీ భవిష్యత్తు గందరగోళంగా మారిపోతుందని వార్నింగ్ ఇస్తుంది యామిని. దీంతో భయపడ్డ రాజ్ హాల్‌లో పడివున్న మొత్తం ఫోటోలను భయం భయంగా ఏరేసి సోఫాలో దాస్తాడు.
ఉదయాన్నే నిద్రలేచిన సుభాష్.. కొంచెం జరగమని రాజ్‌కు చెప్పగా , జరగనని మొండికేస్తాడు. ముందే లేచారు, రాత్రంతా నిద్రపోయినట్లు లేరని రాజ్‌ని అడుగుతుంది కావ్య. వీపు నొప్పిగా ఉందని నేను ఎటూ కదల్లేనని చెబుతాడు. అందరికీ కాఫీ తెచ్చేందుకు కావ్య లోపలికి వెళ్తుండగా .. కిచెన్‌లో ఉన్న ఫోటోలను తీయవా అంటూ రాజ్‌కు మెసెజ్ పెడుతుంది యామిని. ఆ దెబ్బకి షాకైన రాజ్.. కళావతి అంటూ గట్టిగా అరుస్తాడు. నా ఫోన్ మరిచిపోయానని చెప్పగా.. నేను వెళ్లి తీసుకొస్తానని కళ్యాణ్ అంటాడు. వాడొద్దు నువ్వే వెళ్లి ఫోన్ తీసుకురమ్మని కావ్యకి చెబుతాడు. ఇంతలో ఫోటోలన్నీ షర్ట్ లోపల దాచేసి వాటర్ తాగుతానని చెప్పి కిచెన్‌లోకి వెళ్లి మిగిలిన ఫోటోలను తీసేస్తాడు రాజ్.
హమ్మయ్య అనుకునేలోపు.. రాజ్‌కి మరో మెసేజ్ వస్తుంది. అది చూసుకుంటూ పైకి వెళ్తున్న రాజ్‌కి కావ్య ఎదురై ఫోన్ మీ దగ్గరే ఉన్నప్పుడు నన్ను పైకి ఎందుకు పంపించారని మండిపడుతుంది. రాజ్‌కి ఏదో అయ్యిందని సుభాష్ భయపడుతుండగా ఏం కాలేదని, నిద్రపోలేదని పైగా వీపు నొప్పి కాబట్టి వాడికి తిక్కతిక్కగా ఉందని ఇందిర అంటుంది. వెంటనే బయటికి వచ్చిన రాజ్.. యామినికి ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్‌కి ఫోన్ చేస్తాడు. తనకు క్యూర్ అయి, డిశ్చార్జ్ కూడా అయ్యిందని డాక్టర్ చెబుతాడు. మీరు ఫోన్ చేస్తారని, మీకు తన అడ్రస్ కూడా చెప్పమని యామిని చెప్పిందని రాజ్‌తో డాక్టర్ అంటాడు.
డాక్టర్ ఇచ్చిన అడ్రస్‌తో యామినిని వెతుక్కుంటూ వెళ్తాడు రాజ్. నువ్వు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావ్ అని మనసులో అనుకుంటాడు. కాలేజ్‌లో తనతో పరిచయం అయిన రోజులను గుర్తుచేసుకుంటాడు రాజ్. ఆమె తనకు ఐ లవ్ యూ చెప్పడం.. తను దానిని యాక్సెప్ట్ చేయడం గుర్తొస్తుంది. నేను ఎవరితోనైనా మాట్లాడితే తను అస్సలు తట్టుకునేది కాదని ఆమెలోని శాడిజాన్ని చూపించడం మొదలుపెట్టిందని గుర్తుచేసుకుంటాడు. ఓ రోజున రాజ్ ఓ అమ్మాయితో మాట్లాడుతుండగా యామిని చూసి రగిలిపోతుంది.
ఆ అమ్మాయిపై అటాక్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రాజ్ .. యామినిని లాగిపెట్టి కొడతాడు. నీతో నేను మాత్రమే మాట్లాడాలి.. ఇంకెవరు మాట్లాడినా ఒప్పుకోనని యామిని చెప్పడంతో నీలాంటి శాడిస్ట్‌తో నేను మాట్లాడనని , ఐ హేట్ యూ చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాజ్‌ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడుతుంది యామిని. బిల్డింగ్ పైకెక్కి రాజ్‌కి ఫోన్ చేసి ఇకపై నిన్ను విసిగించనని ఇదే నా చివరి కాల్ అని అంటుంది. నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తేనే కిందకి దిగుతానని లేదంటే దూకేస్తానని బెదిరిస్తుంది. దీంతో రాజ్ చెప్పేది లేక ఐ లవ్ యూ చెబుతాడు.
యామిని కిందకి దిగి రాగానే పోలీసులకు అప్పగిస్తాడు. నీలాంటి వాళ్లంటే నాకు అసహ్యమని, నువ్వు కిందకి దిగి రావడానికే ఐ లవ్ యూ చెప్పానని అంటాడు. మా శైలు మీద అటాక్ చేసింది తనేనని, ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసి నన్ను బెదిరించిందని పోలీసులకు చెబుతాడు. దీంతో పోలీసులు యామినిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ రోజుతో యామిని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అనుకున్నానని కానీ తాను మత్తు పదార్ధాలకు బానిసై.. మా హాస్టల్‌కు వచ్చి చనిపోతానని బెదిరించిందని గుర్తుచేసుకుంటాడు రాజ్.
చేతి నరం కట్ చేసుకుని ఉండటంతో రాజ్ వెళ్లి ఆమెకు కట్టు కడతాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టమని, నువ్వు లేకుండా నేను బతకలేనని అంటుంది యామిని. ఇద్దరం ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్లిపోయి బతుకుదామని చెబుతుంది. అడవులకు వెళ్లిపోయి బతుకుదామని.. మనకు పిల్లలు కూడా వద్దని, నా ప్రేమ మొత్తం నీకే సొంతం అవ్వాలని అంటుంది యామిని. ఆ రోజుతో తనకు యామిని బిహేవియర్ పూర్తి అర్ధమైందని ఇక ఆమె తనను వదిలిపెట్టదని అర్ధమైందని గుర్తుచేసుకుంటాడు రాజ్. తనను వాళ్ల అమ్మానాన్నలు ట్రీట్‌మెంట్ కోసం ఫారిన్ పంపించారని , తను కోలుకుంటుందని తెలిసి సంతోషించానని చెబుతాడు రాజ్. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా మారలేదని అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










