Brahmamudi March 10th Episode : రక్తపు మరకలతో రాజ్ షర్ట్ .. షాక్‌లో కావ్య, యామిని ఉచ్చులో రాజ్

కావ్య కళ్లు మూసి బూత్ బంగ్లాలోకి తీసుకెళ్లి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు రాజ్. మన పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిగిందని, అందుకే నిన్ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు రాజ్ చెప్పడంతో కావ్య పొంగిపోతుంది. మోకాళ్లపై కూర్చొని కావ్య వేలికి ఉంగరం తొడిగి .. జీవితంలో ఎప్పుడూ నన్ను వదిలి వెళ్లొద్దని అడుగుతాడు రాజ్. దాంతో కావ్య సంతోషంతో భర్తని హగ్ చేసుకుంటుంది.

అనంతరం ఇద్దరూ కలిసి శ్రీశైలం వెళ్తుండగా యామిని సుపారీ ఇచ్చిన కిల్లర్ తుపాకీతో కాలుస్తాడు. అయితే బుల్లెట్ పొరపాటున టైరుకు తగిలి కారు లోయలోకి దూసుకెళ్తుంది. ఆ వెంటనే ఇంట్లో రాజ్ - కావ్యల ఫోటో పడిపోవడంతో అపర్ణ మనసు ఏదో కీడు శంకించి ఆమె టెన్షన్ పడుతుంది.

ఇంట్లో వాళ్లంతా అపర్ణకి ధైర్యం చెబుతుండగా రాజ్ - కావ్యలకు యాక్సిడెంట్ అయినట్లు సుభాష్‌కు ఫోన్ వస్తుంది . దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. అందరూ కలిసి ఆసుపత్రికి పరుగులు తీస్తారు. బెడ్‌పై తలకి కట్టుతో అచేతనంగా పడిఉన్న కావ్యని ఆ స్థితిలో చూసి ఇందిర, అపర్ణ, కనకం కంటతడి పెడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 10వ తేదీ .. ఎపిసోడ్ 665లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 665 March 10th 2025 Here is full story

కావ్య ఒక్కటే బెడ్‌పై ఉండటం, రాజ్ కనిపించకపోవడంతో అతను ఏమైయ్యాడో తెలుసుకునేందుకు అప్పూ పోలీసులతో మాట్లాడుతుంది. కారులో కావ్యని చూసి ఆసుపత్రికి తీసుకొచ్చిన పశువుల కాపరిని అప్పూ ప్రశ్నిస్తుంది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండాలని.. కానీ మా అక్కని మాత్రమే తీసుకొచ్చారని , మా బావగారు ఏమయ్యారని అడగ్గా.. అతను తనకు తెలియదని చెబుతాడు. కారులో అమ్మగారు మాత్రమే ఉన్నారని చెప్పడంతో అప్పూ టెన్షన్ పడుతుంది.

ఒకవేళ మీ బావగారు మధ్యలో దిగిపోయి ఉండొచ్చని ఎస్ఐ డౌట్‌గా పడటంతో.. వారిద్దరూ కలిసే శ్రీశైలంలో దేవుడి దర్శనానికి బయల్దేరారని చెబుతుంది అప్పూ. దీంతో అన్నయ్య ఏమయ్యాడో తెలియక కళ్యాణ్ టెన్షన్ పడతాడు. కారు లోయలో పడే సమయంలో బావగారు పక్కకి పడిపోయి ఉండొచ్చని అంటుంది అప్పూ. ఆ ప్లేస్‌కి వెళ్లి వెతికితే ఏదైనా క్లూ దొరకొచ్చని, మమ్మల్ని యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌కి తీసుకెళ్లమని ఎస్ఐని అడుగుతుంది .

ఇద్దరూ ఒకే కారులో ఉన్నప్పుడు కావ్య మాత్రమే దొరికి నా కొడుకు ఏమయ్యాడని బాధపడుతుంది అపర్ణ. కావ్యకే ఇలా ఉంటే రాజ్‌కి ఏమైందోనని అంటుంది ఇందిర. హాయిగా ఇద్దరూ ఇంట్లో ఉండేవాళ్లని.. మీరంతా హనీమూన్‌కి ఏర్పాట్లు చేసి వాళ్లని పంపించారని మండిపడుతుంది రుద్రాణి. వాడు గాయాలతో దొరికినా రాత్రిపగలు వాడికి సేవలు చేసుకుంటానని అంటూ బాధపడుతుంది అపర్ణ. దేన్నయినా విని తట్టుకునేలా ఉండటమే మంచిదని రుద్రాణి అంటుంది. ఇన్ని పాపాలు చేసిన నువ్వే ఇంకా భూమ్మీద ఉన్నావ్.. ఏ పాపం తెలియని నా అల్లుడికి ఏం కాదని మండిపడుతుంది కనకం.

