Brahmamudi weekly roundup: ఇందూని మోసం చేసిన రాజ్.. రాజ్‌ని వెతుక్కుంటూ వచ్చిన పీఏ శృతి
Photo Courtesy: JioHotstar
ఇందూని 24 గంటల్లో తీసుకురాకపోతే నేను పోలీసులకు కంప్లయంట్ చేస్తానని అపర్ణ వార్నింగ్ ఇవ్వడంతో రేఖ షాక్ అవుతుంది. రాజ్‌తో ఇందూ క్లోజ్‌గా ఉండటం చూసి ఆమ తనింటికి కోడలిగా వస్తే బాగుంటుందని చలపతి- లక్ష్మీలు అనుకుంటారు. ఇందూ చేసిన వంటలు అందరికీ నచ్చుతాయి. సాహూ వచ్చి రాజ్ తల్లిదండ్రులతో కేక్ కట్ చేయిస్తాడు. రాజ్‌ని పక్కకి తీసుకెళ్లి 24 గంటల్లో డబ్బులు ఇవ్వకపోతే నీ ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో రేఖకి ఫోన్ చేసిన రాజ్ 24 గంటల్లో డబ్బులు ఇవ్వమని వార్నింగ్ ఇస్తాడు. తమ దగ్గర 20 లక్షలే ఉన్నాయని రేఖ చెప్పడంతో దానికి ఓకే చెబుతాడు రాజ్. ఇందూని గుడికి తీసుకెళ్లిన రాజ్, లక్కీలు ఆమెను వదిలేసి దూరంగా వచ్చేస్తారు. గుడిలో రేఖ ప్రత్యక్షమై తనను ఇంటికి తీసుకెళ్తుండటంతో ఇందూ షాక్ అవుతుంది. ఇందూ వెళ్లిపోతుండటంతో రాజ్ బాధపడతాడు. ఇందూని తీసుకొచ్చి రేఖ చేతుల్లో పెట్టి ఆస్తి నా పేరు మీద రాయాలని వార్నింగ్ ఇస్తుంది రేఖ. హాస్పిటల్‌లో రాజ్‌ని చూసిన రాజ్ పీఏ శృతి.. అతనిని ఫాలో అవుతూ వెళ్లి నిజం తెలుసుకుంటుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు .. 1017వ ఎపిసోడ్ నుంచి 1022వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 27వ తేదీ 1017వ ఎపిసోడ్‌లో ..
రాజ్ తల్లిదండ్రుల పెళ్లిరోజు ఫంక్షన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది ఇందూ. ఇంటి బయట ఉన్న నిమ్మకాయ చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. దాంతో షర్బత్ చేసి వెల్‌కమ్ డ్రింక్ కింద ఇచ్చేద్దామని అంటుంది. ఇందూ తెలివితేటలు చూసి అంతా షాక్ అవుతారు. పెళ్లి రోజు విందు గురించి చుట్టుపక్కల అందరినీ ఆహ్వానించడానికి రాజ్- ఇందూ, వెంకీ- నందూలు వెళ్తారు. చక్రీ మోసం చేశాడని.. మన నగల్నీ వాడి బాకీ కింద జమ చేసుకున్నాడని భూషణ్ చెప్పడంతో భ్రమరాంబ ఏడుస్తుంది. మనకి ఎక్కడా డబ్బులు దొరకడం లేదు. డబ్బులు వస్తేనే ఇందూ వస్తుంది, ఇందూ వస్తేనే మనకి డబ్బులు వస్తాయని భ్రమరాంబ చెబుతుంది. ఇంతలో అపర్ఱ వచ్చి.. కంపెనీ నుంచి నెల నెలా వస్తున్న డబ్బుని మీరేం చేస్తున్నారు? అని నిలదీస్తుంది. రెండ్రోజుల్లో నా మనవరాలిని క్షేమంగా తీసుకురాకపోతే.. మీడియాకు విషయం చెప్పి, పోలీస్ కంప్లయంట్ ఇస్తానని అపర్ణ వార్నింగ్ ఇవ్వడంతో రేఖ షాక్ అవుతుంది. రాజ్ తల్లిదండ్రుల ఫంక్షన్ కోసం దగ్గరుండి వంట చేస్తుంది ఇందూ.
ఏప్రిల్ 28వ తేదీ 1018వ ఎపిసోడ్‌లో..
రాజ్ ఇంట్లో ఇందూని, నందూని చూడటంతో లక్కీ షాక్ అవుతాడు. రాజ్‌ని పక్కకి పిలిచి దీని గురించి మాట్లాడతాడు. ఇందూని కిడ్నాప్ చేసినట్లు నందూకి తెలిస్తే మనిద్దరం జైళ్లో ఉంటామని భయపడతాడు. ఇంతలో నందూ వచ్చి.. మా అక్కని కిడ్నాప్ చేసింది మీరేనని నాకు తెలుసని చెప్పడంతో రాజ్- లక్కీలు షాక్ అవుతారు. మా అక్క మీతోనే ఉంటానని చెప్పడంతో ఈ విషయం వదిలేశానని లేదంటే జైళ్లో కూర్చోబెట్టే దాన్నని వార్నింగ్ ఇస్తుంది నందూ. రాజ్- ఇందూలు క్లోజ్‌గా ఉండటం చూసిన చలపతి- లక్ష్మీలు ఇందూ కోడలిగా వస్తే బాగుంటుందని అనుకుంటారు. ఇందూకి డ్రెస్ తీసుకొచ్చి ఇస్తాడు రాజ్.. అది చూసి ఆమె మురిసిపోతుంది. మా ఇంట్లో ఉన్న వస్తువులతో ఇన్ని వంటలు చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అని ఇందూని మెచ్చుకుంటాడు చలపతి. ఫంక్షన్‌కి వచ్చినవాళ్లు ఏర్పాట్లు బాగున్నాయని, మన బస్తీలో ఎవరూ ఇలా చేసుకోలేదని చెబుతారు.

Photo Courtesy: JioHotstar
ఏప్రిల్ 29వ తేదీ 1019వ ఎపిసోడ్‌లో..
రాజ్ తల్లిదండ్రుల కోసం ఇందూ చేసిన ఫంక్షన్ ఏర్పాట్లు గెస్ట్‌లందరికీ బాగా నచ్చుతాయి. ఇంతలో చలపతి- లక్ష్మీలు దండలు మార్చుకుని ఒకొరికకరు స్వీట్ తినిపించుకుంటారు. తమ పాతికేళ్ల ప్రయాణం గురించి చెబుతూ చలపతి, లక్ష్మీలు ఎమోషన్ అవుతారు. రాజ్.. తమ్ముడిని ప్రైవేట్ స్కూల్‌లో వేయమని చెప్పి తను మాత్రం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాడని చెబుతాడు చలపతి. వారి మాటలను విన్న ఇందూ కంటతడి పెడుతుంది. నాకు తల్లిదండ్రులు లేరు.. వీళ్లని చూస్తుంటే నాకు అమ్మానాన్నలు లేని లోటు తెలుస్తోందని చెబుతుంది. నీకే కాదు.. నాకు కూడా అమ్మానాన్నలు లేరని అంటుంది నందూ. ఇంతలో రాజ్ - ఇందూ, వెంకీ- నందూలు అందరికీ భోజనాలు వడ్డిస్తారు. ఎక్కడ చికెన్ లేకుండా పోతుందోనని ముందే రెండు కప్పులు దాచేస్తాడు లక్కీ. అది చూసిన ఇందూ లక్కీపై కోప్పడుతుంది.
ఏప్రిల్ 30వ తేదీ 1020వ ఎపిసోడ్‌లో..
రూపాయి ఖర్చు లేకుండా ఫంక్షన్ చాలా బాగా చేశావని ఇందూని మెచ్చుకుంటాడు చలపతి. ఇంతలో సాహూ అక్కడికి వచ్చి ఫంక్షన్‌లో ఒక్కటి మిస్ అయ్యిందని చెప్పి కేక్ తీసుకొచ్చి ఇస్తాడు. సాహూని చూడగానే రాజ్, లక్కీలు వణికిపోతారు. మీరిద్దరూ ఫంక్షన్‌లో కేక్ కట్ చేయకపోతే ఏదోలా ఉంటుందని సాహూ చెప్పడంతో చలపతి సంతోషించి కేక్ కట్ చేస్తుండగా అందులో విషం ఉందేమోనని భయపడి కేక్‌ను లాక్కోబోతాడు రాజ్. రాజ్‌ని పక్కకి తీసుకెళ్తాడు సాహూ. నీకు 24 గంటలు టైమ్ ఇస్తున్నా.. ఆ లోగా నా డబ్బు నాకు ఇవ్వకుంటే నీ ఫ్యామిలీని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో రాజ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వెంటనే రేఖకి ఫోన్ చేసి నా డబ్బులు నాకు అప్పగించకపోతే మీ అమ్మాయిని చంపేస్తానని డెడ్‌లైన్ పెడతాడు. దాంతో రేఖ ఆఫీసులో శాలరీలు ఆపేసి ఆ డబ్బుని తన సొంతానికి వాడుకుంటుంది. ఇదంతా చూసిన రాజ్ పీఏ శృతి.. గతంలో రాజ్- కావ్యలు ఉన్నప్పుడు ఆఫీసు ఎలా ఉండేది? ఉద్యోగస్తులను వారిద్దరూ ఎలా చూసుకునేవారో తలచుకుని ఏడుస్తుంది.

