Brahmamudi: స్వప్న మిస్సింగ్.. కావ్య కోసం అమ్మకు ఎదురుతిరిగిన రాజ్... వేరు కాపురం పెట్టిన అపర్ణ..
బ్రహ్మాముడి సీరియల్ లో ఈ వారం కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఈ సీరియల్ మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
సెప్టెంబర్ 11న బ్రహ్మముడి ఎపిసోడ్ లో అదిరిపోయే సీన్ కనిపించింది. కావ్య అంటే ఎప్పుడూ మండిపడే అపర్ణలో మానవత్వం వెల్లి విరిసింది. సీతారామయ్య అనారోగ్యం కారణంగా.. కావ్యపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న రాజ్ ని హెచ్చరించింది అపర్ణ. చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి ట్విస్టులు, షాక్ లు ఉన్నాయో. కృష్ణాష్టమి సందర్భంగా కావ్య.. పూజ చేస్తూ ఉంటుంది. దీంతో ఇందిరా దేవి కావ్యలోని మంచి లక్షణాలను పొగుడుతూ ఉంటుంది.

సెప్టెంబర్ 12న బ్రహ్మముడి సీరియల్ లో అప్పు గోడ దూకి ఇంట్లోంచి వెళ్తోంది. ఇక కళ్యాణ్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అప్పు గ్రౌండ్ కి వెళ్లి అక్కడ ఉన్న పిల్లల్ని కొడుతుంది. అందులో ఒకడు అప్పుని కొట్టడానికి వస్తుంటే కళ్యాణ్ వెళ్ళి అడ్డుగా నిలబడతాడు. దీంతో తన తలకి దెబ్బ తగులుతుంది. పోలీసులు రావడంతో అక్కడ వాళ్ళందరూ పారిపోతారు. ఇక కళ్యాణ్ కు బ్లడ్ రావడంతో అప్పు టెన్షన్ పడుతుంది.
సెప్టెంబర్ 13న బ్రహ్మముడి సీరియల్ లో కావ్య స్వీట్ చేస్తుంటే రాజ్ వేలు పెట్టి అందులో పంచదార అనుకుని ఉప్పు వేస్తాడు. మీరు మారతారని ఆశ పడ్డాను కానీ ఎప్పటికీ మారరని అర్థం అయ్యింది. మీలోని ఒరిజినల్ రాజ్ బయటకి వస్తూనే ఉంటాడని తిడుతుంది. తిట్టడం బాగుంది కానీ తిట్టించుకోవడం కష్టమేనని మనసులో అనుకుంటాడు. స్వీట్ బౌల్స్ లో వేసుకుని కావ్య ఇంట్లో వాళ్ళకి పెట్టడానికి తీసుకెళ్తుంది. అప్పుడు రాజ్ తను వేసింది షుగర్ కాదు ఉప్పని తెలుసుకుంటాడు. అయ్యయ్యో ఇంటికి వచ్చిన గెస్ట్ కి ఉప్పు వేసిన స్వీట్ పెడుతున్నామా ఎలాగైనా ఆపాలని మళ్ళీ కావ్య వెంట పడతాడు.

సెప్టెంబర్ 14న బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ కావ్యకి థాంక్స్ చెప్తాడు. గోదానం చేసినట్టు థాంక్స్ దానం ఎందుకు చేశారని కావ్య అడుగుతుంది. తాతయ్య దగ్గర నిజం చెప్పనందుకు అంటాడు. అయితే ముందు థాంక్స్ కంటే సారి చెప్పమంటే చెప్పనని అనేస్తాడు. మిమ్మల్ని చూస్తుంటే డౌట్ వస్తుంది. మీరు మూడు నెలల్లో మారతారని అనిపించడం లేదు. ఒక్కోసారి అరుస్తారు. ఇంకొకసారి మీకు నచ్చినట్టు ఉంటారు. మీరు జీవిస్తున్నారో, నటిస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు.. అంటుంది కావ్య.
సెప్టెంబర్ 15న బ్రహ్మముడి సీరియల్ లో కావ్య పనిమనిషి శాంతకు డబ్బులు ఇస్తుంది. ఇక కావ్యను ఇరికించేందుకు రుద్రాణి స్కెచ్ వేస్తుంది. అపర్ణకు లేనిపోనివి చెప్పి... కోపం వచ్చేలా చేస్తుంది. అపర్ణ కోపంగా కావ్య దగ్గరకి వెళ్తుంది. డబ్బులు తీసుకొచ్చి కావ్య శాంతకి ఇవ్వబోతుంటే ఆగు అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ బయటకి వస్తారు. ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. శాంత డబ్బులు అడిగితే ఇస్తున్న అత్తయ్య అని కావ్య చెబుతుంది. అంటే నువ్వు ఈ ఇంటి యజమానురాలు అయిపోయావా? ఈ డబ్బు నీకు ఎక్కడిది. మీ పుట్టింటి నుంచి తెచ్చావా? అని అంటుంది. నా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అంత ఉన్నవాళ్ళు కాదని చెబుతుంది.

సెప్టెంబర్ 16న బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పెట్టిన చిచ్చుతో అపర్ణ తనకు తానే వెలి వేసుకుంటుంది. ఇక నుంచి ఇంటి నుంచి అడుగు బయట పెట్టను. ఎవరినీ ఏం అనను. జడ పదార్థంలా ఉండిపోతాను అని అపర్ణ అంటుంది. మమ్మీ అలా అనకు అని రాజ్ చెప్పినా... నువ్ నాతో మాట్లాడకు రాజ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఇవాళ నీ తల్లిని విమర్శించినప్పుడే మన తల్లీ కొడుకుల బంధం అబాసుపాలైంది.


Click it and Unblock the Notifications











