Brahmamudi weekly roundup : నిజం తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ .. యామినితో కళావతి వార్, రుద్రాణి స్కెచ్

రాజ్ ఇంటి ముందు కనిపించడంతో అతనిని కిచెన్‌లోకి తీసుకెళ్తుంది కావ్య. రాజ్‌ వెళ్లే వరకు అప్పూ, అపర్ణలు ఇంట్లో వాళ్లని మేనేజ్ చేస్తారు. రాజ్ తెచ్చిన చీరను చూసి కావ్య మురిసిపోతుంది. మీరు గతం మరిచిపోయినా నా ఇష్టాయిష్టాలు మరిచిపోలేదని అనుకుంటుంది. రాజ్ బయటికి తీసుకొస్తుండగా గుమ్మం దగ్గర సుభాష్ ఎదురుకావడంతో ఆయనకి రాజ్‌ని రామ్‌గా పరిచయం చేస్తుంది కావ్య. మీ అందరికీ రాజ్ బతికే ఉన్నాడని తెలిసినా నాకు ఒక్కమాట కూడా చెప్పలేదని బాధపడతాడు సుభాష్. ఆయన గతం గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తే అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని అంటుంది కావ్య.

రాజ్‌ని ఒంటరిగా వదలకుండా తనతోనే ఉంచుకోవాలని అనుకున్న యామిని.. వెడ్డింగ్ కార్డ్స్ పంచుదామని అడగటంతో రాజ్ సరేనంటాడు. రాజ్‌కి గతం గుర్తొచ్చే పనులు చేయమని కావ్యకి చెబుతుంది అపర్ణ. దాంతో రాజ్‌కి ఫోన్ చేసి కలుద్దామని అడుగుతుంది కావ్య. యామినికి ఏదో సాకు చెప్పి కావ్యని రెస్టారెంట్‌లో కలుస్తాడు రాజ్. వీరిద్దరిని చూసిన యామిని.. కావ్యతో గొడవకి దిగుతుంది. రాజ్ ఎవరికి దక్కుతాడో చూసుకుందామని ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. కారులో వెళ్తున్న రాజ్‌ని చూసిన కళ్యాణ్ ఈ విషయాన్ని దుగ్గిరాల ఫ్యామిలీకి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆయనకి గతం గుర్తులేదని , తిరిగి మామూలు మనిషిని చేసి ఇంటికి తీసుకొస్తానని చెబుతుంది కావ్య.

రాజ్‌కి యామిని తన వెడ్డింగ్ కార్డ్ చూపించడంతో అతను షాక్ అవుతాడు. కళావతి మనసులో మాటని కనుక్కుని ఈ పెళ్లి ఆపేయాలని అనుకుంటాడు రాజ్. సందీప్ రిసార్ట్స్‌లో ఇచ్చే పార్టీకి రాజ్‌ని తీసుకెళ్లి గతం గుర్తుచేయాలని అనుకుంటుంది కావ్య. రాజ్ ఫోన్ చేసి నేను కూడా రిసార్ట్‌కి వస్తానని చెప్పడంతో సంబరపడిపోతుంది కావ్య. తనకు ఫ్రెండ్స్‌తో గెట్ టూ గెదర్ ఉందని రాజ్ లగేజ్‌తో కనిపించడంతో యామిని షాక్ అవుతుంది. మొగుడు కనిపించపోతే బాధపడాల్సిందిపోయి పార్టీలకు వెళ్లడమేంటని కావ్యపై మండిపడుతుంది రుద్రాణి. కావ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని చెప్పడంతో రాహుల్ రిసార్ట్ అడ్రస్ సంపాదిస్తాడు. కారులో రాజ్ - కావ్యలు రిసార్ట్‌కు బయల్దేరతారు.

