Brahmamudi March 14th Episode: రాజ్‌ బతికే ఉన్నాడని తెలుసుకున్న కావ్య .. భర్త కోసం పరుగులు

రాజ్ మనకి ఇక లేడని రుద్రాణి అనడంతో అపర్ణ ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. రాజ్ చనిపోయినందుకు నాకు బాధగానే ఉందని అంటాడు రాహుల్. రాజ్‌తో నిశ్చితార్ధం జరిగినట్లుగా ఫోటోలు చూస్తూ వైదేహి సంతోషిస్తుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావని తండ్రి యామినిని హెచ్చరిస్తాడు. రాజ్ చనిపోయాడని అతని భార్య, కుటుంబం గుండె పగిలేలా ఏడుస్తుంటారని చెబుతాడు. కానీ యామిని ఏమీ పట్టించుకోదు.

కిచెన్‌లో వంట చేసి అందరినీ భోజనానికి పిలుస్తుంది కావ్య. ఆమె తీరుతో దుగ్గిరాల కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. అయినప్పటికీ అందరినీ బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. రాజ్‌ను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి వడ్డిస్తుంది యామిని. ఆమె తనపై చూపిస్తోన్న ప్రేమకు రాజ్ కరిగిపోయి యామిని చేతిలో చేయ్యేసి థ్యాంక్స్ చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 14వ తేదీ .. ఎపిసోడ్ 669లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 669 March 14th 2025 Here is full story

ఆయన లేరంటున్నారు? రాడు అంటున్నారంటూ కృష్ణుడి ముందు కూర్చొని ఏడుస్తుంది కావ్య. ఆయన బ్రతికే ఉన్నారని నా మన:సాక్షి చెబుతుందని, ఆయన ఎక్కడున్నా సరే తిరిగి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టాలని అంటుంది కావ్య. భోజనం చేస్తుండగా రాజ్ దగ్గుతుంటాడు.. ఎవరో బాగా తలచుకుంటూ ఉన్నారని యామిని తండ్రి అంటాడు, ఇంకెవరు ఆయన భార్యే అయ్యుంటుందని వైదేహి చెప్పేసరికి యామిని , రాజ్ షాక్ అవుతారు. నాకు పెళ్లయ్యిందా? నా భార్య ఎవరు? అని రాజ్ ప్రశ్నిస్తాడు. యామిని నీకు కాబోయే భార్య కదా? పక్కనే ఉన్నా నిన్ను తలచుకుంటూ ఉంటుందని చెబుతుంది వైదేహి. ఈ ప్రపంచంలో నేను , నా తల్లిదండ్రులు తప్పించి ఎవరూ లేరని అంటుంది యామిని.

కావ్య పరిస్ధితి చూసి స్వప్న, అప్పూలు బాధపడుతుంటారు. బావ చనిపోయాడని అందరూ బాధపడుతుంటే, అక్క మాత్రం ఏం జరగనట్లే ఉందని అంటుంది అప్పూ. అక్క అసలు ధైర్యంగా ఉందా? ధైర్యంగా ఉన్నట్లు నటిస్తుందా? లేక మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యిందా అని ప్రశ్నిస్తుంది. కావ్యని అలా చూసి అపర్ణ ఆంటీ బాధపడుతోందని, నిజంగా కావ్య పిచ్చిది అయిపోతుందని చెబుతుంది స్వప్న. తన నమ్మకమే నిజం అవుతుందేమో? బావ ఇంటికి తిరిగొస్తాడేమో అంటుంది అప్పూ. నీ చేతులతో నువ్వే రాజ్ బట్టలు, తన వస్తువులు తీసుకొచ్చి అందరికీ చూపించావు కదా అని స్వప్న చెబుతుంది.

నువ్వొక పోలీస్ ఆఫీసర్‌వి, రాజ్‌కి మరదలివి, కావ్యకి చెల్లెలివి అన్న విషయం మరిచిపోయి మాట్లాడు అంటుంది. నేను బావ బట్టలు, వస్తువులే తీసుకొచ్చాను కానీ బావ బాడీని చూడలేదు కదా అని చెబుతుంది అప్పూ. ఈ విషయంలో ఇంకొంచెం డీప్‌గా ఆలోచించాలని , ప్రతికోణంలోనూ ఇన్వెస్టిగేషన్ చేయాలని అంటుంది. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని, దాని మూలాలు పట్టుకోవాలని, చిన్న తీగ దొరికినా దాని డొంక కదులుతుందని చెబుతుంది అప్పూ. రాజ్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండటంతో యామిని చూస్తుంది. నాది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టే ఆ దేవుడు నిన్ను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టేశాడని మనసులో అనుకుంటుంది యామిని.

రాజ్‌ని వెనుక నుంచి వెళ్లి హగ్ చేసుకోగా.. అతను విదిలించుకుంటాడు. నువ్వా నేను ఇంకెవరో అనుకున్నానని రాజ్ అంటాడు. ఈ ఇంట్లో నేను తప్ప నిన్ను పట్టుకునే ధైర్యం లేదని చెబుతుంది యామిని. గతంలో ఏం జరిగిందో నీకు గుర్తు రావడం లేదు అంతేకదా, దానికి ఎందుకంత కంగారు పడుతున్నావ్ అని ప్రశ్నిస్తుంది. నీ చుట్టూ ఉన్నవాళ్లు, నా మాటల మీద నీకు నమ్మకం కుదరడం లేదా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదని, అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారని.. ఈ ఇంట్లో ఉన్న ఫోటోలు మన గతాన్ని చూపిస్తున్నాయని అంటాడు.

మీరంతా నా మీద ఎంతో ఎఫెక్షన్ చూపిస్తున్నా ఫ్రీగా ఉండలేకపోతున్నానని చెబుతాడు రాజ్. నా మాటలతో నిన్ను చాలా బాధపెట్టానని అంటాడు. నీకు గుర్తొచ్చే వరకు నేను వెయిట్ చేస్తానని చెబుతుంది యామిని. నువ్వు నా దారిలోకి రావాలంటే ఈ డోస్ సరిపోదని .. దానిని ఇంకా పెంచాలని మనసులో అనుకుంటుంది. ఉదయాన్నే రాహుల్‌ని రెడీ చేస్తుంది రుద్రాణి. అవకాశం దొరికినప్పుడే మనం ఆ సీఈవో కుర్చీని లాగేసుకోవాలని అంటుంది. సీఈవో అవ్వాలని లేదా? అని రుద్రాణి ప్రశ్నించగా.. ఉంది కానీ ఎలా? అని ప్రశ్నిస్తాడు రాహుల్. ఇంతకు ముందు రాజ్, కావ్యలు ఆఫీస్ వ్యవహారాలు చూసుకున్నారని చెబుతుంది రుద్రాణి.

రాజ్ లేడు, కావ్యకి ఇప్పుడు అంత సీన్ లేదు.. పోయిన మొగుడు ఎప్పుడు తిరిగొస్తాడా? అని ఎదురుచూసి చూసి పిచ్చిది అయిపోతుందని, ఇళ్లంతా శోకసంద్రంలో మునిగిపోయిందని అంటుంది రుద్రాణి. ఇప్పటికైనా కాస్త బుర్ర వాడు.. దుగ్గిరాల బ్యాచ్ మొత్తం బాధలోంచి బయటికి వచ్చేసరికి నువ్వు తప్ప వేరే ఆప్షన్ వాళ్లకి ఉండకూడదని చెబుతుంది. ఈసారి మిస్ ఫైర్ అయితే నిన్ను ఫైర్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. నిన్ను రాజుని చేసి రాజ్యాన్ని ఏలదామని అనుకుంటే .. నేను రాజు, నేనే మంత్రి అన్నట్లు అయిపోయింది నా పరిస్ధితి అని బాధపడుతుంది రుద్రాణి. నన్ను సీఈవోని చేయడానికి సుభాష్ మావయ్య ఒప్పుకుంటాడా అని రాహుల్ ప్రశ్నించగా.. ఆ పావులు నేను కదుపుతానని అంటుంది.

యామిని, తన తల్లిదండ్రులతో కలిసి టీ తాగుతూ ఉంటుంది. ఏమంటున్నాడు నీ రాజ్ అని యామినిని అడుగుతుంది వైదేహి. నువ్వెవరో గుర్తుకొస్తే జీవితాంతం బాధపడాలని.. కానీ మంచో చెడో ఈ లోపే నువ్వు అతనితో తాళి కట్టించుకుంటే ఆ తర్వాత ఏం జరిగినా నీకు రుజువులు ఉంటాయని అంటుంది. ఆ మాటలతో యామిని తండ్రి కోప్పడి నువ్వసలు తల్లివేనా? కూతురితో చెప్పాల్సిన మాటలేనా? అంటాడు. ఇదంతా నా ప్లానే డాడీ అని అంటుండగా రాజ్ చూస్తాడు. దీంతో వాళ్లంతా అలర్ట్ అవుతారు.

బావ మామూలు మనిషి అవుతాడనే నమ్మకం నాకు లేదని , గతాన్ని గుర్తుచేయాలని చూస్తే బావ బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అవుతుందని అంటుంది యామిని. బావ నన్ను పరాయి దానిలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానని చెబుతుంది. అన్ని బాగుంటే ఈరోజు హనీమూన్‌లో ఉండేవాళ్లమని.. ఈరోజు ఇలా జరిగిందని అంటుంది. నేనొక్క గంట కనిపించకపోతే వెంటనే నా కోసం వెతుక్కుంటూ వచ్చేవాడని చెబుతుంది. ఇప్పుడు నన్ను పరాయి వ్యక్తిలా చూస్తున్నాడని.. ఇదంతా ఎలా భరించాలో నాకు అర్ధం కావడం లేదని అంటుంది.

దాంతో యామిని తండ్రి కలగజేసుకుని మంచి సైకియాట్రిస్ట్‌కు చూపిద్దామని చెప్పేసరికి యామిని, వైదేహి షాక్ అవుతారు. గతం గుర్తుచేస్తే బ్రెయిన్‌లో నరాలు చిట్లీపోతాయని డాక్టర్ గారు చెప్పారు కదా.. అలాంటి ప్రయత్నం చేస్తే బావ ప్రాణాలకే ప్రమాదమని యామిని కవర్ చేస్తుంది. బావకి మళ్లీ ఏదైనా అయితే నేను బతకనని చెబుతుంది. ఆ మాటలు విన్న రాజ్ బాధపడతాడు. మీ డాడీ సలహా మాత్రమే ఇచ్చారని.. రామ్‌కి ప్రమాదం జరిగే పని ఆయన మాత్రం ఎలా చేస్తారని అంటుంది. రామ్‌కి గతం గుర్తొచ్చినా, లేకున్నా రామ్ నీకు బావ కాకుండా పోడు, నువ్వు మరదలు కాకుండా పోవు అని చెబుతుంది యామిని. ఈ మాటలు విన్న రాజ్ బాధపడతాడు.

More from Filmibeat

Read more about: brahmamudi deepika rangaraju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X