Brahmamudi Weekly Roundup రాజ్ బిడ్డ తల్లి ఎవరో గుట్టు వీడింది.. కావ్య ప్లాన్ ఎలా వర్కవుట్ అయిందంటే?
బ్రహ్ముముడి సీరియల్‌లో అప్పు, కల్యాణ్, అనామిక మధ్య పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, అలాగే ఇంట్లో డాక్యుమెంట్లు దొంగిలించిన రాహుల్.. సేటు వద్ద తాకట్టు పెట్టడం లాంటి అంశాలు ట్విస్టులగా కొనసాగాయి. రుద్రాణి, కనకం ఎత్తుగడలు సీరియల్‌ను ఇంట్రెస్టింగా మార్చాయి. ఇక ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు, 396 ఎపిసోడ్ నుంచి 401 వరకు ఈ సీరియల్‌లో ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 29వ ఎపిసోడ్‌లో
అప్పును చెంప దెబ్బ కొట్టడంతో కల్యాణ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంట్లోకి వస్తారు. అప్పుతో కల్యాణ్ తిరుగుతున్నాడు. నాకు సవతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే నేను గృహ హింస కేసు పెట్టాను అని అనామిక అంటుంది. అయితే ఇంట్లో చిన్న సమస్య మేము రాజీ చేసుకొంటామని అని రాజ్ అంటే.. మీరు అరెస్ట్ చేయకపోతే.. పై ఆఫీసర్లను కలుస్తాను అని అనామిక బెదిరిస్తుంది. సారీ చెబితే కల్యాణ్‌ను క్షమిస్తాను అంటుంది. నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత నీకు సారీ చెప్తానని ఎలా అనుకుంటున్నావు, ఏం జరిగితే అదే జరుగుతుంది, నీతో కాపురం చేయటం కన్నా జైల్లో ఉండడమే బెటర్ అని పోలీసులతో పాటు స్టేషన్ కి కళ్యాణ్ వెళ్ళిపోతాడు

ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్‌లో
అప్పు మీద అనామిక కేసు పెట్టడంతో దుగ్గిరాల ఫ్యామిలీ దిగ్బ్రాంతికి గురి అవుతుంది. కేసు విషయంలో కల్యాణ్ బాధపడుతాడు. అనామిక పెట్టిన కేసులు చాలా చిన్నవి. ఆమెను ఒప్పిస్తే, కేసు వెనుకకు తీసుకోవచ్చు అని పోలీసులు సలహా ఇస్తారు. అయితే అనామికను ఒప్పించే ప్రయత్నం చేస్తానని రాజ్ అంటాడు. అప్పును కలువనీయకుండా కల్యాణ్‌ను కట్టడి చేయాలని అనామిక ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
రాజీ పడితే నా కూతురు తప్పు చేసిందని నేనే ఒప్పుకున్నట్లు అవుతుంది అంటుంది కనకం. దాంతో దుగ్గిరాల వారి ఇంటికి ఒక పరువు ఉంది ఇలా ఇంటి మీదకు వచ్చి రచ్చ చేస్తావేంటి అంటుంది రుద్రాణి. ఆవేశంలో ఉన్న కనకానికి నచ్చచెప్పాలని చూస్తారు చిట్టి, అపర్ణ. నాకు న్యాయం కావాలి అని భీష్ముంచుకొని కూర్చుంటుంది కనకం.

మే 1వ తేదీ ఎపిసోడ్‌లో
అనామిక కళ్యాణ్ మీద, అప్పు మీద కేసులు పెట్టి అరెస్టు చేయిస్తుంది. అప్పుని అరెస్టు చేయించినందుకు దుగ్గిరాల ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది కనకం. నా కూతురుకు న్యాయం జరగాలంటే కేసు ఉండాల్సిందేనని అంటుంది. అయితే కేసు ఉంటే న్యాయం జరగదు. నీ అల్లుడు జైల్లు ఉంటాడు అని కనకానికి కావ్య చెబుతుంది.
అయితే కేసు విత్ డ్రా చేయించేందుకు అనామికను ఒప్పించి పోలీస్ స్టేషన్‌కు రప్పిస్తారు. అయితే స్టేషన్‌లో కల్యాణ్, అప్పు కూర్చొని కాఫీ తాగుతుంటే చూసి.. ఇక్కడ కూడా రొమాన్స్ చేస్తున్నారా? అంటూ కోపంతో ఊగిపోతుంది. చివరకు కేసును ఆమె విత్ డ్రా చేసుకొంటుంది. అయితే రాజ్ మాదిరిగానే కల్యాణ్ కూడా బిడ్డను తీసుకొస్తాడేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది.
మే 2వ తేదీ ఎపిసోడ్‌లో
అప్పు, కల్యాణ్ కేసు వాపసు తీసుకోవడంతో ఇంటికి వచ్చారు. చెంపదెబ్బ కొట్టినందుకు కేసు పెట్టావా? మళ్లీ నీ రెండో చెంప స్వప్న వాయిస్తుంది. అప్పుడు కూడా వారిపై కేసు పెడుతావా? అంటూ అనామికను కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తారు. అయితే కావ్యతో రుద్రాణి మాట్లాడుతూ.. మీ అత్తగారు ఇంటి నుంచి గెంటివేస్తే.. బయటకు వెళ్లడానికి ఇల్లు వెతుక్కొండి సలహా ఇస్తుంది.
అయితే ఇంటి డాక్యుమెంట్ల వెతుకుతున్న కనిపించకపోవడంతో స్వప్న కంగారు పడిపోతుంది. అయితే డాక్యుమెంట్లు కనిపించలేదంటే.. సరిగా దాచిపెట్టావా? లేదా ఎక్కడైనా తాకట్టు పెట్టావా? అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. రాహుల్‌ను పిలిచి స్వప్నను ఇరికించడానికి ఇదే కరెక్ట్ సమయం అని రుద్రాణి చెబుతుంది.

ఇంటి డాక్యుమెంట్స్ మాయం కావడంతో స్వప్నకు అనుమానాలు వస్తాయి. తన తల్లికి ఫోన్ చేస్తే.. వస్తున్నానని కనకం అంటుంది. రావడానికి లేటు కావడంతో మళ్లీ కాల్ చేస్తుంది. దాంతో నేను నీ వెనుకనే ఉన్నాను అని చెప్పగానే.. స్వప్న తిరిగి చూస్తుంది. నేను కంగారు పడకు.. అమ్మవారి వేషంలో సేటు భరతం పడుతాను అంటూ లోపలికి వెళ్తుంది. సేటు మంచం మీదకి ఎక్కి వాడి త్రిశూలం పెట్టి స్వప్న ఆస్తి పత్రాల గురించి అడిగి బెదిరిస్తుంది. దాంతో రాహుల్ తెచ్చి ఇచ్చాడని సేట్ చెబుతాడు.
మే 4వ ఎపిసోడ్‌లో
ఇదిలా ఉండగా, ఫోనులో రాజ్ కంటాక్ట్‌లో ఉన్న నెంబర్ అడ్రస్ కనుక్కోమని స్వప్నకు చెబుతుంది. అయితే అడ్రస్‌తో పనేముంది అని అడుగుతుంది. ఆ అడ్రస్‌కు వెళ్తాను అంటే.. నేను నీ వెంట వస్తానని చెబుతుంది. అయితే కావ్య వద్దంటుంది. దాంతో కష్టాల్లో ఉంటే వదిలేస్తానా? నీతో నేను వస్తాను. అందుకే అడ్రస్ చెప్పడం లేదని స్వప్న అంటుంది.
పోలీసులను చూసి భయపడిన ఆ వ్యక్తి మాయ అనే ఒక ఆవిడ వాళ్ళ బాబుని రోజు రెండు గంటలు ఇక్కడ ఉంచుతుంది. ఆరోజు రాజ్ సార్ ఇక్కడికి వచ్చి ఆమెతో ఏదో మాట్లాడారు, నాకు అనుమానం వచ్చి వారు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాను అంటాడు


Click it and Unblock the Notifications










