Brahmamudi weekly roundup : రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన కావ్య.. రాజ్‌తో యామిని పెళ్లికి ఏర్పాట్లు
కావ్య, అపర్ణలకు రాజ్ దగ్గరవుతున్నాడని మనం జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. కావ్య అడ్రస్ ఏంటో తెలుసుకోవాలని రాజ్ సీరియస్‌గా ప్రయత్నిస్తాడు. అపర్ణలో వచ్చిన మార్పుకు కారణం తెలుసుకోవాలని రుద్రాణి, రాహుల్‌లు ప్రయత్నిస్తారు. కంపెనీ స్టాఫ్‌ని రప్పించి రాజ్‌కు శ్రద్ధాంజలి ఘటించాలని ప్లాన్ వేయగా కావ్య తిప్పి కొడుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి పార్శిల్ రావడంతో తాను రా సీక్రెట్ ఏజెంట్‌నని ఊహించుకుని కావ్య ముందు బిల్డప్ ఇస్తాడు రాజ్.
కావ్య నోటి నుంచి నిజం చెప్పించాలని కంపెనీకి రావాల్సిన డబ్బును ఎక్కడికక్కడే ఆపేస్తుంది రుద్రాణి. రాజ్ డెత్ సర్టిఫికెట్ ఇవ్వడమా? లేదంటే కావ్య పేరు మీదకి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకురావాల్సిన పరిస్ధితి క్రియేట్ చేస్తుంది. ఏం చేయాలో తెలియక రాజ్‌ను సాయం అడుగుతుంది కావ్య. తన కోసం ఫోర్జరీ సంతకం చేయాలని చెప్పడంతో రాజ్ భయపడి పారిపోతాడు. కావ్య అన్ని బిల్స్ క్లియర్ చేయడంతో ఎలా సాధ్యమైందో తెలియక రుద్రాణి షాక్ అవుతుంది. కావ్య తీసుకొచ్చిన పేపర్లు, రాజ్ బతికున్నప్పటి సంతకాన్ని పోల్చి చూడగా రెండూ ఒకటేనని తేలుతుంది. ఆ సంతకం రాజ్ చేసినట్లు గుర్తొచ్చి నవ్వుకుంటుంది కావ్య.

కావ్య చెప్పిన పొడుపు కథ ఆధారంగా ఆమె అడ్రస్ కనుక్కొని చెబుతాడు రాజ్. కానీ అది తప్పుడు అడ్రస్ కావడంతో ఆయన ఎక్కడో చోట ఇరుక్కుపోతాడని నవ్వుకుంటుంది కళావతి. ఉదయాన్నే అందరితో క్యారంబోర్డ్ ఆడిస్తుంది అపర్ణ. రాజ్‌లో మార్పు కనిపిస్తోందని కావ్య మీద కన్నేసి ఉంచాలని యామినికి సలహా ఇస్తుంది వైదేహి. రాజ్ వెళ్లే దారి తనకు బాగా తెలిసిందిలా అనిపించి నేరుగా దుగ్గిరాల వారి నిలయానికి వెళ్తాడు. గేటు వద్ద రాజ్‌ని చూసిన అపర్ణ, కావ్యలు ఫ్యామిలీ మొత్తాన్ని మరో రూమ్‌కి తీసుకెళ్తారు.
బ్రహ్మముడి ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు.. 701 ఎపిసోడ్ నుంచి 706 వరకు ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 21వ తేదీ 701వ ఎపిసోడ్‌లో ... రాజ్ వాళ్ల అమ్మ అపర్ణకి క్లోజ్ అవుతున్నాడని ఆమెతో కేక్ కట్ చేయించాడని వైదేహి, రఘునాథ్‌లకు చెబుతుంది యామిని . నువ్వు మహాపాపం చేస్తున్నావని ఓ తల్లికి బిడ్డని దూరం చేస్తున్నావని, ఓ కుటుంబానికి వారసుడిని దూరం చేస్తున్నావని యామినిపై మండిపడతాడు రఘునాథ్. రేపు బావని పెళ్లి చేసుకుంటే వాళ్లు నా ఫ్యామిలీయే కదా అని అంటుంది యామిని. మరి రాజ్‌తో తాళి కట్టించుకున్న కావ్య పరిస్ధితి ఏంటి అని ప్రశ్నించగా.. ఆమె కంటే ముందు నుంచే రాజ్‌తో నా ప్రయాణం ప్రారంభమైందని చెబుతుంది యామిని. గుడి నుంచి వచ్చిన అపర్ణ, కావ్యలు ముఖాలు వెలిగిపోవడంతో రుద్రాణికి అనుమానం వస్తుంది. ఇంట్లో ఇంకో పిచ్చిది తయారైందని మండిపడుతుంది. కావ్య ఎవరో తెలుసుకోవాలనే ఆలోచిస్తున్న రాజ్‌కు పార్శిల్ గుర్తొచ్చి కొరియర్ ఆఫీస్‌కి ఫోన్ చేస్తాడు రాజ్. ఆ పార్శిల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి రావడంతో రాజ్ షాక్ అవుతాడు.
