Brahmamudi March 18th Episode: రాజ్‌ని రామ్‌గా మార్చేలా ఆధారాలు రెడీ.. రాజ్ కర్మకాండని అడ్డుకున్న కావ్య
తన కారు వద్ద స్పృహ తప్పి పడిపోయిన కావ్యని తీసుకుని ఆసుపత్రిలో చేరుస్తాడు రాజ్. ఆమె కళ్లు తెరిచి చూసేసరికి రాజ్ హాస్పిటల్ నుంచి వెళ్లిపోతాడు. రాజ్ బతికి లేడని ఇకపై కావ్యకి అర్ధమయ్యేలా చెప్పమని దుగ్గిరాల కుటుంబానికి రుద్రాణి తేల్చిచెబుతుంది. ఇంతలో కావ్య వచ్చి ఆయన బతికే ఉన్నారని , నేను చూశానని కావ్య అంటుంది. కావ్యకి బాగా పిచ్చి పట్టిందని మంచి సైకియాట్రిస్ట్‌కి చూపించమని సుభాష్‌కి చెబుతుంది.
అన్నయ్యని ఎప్పుడు? ఎక్కడ చూశారని కావ్యని అడుగుతాడు కళ్యాణ్. దీంతో జరిగినదంతా చెబుతుంది కావ్య. కానీ ఎంత చెప్పినా ఎవ్వరూ ఆమె మాట నమ్మరు. నా భర్త బతికే ఉన్నాడని , త్వరలోనే ఆయనను మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టకపోతే నా పేరు కావ్యే కాదని సవాల్ విసురుతుంది కళావతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 18వ తేదీ .. ఎపిసోడ్ 672లో ఏం జరిగిందంటే..

రాజ్‌తో కలిసి ఫారిన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు యామిని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఇన్నాళ్లూ మాకు దూరంగా ఉన్నావని, అదృష్టం బాగుండి తిరిగొచ్చావని అంటుంది తల్లి. రాజ్‌ని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేకపోయినా నీ కోసం ఒప్పుకుంటే ఇప్పుడు అతనిని తీసుకుని ఫారిన్‌కు వెళ్లిపోతావా అని బాధపడుతుంది వైదేహి. ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు రాజ్‌ని గుర్తుపట్టొచ్చు.. అతని కుటుంబం ఎదురుకావొచ్చని , ఈసారి రాజ్‌ని ఎట్టి పరిస్ధితుల్లోనూ వదులుకోనని చెబుతుంది. కానీ అనవసరం మా పెళ్లి లేట్ అవుతుందని, అందుకే ఫారిన్ తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నానని చెబుతుంది యామిని.
గతం గుర్తు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని, మీరు కావాలని అనుకుంటే ఎప్పుడైనా రావొచ్చని అంటుంది యామిని. ఇలా చేయడం నాకు ఇష్టం లేదని యామిని తండ్రి అంటాడు. ఇప్పటికే చాలా దూరం తీసుకొచ్చావని, నువ్వు ఇష్టపడ్డావనే కారణంతో పాపమని తెలిసినా మౌనంగా ఉండిపోయానని చెబుతాడు . నువ్వు ఫారిన్ వెళితే మాకు శాశ్వతంగా దూరమైపోతావని అంటాడు. ఇంతలో రాజ్ వచ్చి ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. నాకు ఇండియాలో ఉండాలని లేదని.. ఇద్దరం కలిసి ఫారిన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అవుదామని అనుకుంటున్నట్లు చెబుతుంది యామిని. దానికి అమ్మానాన్న ఒప్పుకోవడం లేదని అంటుంది.
మీ పెళ్లి ఇక్కడే జరిపించాలనేది మా కోరిక అని వైదేహి చెబుతుంది. జరిగిన దానిని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానని , అలాంటిది ఈ హ్యాపీ మూవ్‌మెంట్స్ ఇప్పట్లో వద్దని అంటాడు రాజ్. భర్త గురించి ఆలోచిస్తుంటుంది కావ్య. ఇంతలో మంచానికి గాజులు తగిలి అవి ముక్కలవుతాయి. దాంతో రాజ్ తన చేతులకి గాజులు వేసిన రోజును గుర్తుచేసుకుంటుంది కావ్య. గాజుల సైజ్ చిన్నదిగా ఉండటంతో కావ్య చేతులకి నూనె రాసి వాటిని పట్టిస్తాడు రాజ్. ఎందుకు గాజులు వేశారు అని కావ్య అడగ్గా.. నాకు అర్ధరాత్రి మెలకువ వచ్చినప్పుడు నీ చేతి గాజుల చప్పుడు వింటే నువ్వు నా పక్కనే ఉన్నావన్న నమ్మకం కుదురుతుందని అంటుంది.
మీరు వేసిన గాజులు నేను తీసేస్తాను కదా అని అంటుంది కావ్య. దాంతో రాజ్ ఆమెను వెనుక నుంచి పట్టుకుంటాడు. కళావతి అని కాకుండా కావ్య అని ప్రేమగా పిలిస్తే గాజులు వేసుకుంటానని లేదంటే తీసేస్తానని చెబుతుంది. అయినప్పటికీ రాజ్ వదిలిపెట్టడు. దాంతో వదలమని కావ్య బ్రతిమలాడుతూ కలవరిస్తూ కళ్లు తెరుస్తుంది. ఇంతలో ఇందిర ఆమెను చూస్తుంది. కావ్యని చూస్తే భయమేస్తోందని కింద హాల్లోకి వచ్చి సుభాష్‌కి చెబుతుంది. ఆ మాటలతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు.
చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని నాట్యం చేస్తుందా? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. రాజ్ ఇంకా తిరిగి వస్తాడనే భ్రమల్లోనే కావ్య బతుకుతోందని అంటుంది ఇందిర. తను అంత గుడ్డిగా నమ్ముతోందని మనం చెప్పినా వినే పరిస్ధితుల్లో లేదు కదా అని అంటుంది ధాన్యలక్ష్మీ. రాజ్ తన పక్కనే ఉన్నట్లు , తనతో మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటూ మురిసిపోతోందని చెబుతుంది ఇందిర. రుద్రాణి చెప్పినట్లు తన మానసిక స్థితి మారిపోతుందని భయమేస్తోందని అంటుంది. అందరూ అదే అభిప్రాయం చెప్పడంతో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని డాక్టర్‌ని పిలిపించాలని అనుకుంటారు.
డాక్టర్‌తో పాటు ఒక పురోహితుడిని కూడా పిలిపించండి అని అంటుంది రుద్రాణి. ఎందుకు అని ఇందిర ప్రశ్నించగా.. సాంప్రదాయం ప్రకారం మూడో రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయని అంటుంది . దాంతో అంతా కలిసి రుద్రాణిపై మండిపడతారు. ఇవన్నీ నా స్వార్ధం కోసం చెప్పడం లేదని రాజ్ ఆత్మ శాంతించాలంటే ఇవన్నీ చేయాల్సిందేనని అంటుంది. రాజ్ బతికున్నప్పుడు ఎన్నో చేయాలని అనుకున్నానని.. కనీసం వాడు పోయాక అయినా వాడి ఆత్మ శాంతించేలా చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది.
రాజ్‌కు కావ్య గుర్తొస్తూ ఉంటుంది? ఆమె ఎవరు ? అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో యామిని వచ్చి రాజ్ భుజాలపై చేయి వేయడంతో దానిని విసిరేస్తాడు. నీ చేతి స్పర్శ నాకు పరిచయమున్న స్పర్శ లాగా అనిపించడం లేదని అనడంతో యామిని షాక్ అవుతుంది. కానీ ఆ అమ్మాయిని టచ్ చేస్తే మాత్రం నాకు బాగా తెలిసిన స్పర్శలా అనిపించిందని అంటాడు రాజ్. ఏ అమ్మాయి అని యామిని ప్రశ్నించగా.. ఇవాళ ఒక అమ్మాయిని ఆసుపత్రిలో చేర్చాను కదా ఆమె అని అంటాడు. ఆమె ముఖం చూస్తే నాకు బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించిందని, నాకు ఏదో గుర్తొచ్చిందని చెబుతాడు.
రాజ్ మాటలతో యామిని కంగారు పడుతుంది. ఆమె ఎవరు? ఒకవేళ కావ్యే అయ్యి ఉంటుందా? అని ఆలోచిస్తుంటుంది. ఇక్కడే రాజ్‌ని ఉంచితే నాకు పూర్తిగా దూరమైపోతాడని భయపడుతుంది. నీకంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని నీకున్నది నేను, అమ్మానాన్న మాత్రమేనని అంటుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? అని రాజ్ అడగ్గా.. నీ ఫ్రెండ్స్‌లోనో, నా ఫ్రెండ్స్‌లోనో ఎవరో ఒకరు అయ్యుంటారని చెబుతుంది యామిని. ఆ మాటలతో రాజ్ కొంచెం కూల్ అవుతాడు.
ఉదయాన్నే పురోహితుడిని తీసుకొచ్చి రాజ్ కర్మకాండలు జరిపిస్తుంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ. నా మనవడి కళ్ల ముందు నేను రాలిపోవాల్సిన దాన్ని.. అలాంటిది నా కళ్ల ముందు వాడిని పొగొట్టుకున్నానని అంటుంది ఇందిర. నన్ను అమ్మా అని ఎవరు పిలుస్తారు అంటూ అపర్ణ బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











