Brahmamudi March 6th Episode: రాజ్‌ని దక్కించుకునేందుకు యామిని ఆరాటం.. కావ్య హత్యకు కుట్ర

యామిని ఇంట్లో పెట్టిన ఫోటోలను కుటుంబ సభ్యులు లేచేసరికి తీసేస్తాడు రాజ్. అతనిలో కంగారు చూసిన రుద్రాణికి ఎక్కడో తేడా కొడుతుంది. ఇంతలో వంటగదిలో ఫోటోలు పెట్టినట్లు రాజ్‌కు యామిని నుంచి మెసేజ్ రావడంతో కావ్యని పైకి పంపించి తను కిచెన్‌లోకి వెళ్తాడు. యామిని ట్రీట్‌మెంట్ తీసుకున్న డాక్టర్‌కి ఫోన్ చేయగా.. ఆమె డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారని మీకు ఆమె అడ్రస్ ఇవ్వమన్నారని రాజ్‌కు చెబుతాడు.

యామిని ఇంటికి బయల్దేరిన రాజ్‌కు తనతో కాలేజీ‌లో నడిపిన ప్రేమాయణం, తన శాడిస్ట్ మెంటాలిటీ అంతా గుర్తొచ్చి వణికిపోతాడు. యామిని ట్రీట్‌మెంట్ తీసుకుని మామూలు మనిషి అయ్యిందని అనుకున్నానని కానీ తను మళ్లీ నా జీవితంలోకి వస్తుందని అనుకోలేదని బాధపడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 6వ తేదీ .. ఎపిసోడ్ 662లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 662 March 6th 2025 Here is full story

స్వప్న బిడ్డ ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో కావ్య వచ్చి ఆ పాపని నిద్ర పుచ్చుతుంది. ఇంతలో ఇందిర వచ్చి ఆమెను మెచ్చుకుంటుంది. పిల్లలను చూస్తే ఎవరికైనా లాలి పాటలు గుర్తొస్తాయని చెబుతుంది కావ్య. మరి నువ్వెప్పుడు తల్లి అవుతావని కావ్యను అడుగుతుంది ఇందిర. దీంతో ఏం మాట్లాడాలో తెలియక కళావతి మౌనం వహిస్తుంది. నాకు తల్లిని కావాలని ఉందని, కానీ భర్త కూడా అనుకోవాలి కదా అని అంటుంది.. కాబట్టి ఈ ప్రశ్నని మీ మనవడిని అడగండి అని చెబుతుంది. వాడికి ఆలోచన నువ్వే వచ్చేలా చేయాలని అంటుంది ఇందిర. వీళ్లని ఇలాగే వదిలేస్తే పిల్లల గురించి ఆలోచించరని బాధపడుతుంది.

యామిని ఇంటికి వెళ్లేసరికి పూలతో అందంగా డెకరేట్ చేసి రాజ్‌కు స్వాగతం చెబుతుంది యామిని. నా లైఫ్‌లోకి నువ్వు వచ్చినందుకు చాలా చిరాగ్గా ఉందని అంటాడు రాజ్. నీకు పెళ్లయ్యిందని, ఇష్టం లేకపోయినా కావ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని చెబుతుంది. నువ్వు ఇంకా మారలేదని, అన్ని సగం సగం తెలుసుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం నీకు అలవాటైందని నా భార్యని మనస్పూర్తిగా ఇష్టపడుతున్నానని చెబుతాడు. ప్రేమంటే నాదని, నువ్వు దూరమైనా ఇంకా నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాని చెబుతుంది యామిని.

Brahmamudi Serial Today s Episode 662 March 6th 2025 Here is full story

నాకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కూడా నేను చచ్చిపోతానని అన్నారని అంటుంది. ఒకప్పటిలా నేను లేనని, ఆ పనులన్నీ మానేశానని చెబుతుంది. మా ఇంటికి ఫోటోలు పంపించి నన్ను బెదిరించడమేనా మారిపోవడం అంటే అని రాజ్ ప్రశ్నిస్తాడు. నీలో ఉన్నది మొండితనం, స్వార్ధమని నువ్వు కావాలనుకున్నది ఏం చేసైనా దక్కించుకోవాలనే మూర్ఖత్వమని మండిపడతాడు రాజ్. నువ్వు ఏం చేయమన్నా చేస్తానని, జీవితాంతం నీ కాళ్ల దగ్గర కుక్కలా ఉండమన్నా ఉంటానని మనిద్దరం పెళ్లి చేసుకుందామని అంటుంది యామిని. నీ కళావతికి విడాకులిచ్చి నా దగ్గరికి వచ్చేయమని చెబుతుంది.