ఏప్రిల్ 22వ తేదీ 702వ ఎపిసోడ్‌లో ... కావ్య, అపర్ణలకి ఏదో నిజం తెలిసిందని అది మనం కూడా తెలుసుకోవాలని రాహుల్ - రుద్రాణిలు అనుకుంటారు. దీంతో రుద్రాణి కొత్త స్కెచ్ వేస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ భోజనానికి వెళ్తుండగా స్వరాజ్ కంపెనీకి చెందిన స్టాఫ్ వస్తారు. రాజ్‌కి మన స్టాఫ్ అంతా శ్రద్ధాంజలి ఘటించాలని అనుకుంటున్నారని రుద్రాణి చెప్పడంతో కావ్య, అపర్ణలు రగిలిపోతారు. ఇలాంటివేవి వద్దు అని కావ్య నచ్చచెప్పడంతో స్టాఫ్ వచ్చిన దారినే వెళ్లిపోతారు. తానెవరో నిజం తెలుసుకున్నానని కావ్య దగ్గరికి వచ్చి బిల్డప్ ఇస్తాడు రాజ్. నా పేరు రామ్ మనోహర్.. రా సీక్రెట్ ఏజెంట్‌ని అని చెప్పడంతో కావ్య నవ్వుకుంటుంది. ఓ దొంగని పట్టుకుని పోలీసులకు అప్పగించి నేను సీక్రెట్ ఏజెంట్‌నని అండర్ కవర్‌లో ఉన్నానని చెప్పడంతో ఆ పోలీస్ అధికారి షాక్ అవుతాడు. భర్త కొంప ముంచేలా ఉండటంతో భయపడిన కావ్య వెంటనే రాజ్‌ని పక్కకి తీసుకెళ్తుంది.
ఏప్రిల్ 23వ తేదీ 703వ ఎపిసోడ్‌లో ... కంపెనీలో ఏదో జరుగుతోందని అదేంటో తెలుసుకోవాలని రాహుల్‌కు రుద్రాణి చెప్పడంతో అతను వెంటనే మేనేజర్‌కి ఫోన్ చేసి పెండింగ్ బిల్స్ గురించి కనుక్కొని రుద్రాణికి చెబుతాడు . దాంతో నవ్య జ్యూయెలర్స్ మేనేజర్‌కి ఫోన్ చేసి కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలంటే రాజ్ డెత్ సర్టిఫికెట్ పంపించాలని లేదంటే పవర్ అటార్నీ కావ్య పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయించమని చెబుతుంది రుద్రాణి. మరో క్లయింట్‌కి ఫోన్ చేసి వాళ్లకు కూడా ఇలాగే చెప్పడంతో వాళ్లిద్దరూ కావ్యకి షాకిస్తారు. తమకు రాజ్ డెత్ సర్టిఫికెట్ , పవర్ ఆఫ్ అటార్నీ మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయించి బిల్స్ క్లియర్ చేయించాలని చెబుతారు. బిల్స్ గురించి నేరుగా ఇంటికొచ్చి కావ్యని నిలదీయడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఈ సమస్య తీరాలంటే రాజ్ రావాలి సంతకం పెట్టాలి లేదా పవర్ ఆఫ్ అటార్నీ కావ్య పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయాలని లేదా రాజ్ డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలని రుద్రాణి చెప్పడంతో కావ్య, అపర్ణ షాక్ అవుతారు.
