Brahmamudi weekly roundup: దుగ్గిరాల ఫ్యామిలీకి దగ్గరవుతోన్న రాజ్ .. యామినితో యుద్ధానికి కావ్య సై

అపర్ణ బాధ చూడలేక అప్పూ కుమిలిపోతుంది . పెద్దత్తయ్యని బాగు చేయమని కావ్యతో చెబుతుంది. చెల్లెలు చెప్పడంతో అత్తగారితో మాట్లాడుతుంది కావ్య . ఆయన బతికే ఉన్నారని గతం మరిచిపోయారని చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. వాడిని దూరం నుంచైనా చూస్తానని, చూపించమని అడుగుతుంది అపర్ణ. ఇంతలో రాజ్ ఫోన్ చేయడంతో కావ్య కూరగాయల షాప్ దగ్గరికి రమ్మని చెబుతుంది. మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేస్తున్నానని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని రాజ్ అడగటంతో కావ్య సరేనని అంటుంది.

వైట్ షర్ట్ మీద ఆర్ అనే అక్షరం కుట్టి దానిని రాజ్‌కు గిఫ్ట్‌గా పంపిన కావ్య అన్నదానం రోజు ఆ షర్ట్ వేసుకురమ్మని చెబుతుంది. రాజ్‌లో వచ్చిన మార్పు చూసి యామిని షాక్ అవుతుంది. ఉదయాన్నే కావ్య పంపిన షర్ట్ వేసుకుని కిందకి వచ్చిన రాజ్‌ను యామిని తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. అన్నదానానికి వెళ్తున్న కావ్య , అపర్ణలని రుద్రాణి నానామాటలు అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ చీవాట్లు పెడుతుంది. రాజ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అపర్ణ.. కొడుకుని చూసి పొంగిపోతుంది. రాజ్‌ని దగ్గరి నుంచి చూసుకుని మురిసిపోతుంది.

అపర్ణ కళ్లు తిరిగి పడిపోతుండటంతో ఆమెను పట్టుకుంటాడు. అన్నదానం మధ్యలో వచ్చి కూర్చొన్న ఆమెకు భోజనం పెట్టి వివరాలు కనుక్కుంటాడు. అపర్ణ పుట్టినరోజని తెలియడంతో ఆమె బర్త్ డే సెలబ్రేట్ చేయాలని కావ్యతో చెబుతాడు. రాజ్ ఇంటికి రాకపోవడంతో తల్లి మాట ప్రకారం గుడికి బయల్దేరుతుంది యామిని. ఆలయంలో కావ్య, రాజ్‌లు కలిసి అపర్ణకి కేక్ తినిపిస్తూ ఉండటంతో షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడే ఉన్నానని ఎవరు చెప్పారని యామినిని నిలదీస్తాడు రాజ్. నేనే రమ్మన్నానని కావ్య చెప్పడంతో యామిని ఊపిరి పీల్చుకుంటుంది. త్వరలో మా పెళ్లి జరగబోతోందని మమ్మల్ని ఆశీర్వదించమని యామిని అడగటంతో అపర్ణ షాక్ అవుతుంది. యామిని ఆటలు సాగనివ్వనని త్వరలోనే ఆయనను మనింటికి తీసుకొస్తానని అపర్ణతో చెబుతుంది కావ్య.

బ్రహ్మముడి ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు.. 695 ఎపిసోడ్ నుంచి 700 వరకు ఏం జరిగిందంటే?

Brahmamudi Telugu Serial Weekly roundup April 14th to April 19th episode Story

ఏప్రిల్ 14వ తేదీ 695వ ఎపిసోడ్‌లో ... రాజ్‌నే తలచుకుంటూ అపర్ణ బాధపడుతుండటంతో అప్పూ జరిగినదంతా కావ్యకి చెబుతుంది. ఆవిడ అన్నం తినడం లేదని, కంటి నిండా నిద్రపోవడం లేదని అలాగే వదిలేస్తే ఏమైపోతుందోనని అక్కని హెచ్చరిస్తుంది అప్పూ. అత్తయ్యని తాను మారుస్తానని చెప్పిన కావ్య .. చీకట్లో బాధపడుతున్న అపర్ణతో మాట్లాడుతుంది. రాజ్ నిజంగా బతికే ఉంటే నీకు ఒక్కడికే ఎందుకు కనిపిస్తున్నాడని ప్రశ్నిస్తుంది అపర్ణ. అత్తగారు గుచ్చి గుచ్చి అడిగేసరికి ఆయన గతం మరిచిపోయాడని కావ్య చెప్పడంతో అపర్ణ షాక్ అవుతుంది. యాక్సిడెంట్‌లో జరిగిన గాయం కారణంగా ఆయన గతం మరిచిపోయారని, ఇన్నిరోజులుగా జరిగినదంతా అత్తగారికి చెబుతుంది కావ్య. వాడిని దూరం నుంచి చూస్తానని గతం గుర్తుచేయని అపర్ణ నుంచి మాట తీసుకుంటుంది కావ్య.

ఏప్రిల్ 15వ తేదీ 696వ ఎపిసోడ్‌లో ... అత్తగారికి తన భర్తను ఎలా చూపించాలో అర్ధం కాక ఆలోచిస్తున్న కావ్యకు రాజ్ ఫోన్ చేస్తాడు. తాను కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పడంతో తాను కూడా వస్తానని అంటాడు రాజ్. కావ్య చెప్పిన ప్లేస్‌కి వచ్చిన రాజ్.. తనకు కూరగాయలు కొనడం చేత కాదని చెబుతాడు. మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయిస్తున్నానని తనకు కొంచెం సాయం చేయమని అడగటంతో కావ్య ఎంతో సంతోషిస్తుంది. జీపీఎస్ లోకేషన్ ఆధారంగా రాజ్ ఓ కూరగాయల షాప్ దగ్గరికి వెళ్లినట్లుగా తెలుసుకుంటుంది యామిని. ఇంటికి రాగానే కూరగాయలు తీసుకొచ్చావా అని అడుగుతుంది యామిని. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు.

