Brahmamudi March 13th Episode: కావ్య ఐదో తనానికి గండం.. యామిని ట్రాప్‌లో చిక్కుకున్న రాజ్
మీ బావగారు ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండి ఉంటారని.. ఆయనకి దెబ్బలు తగిలి ఎంతో ఇబ్బంది పడుతున్నారో? ఆయన ఆకలికి ఉండలేరని కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బాధపడతారు. కావ్య పరిస్ధితి చూసి డాక్టర్ కోప్పడి ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాడు. అటు రాజ్‌ని కూడా డిశ్చార్జ్ చేయడంతో యామిని తన ఇంటికి తీసుకెళ్తుంది.
రాజ్‌తో కాలేజీలో దిగిన ఫోటోలు, ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా కొన్ని ఫోటోలు తయారు చేయించి ఇంట్లో , ఆల్బమ్‌లో పెడుతుంది యామిని. ఇంటికొచ్చిన కావ్య.. రాజ్ ఫోటో చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఆయన బతికే ఉన్నాడని, ఖచ్చితంగా తిరిగొస్తాడని అందరితో అంటుంది. రాజ్ మనకి లేడని, ఎప్పటికీ రాడని వాడు చచ్చిపోయాడన్న నిజం కావ్యకి అర్ధమయ్యేలా చెప్పమంటుంది రుద్రాణి. ఆ మాటలతో దుగ్గిరాల కుటుంబం ఆమెపై మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 13వ తేదీ .. ఎపిసోడ్ 668లో ఏం జరిగిందంటే..

రుద్రాణి మాటలతో అపర్ణ ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఓవైపు కొడుకుని పొగొట్టుకుని గుండెలు పగిలేలా రాబందుల్లా మనిషిని పీక్కుతుంటున్నావ్.. ఇంతకంటే చంపేయడమే మంచిదని మండిపడుతుంది ఇందిర. నువ్వు పనికిమాలిన పనులు చేస్తున్నా.. నీలో కొంచెమైనా మానవత్వం ఉంటుందని అనుకున్నానని ఎప్పటికప్పుడు అది రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నావని కోప్పడుతుంది స్వప్న. అనవసరంగా నోరు జారి అందరి చేతా మాటలు పడ్డావని రాహుల్ అంటాడు.
వాళ్లందరి దృష్టిలో నేను చెడ్డదాన్నే కానీ.. నేను మాత్రం నా కొడుకు జీవితానికి బంగారు బాటలు వేస్తున్న శ్రమికురాలిని అంటుంది రుద్రాణి. మంచో, చెడో ఆ దేవుడే రాజ్‌ను దూరం చేశాడు.. ఇక నిన్ను ఈ ఇంటి వారసుడిగా చేయడానికి నాకో గొప్ప అవకాశం దొరికిందని చెబుతుంది . రాజ్‌తో నిశ్చితార్ధం జరిగినట్లుగా చేయించిన ఫోటోలను చూసిన వైదేహి ముచ్చటపడుతుంది. ఇంతలో యామిని వచ్చి రాజ్ నీతో ఏమైనా మాట్లాడాడా అని తల్లిని అడుగుతాడు. గతంలో జరిగినది నిజమైతే రాజ్‌కు ఏమైనా గుర్తొచ్చేదని , కానీ ఇదంతా అభూత కల్పన అని ఓ మాయ లోకంలో ఉన్నట్లు ఉంటే ఏం మాట్లాడతాడని యామిని తండ్రి మండిపడతాడు.
నిజంగా రాజ్‌కి గతం గుర్తొస్తే నన్ను జీవితంలో దగ్గరికి రానివ్వడని నాకు బాగా తెలుసు అంటుంది యామిని. నేను నీలా మనుషులతో, ఎమోషన్స్‌తో ఆడుకోలేనని .. నీలా నటించలేనని నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెబుతాడు యామిని తండ్రి. మీకెందుకు ఈ పంతం.. మీరు మౌనంగా ఉంటే రాజ్‌కి అనుమానం వస్తుందని మండిపడుతుంది వైదేహి. యామిని ఇష్టప్రకారమే జరగనివ్వండి అని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కాలేజీలో చదివే రోజుల్లోనూ ఇలాగే రాజ్‌ని ప్రేమించిందని.. అప్పుడు కూడా వద్దని చెప్పాను ఏం జరిగింది అని గుర్తుచేస్తాడు యామిని తండ్రి. మత్తుకు బానిసై తిరిగి మామూలు మనిషి అయ్యిందని, ఇప్పుడు ఇంత పెద్ద సమస్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందని మండిపడతాడు.
నువ్వు నా సుఖం, సంతోషమే ముఖ్యమైతే ఇలా మాట్లాడవని ఫైర్ అవుతుంది యామిని. ఇంకొకరి సుఖం, సంతోషం, సౌభాగ్యం తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాలా? రాజ్ చనిపోయాడని అతని భార్య, అంత పెద్ద కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారని చెబుతాడు. నాకు రాజ్ కావాలి? అతనితో జీవితం పంచుకోవాలి? ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని చెబుతుంది యామిని. నేను, నా రాజ్ తప్పించి ఎవ్వరు ఏమైపోయినా ఆ డోంట్ కేర్ అంటుంది.
