Brahmamudi March 19th Episode: పిచ్చిపట్టినట్లుగా కావ్య ప్రవర్తన.. షాక్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ
రాజ్‌ని రామ్‌గా నమ్మేంచేందుకు అవసరమైన అన్ని ప్రూఫ్స్‌ని సిద్ధం చేస్తుంది యామిని. ఇక్కడే ఉంటే రాజ్‌కి వాళ్ల ఫ్యామిలీ , తెలిసినవాళ్లు ఎదురై గతం గుర్తు చేయొచ్చని అందుకే ఫారిన్ తీసుకెళ్తున్నట్లు యామిని చెబుతుంది. నువ్వు ట్రీట్‌మెంట్ కోసం వెళ్లి మాకు దూరంగా ఉన్నావని.. ఇప్పుడు శాశ్వతంగా దూరమైపోతావా అని తల్లిదండ్రులు బాధపడతారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూసుకోవచ్చని అంటుంది యామిని.
గతంలో రాజ్ తనకు గాజులు వేసిన రోజును గుర్తుచేసుకుని కలవరిస్తుంది కావ్య. ఆమె పరిస్థితి చూసి ఇందిర కంటతడి పెడుతూ కిందకెళ్లి దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌కి చెబుతుంది. రుద్రాణి చెప్పినట్లు కావ్య మానసిక పరిస్ధితి రోజు రోజుకు దిగజారిపోతోందని ఆమెను మంచి సైకియాట్రిస్ట్‌కు చూపించాలని అంటుంది. ఆ మాటలతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 19వ తేదీ .. ఎపిసోడ్ 673లో ఏం జరిగిందంటే..

రుద్రాణి చెప్పినట్లుగానే పురోహితుడిని పిలిపించి రాజ్‌కి కర్మకాండ చేయిస్తాడు సుభాష్. నా మనవడి కళ్ల ముందు నేను రాలిపోవాల్సిన దాన్ని.. నా కళ్ల ముందు నా మనవడిని పోగొట్టుకున్నానని బాధపడుతుంది ఇందిర. నన్ను అమ్మ అని ఎవరు పిలుస్తారు? ఇంక ఎప్పటికీ ఆ పిలుపు వినిపించనంత దూరంగా వెళ్లిపోయావు కదా అంటూ ఏడుస్తుంది అపర్ణ. ఇంతలో రాహుల్ వచ్చి మమ్మీ గుండె పట్టినట్లుగా లేదా అని రుద్రాణిని అడుగుతాడు. ఉందని రుద్రాణి చెప్పగా.. మరి మీ కళ్లలో కన్నీళ్లు రావడం లేదని ప్రశ్నిస్తాడు. గుండెని రాయిగా మార్చుకున్నానని.. వాడు దూరమైతేనే కదా ఆస్తికి నువ్వు వారసుడివి అవుతావని అంటుంది రుద్రాణి. ఈ కాసేపైనా మనుషుల్లా మాట్లాడుకుందామని అంటాడు రాహుల్.
బెడ్‌రూమ్‌లో పడుకుని ఉన్న కావ్యకి ఉదయాన్నే మంత్రాలు వినిపిస్తాయి. అవేంటో తెలియక అటూ ఇటూ చూస్తుంది. అక్కడ రాజ్ ఫోటోకి దండ వేసి కర్మకాండ జరిపిస్తున్నట్లుగా ఉండటంతో షాక్ అవుతుంది. ఆపండి అంటూ గట్టిగా కేకలు వేస్తూ అక్కడికి వెళ్లి ఎందుకిలా చేస్తున్నారని మండిపడుతుంది. ఏంటిది మావయ్య ఏం చేస్తున్నారని సుభాష్‌ని ప్రశ్నిస్తుంది. తప్పదమ్మా? నా కొడుక్కి ఉత్తమ గతులు లేకుండా చేసే అధికారం నాకు లేదని అంటాడు. ఉత్తమ గతులు ఈ లోకంలో లేనివారికి చేయాలని , ఉన్నవాళ్లకి కాదని అంటుంది కావ్య.
గుండె రాయి చేసుకో కావ్య.. ఏ నిజాన్ని జీర్ణం చేసుకో , చిన్న వయసులోనే నీకు చాలా కష్టం వచ్చింది తల్లి అంటుంది అపర్ణ. తలరాతను ఎవ్వరూ మార్చలేరని చెప్పగా.. నేను ఆయనను చూశానని ఎన్నిసార్లు చెప్పాలి.. నా కళ్లతో నేను చూశాను, ఆయన ప్రాణాలతోనే ఉన్నారని మండిపడుతుంది కావ్య. నువ్వు రాను రాను ధైర్యాన్ని పొగొట్టుకుంటున్నావని, మతిస్థిమితం మారినదానిలా మాట్లాడుతున్నావని అంటుంది ఇందిర. వాడు లేకపోయినా మీకు మేం ఉన్నాం.. ఈ కార్యక్రమాన్ని ఆపొద్దని, నా మనవడికి ఆత్మ శాంతించాలంటే ఈ కార్యక్రమం జరిపించాలని చెబుతుంది.
ఆచారం పేరుతో బతికున్న మనిషికి మీరు శ్రాద్ధ కర్మలు చేస్తున్నారని.. అది ఇంకా పాపమని బాధపడుతుంది కావ్య. నా భర్త బతికుండగా ఆయనకి కర్మకాండలు చేయడం కరెక్ట్ కాదని.. నేను పుణ్య స్త్రీని అని, నా సౌభాగ్యాన్ని దూరం చేయొద్దని బ్రతిమలాడుతుంది. వాడి శాంతి ప్రక్రియలన్నీ ఆపేస్తే వాడి ఆత్మకు శాంతి ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తుంది రుద్రాణి. కావ్యని లోపలికి తీసుకెళ్లమని చెప్పడంతో అప్పూ, స్వప్నలు ఆమెను తీసుకెళ్లబోతుండగా.. మీరు కూడా నన్ను నమ్మడం లేదా అని వాళ్లపైనా అరుస్తుంది. అందరిలాగే మీరు కూడా నాకు మతిపోయిందని అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తుంది.
నీ అర్ధం లేని నమ్మకాల కోసం అనర్ధాలు కొని తెచ్చుకుంటావా అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. చనిపోయినవాళ్లకి తర్పణాలు వదలకపోతే ఎలా? ప్రశ్నిస్తుంది. రక్త సంబంధీకులు ఉండి కూడా అనాథ ప్రేతంలా వదిలేస్తావా అని మండిపడుతుంది. చిన్నత్తయ్య మీకు నా మీద కోపం ఉంటే వేరేలాగా తీర్చుకోండి, అంతేకానీ నా పసుపు, కుంకుమలు తుడిచేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తుంది. నా ఐదోతనం తుడిచేసే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతుంది. ఈ కార్యక్రమం జరిపిస్తే నా భర్త ఉండగానే ఇవన్నీ జరిపిస్తే అది నాకు శాపంగా మారుతుందని బాధపడుతుంది కావ్య.
పసుపు కుంకమలు తీయాలా? లేదా ? అనేది నీ ఇష్టమని.. కానీ మా కొడుక్కి తిలోదకాలు వదలకపోతే అది జీవితాంతం దహించి వేస్తుందని చెబుతుంది అపర్ణ. చెట్టంత ఎదిగిన నా కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని ఈ తంతు జరగనివ్వమని బ్రతిమలాడుతుంది. నిజంగానే ఆయన చనిపోయుంటే, ఆచూకీ తెలియకపోయుంటే ఇంత చిన్నవయసులోనే నా సౌభాగ్యం నేను తుడుచుకునే దాన్నని చెబుతుంది . గుండెనిబ్బరంతో మీ కొడుకు స్థానంలో నేనే కొడుకులా నిలబడేదాన్నని అంటుంది. అది తట్టుకోలేకపోతే గుండెపగిలి చచ్చిపోయేదాన్నని అంటుంది. ఊహించుకుని మాత్రమే మీ అబ్బాయి బతికి ఉన్నాడని చెప్పడం లేదని , ఆచారం పేరుతో మీరు మహాపాపం చేస్తున్నారని బాధపడుతుంది కావ్య.
కావ్య మాటలతో నాకేం అర్ధం కావడం లేదని ఇందిరతో చెప్పుకుని బాధపడుతుంది అపర్ణ. కావ్య ఇంత నమ్మకంగా చెబుతుంటే మనమే ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా? అని ప్రశ్నిస్తుంది. కావ్య అంత నమ్మకంగా చెబుతుంటే ఏ చేద్దామంటావు అని సుభాష్‌ని అడుగుతుంది ఇందిర. రాజ్ బతికుంటే కావ్యని చూసుంటే వదిలేసి ఎలా వెళ్లిపోతాడని ప్రశ్నిస్తాడు సుభాష్. కావ్య భ్రమపడుతోందని, మనందరినీ కూడా అదే భ్రమలో నెట్టేస్తుందని చెబుతాడు. ముందు కావ్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని లేదంటే రాజ్ శాశ్వతంగా బతికే ఉన్నాడనే భ్రమలో ఉంటుందని చెబుతుంది రుద్రాణి.
నువ్వు , అప్పూ కావ్యని హాస్పిటల్‌కి తీసుకెళ్లమని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. మీరంతా కలిసి నన్ను వెర్రిదాన్ని చేస్తున్నారని.. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా అని మండిపడుతుంది కావ్య. నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని అంటుంది. ఆమె మాటలు పట్టించుకోవద్దని, మీరు మిగిలిన తంతు పూర్తి చేయమని అంటాడు సుభాష్. ఎంత చెబుతున్నా ఎవరూ వినిపించుకోకపోవడంతో కావ్య పూజా సామాగ్రిని విసిరికొడుతుంది. ఆమె తీరుతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది.
మీకు తర్పణం వదిలే అధికారం ఉన్నా.. కన్నతండ్రైనా సరే మీక్కూడా ఈ తంతు చేయించే అధికారం లేదని అంటుంది కావ్య. ఈ దీపం సాక్షిగా చెబుతున్నా నా భర్త ప్రాణాలతోనే ఉన్నారని చెబుతుంది. మీరు చేసినపనికి ఏదో ఒకర రోజు మీరంతా పశ్చాత్తాపం చెందుతారని చెప్పి రాజ్ ఫోటో తీసుకుని వెళ్లిపోతుంది. ఆ రాజ్ నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడని తల్లిదండ్రులతో అంటుంది యామిని. ఏం చేశాడని వైదేహి ప్రశ్నించగా.. రోడ్డు మీద ఎవరో అమ్మాయిని కాపాడి, ఆమెను ఎక్కడో చూసినట్లుగా ఉందని చెబుతున్నాడని అంటుంది.
ఆలోచిస్తే అల్లుడుగారికి తలనొప్పి వస్తుంది కానీ గతం గుర్తొస్తుందా అని ప్రశ్నిస్తుంది వైదేహి. రోడ్డుపై కళ్లు తిరిగి పడిపోయిందెవరు? ఎవరిని కాపాడాడు అనేది తెలుసుకోవాలని అంటుంది. రాజ్ కనుక వాళ్లింట్లో అమ్మాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేసుంటే ఆమె ఖచ్చితంగా రాజ్‌ని గుర్తుపట్టేది కదా అని అంటాడు యామిని తండ్రి. ఒకవేళ రాజ్‌తో మాట్లాడే పరిస్ధితి ఆ అమ్మాయికే లేదేమోనని డౌట్ పడుతుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











