Brahmamudi: కావ్యతో మాట్లాడొద్దని అపర్ణ ఇంట్లో వాళ్లకి కండిషన్.. రాజ్ ఏం చేయనున్నాడు?
బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఆగస్టు 21 నుంచి ఆగస్టు 26 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
సోమవారం ఆగస్టు 21న బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ తో కావ్య మట్టి తొక్కించిందనే కారణంతోదుగ్గిరాల ఫ్యామిలీ ఫైర్ అవుతుంది. రాజ్ కూడా కావ్యతో దారుణంగా వ్యవహరిస్తారు. రాజ్ మెడ పట్టుకుని కావ్యను బయటకు గెంటేస్తాడు. మీరు వచ్చి లోపలికి పిలిచే వరకు ఇక్కడే ఉంటాను అని కావ్య వర్షంలో అలాగే నిలబడుతుంది. ఇక ఈ విషయం కనకానికి తెలిసి దుగ్గిరాల ఇంటికి వస్తుంది.

ఆగస్టు 22న ఎపిసోడ్ లో కనకం, కృష్ణమూర్తి కావ్యని తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు. కానీ రాజ్ మాత్రం అసలు పట్టించుకోకుండా పట్టువదలకుండా అలాగే ఉంటాడు. 'కలిసినట్టుగా ఉన్నా కలవలేవే నింగినేలా.. కలిసికలలు ఎన్ని కన్నా కనులు ఒకటవవే'.. అంటూ సీన్ చాలా ఎమోషనల్ గా చూపించారు.భర్తకి దూరంగా వెళ్లిపోతున్న కావ్య మొహం చూస్తే ఎవరికైనా బాధకలుగుతుంది. ఇంద్రాదేవి కావ్యని వెనక్కి పిలవమని రాజ్ చెప్పబోతుంటే అపర్ణ అడ్డం పడుతుంది. దీంతో తను సీరియస్ అవుతుంది.
ఆగస్టు 23న ఎపిసోడ్ లో రాజ్ చేతికి తగిలిన గాయానికి కావ్య కట్టు కడుతుంది. దాన్ని రాజ్ కోపంగా విసిరి కొట్టేస్తాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి. మా నాన్నకి సాయం చేస్తానని మాట ఇచ్చాను కదా నేను పుట్టింటికి వెళ్లనా అని కావ్య రాజ్ ని అడుగుతుంది. కానీ సమాధానం చెప్పకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కృష్ణయ్య ముందు నిలబడి ఏడుస్తుంది.
ఆగస్టు 24న ఎపిసోడ్ లో అపర్ణ గది వద్దకు కావ్య వెళ్తుంది. కానీ గుమ్మం బయటే నిల్చోమని చెబుతుంది అత్త. ఏం కావాలి నీకు అని అడుగుతుంది. ఔదార్యం కావాలని అడుగుతుంది కావ్య. చిన్నపిల్లలు కదా అని క్షమించలేను అని అంటుంది అపర్ణ. ఎందుకంటే.. మా ఇంటి సభ్యుల జాబితాలో నిన్ను చేర్చుకోలేనని, నేను ఒక కొడుకును కన్న తర్వాతే నువ్ పుట్టావని, నా వయసు, అనుభవం ముందు నీ ఆటలు సాగవు అని చెబుతుంది.
ఇప్పుడు వచ్చి.. నా దగ్గర క్షమాపణలు చెబితే.. నా కొడుకు ముందు మంచిదానివై పోదాం అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. నిజంగా అంత తెలివి ఉంటే.. మా అక్కలాగా తామరాకు మీద నీటి బొట్టులో ఉండేదాన్నని, అందిరి ముందు బాగా ఉండేదాన్ని అని కావ్య అంటుంది. అది నాకు చేతకాకే.. ఇలాంటి పరిస్థితుల్లో పడ్డానని అంటుంది. ఈ ఇంట్లో నన్ను కోడలిగా ఒప్పుకోకపోయినా.. మిమ్మల్ని ఎప్పుడూ నేను అత్తగారిలా గౌరవిస్తానని చెబుతుంది.
ఆగస్టు 25న ఎపిసోడ్ లో కావ్య ఇంట్లో అందరిని ఒప్పించి అవసరమైతే ఎదురించి మరి తాను అనుకున్నవన్నీ సాధిస్తుండటం తట్టుకోలేకపోతుంది రుద్రాణి. తనకు తలనొప్పిగా కావ్య తయారు కావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని కొడుకు రాహుల్ తో అంటుంది. నీ వల్లే కావ్య ఈ ఇంటికి వచ్చిందని తల్లికి నీతులు చెబుతాడు రాహుల్. కొడుకుపై ఫైర్ అవుతుంది రుద్రాణి. ఇరగదీస్తాను. రాజ్ కు షాకిస్తానని బోర్లా పడ్డ నువ్వు నాకు నీతులు చెబుతున్నావా అంటూ కొడుకుపై సెటైర్స్ వేస్తుంది రుద్రాణి.
తండ్రికి బొమ్మల పెయింటింగ్ వర్క్‌లో సహాయం చేసి ఇంటికి వస్తుంది కావ్య. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి టీ రెడీ ఇస్తుంది. కానీ ఎవరూ ఆమె ఇచ్చిన టీ తీసుకోరు. కనీసం ఆమెతో మాట్లాడరు. తనతో ఎవరూ మాట్లడకూడదని అత్తయ్య తీర్పు ఇచ్చారని కావ్య అర్థం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