రోజూలాగానే కిచెన్‌లో వంట చేసి అందరినీ భోజనానికి పిలుస్తుంది కావ్య. దీనికేమైనా పిచ్చి పట్టిందా? చీమ కుట్టినట్లు కూడా లేదంటుంది రుద్రాణి. ఒకవేళ కావ్య నమ్మకమే నిజమై ఉండొచ్చు కదా అని అంటాడు రాహుల్. రాజ్ ఎప్పటికీ తిరిగిరాడు, రాకూడదు అని చెబుతుంది రుద్రాణి. రాజ్ లేడంటే కొంచెం బాధగానే ఉందని.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, ఇంట్లో అందరూ నన్ను ఎన్ని మాటలు అన్ని రాజ్ ఒక్క మాట కూడా అనలేదని అంటాడు రాహుల్. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని నువ్వేం మాట్లాడొద్దని చెబుతాడు.
మాకు ఆకలిగా లేదని నువ్వు తిను అంటుంది ఇందిర. కావ్య , లేడు రాడు అన్న నిజం మీకు అర్ధమైనట్లు కావ్యకి అర్ధం కాలేదని చెబుతుంది రుద్రాణి. ఆమె చెప్పినట్లుగానే మీరంతా నమ్ముతున్నారా? అని కావ్య వచ్చి అరుస్తుంది. ఆయన ఎక్కడో బతికే ఉన్నారని, ఖచ్చితంగా తిరిగొస్తారని చెబుతుంది కావ్య. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి నేనే బయటపడినప్పుడు ఆయన బయటపడలేరా అని ప్రశ్నిస్తుంది. నా నమ్మకం నిజమైన రోజున మీరే బాధపడతారని అంటుంది. సుభాష్ అందరికీ నచ్చజెప్పి భోజనం చేయడానికి తీసుకొస్తాడు. ఇందిర, అపర్ణలని కావ్య బలవంతంగా తీసుకెళ్తుంది.
మరోవైపు.. రాజ్‌ని భోజనానికి తీసుకొచ్చి వడ్డిస్తుంది యామిని. కొత్త ప్లేస్ కదా బాగా నిద్రపోయారా అని రాజ్‌ని అడుగుతాడు యామిని తండ్రి. దాంతో యామిని షాక్ అవుతుంది. రామ్ గతం మరిచిపోయాడు కాబట్టి ఇల్లంతా కొత్తగా ఉంటుందని ఆ ఉద్దేశంతో డాడీ మాట్లాడాడని అంటుంది వైదేహి. నాకు ఇష్టమైనవి కూడా నాకేం గుర్తులేదని చాలా థ్యాంక్స్ అని చెబుతాడు రాజ్. నీ గతం మరిచిపోయినా నీ పక్కన నేనున్నాను కదా.. మనం ప్రేమించిన మనిషి మన పక్కన ఉంటే చాలు అని అంటుంది యామిని. ఒకప్పుడు రామ్ క్షణం కూడా తీరిక లేకుండా నీ చుట్టూనే తిరిగేవాడని కథ చెబుతుంది.
దేని గురించి ఆలోచించాలో తెలియక నాకంతా అయోమయంగా ఉందని రాజ్ చెప్పడంతో యామిని వెంటనే లైట్స్ కట్టేసి క్యాండిల్ తీసుకొస్తుంది. చీకట్లో ఉండలేకపోతున్నానని అన్నావ్ కదా.. అందుకే నీకు వెలుగులా నేను ఉంటానని అంటుంది యామిని. నా చేతిలో చేయి వేసి నడుస్తావా అని యామిని అడగ్గా.. రాజ్ ఆమెకు మాట ఇస్తాడు. దీంతో అంతా సంతోషపడతారు. నువ్వు నాకు చాలా సార్లు థ్యాంక్స్ చెప్పావని.. కానీ నేరు కోరుకుంటున్న మూడు పదాలు మాత్రం నీ నోటివెంట రావడం లేదని అంటుంది.
డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ భోజనాలు వడ్డిస్తుండగా పొరపాటున రాజ్ ప్లేట్‌లో అన్నం పెట్టబోతుంది కావ్య. బావ ఇంకా తిరిగిరాలేదని అప్పూ చెప్పడంతో మరిచిపోయానని అంటుంది కళావతి. భోజనం దగ్గర అపర్ణ ఏడుస్తు.. నీకున్నంత ఆత్మస్థైర్యం నాకు లేదని అంటుంది. నాకు రాజ్ తిరిగొస్తాడని నమ్మకం లేదని చెప్పి వెళ్లిపోతుంది. ఆ వెంటనే మిగిలిన కుటుంబ సభ్యులంతా కూడా లేచి వెళ్లిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