భర్త తనకు సర్‌ప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం ఆ వెంటనే ఆనందంగా శ్రీశైలం వెళ్తుండగా కారు టైర్ పగిలి, లోయలోకి పడిపోవడం ఇలా అన్ని గుర్తొచ్చి కావ్య బెడ్‌ మీద నుంచి ఉలిక్కిపడి లేస్తుంది. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీని డాక్టర్ లోపలికి పిలిపిస్తారు. ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఆయనకి ఏ ప్రమాదం లేదు కదా అని అందరినీ అడుగుతుంది కావ్య. నేను ఆయనని చూడాలని అక్కడికి తీసుకెళ్లమని రచ్చ చేస్తుంది. రాజ్ గురించి ఎవరూ తెలియదని అంటున్నారని.. అసలు ఏం జరిగిందో నువ్వయినా చెప్పమని అంటుంది అపర్ణ. యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారని చెబుతుంది కావ్య. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ వస్తే అందరం ఇక్కడికి వచ్చామని.. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వొక్కదానివే ఉన్నావని, ఎవరిని అడిగినా తెలియదు అని అంటున్నారని చెబుతాడు సుభాష్. మేం కారులో వెళ్తుంటే సడెన్‌గా టైర్ పంక్చర్ అయ్యిందని , కారు కంట్రోల్‌ తప్పి లోయలో పడిపోతుంటే నా తలకి దెబ్బతగిలి స్పృహ తప్పిందని గుర్తుచేసుకుంటుంది కావ్య. ఆయన కళావతి కళావతి అని అరుస్తూనే ఉన్నారని.. ఆ తర్వాత నాకేం గుర్తులేదని .. నేను ప్రాణాలతో ఉన్నప్పుడు, ఆయన కూడా ప్రాణాలతో ఉండాలి కదా అని అంటుంది

నేను చెబుతూనే ఉన్నానని.. వాడొక్కడే లోయలో పడిపోయి ఉంటాడని రుద్రాణి చెబుతుంది. ఇంతలో అప్పూ పోలీసులతో అక్కడికి రావడంతో రాజ్ గురించి అందరూ ఆమెను అడుగుతారు. యాక్సిడెంట్ స్పాట్‌లో ఎంత గాలించినా బావ కనిపించలేదని, చెట్టు కొమ్మకి బావ వేసుకున్న షర్ట్ చిక్కుకుని ఉందని అప్పూ దానిని ఇస్తుంది. కావ్య దానిని తీసుకుని చూడగా షర్ట్ మొత్తం రక్తపు మరకలు కనిపిస్తాయి. ఈ షర్ట్ ఆయనదేనని గుర్తు పడుతుంది.. లోయలో పడిపోయేటప్పుడు ఆయన కారులో నా పక్కనే ఉన్నారని.. ఇద్దరం ఒకేచోట పడిపోయినప్పుడు బావ లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తుంది కావ్య.

మా దగ్గర ఏమైనా దాస్తున్నావా? మేం తట్టుకోలేమని చెప్పలేకపోతున్నావా ? అని అప్పూని అపర్ణ అడుగుతుంది. షర్ట్ మాత్రమే దొరికాయి అంటే.. అడవిలో క్రూర మృగాలు బావ బాడిని లాక్కెళ్లిపోయాయని అంటున్నారని చెబుతుంది అప్పూ. ఆ మాటతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటారు. అంతా అయిపోయింది.. రాజ్ మనకి ఇకలేడని అంటుంది రుద్రాణి. ఆయనికి ఏం కాదు.. ప్రాణాలతోనే ఉంటాడని, నన్ను వదిలి ఎక్కడికిపోడు అంటుంది కావ్య. గుండె రాయి చేసుకో.. ఇక రాజ్ ఎప్పటికీ తిరిగిరాడని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో కావ్య మండిపడుతుంది. ఎవరెన్ని చెప్పినా నేను నమ్మనని.. నేను వెళ్లి వెతుక్కుంటానని గోల చేస్తుంది .

Take a Poll

మరోవైపు రాజ్‌‌కి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ చేయిస్తుంది యామిని. తనకు ఏమైనా జరిగితే నేను బతకలేనని, తనే నా జీవితమని వాళ్ల అమ్మతో చెబుతుంది. ఇంతలో రాజ్ స్పృహలోకి వచ్చి ఎక్కడున్నాను అని డాక్టర్‌ని అడుగుతాడు. మీకు ఏమీ గుర్తు లేదా అని రాజ్‌ని డాక్టర్ ప్రశ్నిస్తాడు. యామిని దగ్గరికి వచ్చి రాజ్‌కి ఏ ప్రమాదం లేదని.. కానీ ఆయన గతం మరిచిపోయాడని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X