Brahmamudi weekly roundup: రేఖకి హ్యాండిచ్చిన చక్రీ.. రాజ్‌ని హత్తుకున్న ఇందూ, ప్రేమలో బావమరదళ్లు
Photo Courtesy: JioHotstar
ఇందూని కిడ్నాపర్ల నుంచి విడిపించడానికి చక్రీ అడిగినట్లుగానే ఇంట్లో ఉన్న బంగారం ఇచ్చేస్తుంది రేఖ. అపర్ణ దగ్గరున్న బంగారాన్ని భ్రమరాంబ లాక్కోబోతుండగా నందూ వచ్చి అడ్డుకుంటుంది. ఇంటి ఓనర్‌కి భయపడ్డ రాజ్.. అతను కోరిన వంటలన్నీ చేయమని ఇందూని ప్రాధేయపడతాడు. వంటలన్నీ చేసిన ఇందూకి రాజ్ రెండు గోలీసోడాలు ఇవ్వడంతో ఆమె సంతోషిస్తుంది. ఓనర్‌కి ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయమని రాజ్ అడగ్గా.. నన్ను ఊరంతా తిప్పాలని కండీషన్ పెడుతుంది ఇందూ. దాంత్ ఇందూని తీసుకుని ఊరంతా చూపిస్తాడు. ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్‌లు కొట్టేస్తారు. ఇందూ గోల భరించలేక కూల్‌డ్రింక్‌లో మందు కలిపి ఇస్తాడు రాజ్. పట్టరాని సంతోషంతో రాజ్‌ని హత్తుకుంటుంది ఇందూ. బంగారం తాకట్టు పెట్టుకుని 50 లక్షలు ఇస్తానన్న చక్రీ మోసం చేయడంతో రేఖ, భూషణ్‌లు షాక్ అవుతారు. తల్లిదండ్రుల పెళ్లిరోజు కావడంతో రాజ్ ఇంటికి వచ్చిన ఇందూ.. జీరో బడ్జెట్‌తో ఈవెంట్ బాగా గ్రాండ్‌గా చేస్తానని అంటుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు .. 1011వ ఎపిసోడ్ నుంచి 1016వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 20వ తేదీ 1011వ ఎపిసోడ్‌లో ..
ఇందూని విడిపించడానికి కావాల్సిన డబ్బు కోసం రేఖని బంగారాన్ని తాకట్టుగా పెట్టమని చెబుతాడు చక్రీ. దాంతో రేఖ, ఐశ్వర్య, స్వాతిలు బంగారం తీసుకొచ్చి ఇస్తారు. భ్రమరాంబ మాత్రం తన దగ్గర చిన్న చైన్ మాత్రమే ఉందని, మిగిలినదంతా గిల్ట్ నగలనీ చెప్పడంతో శేషం షాక్ అవుతాడు. స్వరాజ్- లక్కీలు పీకలదాకా తిన పడుకోవడంతో ఇదే అదనుగా లోపలికి వెళ్తుంది నందూ. ఆమెను చూడగానే ఇందూ షాక్ అవుతుంది. నిన్ను నేను క్షేమంగా ఇంటికి తీసుకెళ్తానని నందూ చెప్పగా.. నేను ఇప్పుడు ఆ ఇంటికి రాలేనని చెబుతుంది ఇందూ. నేను ఇక్కడ బాగానే ఉన్నాను.. కానీ నానమ్మ, తాతయ్యల గురించే బాధపడుతున్నానని చెబుతుంది ఇందూ, వాళ్లిద్దరినీ నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెబుతుంది. రేఖ వాళ్లు ఇచ్చిన బంగారానికి 50 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయని చక్రీ తేల్చి చెప్పడంతో.. అపర్ణ దగ్గరున్న నగల్ని లాక్కోవడానికి రేఖ, భ్రమరాంబలు వెళ్తారు. ఇంతలో నందూ వచ్చి ఈ ఇంట్లో ఏదో తేడాగా ఉంది, మీరే ఇందూని కిడ్నాప్ చేశారని అనడంతో అంతా షాక్ అవుతారు.
ఏప్రిల్ 21వ తేదీ 1012వ ఎపిసోడ్‌లో..
ఇందూ అడగ్గానే కాఫీ తెచ్చిస్తాడు రాజ్. ఇంతలో ఆ ఇంటి ఓనర్ రావడంతో ఇందూ- రాజ్‌ల్ని బీరువాలో దాస్తాడు లక్కీ. ఇంటి ఓనర్ మందు ఏర్పాట్లతో పాటు పెద్ద లిస్ట్ చెప్పడంతో లక్కీ, రాజ్‌లు షాక్ అవుతారు. వారికి వంట రాకపోవడంతో ఇందూ దగ్గరికి వెళ్లి హెల్ప్ చేయమని ఇద్దరూ బతిమలాడతారు. రాజ్ కూడా బుజ్జగించడంతో వంట చేయడానికి ఒప్పుకుంటుంది ఇందూ. అయితే తనకు గోలీసోడా కావాలని అడుగుతుంది. ఎప్పుడో మా నానమ్మ చిన్నప్పుడు తాగించింది. మళ్లీ ఇప్పటి వరకు తాగలేదని ఇందూ చెప్పడంతో. సిటీ మొత్తం గాలించైనా తెచ్చిపెడతానని అంటాడు రాజ్. ఇంటి ఓనర్‌కు మందు పోసి కబుర్లు చెబుతాడు లక్కీ. అతనికి కావాలని ఎక్కువగా మందు పోస్తాడు. దాంతో ఓనర్ మత్తులో తూగుతుండగా నాకు ఫుడ్ రాలేదు అంటూ మండిపడతాడు. కోపంతో ఊగిపోతూ కిచెన్‌లోకి వస్తాడు. అక్కడ ఇందూ వంట చేస్తూ ఉండటంతో షాక్ అవుతాడు ఓనర్. దాంతో నువ్వేం మాట్లాడొద్దు నేనే మాట్లాడతానని, నువ్వు లిప్స్ కదిలిస్తూ ఉండమని ఇందూకి చెబుతాడు ఓనర్.

Photo Courtesy: JioHotstar
ఏప్రిల్ 22వ తేదీ 1013వ ఎపిసోడ్‌లో..
ఇంట్లోకి ఆడపిల్ల ఎలా వచ్చిందంటూ ఓనర్ నానారకాల ప్రశ్నలు వేయడంతో రాజ్, లక్కీలు వణికిపోతారు. ఈ అమ్మాయి కత్తిలాగా ఉందని అనడంతో లాగిపెట్టి కొడుతుంది ఇందూ. ఆ దెబ్బకి కిందపడిపోయి లేస్తాడు ఓనర్. ఆ వెంటనే అమ్మాయిలా చీరకట్టుకుంటాడు లక్కీ. హోమ్ ఫుడ్ ఫీలింగ్ రావడానికి నేను ఇలా చీరకట్టుకున్నానని చెబుతాడు లక్కీ. భోజనం తినకుండానే ఓనర్ పడిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. మీ కోసం భోజనం వండిపెడితే నాకు గోలీసోడా ఇవ్వవా అంటూ రాజ్‌పై మండిపడుతుంది ఇందూ. అతను సర్‌ప్రైజ్‌గా గోలీసోడా ఇవ్వడంతో సంతోషంగా తాగుతుంది. రేపొద్దున కూడా బ్రేక్ ఫాస్ట్ చేయమని రాజ్ చెప్పగా.. నన్ను బైక్ మీద ఊరంతా తిప్పితే చేస్తానని అంటుంది. చలపతి- లక్ష్మీ మాట్లాడుకుంటూ ఉండగా నందూ వచ్చి వెంకీ ఎక్కడ అని అడగటంతో ఇద్దరూ షాక్ అవుతారు. నందూ పైకి వెళ్లేసరికి వెంకీ మందు తాగుతున్నట్లు దేవదాస్‌లా బిల్డప్ ఇస్తాడు. నా కోసం ఓ మంచి అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది.. నువ్వే మా ప్రేమకి హెల్ప్ చేయమని నందూకి చెబుతాడు వెంకీ. ఇందూని తీసుకుని బజారుకి రాగానే నాకు ఐస్‌క్రీమ్ దొంగతనం చేయాలని ఉందని ఆమె చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.
ఏప్రిల్ 23వ తేదీ 1014వ ఎపిసోడ్‌లో..
ఐస్‌క్రీమ్‌ని దొంగతనం చేయాలంటూ రాజ్ దగ్గర గోల గోల చేస్తుంది ఇందూ. ఆమె పోరు పడలేక ఐస్‌క్రీమ్ దొంగతనానికి ఒప్పుకుంటాడు. ఓ ఐస్‌క్రీమ్ బండి దగ్గరికి వెళ్లి వాడిని మాటల్లో పెట్టి ఐస్‌క్రీమ్ కొట్టేస్తారు ఇందూ, రాజ్. ఇద్దరూ ఐస్‌క్రీమ్‌ని తిన్న తర్వాత మరో ఐస్‌క్రీమ్ కొట్టేద్దామని చెబుతుంది ఇందూ. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వు నేను చెప్పినట్లు వినకపోతే ఇంటి ఓనర్ దగ్గర తేల్చుకుందామని ఇందూ బెదిరిస్తుంది. దాంతో చేసేదేం లేక రాజ్ సరేనని అంటాడు. ఐస్‌క్రీమ్ బండి దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి మీ ఐస్‌క్రీమ్‌లు కొట్టేశాడని ఇరికిస్తుంది. దాంతో ఐస్‌క్రీమ్ బండివాడికి డబ్బులు కట్టేస్తాడు రాజ్. ఇందాకే డబ్బులు ఇచ్చేద్దామంటే నువ్వు వినలేదు.. ఇప్పుడు నన్నెందుకు ఇరికించావని ఇందూపై మండిపడతాడు రాజ్. పాపం అతను కుటుంబం కోసం రాత్రంతా నిద్ర మానుకుని కష్టపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని మనం మోసం చేయకూడదని చెబుతుంది ఇందూ. ఇంకా నీకు ఎలాంటి కోరికలు ఉన్నాయో చెబితే తీరుస్తానని చెబుతాడు రాజ్. దాంతో ఇందూ పెద్ద లిస్ట్ చెబుతుంది. ఇందూ గోల తట్టుకోలేక ఆమెకు కూల్‌డ్రింక్‌లో మందు కలిపి ఆమెతో తాగిస్తాడు. మత్తులో గోల గోల చేస్తుంది ఇందూ.

