Brahmamudi March 17th Episode: కావ్య కళ్లు తెరిచేలోగా రాజ్ మాయం.. దుగ్గిరాల కుటుంబానికి శుభవార్త

రాజ్ చనిపోలేదని కావ్య పదే పదే చెప్పడంతో అప్పూ ఆ దిశగా ఎంక్వైరీ చేస్తుంది. రాజ్ షర్ట్‌పై ఉన్న రక్తపు మరకల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా అవి అతనివేనని తెలుస్తుంది. నా భర్తని నేనే వెతుక్కుంటానంటూ కావ్య బయల్దేరుతుంది. అందరూ బాధలో ఉంటే కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం కష్టమని రాహుల్‌ను సీఈవోగా పంపిస్తున్నాని రుద్రాణి చెప్పడంతో అవసరం లేదని నేను, ప్రకాశం వెళ్లి కంపెనీ పనులు చూసుకుంటామని సుభాష్ తేల్చిచెబుతాడు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి షాక్ అవుతుంది.

నాకు ఇంట్లో ఉంటే పిచ్చిగా ఉందని బయటికి వెళ్దామని యామినితో అంటాడు రాజ్. నువ్వు అడిగింది ఏది నేను కాదను అని తప్పకుండా వెళ్దామని అంటుంది యామిని. రాజ్ కోసం వెతుకుతూ కారులో వెతుకుతున్న కావ్య.. రాజ్‌ని చూసి షాక్ అవుతుంది. వెంటనే డ్రైవర్‌ని కారు ఆపమని చెప్పి పిచ్చి దానిలా రాజ్ కారు వెంట పరుగులు తీస్తుంది. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి రాజ్ పక్కనే పడిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 17వ తేదీ .. ఎపిసోడ్ 671లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 671 March 17th 2025 Here is full story

తన కారు వద్ద పడిపోయిన కావ్యను తీసుకుని ఆసుపత్రికి వెళ్తాడు రాజ్. కావ్యని పరీక్షించిన డాక్టర్ పల్స్ బాగా పడిపోయాయని ఐసీయూకు తీసుకెళ్లమని చెబుతుంది. ఇంతలో రాజ్ కోసం యామిని ఫోన్ చేస్తుంది. ఏంటీ బావా? నా మీద నీకు కోపం వచ్చిందా? వదిలేసి వెళ్లిపోయావ్ ఏంటీ? అని అడుగుతుంది. నీ మీద నాకు కోపం దేనికి? అని రాజ్ ఆన్సర్ ఇస్తాడు. మరి ఎక్కడికి వెళ్లావని యామిని అడగ్గా.. ఇందాక రోడ్డు మీదు ఎవరో ఒక అమ్మాయి కళ్లు తిరిగి రోడ్డు మీద పడిపోతే అందుకే ఆసుపత్రికి తీసుకొచ్చానని చెబుతాడు.

అందుకని నన్ను రోడ్డు మీదే నిలబెట్టేస్తావా అని యామిని మండిపడుతుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావ్? ఒక మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా అని అంటాడు రాజ్. వీడు గతం మరిచిపోయినా మానవత్వం మాత్రం అలాగే ఉందని మనుసులో అనుకుంటుంది యామిని. సరే నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చేయమని చెబుతుంది. క్యాబ్‌లో వెళ్లిపోవచ్చు కదా అని రాజ్ చెప్పగా.. నువ్వే వచ్చి నన్ను పిక్ చేసుకోవాలని అంటుంది.

ఇంతలో కావ్యకి ట్రీట్‌మెంట్ చేసి వస్తున్న డాక్టర్‌ని పిలిచి ఎలా ఉంది అని అడుగుతాడు. ఆవిడ బాగా నీరసంగా ఉండటం వల్ల కళ్లు తిరిగి పడిపోయిందని అంటుంది. సెలైన్ ఎక్కిస్తున్నామని అర్ధగంటలో కోలుకుంటుందని చెబుతుంది డాక్టర్. తను ఎవరో నాకు తెలియదని, ఆవిడ బాగానే ఉంది కాబట్టి నేను వెళ్తానని .. అక్కడ నా వాళ్లు వెయిట్ చేస్తూ ఉంటారని అంటాడు రాజ్. మీలాగా ఈ రోజుల్లో సాయం చేసేవాళ్లు లేకుండా పోయారని , మీరు బిల్ కట్టి వెళ్లండి అని చెబుతుంది డాక్టర్. తర్వాత రాజ్ బిల్ కట్టేసి వెళ్లిపోతాడు.