ఆ మాటలతో రాజ్ మండిపడతాడు. నా కళావతి గురించి నీకేం తెలుసు.. తన కాలిగోటికి కూడా నువ్వు సరిపోవని అంటుంది. ఎదుటివాళ్ల ఆనందం కోసం తన ఇష్టాల్ని కూడా త్యాగం చేస్తుందని, ఎదుటివాళ్ల బాధని తన బాధ అనుకుంటుందని , ఎదుటివారి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుందని చెబుతుంది. కళావతే నా జీవితమని, లైఫ్ లాంగ్ నేను తనతోనే కలిసుంటానని తేల్చి చెబుతాడు రాజ్. నేను దూరంగా ఉన్న ఇన్ని రోజులు .. నువ్వు నీ భార్యకి దగ్గర అయిపోయావని , అందుకే కదా నన్ను కాదు అంటున్నావ్.. అదే ఈ లోకం నుంచి దూరమైతే నువ్వే చచ్చినట్లు నా దగ్గరికి వస్తావని అని మనసులో అనుకుంటుంది యామిని. కళావతిని శాశ్వతంగా దూరం చేసేందుకు ప్లాన్ చేస్తుంది.

ధాన్యలక్ష్మీ బట్టలు సర్దుకుంటుండగా అప్పూ రెండు సంచులు తీసుకుని వస్తుంది. నా మొదటి జీతం వచ్చిందని మీకు, మామయ్య గారికి బట్టలు తీసుకొచ్చానని చెబుతుంది. నువ్వు తెస్తే నేను తీసుకోనని.. నిన్ను కోడలిగా అంగీకరించడం లేదు కాబట్టి నన్ను బుట్టలో వేసుకుందామని అనుకుంటున్నావా అని మండిపడుతుంది. నేను నా కొడుకు కోసమే నిన్ను ఇంట్లోకి రానిచ్చానని అంటుంది. మీ అబ్బాయి కోసమైనా ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు , నాకది చాలు అని చెబుతుంది అప్పూ.

Brahmamudi Serial Today s Episode 662 March 6th 2025 Here is full story

తను ఈ సౌకర్యాలు, అయినవాళ్లని వదులుకుని చాలా ఇబ్బందిపడ్డాడని.. కానీ ఇప్పుడు కళ్యాణ్‌కి అన్ని ఉన్నాయని అంటుంది. నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు నీ బుట్టలో నేను పడను.. నువ్వు రెండాకులు చదివితే , నేను నాలుగు ఆకులు చదివానని ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. నాకు పెళ్లి కాకపోయుంటే నా మొదటి జీతంతో మా అమ్మానాన్నలకు బట్టలు కొనేదాన్నని.. కానీ వాళ్ల స్థానంలో మీరున్నారు అందుకే కొన్నానని చెప్పి వెళ్లిపోతుంది అప్పూ. ఇదంతా అపర్ణ దూరం నుంచి చూసి బయటికొచ్చాక అప్పూతో మాట్లాడుతుంది.

మీ పెద్దక్క స్వప్నలా అత్తాగారి మీద అరవకుండా.. మీ చిన్నక్క కావ్యలా భరించకుండా , కర్ర విరగకుండా పాము చావకుండా బాగా మాట్లాడావని అప్పూని మెచ్చుకుంటుంది అపర్ణ. నిన్ను త్వరలోనే ధాన్యలక్ష్మీ అర్ధం చేసుకుంటుందని అంటుంది. నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందని చెబుతుంది.

ఇంతలో ఇందిర వచ్చి నాకు మాత్రం నిన్ను ఇలా చూస్తుంటే నాలుగు పీకాలని అనిపిస్తోందని అపర్ణతో అంటుంది . అప్పూ సంగతి సరేకానీ.. నీ కోడలిని ఎప్పుడు అర్ధం చేసుకుంటావ్ అని ప్రశ్నిస్తుంది . అప్పూని పని చేసుకోమ్మని చెప్పి పంపించి వేస్తుంది. నీ కొడుక్కి పెళ్లాన్ని ఏలుకోవాలనే బుద్ధి పుట్టడం లేదని , దానిని తల్లిని చేయాలనే ఆలోచన వాడి బుర్రలోకి రావడం లేదని అంటుంది. మనిద్దరం కలిసి రాజ్ బుర్రని వాష్ చేద్దామని చెబుతుంది ఇందిర. మీరు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటుంది అపర్ణ.

రాత్రి ఇంటికి వచ్చిన రాజ్‌ని మొత్తం ఫ్యామిలీ అంతా రౌండప్ చేస్తారు. పెళ్లయిన నాటి నుంచి బిజినెస్ తప్పించి నీ భార్యను పట్టించుకున్నావా అని మండిపడుతుంది ఇందిర. నీ భార్యకు మనసు ఉంటుందని, తనకు ఆశలు , కోరికలు ఉంటాయని ఆలోచించావా అని ప్రశ్నిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X