Brahmamudi Weekly Roundup దొంగచాటుగా బిడ్డను తీసుకొని రాజ్.. అడ్డుకొన్న తండ్రి.. షాక్‌లో తండ్రి
బ్రహ్మముడి సీరియల్ రసవత్తరంగా సాగుతుంది. ఏప్రిల్ 15 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సాగిన ఎపిసోడ్స్ ట్విస్టులు, టర్నులతో కొనసాగింది. బిడ్డకు తల్లిగా భావించిన వెన్నెల బతికి లేదు అనే విషయం షాక్ గురి చేస్తుంది. ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రతికూలత రావడంతో రాజ్ బిడ్డను తీసుకొని అనాథాశ్రమానికి వెళ్లడాన్ని తండ్రి సుభాష్ అడ్డుకొంటాడు. అయితే వాస్తవం చెప్పేస్తా అని అనడంతో కావ్య షాక్ తింటుంది. ఈ వారం జరిగిన కథ విషయానికి వస్తే..
15వ తేదీ ఎపిసోడ్‌లో
రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తల్లి ఎవరో కనుక్కోవాలని ప్రయత్నించిన కావ్య.. శ్వేతతో కలిసి ఓ నాటకం ఆడింది. రాజ్ టెన్త్ క్లాస్‌మేట్స్ రీ యూనియన్ మీటింగ్‌లో వెన్నెల కలువాలని ప్లాన్ చేసింది. రాజ్ తెచ్చిన బిడ్డకు వెన్నెలేనా తల్లి అనే అనుమానాలకు క్లారిటీ తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నది. అయితే ఆ పార్టీకి వెన్నెల ఆలస్యంగా వస్తుంది.

16వ తేదీ ఎపిసోడ్‌లో
పార్టీలో భార్య గొప్పతనం గురించి రాజ్.. భర్త గొప్పతనం గురించి రాజ్ గొప్పగా చెప్పుకొంటారు. అయితే ఇంత అన్యోన్యంగా ఉన్న దంపతులు వెన్నెల వస్తే.. విడిపోతారా? కలిసి పోతారా? అనే సందేహం శ్వేతలో కలుగుతుంది. అయితే ఓ యువతి వెన్నెలగా మాదిరిగా ప్రాంక్ చేయడంతో అందరూ చివాట్లు పెడుతారు. అయితే వెన్నెల రాక ఆలస్యం కావడంతో మళ్లీ ఫోన్ చేస్తే.. రాజ్ వచ్చాడా? అని అడుగుతుంది. అయితే రాజ్ రాలేదని చెప్పమని కావ్య సూచిస్తుంది.
17వ తేదీ ఎపిసోడ్‌లో
వెన్నెల కోసం కావ్య, శ్వేత వెయిట్ చేస్తుంటే.. రాజ్ వచ్చి ఎవరి కోసం వెయిటింగ్ అని అడుగుతాడు. దాంతో వెన్నెల కోసం అని శ్వేత చెబుతుంది. అయితే వెన్నెల వస్తుందని నాకు ఎందుకు చెప్పలేదు అని రాజ్ కంగారు పడుతాడు. ఓ యువతి వచ్చి వెన్నెలగా పరిచయం చేసుకొంటుంది. అయితే అందరికి షాక్ ఇస్తూ నేను వెన్నెల కాదు.. ఆమె సోదరిని.నేను వెన్నెల కవలపిల్లలం. వెన్నెల చనిపోయిందని షాకింగ్ న్యూస్ చెబుతుంది. దాంతో కావ్యకు ఉపశమనం కలుగుతుంది. వెన్నెల చనిపోతే రాజ్ తెచ్చిన బిడ్డ ఎవరు? రాజ్ ఎందుకు అబద్దం చెప్పాడనే అనుమానం కావ్యలో కొత్తగా మొదలవుతుంది.
18 తేదీ ఎపిసోడ్‌లో
పార్టీలో వెన్నెల చనిపోయిందనే విషయం తెలియడంతో కారులో రాజ్, కావ్య వస్తుంటారు. మధ్యలో రాజ్ మాట్లాడుతూ.. వెన్నెల గురించి తెలుసుకోవడానికి బాగానే ప్లాన్ చేశావు అని ఎత్తి పొడుస్తాడు. దాంతో వెన్నెల చనిపోతే.. ఆ బాబుకు తల్లి ఎవరు అని ప్రశ్నిస్తుంది. కంపెనీలో సమస్య రావడంతో కల్యాణ్ వచ్చి రాజ్‌కు కొన్ని విషయాలు చెబుతాడు. అయితే రాహుల్‌తో జాగ్రత్తగా ఉండాలని కల్యాణ్, రాజ్‌కు వెన్నెల చెబుతుంది.
19వ తేదీ ఎపిసోడ్‌లో
రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు అనారోగ్యం చేస్తుంది. బిడ్డ ఏడుస్తుండటంతో ఆపే ప్రయత్నం చేస్తుంది. బాబుకు జ్వరంగా ఉందని స్వప్న చెబుతుంది. దాంతో ఆ బిడ్డను తీసుకొని కావ్య దంపతులు హాస్పిటల్‌కు వెళ్తారు. డాక్టర్ అడిగితే.. నేను కన్నతల్లిని కాదని చెబుతుంది. ఎక్కడి నుంచి తెచ్చిన బాబు తల్లిదండ్రులకు తెలిస్తే..వారు కేసు పెడితే ఇబ్బందుల్లో పడుతాం. కాబట్టి బిడ్డను రాజ్ వారికి అప్పగిస్తే మంచిది అని ధాన్యలక్ష్మీ, రుద్రాణి తమ కుటుంబ సభ్యులను భయపెడుతారు.
బాబు అనారోగ్యం చేయడంతో ఆ బాబు తల్లిదండ్రులు ఎవరో చెప్పాలని రాజ్‌ను అడిగితే.. అందుకు ఏమీ మాట్లాడడు. ఆ బాబు ప్రాణం పోకముందే.. ఒక నిర్ణయం తీసుకోవాలని అపర్ణ సూచిస్తుంది. ఇదిలా ఉండగా దొంగచాటుగా బిడ్డను రాజ్ తీసుకెళ్లడం చూసి తన తండ్రి సుభాష్ కారులో వెంబడిస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావంటే.. ఈ వంశానికి, కుటుంబానికి దూరంగా అనాథాధ్రమానికి అంటాడు. అయితే నీవు ఇంటి నుంచి వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదు. బిడ్డ గురించి అంతా చెప్పేస్తా అని సుభాష్ అంటే.. కావ్య షాక్ తింటుంది. మామయ్యకు అంతా తెలుసా? అని షాక్‌లో ఉండిపోతుంది.


Click it and Unblock the Notifications










