Brahmamudi weekly roundup: రేఖతో రాజ్ కోటి రూపాయల డీల్.. ఇందూ జాడ కనిపెట్టిన నందూ
Photo Courtesy: JioHotstar
ఇందూ కిడ్నాప్ అయిన విషయం తెలుసుకున్న నందూ.. తనే స్వయంగా ఈ కేసుని డీల్ చేస్తానని చెప్పి దుగ్గిరాల వారింటికి వస్తుంది. తనను కిడ్నాప్ చేసింది లక్కీ- రాజ్‌లని తెలుసుకుని షాక్ అవుతుంది ఇందూ. నేను పంపిన మనుషులు కాకుండా అక్కని ఎవరు కిడ్నాప్ చేశారా అని ఆలోచిస్తుంది స్వాతి. రాజ్ ఫోన్ కాల్‌ని ట్రేస్ చేసిన నందూ.. ఇందూ ఉన్న లోకేషన్‌ని పట్టుకుంటుంది. రోజాని కలిసేందుకు నందూని తీసుకుని వెంకీ వెళ్లగా.. అక్కడ రోజా మరో కుర్రాడితో మాట్లాడుతూ కనిపిస్తుంది. దాంతో రోజాని వెంకీ నిలదీయగా.. నా ఇష్టమొచ్చిన వాడితో నేను తిరుగుతానని ఆమె వార్నింగ్ ఇస్తుంది. నందూని తన ఇంట్లో చూసిన రాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఆమె నుంచి ఏదోలా తప్పించుకుంటారు. అక్కని ఎలాగైనా కనిపెట్టాలని బర్త్ డే వీడియో మొత్తం చూస్తుంది నందూ. ఆమె వేసుకున్న డ్రెస్ రాజ్ ఇంటి దండెంపై కనిపించడంతో ఇందూ ఆచూకీని కనిపెడుతుంది. కిడ్నాపర్లు అడిగిన కోటి రూపాయలు ఇవ్వమని చక్రీని అడుగుతుంది రేఖ

బ్రహ్మముడి ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు .. 1005వ ఎపిసోడ్ నుంచి 1010వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 13వ తేదీ 1005వ ఎపిసోడ్‌లో ..
ఇందూ కిడ్నాప్ కేసు గురించి పోలీసులను ఇంటికి పిలిపించి ఎంక్వైరీ చేయిస్తుంది రేఖ. ఇదంతా ఇంట్లో వాళ్లు చేసిన పనిలాగే ఉందని పోలీసులు అనుమానిస్తారు. ఈ మాటలు వినగానే ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లయంట్ ఇస్తే.. మా పని మేం మొదలుపెడతామని పోలీసులు చెప్పగా.. రేఖ భయపడుతుంది. కంప్లయంట్ లేకుండానే ఇందూని వెతికి పట్టుకోమని చెబుతుంది రేఖ. ఈ మాటలన్నీ విన్న అపర్ణ కంగారుపడుతుంది. స్వరాజ్ కొన్నిరోజులుగా ఇంటికి రాకపోవడంతో తండ్రి ఫోన్ చేసి నానామాటలు అంటాడు. నన్ను చాలా బాగా కిడ్నాప్ చేశారు.. మా చెల్లితో చెప్పి డబ్బులు వేయిస్తానని చెప్పడంతో స్వరాజ్ షాక్ అవుతాడు. మేం నిన్ను డబ్బు కోసం కిడ్నాప్ చేశాం.. మా పేమెంట్ మాకు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలని ఇందూని కట్టేస్తారు. ఇందూ కిడ్నాప్ అయిన విషయాన్ని నందూకి చెబుతాడు పోలీస్ బాబాయ్. దాంతో అక్కని నేనే వెతికి పట్టుకుంటానని అంటుంది నందూ. కిడ్నాప్ విషయం తేల్చడానికి ఇందూ బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో మొత్తం చూస్తుంది రేఖ. కిడ్నాప్ వెనుక అపర్ణ- సుభాష్‌లు ఉన్నారని అనుమానించి ఇద్దరినీ చంపేయాలని అనుకుంటుంది.
ఏప్రిల్ 14వ తేదీ 1006వ ఎపిసోడ్‌లో..
