Brahmamudi: రుద్రాణి కంటే అరాచకంగా అనామిక ప్లాన్స్... శ్వేత, రాజ్ గురించి నిజం తెలుసుకున్న కావ్య!
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఈ వారం మొత్తం ట్విస్టులతో సాగింది. కావ్యను వదిలించుకునేందుకు రాజ్.. శ్వేతతో కలిసి విడాకులు, పెళ్లి అంటూ డ్రామా మొదలుపెడతాడు. మరోవైపు అనామిక, రుద్రాణి కలిసి కావ్యను ఇరికించేందుకు ప్లాన్ వేస్తారు. ఇక అప్పు పోలీస్ అయ్యేందుకు కసరత్తులు ప్రారంభిస్తుంది. అటు ధాన్యలక్ష్మి రచ్చ, ఇటు కల్యాణ్ అనామికతో శోభనం కోసం ఆఫీసుకు బయలుదేరుతాడు. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు బ్రహ్మముడి సీరియల్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
ఫిబ్రవరి 5వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో అప్పు.. డెలివరీ ఇచ్చేందుకు ఓ కస్టమర్ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ల పాప కిడ్నాప్ అయిందని తెలుసుకుని కాపాడుతుంది. దీంతో పోలీసులు వెళ్తూ వెళ్తూ అప్పుకు ఓ సలహా ఇస్తారు. నీ లాంటి యూత్ స్టర్స్ బయట కాదు.. డిపార్ట్ మెంట్ లో ఉండాలని అంటారు. మరోవైపు కావ్య మోడ్రన్ లుక్ లో ఆఫీసుకు బయలుదేరుతుంది. ఆ లుక్ చూసిన రాజ్ షాక్ అవుతాడు. కావ్య అందానికి పడిపోతాడు.

ఫిబ్రవరి 6వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో శ్వేత.. రాజ్ ఆఫీసుకు వస్తుంది. ఇక కావ్యను బాధపెట్టేందుకు శ్వేతతో రాజ్ క్లోజ్ గా మూవ్ అవుతాడు. ఇక కావ్య.. శ్వేత, రాజ్ ఉన్న గదిలోకి వస్తుంది. శ్వేత మీద కౌంటర్స్ వేసి వెళ్తుంది. దీంతో మనల్ని తప్పుగా అర్థం చేసుకుందని రాజ్ కు శ్వేత చెప్తుంది. పర్వాలేదని రాజ్ లైట్ తీసుకుంటాడు. నాకు ఆమె అంటే ఇష్టంలేదని చెప్తాడు. దీంతో శ్వేత నిజం చెప్పేస్తాను అంటూ వెళ్తుంది.
ఫిబ్రవరి 7వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో కల్యాణ్, అనామిక ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. ఇక అనామిక మళ్లీ గదిలోకి వస్తుంది. ఇక కల్యాణ్ దగ్గరగా రాబోతుంటే.. అనామిక తనకు పిరియడ్స్ వచ్చాయని.. మూడు రోజుల వరకు కుదరని చెప్తుంది. దీంతో కల్యాణ్ అప్ సెట్ అవుతాడు. అనామిక కావాలనే అబద్ధం ఆడి తన ఫస్ట్ నైట్ ను చెడగొట్టుకుంటుంది. కల్యాణ్ పోయి కింద పడుకుంటే.. అనామిక బెడ్ మీద పడుకుంటుంది.
ఫిబ్రవరి 8వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో కావ్య, కల్యాణ్ బయట కూర్చొని రాజ్ గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో రాజ్ వచ్చి ఎక్సైజ్ చేసి బిల్డప్ ఇస్తాడు. ఇక రాజ్ నీళ్లు పెట్టమని అడిగితే కావ్య వేడి వేడి నీళ్లను తీసుకువెళ్తుంది. దీంతో రాజ్ తెలియకుండా స్నానానికి వెళ్తాడు. ఒళ్లంతా కాలిపోతుంది. ఇక ఆ మంటతోనే టిపిన్ చేసేందుకు కిందకి వస్తే.. ఇంట్లోని వారంత విచిత్రంగా చూస్తారు. మరోవైపు అపర్ణకు నెలవారి లిస్ట్ రాసివ్వాలని ఇందిరాదేవి చెప్తుంది.

ఫిబ్రవరి 9వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో అపర్ణ.. దుగ్గిరాల ఇంటి బాధ్యతలను కావ్యకు అప్పగిస్తుంది. కావ్యకు తాళాలు ఇచ్చి.. ప్రతి నెల నువ్వే చూసుకోవాలని అర్డర్ వేస్తుంది. ఇక నెలవారి లిస్టును అందరూ ఇస్తారు ఒక్క ధాన్యలక్ష్మి తప్ప. తన పేపర్ కిందపడేసి పోతుంది. ఇక కావ్య చేతికి ఇంటి బాధ్యతలు రావడంతో అనామిక, రుద్రాణి, ధాన్యలక్ష్మి రగిలిపోతారు. మరోవైపు కల్యాణ్ ను ఆఫీసుకు పంపేందుకు అనామిక ప్రయత్నం మొదలుపెడుతుంది.
ఫిబ్రవరి 10వ తేదీ బ్రహ్మముడి సీరియల్లో అనామిక.. కల్యాణ్ ను ఆపీసుకు పంపేందుకు ఒప్పిస్తుంది. మరోవైపు కావ్య ఇంటి తాళాలను రుద్రాణి కొట్టేస్తుంది. ఇంట్లో లాకర్ డబ్బులను కొట్టేసి కావ్యపై నెట్టివేయాలని చూస్తుంది. ఇక రాజ్.. శ్వేతను కలుసుకుంటాడు. కావ్య చూస్తుందని తెలిసి.. రాజ్ కావాలని ఓవర్ గా మాట్లాడుతాడు. మన పెళ్లికి అడ్డు లేదని చెప్తాడు. కావ్య కన్నీళ్లతో ఆఫీసుకు బయలుదేరుతుంది.


Click it and Unblock the Notifications