బ్రహ్మముడి ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు.. 707 ఎపిసోడ్ నుంచి 712 వరకు ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 28వ తేదీ 707వ ఎపిసోడ్‌లో ... సడెన్‌గా ఇంటికి వచ్చిన రాజ్‌ని దుగ్గిరాల ఫ్యామిలీ చూడకుండా కిచెన్‌లోకి తీసుకెళ్తుంది కావ్య. ఆమె ఇచ్చిన జ్యూస్ దెబ్బకి కడుపులో తిప్పడంతో కావ్య నేరుగా తన బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్తుంది. రాజ్ వెళ్లకపోవడంతో ఇంట్లో వాళ్లని ఎలా మేనేజ్ చేయాలో తెలియక అప్పూ, అపర్ణలు టెన్షన్ పడుతుంటారు. పౌడర్ కోసం అపర్ణ గదిలోకి వచ్చిన ప్రకాశంతో చీరలు, నగలు గురించి గొడవ పడుతుంది ధాన్యలక్ష్మీ. తాను తీసుకొచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో చూసి చెప్పమని అంటాడు రాజ్. అందులో చీర ఉండటంతో కావ్య మురిసిపోతుంది. గుడికి వెళ్లిన మా వాళ్లు వచ్చే టైం అయ్యిందని, వాళ్లు వచ్చేసరికి మీరు ఇంట్లో ఉంటే బాగోదని రాజ్‌ని బయటికి తీసుకొస్తుంది కావ్య.

Brahmamudi Telugu Serial Weekly roundup April 28th to May 3rd episode Story

ఏప్రిల్ 29వ తేదీ 708వ ఎపిసోడ్‌లో ... కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాజ్‌ను చూడకుండా తలుపు వేసినప్పటికీ గుమ్మం దగ్గర సుభాష్ రావడంతో కావ్య ఉలిక్కిపడుతుంది. బతికే ఉన్న కొడుకుని చూసి సుభాష్ షాక్ అవుతాడు. రాజ్‌తో సుభాష్ ఏదో మాట్లాడబోతుండగా కావ్య జోక్యం చేసుకుని ఈయన రామ్ అని చెప్పి పరిచయం చేస్తుంది. గతం మరిచిపోవడంతో సుభాష్‌ని సార్ అని పిలుస్తాడు రాజ్. నా కొడుకు బతికే ఉన్నాడని మీ అందరికీ తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదని సుభాష్ బాధపడతాడు. ఆయన గతం మరిచిపోయారని, మీరు ఆయనతో మాట్లాడితే గతం గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తారని అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని కావ్య చెప్పడంతో సుభాష్ షాక్ అవుతాడు. రాజ్ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో జీపీఎస్ చెక్ చేయగా అతని కారు దుగ్గిరాల వారింట్లో ఉన్నట్లు తెలియడంతో యామిని టెన్షన్ పడుతుంది.

ఏప్రిల్ 30వ తేదీ 709వ ఎపిసోడ్‌లో ... కావ్యకి రాజ్ ఫోన్ చేసి చీర ఎలా ఉందని అడగ్గా.. చాలా బాగుందని చెబుతుంది. రాజ్ వచ్చి తనకు ముద్దు పెట్టినట్లుగా కావ్య కలగంటుంది. కిచెన్‌లో వంట చేస్తున్న కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి రాజ్‌కి గతం గుర్తొచ్చే పనులు చేయమని మండిపడుతుంది. రాజ్‌తో కలిసి పెళ్లి పత్రికలు పంచి తనని రోజంతా తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటుంది యామిని. రాజ్ ఒప్పుకుని ఆమెతో బయటికి వెళ్లబోతుండగా కావ్య ఫోన్ చేసి కలవాలని చెప్పడంతో యామినికి ఏదో సాకు చెప్పి కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. వాళ్లిద్దరిని రెస్టారెంట్‌లో చూసిన యామిని రగిలిపోతుంది. రాజ్ వెళ్లిపోయిన తర్వాత కావ్యని కలిసి నా బావని నాకు దూరం చేయాలని అనుకుంటున్నావా అంటూ గొడవకి దిగుతుంది యామిని. ఎవరు ఎవరిని లాక్కుంటున్నారని .. నువ్వేం చేసినా ఆయనని నన్ను విడదీయలేవని వార్నింగ్ ఇస్తుంది కావ్య. రాజ్ ఎవరికి దక్కుతాడో చూసుకుందామని కావ్య - యామినిలు సవాల్ చేసుకుంటారు.

Brahmamudi Telugu Serial Weekly roundup April 28th to May 3rd episode Story

మే 1వ తేదీ 710వ ఎపిసోడ్‌లో ... కళ్యాణ్ బైక్‌పై వెళ్తుండగా ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో అతను కిందపడిపోతాడు. చూసుకో తమ్ముడు నేను బ్రేక్ వేయడం ఆలస్యం అయ్యుంటే ఏమయ్యేదని కారులోంచి ఓ గొంతు వినపడటంతో కళ్యాణ్ సారీ చెబుతాడు. అద్దం వైపు చూడగా డ్రైవింగ్ సీట్‌లో రాజ్ కనిపించడంతో కళ్యాణ్ ఉలిక్కిపడతాడు. అన్నయ్యని పిలుస్తూ కారు వెంట పరిగెడుతుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపుతాడు. కళ్యాణ్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా డాక్యుమెంట్స్ చూపిస్తే కానీ వదలడు. రాజ్ మిస్ కావడంతో అన్నయ్య బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. వదిన ఇన్ని రోజుల నుంచి చెబుతున్నా మనం పట్టించుకోలేదని కళ్యాణ్ అంటాడు. రాజ్ బతికే ఉన్నాడని మాకెందుకు చెప్పలేదని ప్రకాశం, సీతారామయ్య, ఇందిర, ధాన్యలక్ష్మీలు బాధపడతారు. ఆయన గతం మరిచిపోయాడని నాకు కొంచెం టైం ఇస్తే ఆయనని ఇంటికి తీసుకొస్తానని చెబుతుంది కావ్య.

మే 2వ తేదీ 711వ ఎపిసోడ్‌లో ... మెట్ల దగ్గర కూర్చొని బాధపడుతున్న రాజ్ దగ్గరికి వచ్చిన యామిని.. అతనికి వెడ్డింగ్ కార్డ్ చూపిస్తుంది. అది చూసిన రాజ్ షాక్ అవుతాడు. కళావతి దగ్గర ఉన్నప్పుడు కలిగే ఆనందం యామిని దగ్గర తనకు దొరకడం లేదని బాధపడతాడు. ఎలాగైనా కళావతి మనసులో ఏముందో కనుక్కుని ఈ పెళ్లి ఆపేయాలని అనుకుంటాడు. అటు రాజ్‌కి గతం గుర్తొచ్చేలా చేయడానికి కావ్యని ప్లాన్ చేయమని సలహా ఇస్తుంది అపర్ణ. మా ఫ్రెండ్ సందీప్ వెడ్డింగ్ యానివర్సరీ వుందని దీనిని ఉపయోగించుకుని ఆయనకి గతం గుర్తొచ్చేలా చేస్తానని అంటుంది కావ్య. కళ్యాణ్ కూడా ఇందుకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఇంతలో రాజే కావ్యకి ఫోన్ చేయడంతో మా ఫ్రెండ్స్‌తో గెట్ టూ గెదర్ అవుతున్నానని చెప్పడంతో నేను కూడా వస్తానని అంటాడు రాజ్. ఉదయాన్నే వెడ్డింగ్ కార్డ్స్ పంచాలని యామిని అనుకుంటూ ఉండగా రాజ్ లగేజ్‌తో కనిపించడంతో ఆమె షాక్ అవుతుంది.

మే 3వ తేదీ 712వ ఎపిసోడ్‌లో ... రిసార్ట్‌కి బయల్దేరిన కావ్యని చూసి రుద్రాణి నానామాటలు అంటుంది. మొగుడు కనిపించకపోతే బాధపడాల్సింది పోయి పార్టీలు, ఫంక్షన్‌ల కోసం ఎవరైనా తిరుగుతారా అని మండిపడుతుంది. కావ్యనే ఫాలో అయి నిజం చెప్పమని అడుగుతుంది రుద్రాణి. ఇన్నాళ్లు వెస్ట్రన్ కావ్యని దాచేశానని నాలుగు రోజులు మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. దీని మీద నాకు అనుమానంగా ఉందని కావ్య ఎక్కడికి వెళ్తుందో కనుక్కోమని రాహుల్‌కి రుద్రాణి చెప్పడంతో రాహుల్ ఏదో ప్లాన్ వేసి రిసార్ట్ అడ్రస్ సంపాదిస్తాడు. కారులో కావ్య- రాజ్‌లు రిసార్ట్‌కు బయల్దేరతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X