ఇందూ కిడ్నాప్ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి దుగ్గిరాల నిలయంలోకి అడుగుపెడుతుంది నందూ. రావడం రావడంతోనే భ్రమరాంబకి చుక్కలు చూపిస్తుంది. తన పేరు అప్పూ అని చెప్పడంతో సుభాష్ - అపర్ణలు షాక్ అవుతారు. భ్రమరాంబని కాఫీ పెట్టమని చెప్పడంతో నేను పెట్టనని అంటుంది భ్రమరాంబ. అయితే నేను వెళ్లిపోతానని నందూ చెప్పడంతో రేఖ సీరియస్ అవుతుంది. ఇందూకి భోజనం తీసుకొచ్చి పెడతారు లక్కీ- స్వరాజ్. మంచినీళ్లు తాగే వంకతో లక్కీ ఫేస్ మాస్క్ లాగేస్తుంది ఇందూ. తనను కిడ్నాప్ చేసింది లక్కీ - రాజ్‌లు అని తెలుసుకుని షాక్ అవుతుంది. డబ్బు కోసమే మేం నిన్ను కిడ్నాప్ చేశాం.. డబ్బు రాగానే వదిలేస్తామని చెబుతాడు స్వరాజ్. దుగ్గిరాల నిలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఎంక్వైరీ చేస్తుంది నందూ. ఇంతలో స్వరాజ్ నుంచి రేఖకి కాల్ వస్తుంది. మీ అమ్మాయిని వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని అడగటంతో అంతా షాక్ అవుతారు. అక్క తనకు తాను కిడ్నాప్ అయితే కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నది ఎవరు? అనుకుని టెన్షన్ పడుతుంది స్వాతి. పోలీసులు ట్రేస్ చేస్తున్న విషయాన్ని చెప్పాలని ఐశ్వర్య ఎంత ప్రయత్నించినా స్వరాజ్ మాత్రం కాల్ కట్ చేస్తాడు.

Photo Courtesy: JioHotstar
ఏప్రిల్ 15వ తేదీ 1007వ ఎపిసోడ్‌లో..
నేను పంపిన మనుషులు కాకుండా ఇందూ అక్కని ఎవరు కిడ్నాప్ చేశారు? అని ఆలోచిస్తూ బంటీకి ఫోన్ చేస్తుంది స్వాతి. మేమంతా మీలాగే పడుకున్నాం. ఈలోపు ఎవరో మీ అక్కని ఎత్తుకుపోయారని బంటీ చెప్పడంతో స్వాతి షాక్ అవుతుంది. ఈ మాటలన్నీ విన్న అపర్ణ.. లాగిపెట్టి కొడుతుంది. ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టకుండా చూడటానికి అక్క తనను తాను కిడ్నాప్ప చేసుకోవాలని అనుకుంది. కానీ ఇంతలో ఇలా జరిగిందని చెబుతుంది స్వాతి. ఇంతలో అక్కడికి వచ్చిన నందూ.. అక్క ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది. సాహూ మన ఇంటికి మళ్లీ చేపలు పంపించి, ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పి వెళ్లాడని స్వరాజ్‌కు చెబుతాడు చలపతి. దాంతో ఈ కిడ్నాప్ డ్రామా వెంటనే క్లోజ్ చేయాలని మన డబ్బు మనం తీసుకుని పారిపోవాలని చెబుతాడు స్వరాజ్. ఇందూ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి ఆమె దగ్గరికి వెళ్లి నా కుటుంబం కోసం నిన్ను చాలా ఇబ్బంది పడుతున్నానని డ్రామా ఆడతాడు. ఇదంతా పసిగట్టిన ఇందూ.. లక్కీ, స్వరాజ్‌లను చితకబాదుతుంది. భ్రమరాంబను కాఫీలు, జ్యూస్‌లు, టిఫిన్‌ల కోసం టార్చర్ చేస్తుంటుంది నందూ. ఇంతలో రేఖకి స్వరాజ్ కాల్ చేయడంతో నందూ ముందు మాట్లాడుతుంది.
ఏప్రిల్ 16వ తేదీ 1008వ ఎపిసోడ్‌లో..
మేం ఎంత చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు.. అందుకే మీ అమ్మాయి వేళ్లు కట్ చేసి పార్శిల్ చేస్తానని స్వరాజ్ వార్నింగ్ ఇవ్వడంతో రేఖ, నందూ షాక్ అవుతారు. నువ్వు అడిగిన కోటి రూపాయలు ఇవ్వడానికి మాకు రెండు రోజులు టైం కావాలని రేఖ చెప్పడంతో స్వరాజ్ ఓకే అంటాడు. నందూ చెప్పినంత సేపు రేఖ కాల్ మాట్లాడుతూ ఉండటంతో ఇందూని దాచిన ఏరియాని పోలీసులు ట్రేస్ చేస్తారు. మనకి కోటి రూపాయలు ఎవరిస్తారు? ఆ చక్రీ కూడా పాత బాకీ కోసం పీక్కుతింటున్నాడని రేఖతో భూషణ్ చెబుతాడు. ఇందూ కిడ్నాప్ వల్ల వచ్చే డబ్బుతో ఏం చేయాలా అని లక్కీ గాలిలో లెక్కలు వేస్తూ ఉండటంతో స్వరాజ్ క్లాస్ పీకుతాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో లక్కీ తీసి చూడగా అక్కడ పోలీసులు ఉండటంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఇటువైపు ఓ దొంగ పారిపోయి వచ్చాడని వాడు ఇప్పటికే 150 మందిని చంపేశాడని చెప్పడంతో స్వరాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఇక్కడికి ఎవరూ రాలేదని మేం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్ డిస్కస్ చేసుకుంటున్నామని స్వరాజ్- ఇందూలని భార్యాభర్తలని చెబుతాడు. ఈరోజుల్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ దొరకడం మీ అదృష్టమని లక్కీని మెచ్చుకుని పోలీసులు వెళ్లిపోతారు. మీరు నన్ను వదిలేస్తే మీరు అడిగినంత డబ్బులు ఇస్తానని ఇందూ ఆఫర్ ఇవ్వడంతో లక్కీ, స్వరాజ్‌లు నవ్వేస్తారు. నేను దుగ్గిరాల ఇంటికి వారసురాలిని, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి కాబోయే ఛైర్మన్‌ని అని ఇందూ చెప్పడంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. ఇందూని వెతికేందుకు వెంకీ సాయం తీసుకుంటుంది నందూ. పోలీసులకు ఇందూ ఫోటో చూపిస్తుండగా వాళ్లకు ఫోన్ రావడంతో వెళ్లిపోతారు.