ఏప్రిల్ 24వ తేదీ 704వ ఎపిసోడ్‌లో ... రుద్రాణి మాటలతో ఇరకాటంలో పడ్డ కావ్య 24 గంటల్లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తానని సవాల్ చేస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతావని కావ్యని అపర్ణ అడగ్గా.. నేను చూసుకుంటానని చెబుతుంది కళావతి. ఆఫీస్‌కు వెళ్తూ రాజ్‌కి ఫోన్ చేసి అర్జెంట్‌గా కలవాలని రెస్టారెంట్‌కు రమ్మని చెబుతుంది కావ్య. ఆమె కోసం రాజ్ వెళ్తుండగా కింద యామిని తల్లిదండ్రులు పంతులు గారితో మాట్లాడుతూ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు. రాజ్‌ని కూడా కూర్చోమని రఘునాథ్, వైదేహిలు చెప్పినా పెద్దవాళ్లు మీరు చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు. రెస్టారెంట్‌లో రాజ్‌ను కలిసిన కావ్య మా బాస్ ఇచ్చిన లెటర్ హెడ్‌ని నేను పొగొట్టానని , అది ఉంటేనే డీల్ క్లోజ్ చేయడం కుదురుతుందని లేదంటే నా జాబ్ పోతుందని చెబుతుంది. మా బాస్ సంతకం ఫోర్జరీ చేయమని చెప్పడంతో రాజ్ షాక్ భయపడి పారిపోతాడు.

ఏప్రిల్ 25వ తేదీ 705వ ఎపిసోడ్‌లో ... కావ్య మేడం బిల్స్ క్లియర్ చేసేశారని క్లయింట్స్ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఎలా చేసిందని ప్రశ్నించగా.. పవర్ ఆఫ్ అటార్నీ ఆమె పేరు మీదే ఉందని చెబుతారు. దాంతో కావ్య మోసం చేసిందని ఇంట్లో వాళ్ల ముందు పంచాయతీ పెడుతుంది రుద్రాణి. రాజ్ లేకుండా నీ చేతికి పవర్ ఆఫ్ అటార్నీ ఎక్కడి నుంచి వచ్చిందని ఆఫీసు నుంచి వచ్చిన కావ్యని ప్రశ్నిస్తుంది రుద్రాణి. రాజ్ బతికే ఉన్నప్పటి సిగ్నేచర్, నువ్వు తీసుకొచ్చిన పేపర్స్ మీద సంతకం రెండూ మ్యాచ్ చేయాలని ఎక్స్‌పర్ట్‌ని పిలిపిస్తుంది. అవి రెండూ రాజ్ సంతకాలేనని ఆయన చెప్పడంతో ఇంకా డబ్బులు ఇస్తానని కానీ నిజం చెప్పమని అంటుంది. ఎమర్జెన్సీలో ఉపయోగపడటానికి వీలుగా నా భర్త నాకు ముందే పవర్ ఆఫ్ అటార్నీ రాయించారని చెబుతుంది కావ్య . అయితే ఫోర్జరీ సంతకం రాజ్ చేసిన సంగతి గుర్తొచ్చి మనసులో నవ్వుకుంటుంది.
ఏప్రిల్ 26వ తేదీ 706వ ఎపిసోడ్‌లో ... కావ్య చెప్పిన పొడుపు కథ ఆధారంగా అడ్రస్ ఊహించి ఆమెకు ఫోన్ చేసి చెబుతాడు రాజ్. అది అబద్ధమని తెలియడంతో కావ్య నవ్వుకుంటుంది. యామిని- రాజ్‌ల పెళ్లికి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తూ బిజీగా ఉంటారు రఘునాథ్ , వైదేహి. ఇంతలో యామిని రావడంతో పెళ్లికి ముహూర్తం పెట్టించి, పనులు మొదలు పెట్టేశాం అల్లుడుగారికి ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతారు. ఆ కావ్యను తక్కువ అంచనా వేయడానికి లేదని జాగ్రత్తగా ఉండమని యామినిని హెచ్చరిస్తుంది వైదేహి.
దుగ్గిరాల కుటుంబంలో మళ్లీ జోష్ తీసుకురావాలని అనుకున్న అపర్ణ అందరితో కలిసి క్యారం బోర్డ్ ఆడుతుంది. మరోవైపు.. కావ్యను వెతుక్కుంటూ రాజ్ వస్తుండగా అతనికి ఆ దారి ఎప్పుడో వచ్చినట్లుగా అనిపించడంతో సరిగ్గా వచ్చి దుగ్గిరాల నిలయం ముందు ఆగుతాడు. రాజ్‌ని చూసి కావ్య, అపర్ణలు ఫ్యామిలీ మొత్తాన్ని మరో గదిలోకి తీసుకెళ్తారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











