Brahmamudi weekly roundup: రేఖ చేజారిన ఆస్తి.. లాస్ట్ మినిట్‌లో ఇందూ కిడ్నాప్, స్వరాజ్ సూపర్‌ ట్విస్ట్

Photo Courtesy: JioHotstar

రేఖకి భయపడి ఇందూ ఏడుస్తుండటంతో కావ్య జీవిత చరిత్ర ఉన్న పుస్తకాన్ని మనవరాలికిచ్చి చదవమని చెబుతుంది అపర్ణ. ఆ పుస్తకం చదవగానే తన తల్లి కావ్యే తనను నడిపించినట్లుగా భావిస్తుంది. ఉదయాన్నే ఇందూకి విషెస్ చెప్పి పార్టీకి రెడీ చేయిస్తుంది రేఖ. తనను కిడ్నాప్ చేయించమని స్వాతి సాయం తీసుకుంటుంది ఇందూ. అక్క కోసం మనుషుల్ని రెడీ చేస్తుంది స్వాతి. ఇందూ బర్త్ డే పార్టీ జరిగే ప్లేస్‌కి వెయిటర్స్‌లా స్వరాజ్- లక్కీలతో పాటు స్వాతి పంపిన వాళ్లు కూడా వస్తారు. రాజ్ ఎదురుపడటంతో అతని కళ్లు చూసి బాగా తెలిసిన కళ్లులా ఉన్నాయని టెన్షన్ పడుతుంది అపర్ణ. ఇందూతో సంతకం పెట్టించుకుండా ఆపడానికి సుభాష్ మీడియాకు ఫోన్ చేసి చెబుతాడు. ఇది తెలుసుకున్న రేఖ ముసలోళ్లని చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో ఇందూ సంతకం పెట్టడానికి ఒప్పుకుంటుంది. ఆస్తి మొత్తాన్ని రేఖ ఆంటీకి ఇచ్చేస్తున్నట్లుగా ఇందూ సంతకం పెట్టబోతుండగా స్వరాజ్- లక్కీలు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఇందూని కిడ్నాప్ చేసిన వాళ్ల కోసం రేఖ పోలీసులను పిలిపిస్తుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup April 6th to April 11th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు .. 999వ ఎపిసోడ్ నుంచి 1004వ తేదీ వరకు ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 6వ తేదీ 999వ ఎపిసోడ్‌లో ..
ఇందూకి దక్కాల్సిన ఆస్తి గురించి రేఖతో ఎన్నో ఏళ్లుగా యుద్ధం చేస్తున్నాం.. మనకోసం అది ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతోందని సుభాష్‌తో చెప్పుకుని బాధపడుతుంది అపర్ణ. ఈ సమయంలో తనకి తన తల్లి గురించి, ఆమె ధైర్యం గురించి తెలియాలని చెప్పి ... ఇన్నాళ్లూ కావ్య గురించి కళ్యాణ్ రాసిన పుస్తకాన్ని బయటకు తీసి సుభాష్‌కి చూపిస్తుంది. గతంలోకి వెళ్లిన సుభాష్.. కావ్య గురించి కళ్యాణ్ రాసిన పుస్తకం గురించి గుర్తుచేసుకుంటాడు. రుద్రాణి, రాహుల్‌ల ఫోటల వైపు చూస్తూ.. ఇన్నేళ్ల మీ కల, ఆశయం రేపు నెరవేరబోతోందని చెబుతుంది. అంతా బాగానే ఉంది కానీ ఆ ఇందూ సంతకం పెడుతుందా? అని భ్రమరాంబ అడుగుతుంది. అక్కడ ఉన్నది కావ్య కూతురే కానీ, కావ్య కాదు. ఆ ముసలోళ్లను చూసైనా ఇందూ సంతకం పెడుతుందని చెబుతుంది రేఖ. ఆస్తిని, తల్లిదండ్రుల ఆశయాల్ని ఎలా కాపాడాలా? అని బాధపుడుతున్న ఇందూకి కావ్య గురించి పుస్తకాన్ని ఇస్తుంది అపర్ణ. మీ అమ్మ వ్యక్తిత్వం, ఈ కుటుంబం కోసం చేసిన త్యాగాలు అన్నింటిని తెలుసుకోమని చెబుతుంది. రాత్రంతా అది చదువుతూ కూర్చొన్న ఇందూకి కావ్య ఆత్మ పక్కనే ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఏప్రిల్ 7వ తేదీ 1000వ ఎపిసోడ్‌లో..
నువ్వు నా రక్తం.. దేనికీ భయపడకూడదు, కాలం సహకరించే వరకు ఓపికగా ఎదురుచూస్తూ ఉండమని ఇందూకి ధైర్యం చెబుతుంది కావ్య ఆత్మ. అమ్మను తలచుకుంటూ అలాగే పడుకున్న ఇందూని ఉదయాన్నే రేఖ, భూషణ్, భ్రమరాంబలు నిద్రలేపి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. త్వరగా లేచి రెడీ అయితే పార్టీకి వెళ్దామని చెబుతుంది రేఖ. ఇదంతా చూసిన అపర్ణ మండిపడుతుంది. నేను ఇందూని హింసిస్తే రాక్షసి అంటున్నారు.. బాగా చూసుకుంటే నటన అంటున్నారని ఫైర్ అవుతుంది రేఖ. ఆ రేఖకి ఆస్తి ఇచ్చేస్తావా అని అపర్ణ అడగ్గా.. నా ప్లాన్ నాకుందని ధైర్యం చెబుతుంది ఇందూ. స్వాతిని పిలిచి నన్ను నేను కిడ్నాప్ చేసుకుంటాను, కొన్నిరోజులు ఎవరికీ కనిపించనని చెబుతుంది ఇందూ. ఇందుకు సాయం చేయమని అడగ్గా స్వాతి సరేనని అంటుంది. ఇందూని కిడ్నాప్ చేయడానికి స్వరాజ్- లక్కీలు వచ్చి ఐశ్వర్యను కలుస్తారు. ఇలా వెళితే మిమ్మల్ని ఎవరో ఒకరు గుర్తుపట్టేస్తారని చెప్పడంతో వెయిటర్స్‌గా గెటప్ మార్చుకుంటారు స్వరాజ్- లక్కీ. పార్టీకి వచ్చిన అప్పుల వాళ్లు.. మా అప్పు ఎప్పుడు తీరుస్తారని రేఖను నానామాటలు అంటూ ఉంటారు.