ఏప్రిల్ 17వ తేదీ 1009వ ఎపిసోడ్‌లో..
ఇందూని వెతుకుతూ వెంకీని వెంట పెట్టుకుని నందూ వస్తుండటంతో స్వరాజ్- లక్కీలు షాక్ అవుతారు. ఇంతలో ఫోన్ రావడంతో లక్కీ పక్కకి వెళ్లిపోతాడు. స్వరాజ్- లక్కీలను గుర్తుపట్టిన నందూ.. వారికి ఇందూ ఫోటో చూపించి ఈ అమ్మాయి కిడ్నాప్ అయ్యిందని, ఆచూకీ తెలిస్తే చెప్పమని వెళ్లిపోతూ దండెం మీద ఆరేసిన ఇందూ బట్టల్ని చూస్తుంది. రోజా ఎక్కడుందో తెలియడంతో నందూని వెంట పెట్టుకుని వెళ్తాడు వెంకీ. అక్కడ మరో అబ్బాయితో రోజా క్లోజ్‌గా ఉండటంతో వారిద్దరి మాటల్ని వింటారు వెంకీ- నందూ. వెంకీ ఒక ఫెస్ట్ ఫెలో .. వాడిని వాడుకుని వదిలేస్తానని రోజా చెప్పడంతో వెంకీ గుండె ముక్కలై.. సీరియస్‌గా వెళ్లి రోజాతో గొడవ పడతాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారో? ఎక్కడున్నానో స్వాతికి చెప్పాలని రాజ్ ఫోన్ తీసుకుని మాట్లాడుతుండగా లక్కీ, స్వరాజ్‌లు చూసి ఫోన్ లాక్కుంటారు. నేను ఎక్కడున్నది మా వాళ్లకి చెప్పాలని, లేదంటే కంగారు పడతారని ఇందూ బతిమలాడుతున్నా స్వరాజ్ పట్టించుకోడు. నిన్ను ఫ్రీగానే ఉంచుతున్నాం, మా డబ్బులు రాగానే వదిలేస్తామని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఇందూ ఎక్కడుందో తెలియక స్వాతి, అపర్ణలు ఏడుస్తూ ఉండగా.. అక్కడ ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది.
ఏప్రిల్ 18వ తేదీ 1010వ ఎపిసోడ్‌లో..
ఇందూ కోసం బాధపడుతున్న అపర్ణ, స్వాతిలను ఓదారుస్తుంది నందూ. ఎంత కష్టమైనా సరే అక్కని నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది. స్వరాజ్ పెట్టే భోజనం తనకు నచ్చకపోవడంతో తనే స్వయంగా వంట చేస్తుంది ఇందూ. అయితే భోజనంలో విషం కానీ మత్తు మందు కానీ కలిపి మేం నిద్రపోయాక సైలెంట్‌గా వెళ్లిపోవాలని చూస్తున్నావా అని అనుమానిస్తాడు రాజ్. దాంతో అన్ని వంటలను ముందు తను తింటుంది ఇందూ. అక్కను ఎవరు కిడ్నాప్ చేశారని ఆలోచిస్తూ ఇందూ బర్త్ డే ఫంక్షన్ వీడియోలను చూస్తుంది నందూ. అందులో ఇందూ వేసుకున్న డ్రెస్.. రాజ్ ఇంటి ముందు దండెం మీద వేలాడుతూ కనిపించడంతో కిడ్నాప్ చేసింది ఎవరో అర్ధమైపోతుంది. వెంటనే రాజ్ ఉన్న ఇంటికి వెళ్లి కిటికీలోంచి చూస్తుంది. అక్కడ ఇందూతో కలిసి రాజ్, లక్కీలు భోజనం చేస్తూ ఉండటంతో షాక్ అవుతుంది. ఇందూని ఎలా విడిపించి తీసుకురావాలి? కిడ్నాపర్లకు కోటి రూపాయలు ఎలా ఇవ్వాలని రేఖ ఆలోచిస్తుంది. ఇంతలో దుగ్గిరాల నిలయానికి చక్రీ వస్తాడు. మరో కోటి రూపాయలు కావాలని రేఖ అడగ్గా.. ఇస్తాను కానీ మీరు దాచిన బంగారం మొత్తం నాకు ఇవ్వాలని కండీషన్ పెడతాడు చక్రీ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications