Brahmamudi Weekly Roundup వెన్నెలకు పుట్టిన బిడ్డేనా? కావ్య అంతర్మథనం.. ఎండీ సీటు కోసం రుద్రాణి కుట్రలు
తెలుగు టెలివిజన్ సీరియల్ రంగంలో టాప్ రేటింగ్ ఉన్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తూ సాగిపోతున్నది. రాజ్, కావ్య దాంపత్యంలో ఓ కీలక సమస్య, అలాగే కుటుంబ బిజినెస్‌లో ఎండీ సీటు కోసం ఆధిపత్య పోరాటం.. అలాగే పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో అప్పుకు జరిగిన అవమానం ఈ వారం సీరియల్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు సాగిన సీరియల్‌లో ముఖ్యాంశాలు మీ కోసం..
ఏప్రిల్ 1వ తేదీ.. 372 ఎపిసోడ్‌లో
కంపెనీలో ఉన్నత పదవి కోసం కుటుంబంలో అభిప్రాయ బేధాలు, కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతుంటే.. ఓ పసిబిడ్డను పట్టుకు రావడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. తన భార్య కావ్యకు పుట్టిన బిడ్డకే ఇంటిలో, బిజినెస్‌లో హోదా ఉంటుందని కుటుంబ సభ్యులు తేల్చి చెబుతారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా తాను ఈ బిడ్డను అనాథను చేయను. బిడ్డతోపాటే ఇంట్లో ఉంటాను. మీకు ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోతాను అని రాజ్ ఖరాఖండీగా చెప్పేస్తాడు. దాంతో కంపెనీలో బాస్ ఎవరు ఉండాలనే చర్చ మొదలైంది.

ఏప్రిల్ 2వ తేదీ.. 373 ఎపిసోడ్‌లో
రాజ్ పసిబిడ్డను తీసుకొచ్చి గందరగోళం సృష్టించడంతో కంపెనీ బాధ్యతలు వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. దాంతో కావ్యను ఎండీ సీటులో కూర్చోబెట్టాలని సుభాష్ నిర్ణయం తీసుకొంటారు. పసిబిడ్డ రాకతో రాజ్, కావ్య జీవితాలు తారుమారు అవుతాయి. అయితే తన ప్లాన్ వర్కవుట్ కావడంతో రుద్రాణి కొంత సంతోషంలో ఉంటుంది. ఇక కథ నడుపాల్సిన బాధ్యత అనామికపై ఉందని చెబుతుంది. రాజ్ స్థానంలో కల్యాణ్‌ను ఎండీ చేయాలని రుద్రాణి ప్లాన్ వేసింది.
ఏప్రిల్ 3వ తేదీ.. 374 ఎపిసోడ్‌లో
కంపెనీ ఎండీగా ఎవరు ఉండాలనే విషయంపై అనామికతోపాటు దుగ్గిరాల ఫ్యామిలీలో రకరకాల వాదనలు తెరపైకి వస్తాయి. కల్యాణ్ కాకుండా రాహుల్‌కు పదవి ఇవ్వాలని రుద్రాణి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టడం ట్విస్టుగా మారుతుంది. అయితే తనకు ఆ పదవిలో కూర్చోవడం ఇష్టం లేదని కల్యాణ్ క్లారిటీ ఇస్తారు. అయితే ఇలాంటి వాదనల మధ్య రాజ్ తప్పు చేశాడని రుజువు కాలేదు. కాబట్టి నేను ఆ పదవిలో కూర్చోనని కావ్య షాకిస్తుంది.

ఏప్రిల్ 4వ తేదీ.. 375 ఎపిసోడ్‌లో
రాజ్ తీసుకొచ్చిన బిడ్డకు తల్లి వెన్నెల అనే విషయాన్ని కావ్య తెలుసుకొంటుంది. రాజ్‌కు వెన్నెల చిన్ననాటి స్నేహితురాలు అని తెలుస్తుంది. దాంతో వెన్నెల గురించి ఆరా తీయడం కావ్య ప్రారంభిస్తుంది. ఇదిలా ఉండగా, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో అపర్ణ తనకు జరిగిన అవమానం గురించి చెప్పి భోరుమని ఏడుస్తుంది. ఓ బ్రోకర్ తనను గెస్ట్ హౌజ్ రమ్మని చెప్పిన విషయాన్ని అప్పు బయటపెడుతుంది.
ఏప్రిల్ 5వ తేదీ.. 376 ఎపిసోడ్‌లో
ఇక కుటుంబ సభ్యుల అండతో బ్రోకర్ గురించి మీడియా ముందుకు వస్తుంది. ఆ బ్రోకర్ వల్ల తాను మాత్రమే కాదు చాలా మంది అమ్మాయిలు వేదనకు గురి అవుతున్నారు. నా మాదిరిగా ఏ అమ్మాయి కూడా ఇలాంటి కష్టాలకు గురికావొద్దని చెబుతుంది. ఇదిలా ఉంటే.. రాజ్ తీసుకొచ్చిన అబ్బాయికి తల్లి ఎవరు? వెన్నెలతో రాజ్‌కు పుట్టిన బిడ్డేనా అనే అనుమానం నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఏప్రిల్ 5వ తేదీ.. 377 ఎపిసోడ్‌లో
పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఓ బ్రోకర్ వేధింపుల విషయంలో మీడియాకు ఎక్కిన అప్పును చూసి తండ్రి బాధపడుతాడు. అయితే తన కూతురు తప్పు చేయనంత వరకు ఎలాంటి పోరాటం చేసినా నా అండ ఉంటుందని తల్లి చెబుతుంది. ఇదిలా ఉండగా, వెన్నెల ఎవరు? రాజ్ తీసుకొచ్చి బిడ్డ ఆమెకు పుట్టారా? అనేది ప్రశ్నగా ఉండకూడదు. అప్పటి వరకు రాజ్ తప్పు చేశాడని నమ్మలేను. కాబట్టి నా జీవితంలో ప్రశ్నగా మారిన సమస్యకు పరిష్కారం చూస్తాను అని కావ్య ముందుకెళ్తుంది.


Click it and Unblock the Notifications











