Brahmamudi August 21th: దుమ్ము దులిపిన కనకం.. ఊహించని నిర్ణయం తీసుకున్న కావ్య.. షాక్‌లో రాజ్
బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఆసక్తి కలిగిస్తోంది. రాజ్ తో కావ్య మట్టి తొక్కించిందనే కారణంతోదుగ్గిరాల ఫ్యామిలీ ఫైర్ అవుతుంది. రాజ్ కూడా కావ్యతో దారుణంగా వ్యవహరిస్తారు. రాజ్ మెడ పట్టుకుని కావ్యను బయటకు గెంటేస్తాడు. మీరు వచ్చి లోపలికి పిలిచే వరకు ఇక్కడే ఉంటాను అని కావ్య వర్షంలో అలాగే నిలబడుతుంది. ఇక ఈ విషయం కనకానికి తెలిసి దుగ్గిరాల ఇంటికి వస్తుంది. కనకం వచ్చి దుగ్గిరాల ఫ్యామిలితో ఏం మాట్లాడిందో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
రాజ్ తో మట్టి తొక్కించిందనే కారణంతో కావ్య మీద దుగ్గిరాల ఫ్యామిలీ ఫైర్ అవుతుంది. ఒకరు ఇద్దరు కాదు.. అందరూ కావ్యను నిందిస్తారు. ఇక అపర్ణ మాటాలకు ఎదురుతిరిగి మాట్లాడుతుంది. మీరు అసలు మీ కొడుక్కి తల్లేనా అని అనగానే ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. అప్పుడే వచ్చిన రాజ్.. తన తల్లిని అంతా మాట అంటావా అని కావ్యను కొట్టబోతాడు. నువ్వెంత నీస్థాయి ఎంత అని మాటలు అంటాడు. భర్త కూడా అనరాని మాటలు అనేసరికి.. కావ్య తట్టుకోలేకపోతుంది. మా అమ్మను అన్న నీకు.. మా ఇంట్లో ఉండే హక్కు లేదని చెప్పేస్తాడు రాజ్. కావ్య చేతిని పట్టుకుని.. బయటకు లాక్కెళ్తాడు. ఇంట్లో నుంచి బయటకు తోసేస్తాడు. నేను ఎక్కడకు వెళ్లాలని కావ్య అడగ్గా.. మీ ఇంటికి వెళ్లమని చెబుతాడు. నేను వెళ్లను అని భీష్మించుకుని ఉంటుంది కావ్య. ఇక చేసేదేమీ లేక తలుపులు వేసేస్తాడు రాజ్.

కావ్యను ఇంట్లో నుంచి బయటకు పంపారనే విషయం కనకానికి తెలుస్తుంది. ఓ వైపు విగ్రహం పగిలిపోయి.. ఏదో కీడు జరుగుతుందని భయపడిన ఆమెకు నిజంగానే కీడు ఎదురైంది. దీంతో వెంటనే మూర్తి, కనకం కలిసి ఆటోలో దుగ్గిరాల ఇంటికి వస్తారు. వచ్చేసరికి.. కావ్య ఒంటరిగా బయట వానలో తడుస్తూ ఉంటుంది. కోపంతో ఊగిపోతుంది కనకం. నీకు ఇంత శిక్ష వేస్తారా అని మండిపడుతుంది. వాళ్లని అడుగుతానని అంటుంది. కావ్య వద్దు అనే విషయం చెబుతున్నా పట్టించుకోదు.
నేరుగా దుగ్గిరాల ఇంటివారి తలపుల దగ్గరకు వెళ్తుంది. కోపంగా తలుపు తీస్తుంది. దీంతో ఇంట్లో ఉన్నవాళ్లు అందరూ షాక్ అవుతారు. కనకం ఏంటి ఇలా రావడం ఏంటని ఆశ్చర్యపోతారు. కానీ కన్నకూతురికి ఇలాంటి శిక్ష వేయడాన్ని మాత్రం.. కనకం తట్టుకోలేకపోతుంది. అసలు మీరు మనుషులేనా అని ఫైర్ అవుతుంది. ఒక ఆడపిల్లను అర్ధరాత్రి.. ఇలా ఒంటరిగా నిల్చొబెట్టిన మీది ఏం సంస్కారం అని నిలదీస్తుంది. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ తింటుంది. కావ్య చేసిన తప్పేంటని అడుగుతుంది.

ముసుగువేసి పెళ్లి చేశారు.. మీ ఇద్దరి కూతుళ్లను మా కుటుంబానికి ఉసిగొల్పారు అని రుద్రాణి అంటుంది. మా స్వప్నకు మాయమాటలు చెప్పి రాహుల్ మోసం చేశాడు అంటుంది కనకం. కృష్ణమూర్తి కూడా రాజ్ ను ప్రశ్నిస్తాడు. మా అమ్మాయిని ఇంటికి పంపిస్తే ఇలాగేనా చూసుకునేది అంటాడు. చూడండి మా అమ్మకు గౌరవం ఇస్తాము. కానీ మీ అమ్మాయి మా అమ్మను చులకనగా మాట్లాడింది అంటాడు రాజ్. భార్య తప్పు చేస్తే.. మందలించి సరిదిద్దాలి అంటాడు కృష్ణ మూర్తి. దీనికి సీతరామయ్య కూడా కావ్యకు సపోర్ట్ ఇస్తారు.
ఇక అపర్ణ నా కొడుకుతో మట్టి పని చేయిస్తుందా అని అంటుంటే.. రాజ్ మమ్మీ ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. ఇదంతా చేసింది రాహుల్ అని చెబుతుంది కావ్య. ఏంటి చేసిందంతా చేసి.. రాహుల్ ను అంటున్నావా అని అపర్ణ ఫైర్ అవుతుంటే.. స్టాపిట్ మమ్మీ.. ఇప్పటి వరకు కావ్యను తప్పుగా అర్ధం చేసుకున్నా అని రాజ్ అంటాడు. ఆ ఇంట్లో మట్టి పని చేస్తున్నట్లు మీడియాకు ఎలా చేస్తుంది.. అని రాజ్ ప్రశ్నిస్తుంది. రుద్రాణి సోషల్ మీడియాలో వచ్చిందని చూపించిందని అపర్ణ చెబుతుంది. అత్త ఏది ఒకసారి చూపించండి అని రాజ్ అడుగుతాడు. ఇక నా మీదే అనుమానం పడుతున్నావా అంటూ రుద్రాణి అంటుంది.
ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేశారు అని రాజ్ ఆరా తీస్తాడు. రాజ్ ఛానెల్ కు కాల్ చేసి.. ఎవరు చేశారని అడుగుతారు. ఆ వ్యక్తి ఎవరో కనుక్కుంటాడు. అప్పు వాడిని తీసుకువస్తుంది. దీనికి అంతంటికి కారణం రాహుల్ అని చెబుతుంది. ఆ వ్యక్తి కూడా రాహుల్ అని చెబుతాడు. ఇదంతా చూసిన రాజ్.. రాహుల్ చెంప పగులగొడతాడు. రాహుల్.. ఇక నేనే చేశాను అని చెబుతాడు. కావ్యను ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకే ఈ పని చేశాను. ఈ నేపథ్యంలో రాజ్ ఓ పెద్ద నిర్ణయం తీసుకుంటాడు.

రాజ్, రుద్రాణి గెస్ట్ హోజ్ లో ఉండాలని చెబుతాడు. ఒక్కసారిగా ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. స్వప్న కూడా బాధపడుతుంది. ఈ రాహుల్ ని పెళ్లి చేసుకుని తప్పు చేశా అని అనుకుంటుంది. రుద్రాణి కూడా రివర్స్ అయి.. రాహుల్ చెంప పగులగొడుతుంది. మరోవైపు కనకం, మూర్తి.. జరిగింది చాలు కావ్య ఇక మీ ఇంట్లో ఉండదు అని తీసుకువెళ్తారు. కావ్య వారికి నచ్చ చెప్పిన వినకుండా తీసుకువెళ్తారు. మరోవైపు రాజ్ ఆగండి అంటారు. క్షమాపణ చెప్పినా.. కావ్య కూడా ఇంట్లో ఉండనని నిర్ణయం తీసుకుంటుంది. రాజ్ షాక్ కు గురవుతాడు. మరి నిజంగానే కావ్య ఇంట్లోంచి వెళ్లిపోతుందా.. చేయని తప్పుకు కావ్యను అన్ని మాటలు అన్న రాజ్ ఏం చేయనున్నాడు తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