ఏప్రిల్ 16వ తేదీ 697వ ఎపిసోడ్‌లో ... రాజ్ షర్ట్‌‌పై ఆర్ అనే లెటర్‌ను తడుముతూ పాత జ్ఞాపకాలలోకి వెళ్లిపోతుంది కావ్య. అనంతరం రాజ్‌కు షర్ట్ కొరియర్ చేసి ఫోన్ చేసి చెబుతుంది. కావ్య పంపిన షర్ట్ తీసుకుని కొరియర్ బాయ్ రావడంతో యామిని తలుపు తీసి చూస్తుంది. ఆమె నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఈ షర్ట్ నేనే ఆర్డర్ చేశానని అంటాడు రాజ్. అన్నదానానికి ఈ డ్రెస్‌లోనే రావాలని కావ్య చెప్పడంతో రాజ్ ఓకే చెబుతాడు. ఉదయాన్నే అన్నదానానికి బయల్దేరుతున్న కావ్య , అపర్ణలను సూటిపోటీ మాటలతో విసిగిస్తుంది రుద్రాణి. అత్తాకోడళ్లు ఏదోలాగా కవర్ చేసి అక్కడి నుంచి బయటపడతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup April 14th to April 19th episode Story

ఏప్రిల్ 17వ తేదీ 698వ ఎపిసోడ్‌లో ... రాజ్‌నే తలచుకుంటూ బతుకుతున్న అపర్ణలో ఒక్కసారిగా సంతోషం కనిపించడంతో రాహుల్ - రుద్రాణిలో అనుమానం కలుగుతుంది. కావ్య పంపిన వైట్ షర్ట్ వేసుకుని కిందకి వచ్చిన రాజ్‌ని చూసి యామిని తల్లిదండ్రులు డ్రెస్ బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. ఎంతకీ రాజ్ రాకపోవడంతో కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానా అపర్ణ టెన్షన్ పడుతుంది. ఇంతలో రాజ్ కారు దిగడంతో కొడుకుని చూసి ఆనంద భాష్పాలు రాలుస్తుంది. వాడితో మాట్లాడనని కానీ దగ్గరిగా చూసుకుంటానని చెప్పి రాజ్‌కి ఎదురవుతుంది అపర్ణ. కళ్లు తిరిగి పడిపోతున్న అపర్ణని రాజ్ పట్టుకుంటాడు. రాజ్‌ను చూస్తూ కంటతడి పెడుతున్న అపర్ణని చూసిన ఇంతగా ఎమోషనల్ అవ్వొద్దని అంటుంది.

ఏప్రిల్ 18వ తేదీ 699వ ఎపిసోడ్‌లో ... రాజ్- కావ్యలను చూసి చూడ ముచ్చటైన జంట అని ఆదర్శ దంపతుల్లా ఉన్నారని మెచ్చుకుంటాడు పంతులుగారు. తాము భార్యాభర్తలం కాదని, కేవలం తెలిసిన మనుషులమేనని చెబుతాడు రాజ్. తన తల్లి పేరు భానుమతి అని ఆమె పేరు మీద అర్చన చేయమని చెప్పడంతో అపర్ణ కుమిలిపోతుంది. రాజ్ గుడికి వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో యామిని, వైదేహి టెన్షన్ పడతారు. తల్లి మాటతో రాజ్ దగ్గరికి బయల్దేరుతుంది యామిని. అన్నదానం మధ్యలో అపర్ణ వచ్చి కూర్చోవడంతో రాజ్ ఆమెకు భోజనం వడ్డించి ఎందుకు బాధపడుతున్నారని అడుగుతాడు. ఆమె ఈరోజు నా పుట్టినరోజని చెప్పడంతో అపర్ణ బర్త్ డే చేయాలని కావ్యతో అంటాడు రాజ్.

ఏప్రిల్ 19వ తేదీ 700వ ఎపిసోడ్‌లో ... మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారని మీలో మా అమ్మని చూసుకుంటున్నానని మీకు అభ్యంతరం లేకపోతే కేక్ కట్ చేస్తారా అని అడుగుతాడు రాజ్. నువ్వు నాకు బిడ్డ లాంటి వాడివేనని అపర్ణ చెప్పడంతో ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్తాడు రాజ్. కావ్య, రాజ్‌లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయిస్తారు. ఇంతలో గుడికి వచ్చిన యామిని .. రాజ్‌ను అపర్ణ, కావ్యతో చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని యామినిని రాజ్ ప్రశ్నించగా కావ్య నేనే పిలిచానని కవర్ చేస్తుంది.

రాజ్, అపర్ణలు పక్కకి వెళ్లగానే యామిని- కావ్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ఆశీర్వదించమని అపర్ణని యామిని అడగ్గా అంతా షాక్ అవుతారు. వాళ్లు వెళ్లిపోగానే ఇదంతా ఏంటో నాకు అర్ధం కావడం లేదని కావ్యతో అంటుంది యామిని. ఇంటికొచ్చిన రాజ్‌ను తల్లిదండ్రుల ముందు పొగిడేస్తుంది యామిని. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X