స్పృహలోకి వచ్చిన కావ్య.. రాజ్‌ను చూడటం, అతను ఆసుపత్రిలో జాయిన్ చేయడం అన్ని గుర్తు చేసుకుంటుంది. పక్కనే ఉన్న నర్స్‌ని మా ఆయన ఎక్కడ అని ప్రశ్నిస్తుంది? మిమ్మల్ని అడ్మిట్ చేసిన వ్యక్తి బిల్లు కడుతున్నారని డాక్టర్ చెప్పడంతో సెలైన్ పీకేసి పరుగులు తీస్తుంది కావ్య. బిల్లు కట్టిన రాజ్‌కి ఆసుపత్రి సిబ్బంది రశీదు ఇవ్వబోతుండగా ఆవిడకే ఇచ్చేయమని అంటాడు. ఇందాక ఒకాయన నాకు బిల్లు కట్టారు కదా ఆయన ఎక్కడ అని కావ్య అడగ్గా.. ఆయన వెళ్లిపోతున్నారని చెబుతాడు ఆసుపత్రి వ్యక్తి. ఇంతలో రాజ్‌ను వెతుక్కుంటూ కావ్య బయటికి వెళ్లగా.. అప్పటికే రాజ్ కారులో వెళ్లిపోతాడు. ఆయనకేం కాలేదని, నా నమ్మకమే నిజమైందని సంతోషపడుతుంది కావ్య.

కావ్య మాటలు పట్టుకుని మీరంతా మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇప్పటికైనా డైజెస్ట్ చేసుకోండి..రాజ్ లేడు, రాడు అని చెబుతుంది. ఇంతలో కావ్య వచ్చి బతికే ఉన్నారని గట్టిగా అరుస్తుంది. నా భర్త బతికే ఉన్నారని.. నా నమ్మకం బతికించిందని చెబుతుంది కావ్య. ఆయన ప్రాణాలతోనే ఉన్నారని అంటుంది కళావతి. మీకు కడుపు కోత లేదని, గర్భశోకం లేదని, మీరు ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చాల్సిన అవసరం లేదని అపర్ణతో చెబుతుంది కావ్య. నా కళ్లారా నేను రాజ్‌ని చూశానని అంటుంది.

ముందు నుంచి ఆయనకేం కాదని నేను అంటూనే ఉన్నానని ఇందిరతో చెబుతుంది కావ్య. ఆయనకేం కాలేదని, ఎప్పటిలాగే ఉన్నారని అంటుంది. కావ్య చెబుతున్న మాటలకు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. అంతా అయిపోయింది ఇప్పటి వరకు నాకు కాస్త అనుమానంగా ఉండేదని, ఇప్పుడు పూర్తిగా కన్ఫర్మ్ అయ్యిందని కావ్యకు మతిభ్రమించిందని అంటుంది రుద్రాణి. నాకు మతి తప్పిందా? నన్ను వెర్రదానిని చేయాలని చూస్తున్నారా అని రుద్రాణిపై మండిపడుతుంది కళావతి.

ఎక్కడో అడవిలో చనిపోయినవాడు, నీకు ఇక్కడ కనిపించడం ఏంటని ప్రశ్నిస్తుంది కావ్య. బయటికి వెళ్లి ఇలాగే మాట్లాడితే.. దుగ్గిరాల వారి ఇంటి కోడలు ఇలా అయిపోయిందేంటీ అని నవ్వుతారని మండిపడుతుంది రుద్రాణి. నూటికి నూరుపాళ్లు నేను ఆరోగ్యంగానే ఉన్నానని.. నా కళ్లు నన్ను మోసం చేస్తాయా? నా భర్తను నేను గుర్తుపట్టలేనా అని ప్రశ్నిస్తుంది కావ్య. మావయ్య గారు ఈ రుద్రాణి మాటలను నువ్వు పట్టించుకోవద్దు.. నిజంగానే మీ అబ్బాయి ప్రాణాలతోనే ఉన్నారని సుభాష్‌తో అంటుంది. స్వప్న దగ్గరికి వెళ్లి కనీసం నువ్వయినా నమ్మమని చెబుతుంది , ఇవాళ నిజంగా నాకు పండగ రోజని అంటుంది.

నా సంకల్పం గట్టిదని, మీరంతా లేరు అనుకున్న మనిషి .. నేను బతికే ఉన్నారని నమ్మానని చెబుతుంది కావ్య. ఆ నమ్మకమే ఇవాళ నిజమైందని, ఆయన బతికే ఉన్నారని రుజువైందని అంటుంది . కవిగారు మీ అన్నయ్య నా కోసం బ్రతికే ఉన్నారని , అప్పూ నీ ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధమేనని చెబుతుంది. బతికే ఉన్న మనిషిని చనిపోయాడని చెప్పినందుకు నీకు నీ పై ఆఫీసర్ నుంచి మొట్టికాయలు పడతాయి.. చూస్తూ ఉండు అని అంటుంది కావ్య. ఆ మాటలతో రుద్రాణి మండిపడి.. నీ వెర్రీ ఆనందం ఏంటీ అని ఫైర్ అవుతుంది రుద్రాణి.

అన్నయ్యని ఎప్పుడు చూశారు? ఎక్కడ చూశారు? అని కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. నేను మీ అన్నయ్యని వెతుకుతూ వెళ్తుండగా.. నా పక్క నుంచి ఓ కారులో ఆయన వెళ్తున్నారని.. నేను ఆయనను పిలుస్తూ వెనకాలే పరిగెత్తానని అంటుంది. పరిగెత్తి పరిగెత్తి బాగా అలిసిపోయానని.. ఎండ దెబ్బకి అక్కడే ఆగిపోయానని , మీ అన్నయ్య కారు కొంత దూరంలో ఆగిందని ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయానని చెబుతుంది. ఒక రెండు చేతులు నన్ను ఎత్తుకోవడం నాకు తెలిసిందని, మీ అన్నయ్య చేతి స్పర్శ నాకు తెలుసుని అంటుంది. ఆయనే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చూశానని.. స్పృహలోకి వచ్చేసరికి ఆయన లేరని చెబుతుంది. నర్స్‌ని అడిగితే నన్ను అడ్మిట్ చేసి వెళ్లిపోయారని చెప్పిందని కావ్య అంటుంది. ఆ మాటలతో రుద్రాణి మండిపడుతుంది.

నిజంగా రాజ్ బతికే ఉంటే ఇంటికి ఎందుకు రాలేదు? ఎవరి కారులోనో ఎందుకు వెళ్లాడు? నిన్ను చూసినవాడు హాస్పిటల్‌లో వదిలేసి ఎందుకు వెళ్తాడు? నిన్ను , ఈ కుటుంబాన్ని ఎందుకు వదులుకుంటాడు? అని ప్రశ్నిస్తుంది. మానసికంగా నువ్వు ఎంత డిస్ట్రబ్ అయ్యావో తెలుస్తోందని.. నీకు ట్రీట్‌మెంట్ అవసరమని అంటుంది. మీరు ఎప్పుడు ఏది నమ్మరేంటీ అని కావ్య ప్రశ్నించగా.. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటుంది. నా దగ్గర వాటికి సమాధానం లేదని చెబుతుంది కావ్య. మీరు అడిగిన ప్రతి ప్రశ్న కరెక్టే.. ఆయనను నన్ను చూసి ఎందుకు వదిలేసి వెళ్లారో నాకు కూడా తెలియదని అంటుంది.

కావ్యని ఇప్పటికైనా ఆపండి.. లేదంటే ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించమని చెబుతుంది రుద్రాణి. నేను చెప్పిన మాటలకు నా దగ్గర ఏ ఆధారం, సాక్ష్యం లేదని .. కానీ ఆయన బతికే ఉన్నది మాత్రం నిజం అని అంటుంది కావ్య. ఆయన ఎక్కడ ఉన్నా సరే వెతికి మీ అందరి ముందు నిలబెడతానని చెబుతుంది. కావ్య మాటల్ని ఇలాగే నమ్మితే.. రేపు చంద్రుడు మీద రాజ్ తిరుగుతున్నాడు, రాకెట్‌ని రెంట్‌కి తీసుకుని వెతుకుదామని అంటుందని మండిపడుతుంది రుద్రాణి. కావ్యని ముందు మంచి ఆసుపత్రికి తీసుకెళ్లమని సుభాష్‌కి చెబుతుంది.

ఇంతలో ఓ కవర్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌ని చెక్ చేస్తుంది యామిని. వాళ్ల అమ్మానాన్న వచ్చి ఏంటీ అని అడగ్గా.. రామ్ పేరు మీద ప్రూఫ్స్ రెడీ చేస్తున్నానని చెబుతుంది. నకిలీ మనిషిగా మారుస్తున్నావా? అని తండ్రి ప్రశ్నించగా.. నా మనిషిగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నానని అంటుంది. నీ మనిషిగా మార్చుకున్నంత మాత్రాన నీ వాడు కాడని అంటాడు తండ్రి. ఏదో ఒక రోజు గతం గుర్తొస్తే నిన్ను క్షమిస్తాడా అని ప్రశ్నిస్తాడు. ఇండియాలో ఉంటే ఆ ప్రమాదం జరుగుతుందని , రాజ్‌ని ఫారిన్‌కి తీసుకెళ్తానని అంటుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X