Brahmamudi Serial Today Episode: ఆ నేరం కావ్య మీదే.. ఆత్తను చంపేందుకు రాహుల్ కుట్ర
ఆటో డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభిస్తాడు కళ్యాణ్. దొంగ బంగారం కేసులో రాజ్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. కానీ రాహుల్ ఆ తప్పు చేశాడు అని కావ్య నిరూపించడంతో రాహుల్ ని అరెస్టు చేస్తారు పోలీసులు. అయితే రాహుల్ కన్నింగ్ ప్లాన్ తో తన తప్పేమీ లేనట్లు నిరూపించుకుంటాడు. దాంతో పోలీసులు తిరిగి రాహుల్ ని రిలీజ్ చేస్తారు. రాహుల్ జైలుకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు సాయం చేయలేదని పగ పెంచుకుంటారు రాహుల్, రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 6 వ తేదీ ఎపిసోడ్ 508 లో ఏం జరిగిందంటే..
కళ్యాణ్ కి పుట్టినరోజు కానుకగా పేపర్ బండిల్స్, పెన్నులు కానుకగా ఇచ్చిన అప్పు ఖాళీ ఉన్నప్పుడు కవితలు రాయమని చెప్తుంది. అప్పుడే కావ్య కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ మెసేజ్ పెడుతుంది. అది చూసిన కళ్యాణ్ నా పుట్టిన రోజు అందరూ మర్చిపోయారు అనుకున్నాను కానీ మా వదిన గుర్తుపెట్టుకుంది అని ఎమోషనల్ అవుతాడు. దానికి ఆనందించాలి గాని అలా ఎమోషనల్ అవుతావెందుకు అని కళ్యాణ్ తో కేక్ కట్ చేయిస్తుంది అప్పు. ప్రతి సంవత్సరం ఇంట్లో చిన్న వాడినని నా బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు, గుడిలో అన్నదానం కూడా చేసేవారు అంటాడు కళ్యాణ్.

దానికి అంత బాధ పడటం ఎందుకు రేపు మనం కూడా గుడికి వెళ్దాం అంటుంది అప్పు. నువ్వు గుడికి కూడా వస్తావా అంటాడు కళ్యాణ్. భర్త కోసం రాక తప్పుతుందా అని నవ్వుతుంది అప్పు. మరోవైపు ఇంట్లో అందరూ కాఫీలు తాగుతూ ఉంటే తన కొడుకు పుట్టినరోజు గురించి మరిచిపోయి అందరూ హాయిగా కాఫీలు తాగుతున్నారు అని నిష్టూరంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. అప్పుడు ఇందిరా దేవి ధాన్య లక్ష్మికి రామాయణంలో ఒక కథ చెప్పి కళ్యాణ్ పుట్టినరోజు మరిచిపోలేదని గుడిలో అన్నదానానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని, అవన్నీ రాజ్ చూసుకున్నాడని చెప్తుంది ఇందిరా దేవి.
మతిమరుపు ఉన్న నేను కూడా వాడు పుట్టినరోజుని గుర్తుపెట్టుకున్నాను అంటాడు ప్రకాష్. అందరమూ కలిసి గుడికి వెళ్లి అక్కడ ధాన్యలక్ష్మి చేతులమీదుగా అన్నదానం చేయిద్దాము పదండి అంటుంది ఇందిరా దేవి. నా ఆరోగ్యం బాగోలేదు నేను ఇంట్లోనే ఉంటాను మీరందరూ వెళ్లి రండి అంటుంది అపర్ణ. ఆమెకి తోడుగా సుభాష్, రాజ్ వాళ్లు ఉంటాను అంటారు కానీ కావ్య నేను ఉంటాను అనటంతో అపర్ణ కూడా అందుకు ఒప్పుకుంటుంది.

ఆ తర్వాత కొడుకుని తన గదిలోకి తీసుకువచ్చి కళ్యాణ్ బర్త్ డే కి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతుంది రుద్రాణి. లేదు షాక్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నాను అంటాడు రాహుల్. ఏం చేయబోతున్నావు అంటుంది రుద్రాణి. అపర్ణ అత్తయ్య ని డైరెక్ట్ గా పైకి పంపించేయబోతున్నాను ఆ నేరం కావ్య మీదికి వెళ్లే లాగా చేస్తాను అని తన ప్లాన్ మొత్తం చెప్తాడు రాహుల్. తర్వాత అపర్ణ అత్త వేసుకునే టాబ్లెట్లకి బదులు ఈ టాబ్లెట్లు అందులో వేసేయ్ అని తల్లితో చెప్తాడు. అందుకు సరే అంటుంది రుద్రాణి.
అందరూ గుడికి బయలుదేరే హడావుడిలో ఉన్నప్పుడు రుద్రాణి అపర్ణ అసలు టాబ్లెట్లు తీసేసి రాహుల్ ఇచ్చిన టాబ్లెట్లు కలిపి కామ్ గా మళ్లీ అందరిలోనూ కలిసిపోతుంది. గుడికి వెళ్లే ముందు ఒకటికి పది సార్లు కావ్యకి తల్లి గురించిన జాగ్రత్తలు చెప్తాడు రాజ్. మరోవైపు గుడికి వచ్చిన అప్పు,కళ్యాణ్ పూజ చేయించుకున్న తర్వాత నా పుట్టినరోజు గురించి అందరూ మర్చిపోయారని బాధపడతాడు కళ్యాణ్.

అప్పుడే గుడికి వస్తున్న తన కుటుంబాన్నంతటిని చూపించి ఎవరూ నీ బర్త్ డే ని మర్చిపోలేదు చూడు అంటుంది అప్పు. వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతాడు కళ్యాణ్. నాతో నిన్ను చూస్తే మళ్ళీ గొడవ జరుగుతుంది అంటూ కళ్యాణ్ ని తీసుకుని పక్కకు వెళ్ళిపోతుంది అప్పు. అది గమనించిన రాహుల్ తల్లిని పక్కకు తీసుకువెళ్లి అప్పు వాళ్ళని చూపిస్తాడు, మళ్ళీ వాళ్ళు కలిసిపోతారేమో అని భయపడతాడు.
వీళ్ళని చూసి అప్పు వాళ్ళు దాకుంటున్నారు కాబట్టి అలాంటిదేమీ జరగదు, మన ఇంట్లో ప్లాన్ వర్క్ అవుట్ అవ్వాలంటే ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వచ్చి అందరితోనే కలిసిపోతుంది రుద్రాణి. కానీ రాహుల్ మాత్రం ఆఫీసులో వ్యక్తికి ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాడు. మరోవైపు వంట చేస్తున్న కావ్య దగ్గరికి వచ్చిన అపర్ణ తాను కూడా వంట చేస్తాను అంటుంది. వద్దు నేను చేస్తాను మీరు కూర్చోండి అంటుంది కావ్య.
ఎంత చెప్పినా వినకపోవడంతో కత్తి తీసి మర్యాదగా నన్ను వంట చేయనివ్వు అని బెదిరిస్తుంది. వంట చేయకపోతే కోడలు మీద హత్య ప్రయత్నం చేస్తారా అంటుంది కావ్య. అప్పుడు తన చేతిలో ఉన్న చాక్ వైపు చూసి ఇది కత్తా,నేను అట్లకాడ అనుకున్నాను అంటూ మళ్ళీ అట్లా కాడ తీసుకువచ్చి కోడల్ని బెదిరించి నేను వంట చేస్తాను అంటూ తాను కూడా కోడలికి వంటలో సాయం చేస్తుంది అపర్ణ. మరోవైపు గుడిలో కళ్యాణ్ పేరు మీద అర్చన చేస్తూ ఉంటారు అతని కుటుంబ సభ్యులు అదంతా చాటుగా చూస్తూ ఉంటారు కళ్యాణ్ దంపతులు.

తరువాయి భాగంలో అపర్ణ టాబ్లెట్ వేసుకుంటుంది, అదే సమయంలో కావ్య ఆఫీస్ కి వెళ్లి ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ ఆఫీస్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటుంది. అంతలోనే గుండె నొప్పి ప్రారంభం అవ్వడంతో బాధపడుతూనే అపర్ణ కావ్య కి ఫోన్ చేస్తుంది. కానీ పనిలో ఉన్న కావ్యకి ఆ ఫోన్ వినపడకపోవడంతో లిఫ్ట్ చెయ్యదు. కుటుంబ సభ్యులందరూ ఇంటికి వచ్చేసరికి అపర్ణ స్పృహ కోల్పోయి ఉంటుంది.


Click it and Unblock the Notifications