Photo Courtesy: JioHotstar
ఏప్రిల్ 24వ తేదీ 1015వ ఎపిసోడ్‌లో..
మద్యం కలిపిన కూల్‌డ్రింక్ తాగిన ఇందూ రోడ్ల మీద పరుగులు తీస్తూ ఉంటుంది, ఆమె వెనుకే రాజ్ పరిగెత్తుతాడు. ఇద్దరూ ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. నువ్వు ఏదైనా పనిచేసుకోవచ్చు కదా ఈ కిడ్నాప్‌లు ఎందుకు అని చెబుతుంది ఇందూ. పనిచేయాలంటే ఉద్యోగం కావాలి.. అయినా నాకు బిజినెస్ అంటే ఇష్టమని చెబుతాడు రాజ్. నువ్వు చదువుకున్నావా అని ఇందూని అడగ్గా.. మా నానమ్మ నన్ను సీక్రెట్‌గా చదివించిందని చెబుతుంది ఇందూ. మాటలు చెబుతూ రాజ్ ఒడిలో నిద్రపోతుంది ఇందూ. ఇందూని విడిపించడానికి కావాల్సిన కోటి రూపాయలు ఇవ్వమని చక్రీని అడుగుతారు రేఖ, భూషణ్. మీరు ఇచ్చిన నగల్ని పాత బాకీ కింద జమ చేసుకున్నాను. వారం రోజుల్లోగా నా బాకీని వడ్డీతో సహా తీర్చాలని చక్రీ చెప్పడంతో రేఖ, భూషణ్ షాక్ అవుతారు. ఉదయాన్నే రాజ్‌కి వెంకీ కాల్ చేసి.. ఈరోజు అమ్మానాన్నల పెళ్లిరోజు చికెన్ తీసుకుని రమ్మని చెబుతాడు. ఈ మాటలు విన్న ఇందూ.. పెళ్లి రోజుని సెలబ్రెట్ చేసుకోవడం అలా కాదు, నేను జీరో బడ్జెట్‌లో సింపుల్‌గా చేస్తానని చెబుతుంది. రాజ్- ఇందూలు ఇంటికి రావడంతో చలపతి, లక్ష్మీ, వెంకీలు షాక్ అవుతారు.
ఏప్రిల్ 25వ తేదీ 1016వ ఎపిసోడ్‌లో..
రాజ్‌తో కలిసి ఇంటికొచ్చిన ఇందూని చూసి చలపతి, లక్ష్మీ, వెంకీలు షాక్ అవుతారు. నీలాంటి వాడికి ఇంత అందమైన అమ్మాయి పడిందా? ఏం చూసి మా వాడిని ప్రేమించావంటూ ఇందూపై మండిపడతాడు చలపతి. తను నా లవర్ కాదని.. ఈవెంట్ ప్లానర్ అని, మీ పెళ్లిరోజు సెలబ్రేట్ చేయడానికి వచ్చిందని రాజ్ చెప్పడంతో చలపతి షాక్ అవుతాడు. మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని చలపతి అనడంతో నేను జీరో బడ్జెట్‌తో మీ పెళ్లిరోజు సెలబ్రేట్ చేస్తానని అంటుంది ఇందూ. రాజ్ చేత అంట్లు తోమించి, వెంకీ చేత కొబ్బరి మట్టలు కోయిస్తుంది. ఓనర్ నుంచి తప్పించుకున్న లక్కీని చికెన్ తీసుకుని రమ్మని చెబుతాడు రాజ్. వెంకీ కోసం నందూ రావడంతో ఆమెను చూసి ఇందూ షాక్ అవుతుంది. ఇంతలో కొబ్బరి చెట్టుపై ఇరుక్కుపోతాడు వెంకీ. అతనిని ఇందూ జాగ్రత్తగా కిందకి దించుతుంది. జీరో బడ్జెట్‌తో వచ్చిన వాళ్లకి భోజనాలు పెట్టడానికి ఏం చేయొచ్చోనని ఇందూ ప్లాన్ చేస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications