Brahmamudi March 7th Episode: కావ్యతో హనీమూన్‌కి రాజ్.. క్రూరంగా యామిని, కళావతిని వెంటాడుతోన్న మృత్యువు

నువ్వు , రాజ్ కూడా పిల్లల్ని కనిస్తే వాళ్లతో ఆడుకుంటామని కావ్య అంటుంది ఇందిర. తల్లిని కావాలని నాక్కూడా ఉందని, కానీ మీ మనవడికి కూడా ఉండాలి కదా అని కావ్య చెప్పేసరికి ఇందిర బాధపడుతుంది. రాజ్‌కు పూలతో స్వాగతం పలుకుతుంది యామిని. నువ్వు ఇంకా మారలేదని, నీలో ఉన్న శాడిజం పోలేదని ఆమెను నానామాటలు అంటాడు రాజ్. కావ్యని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోమని అంటుంది.. నేను కళావతితోనే ఉంటానని తేల్చిచెప్పి వెళ్లిపోతాడు రాజ్. కళావతిని శాశ్వతంగా దూరం చేస్తే నువ్వు నా సొంతం అవుతావని మనసులో అనుకుంటుంది యామిని.

తొలి జీతంతో కొన్న బట్టల్ని ధాన్యలక్ష్మీకి తీసుకొచ్చి ఇస్తుంది అప్పూ. నా కొడుకు కోసం నిన్ను ఇంట్లోకి రానిచ్చానని , నన్ను బుట్టలో వేసుకోవాలి అనుకునే ప్లాన్స్ వేయొద్దని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఆమెకు తనదైన శైలిలో ఆన్సర్ ఇస్తుంది అప్పూ. ఇదంతా అపర్ణ చూసి బయటికి వచ్చిన అప్పూని మెచ్చుకుంటుంది. ఇంతలో ఇందిర వచ్చి కావ్య - రాజ్‌లు ఏకాంతంగా గడిపేలా చేయాలని చెబుతుంది. ఇక మార్చి 7వ తేదీ .. ఎపిసోడ్ 663లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 663 March 7th 2025 Here is full story

ఇంటికొచ్చిన రాజ్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం రౌండప్ చేసి పెళ్లయినప్పటి నుంచి బిజినెస్‌ను తప్పించి, నీ భార్యను పట్టించుకున్నావా అని ఇందిర నిలదీస్తుంది. నీకు అవసరం వచ్చినప్పుడల్లా ఆఫీస్‌కు తీసుకెళ్లి పనులు చేయించుకున్నావే తప్ప నీకు ఏం కావాలని ఎప్పుడైనా అడిగావా అని అడుగుతుంది అపర్ణ. ఏం చెప్పాలని అనుకుంటున్నారో డైరెక్ట్‌గా చెప్పండి అంటాడు రాజ్. కొన్ని రోజులు పనులన్నీ పక్కనపెట్టి కావ్యతో కలిసి కొన్నిరోజులు హానీమూన్‌కు వెళ్లాలని చెబుతుంది అపర్ణ.

పెళ్లయి రెండేళ్లు అవుతోంది.. ఇప్పుడు హనీమూన్ ఏంటి నా మొహం అంటూ సెటైర్లు వేస్తుంది రుద్రాణి. ఇప్పటికిప్పుడు హనీమూన్ అంటే చాలా ప్లాన్ చేసుకోవాలి? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి? చాలా పనులున్నాయని అంటాడు రాజ్. ప్లానింగ్ మొత్తం ఎప్పుడో అయిపోయిందని, కులు మనాలి వెళ్లాలని ట్రావెల్ ఏజెన్సీతో ఎప్పుడో అన్నీ మాట్లాడానని చెబుతాడు సుభాష్. ఫ్లైట్ టికెట్స్ దొరకాలి కదా అనగా.. అవి కూడా రెడీ అని రాజ్ చేతిలో పెడతాడు ప్రకాశం. టికెట్స్ చూసి రేపే మార్నింగ్ ఫ్లైట్‌కే వెళ్లాలా అని రాజ్ షాక్ అవుతాడు.

బట్టలు సర్దుకోవాలి కదా అని రాజ్ అడగ్గా.. స్వప్న వెళ్లి బ్యాగ్ తీసుకుని వస్తుంది. మీరంతా ఇంతా ప్లానింగ్‌తో ఉన్నారంటే ఇదంతా కళావతి ఇచ్చిన ట్రైనింగ్ లాగానే ఉందని అంటాడు రాజ్. ఆ మాట ఇంకా అనలేదా అని చూస్తున్నానని మండిపడుతుంది కావ్య. నేనేమీ ఎవ్వరికీ చెప్పలేదని.. ఈ ప్లానింగ్‌లో నా ట్రైనింగ్ ఏం లేదని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. ఆమెని ఒప్పించి హనీమూన్‌కి తీసుకెళ్లాలని అంతా చెప్పడంతో రాజ్ పైకి వెళ్తాడు. నేనేదో టెన్షన్‌లో ఉండి అలా మాట్లాడానని అనడంతో కావ్య కంగారుపడి మళ్లీ ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది.

Brahmamudi Serial Today s Episode 663 March 7th 2025 Here is full story

ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నామని కొత్త వాటిని ఎదుర్కోనే ఓపిక లేదని కావ్య చెబుతుంది. మీరు టెన్షన్ అనే పదాన్ని వాడితే నాకు భయమేస్తోందని అంటుంది కావ్య. నిన్ను మాట్లాడించాలని అలా చేశానని జరిగినదంతా దాస్తాడు రాజ్. ఇప్పటి వరకు ఎదురైన సమస్యలు చాలని, ఇకపై కొత్తగా ఏం జరిగినా తట్టుకోలేనని అంటుంది. హనీమూన్ క్యాన్సిల్ చేస్తానని, బ్యాగ్‌లో ఉన్న బట్టలన్నీ బీరువాలో సర్దేస్తానని చెబుతాడు. రాజ్ మాటలతో కావ్య షాక్ అవుతుంది. ఇంకా లాగితే తేడా కొడుతుందని భయపడ్డ కళావతి హనీమూన్‌కి వెళ్లేందుకు ఒప్పుకుంటుంది.

రాజ్‌ని ఆగమని చెప్పి మనం వెళ్లకపోతే అమ్మమ్మ వాళ్లు బాధపడతారని అంటుంది. పెళ్లాం అలిగితే బుజ్జగించడం రాదని, నేనేమీ రానని కూర్చొన్నానా? మీరే అంతా ప్లాన్ చేశారని చెప్పడంతో నాకు కోపం వచ్చిందని చెబుతుంది కావ్య. అయితే హనీమూన్‌కి వెళ్తున్నట్లే కదా అని అంటాడు రాజ్.

అయితే మొత్తం ప్లాన్ అంతా నాదేనని , నేను చెబితేనే వాళ్లు ఆ ఏర్పాట్లు చేశారని కావ్య అసలు నిజం చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నాకు సుఖం, సంతోషం, ప్రశాంతత కావాలని అనిపించిందని కావ్య చెప్పడంతో .. నువ్వు కాబట్టి ఇన్ని సమస్యల్ని తట్టుకున్నావని అంటాడు. హాయిగా హనీమూన్‌కి వెళ్లి జాలిగా గడిపేసి వద్దామని అంటాడు రాజ్. కానీ మీరు కేసు నుంచి బయటపడితే మీతో కలిసి శ్రీశైలం వస్తానని మొక్కుకున్నానని అంటుంది. ముందు మొక్కు తీర్చుకున్నాకే శ్రీశైలం వెళ్దామని చెప్పడంతో రాజ్ సరేనని అంటాడు.

మరోవైపు ప్రొఫెషనల్ కిల్లర్‌ని పిలిపించి మాట్లాడుతుంది యామిని. నేను అది చేశా, ఇది చేశా, వాడిని లేపేశానని గొప్పగా చెబుతాడు యామిని. కావ్య ఫోటో ఇచ్చి ఈ భూమ్మీద లేకుండా చేయ్యాలని చెబుతుంది. అమ్మాయి చాలా అందంగా ఉందని, ముఖంలో కళ కనిపిస్తోందని అంటాడు కిల్లర్. అవన్నీ నీకెందుకు.. చెప్పిన పని చేయ్ మంటూ మండిపడుతుంది యామిని.

వాళ్లు శ్రీశైలం వెళ్తున్నారని ఆ శాల్తీ ఈ భూమ్మీద ఉండకూడదని చెప్పడంతో ఆనవాళ్లు లేకుండా చంపేస్తానని అంటాడు కిల్లర్. ఇది హత్య అని ఎవరికీ డౌట్ రాకూడదని చెప్పి డబ్బులు ఇస్తుంది యామిని. పని కనుక జరగకుంటే ఇంకో కిల్లర్‌ని మాట్లాడి నిన్ను చంపిస్తానని అతనికి వార్నింగ్ ఇస్తుంది. రాజ్‌కి, నాకు మధ్యలోకి ఎవరొచ్చినా వాళ్లకు ఇదే గతి అని మనసులో అనుకుంటుంది యామిని.

Brahmamudi Serial Today s Episode 663 March 7th 2025 Here is full story

రాజ్- కావ్యలు కారులో వెళ్తూ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటారు. ఎన్నిసార్లు మీ ప్రేమ కావాలని వెంటపడినా, మీరు పట్టించుకోలేదని.. నన్ను పెట్టిన టార్చర్‌కు మీపై గృహ హింస కేసు పెట్టాలని అంటుంది కావ్య. భార్యే కదా ఎక్కడికి పోతుందన్న చిన్నచూపని ఫైర్ అవుతుంది. ఇంతలో రాజ్ రూట్ మార్చేసి కారుని ఓ పాత బిల్డింగ్ దగ్గరికి తీసుకొస్తాడు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పగా.. అలాంటప్పుడు ఏదైనా రొమాంటిక్ ప్లేస్‌కి తీసుకెళ్లాలి కానీ, ఇలాంటి బూత్ బంగ్లాకి తీసుకొచ్చారేంటీ అని అడుగుతుంది కావ్య. మనం గుడికి వెళ్తున్నామని.. అలాంటప్పుడు దారిలో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారా అని మండిపడుతుంది. నాకు అలాంటి ఆశలేం లేవని చెప్పి కావ్య కళ్లు మూసి లోపలికి తీసుకెళ్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X