Photo Courtesy: JioHotstar
మే 1వ తేదీ 1021వ ఎపిసోడ్‌లో..
మధ్య తరగతి వాడికి అన్నీ కష్టాలేనని ఇందూకి పెద్ద క్లాస్ పీకుతాడు రాజ్. తన డబ్బులు తనకి కట్టాలని, 24 గంటలు మాత్రమే రాకేష్ టైం ఇవ్వడంతో ఐశ్వర్య వణికిపోతుంది. ముందు ఎంతోకొంతకి ఈ డీల్ క్లోజ్ చేయాలని అనుకుంటుంది. వెంటనే రేఖ దగ్గరికి వెళ్లి. మన దగ్గర ఉన్నది 20 లక్షల రూపాయలేనని చెప్పమని చెబుతుంది. భ్రమరాంబ కూడా అదే ఐడియా ఇవ్వడంతో రాజ్‌కి కాల్ చేసి తాము 20 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వగలమని, అంతకుమించి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేనని చెబుతుంది రేఖ. దాంతో రాజ్ మండిపడతాడు. మీకు చిల్లర మనుషుల్లా కనిపిస్తున్నామా? మేం అడిగిన డబ్బు ఇవ్వకపోతే మీ అమ్మాయిని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ వెంటనే రాజ్‌కి ఐశ్వర్య ఫోన్ చేసి.. 20 లక్షల రూపాయల డీల్‌కు ఒప్పుకోమని ఒత్తిడి చేస్తుంది. సాహూ వార్నింగ్, తన కుటుంబం గురించి ఆలోచించి రాజ్ కూడా ఆ డీల్‌కు ఒప్పుకుంటాడు. వెంటనే రేఖకి కాల్ చేసి 20 లక్షల రూపాయలు ఇస్తే వెంటనే ఇందూని మీకు అప్పగిస్తామని చెబుతాడు. ఇదంతా విన్న లక్కీ మండిపడతాడు. నాకు నా ఫ్యామిలీయే ముఖ్యం.. డబ్బులు సంగతి తర్వాత అని చెబుతాడు రాజ్. ఇందూని గుడికి తీసుకొచ్చిన రాజ్- లక్కీలు.. ఇందూని అక్కడే రేఖకి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు.
మే 2వ తేదీ 1022వ ఎపిసోడ్‌లో..
గుడిలో రేఖ కనిపించడంతో ఇందూ షాక్ అవుతుంది. ఆమెను తీసుకుని వెళ్తుండగా వెనుక నుంచి రాజ్ చూస్తూ బాధపడతాడు. డబ్బులు అందాయని లక్కీ చెప్పినా బాధగా కనిపిస్తాడు. నువ్వు ఇందూని ప్రేమించావా అని అడుగుతాడు లక్కీ. అలాంటిదేం లేదని అబద్ధం ఆడతాడు రాజ్. అనంతరం సాహూ డబ్బుని పంపేసి, మిగిలిన డబ్బును తీసుకుని ఆసుపత్రికి వెళ్తాడు. బెడ్ మీద ఒకావిడ పడుకుని ఉండటంతో ఆమెను ఎలాగైనా కాపాడమని డాక్టర్లను అడుగుతాడు రాజ్. ఇందూని తీసుకొచ్చి నట్టింటిలో పడేస్తుంది రేఖ. నువ్వు అడిగినట్లు నీ మనవరాలిని ప్రాణాలతో తీసుకొచ్చా.. నేను అడిగినట్లు నా ఆస్తి నాకు కావాలి, ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే ఊరుకోనని అపర్ఱకి వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఆసుపత్రిలో నుంచి వస్తున్న రాజ్ పీఏ శృతి.. రాజ్‌ను చూసి షాక్ అవుతుంది. వెంటనే అతనిని ఫాలో అవుతూ చలపతి ఇంటికి వస్తుంది. రాజ్ ఎవరు అని శృతి అడగ్గా.. మా పెద్దబ్బాయి అని చలపతి- లక్ష్మీలు చెబుతారు. మీరు అబద్ధం చెబుతున్నారు.. రాజ్ మా ఎండీకి మేనల్లుడు, దుగ్గిరాల కుటుంబానికి వారసుడు అని శృతి చెప్పడంతో చలపతి- లక్ష్మీలు షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications