Brahmamudi: మట్టిలో రాజ్, కావ్య రొమాన్స్... దుగ్గిరాల కుటుంబం నుంచి కళావతి ఔట్

బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఆగస్టు 14 నుంచి ఆగస్టు 19 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

సోమవారం ఆగస్టు 14న బ్రహ్మముడి సీరియల్ లో పుట్టింటి నుంచి వచ్చిన కావ్యపై అందరూ ఫైర్ అవుతారు. మనిషికో మాట అంటారు. కానీ దుగ్గిరాల సీతారామయ్య మాత్రం.. కావ్యకు మద్దతు ఇస్తాడు. నా మనవరాలు ఏం తప్పుచేసిందని అడుగుతాడు. ఇది చూసిన అక్కడి వారంతా షాక్ అవుతారు. పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 August 14th to August 19th episode

ఆగస్టు 15వ తేదీన బ్రహ్మముడి సీరియల్ లో నవ్వులే నవ్వులు. రాజ్‌ను తాతయ్య దగ్గర ఇరికించేస్తుంద కావ్య. దీంతో తప్పక స్వయంగా తానే కావ్యను పుట్టింటికి తీసుకువెళ్తే పరిస్థితి వస్తుంది. దీంతో చేసేదేం లేక రాజ్ స్వయంగా ఆ కాంట్రాక్టర్‌కి ఫోన్ చేసి తిరిగి కావ్యకే కాంట్రాక్ట్ ఇవ్వాలని చెబుతాడు. ఇదంతా చూసిన స్వప్న తెగ కుళ్లిపోతుంది. పైకి ఇష్టం లేదని చెబుతూనే కావ్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు రాజ్.. మా వాడు ఉన్నాడు వేస్ట్ అంటూ తిట్టుకుంటుంది. ఆ కోపంతో రాజ్ వినేలే.. రాహుల్ దగ్గరికి వెళ్లి వాయించేస్తుంది. స్వప్న మాటలు విన్న రాజ్.. తాను కళావతిని అంత బాగా చూసుకుంటున్నానా అంటూ ఆలోచిస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 August 14th to August 19th episode

ఆగస్టు 16వ తేదీన బ్రహ్మముడి సీరియల్ లో కావ్యను రాజ్ స్వయంగా పుట్టింటికి తీసుకువెళ్తాడు. మరోవైపు ప్రెగ్నెన్సీ రావడం లేదని స్వప్న టెన్షన్ పడుతుంది.ఇదేంటి ప్రెగ్నెన్సీ ఇంకా రావడం లేదని ఆలోచిస్తుంది. ఆ కోపంలో రాహుల్‌తో గొడవ పెట్టుకుంటుంది. ఇంకోవపు అప్పు తీర్చే మార్గం లేక ఇల్లు అమ్మేయడానికి కృష్ణమూర్తి బయలుదేరతాడు.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 August 14th to August 19th episode

ఆగస్టు 17వ తేదీన బ్రహ్మముడి సీరియల్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ ఎపిసోడ్ లో రాజ్ దూరం చేసిన బొమ్మ‌ల కాంట్రాక్ట్‌ను తిరిగి అత‌డి చేతే సొంతం చేసుకుంటుంది కావ్య‌. ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌పై రాజ్ చేత సాక్షి సంత‌కం చేయిస్తుంది. ఆ తర్వాత కాసేపు రాజ్, కావ్యల మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తోంది. ఉప్మా వల్ల రాజ్ కు కష్టాలు వస్తాయి. పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 August 14th to August 19th episode

ఆగస్టు 18వ తేదీన బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ అత్తారింటికి వస్తాడు. ఇక అనుకోని పరిస్థితుల్లో మట్టి తొక్కాల్సి వస్తుంది. కావ్యతో కలిసి మట్టి తొక్కుతాడు. దీన్ని వీడియో, ఫోటోలు తీసి.. రాహుల్ కు పంపిస్తాడు ఓ వ్యక్తి. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీలో పెద్ద సునామీ సృష్టిస్తోంది రుద్రాణి. అపర్ణ, కావ్యల మధ్య మాటల యుద్ధం జరగ్గా.. రాజ్ వచ్చి.. కావ్యను కొట్టబోతాడు. పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 August 14th to August 19th episode

ఆగస్టు 19వ తేదీన బ్రహ్మముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల వారసుడి ఉగ్రరూపం కనిపిస్తోంది. రాజ్ మట్టి తొక్కడాన్ని సహించలేకపోతుంది అపర్ణ. కావ్య ఇంటికి రాగానే నిలదీస్తుంది. కావ్య కూడా ఎదురు సమాధానం చెబుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు. మా అమ్మను అంటావా అంటూ ఇంట్లో నుంచి గెంటేస్తాడు. కావ్య వర్షంలో తడుస్తూ నిల్చొని ఉంటుంది. అయినా రాజ్ మనసు కరగదు. పూర్తి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X