Brahmamudi Telugu Serial Weekly roundup April 6th to April 11th episode Story

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 8వ తేదీ 1001వ ఎపిసోడ్‌లో..
ఐశ్వర్యతో చేసుకున్న డీల్ మేరకు తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఇందూని కిడ్నాప్ చేయడానికి మారు వేషాల్లో వెయిటర్స్‌గా వెళ్తారు స్వరాజ్- లక్కీ. అదే ఈవెంట్‌కు నందూ ఫ్లవర్స్ డెకరేషన్ చేయడానికి వస్తుంది. ఇంతలో ఇందూ కారులోంచి దిగగా, అపర్ణ వచ్చి మండిపడుతుంది. అపర్ణని చూడగానే ఆమె తన నానమ్మ అని, ఇందూయే తన అక్క అని తెలుసుకుని ఎమోషనల్ అవుతుంది నందూ. నేను ఎవరనేది చెబితే ఆ రేఖ ఆంటీ నన్ను పోలీస్ అవ్వకుండా ఆపుతుందని ఆగిపోతుంది నందూ. ఇందూ అందాన్ని చూసి స్వరాజ్ మురిసిపోతాడు. తనను కిడ్నాప్ చేయడానికి ఎవరైనా మనుషుల్ని మాట్లాడావా? లేదా? అని స్వాతిని అడుగుతుంది ఇందూ. నేను మొత్తం రెడీ చేసి పెట్టా.. నిన్ను కాసేపట్లో కిడ్నాప్ చేస్తారని స్వాతి చెప్పడంతో ఇందూ సంతోషిస్తుంది. స్వాతి ఏర్పాటు చేసిన మనుషులకు, స్వరాజ్- లక్కీలకు గొడవ జరుగుతుంది. ఫంక్షన్ ఏర్పాట్లు చూడకుండా సుభాష్ దగ్గరికి వెళ్తున్న అపర్ణని నానామాటలు అంటుంది భ్రమరాంబ. ఇదంతా చూసిన నందూ రగిలిపోతుంది. ఆమె వెనకాలే వెళ్లి బెడ్‌రూంలో భ్రమరాంబను దుప్పటి ముసుగు వేసి చితకబాదుతుంది. దెబ్బలతో ఒళ్లంతా వాచిపోవడంతో ఏడుస్తున్న భ్రమరాంబ దగ్గరికి శేషం వచ్చి నవ్వుకుంటాడు.

ఏప్రిల్ 9వ తేదీ 1002వ ఎపిసోడ్‌లో..
రాజ్ లోపలికి వస్తుండగా అపర్ణ అడ్డు తగులుతుంది. అతని కళ్లు చూడగానే బాగా దగ్గరి నుంచి చూసిన ముఖంలా అనిపించడంతో మాస్క్ తీసి చూపించమని అడుగుతుంది. ఆ మాటలకు స్వరాజ్ కంగారుపడి భయంతో జారుకుంటాడు. ఇందూని చూసిన నందూ.. ఆమెను గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. నిన్ను చూస్తే మా అక్కలాగే ఉన్నావని నందూ.. నువ్వు నా చెల్లెలిలా ఉన్నావని ఇందూ చెప్పుకుంటారు. నాకు నా చెల్లెలంటే చాలా ఇష్టం.. అది చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, దానిని తలచుకోని రోజు లేదని బాధపడుతుంది ఇందూ. అయితే నన్ను నీ చెల్లెలు అనుకోమని చెబుతుంది నందూ. స్వాతి పంపించిన మనుషులు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలుపుతుండగా ఇందూ వచ్చి .. నన్ను ఎలా కిడ్నాప్ చేస్తారని ప్రశ్నిస్తుంది. వాళ్లు తమ ప్లాన్ చెప్పడంతో ఇందూ సంతోషిస్తుంది. ఇంతలో ఐశ్వర్య వచ్చి.. నువ్వు సంతకం పెట్టాక నీ ఆస్తి మొత్తం రేఖ ఆంటీకి వచ్చేస్తుంది. రేపటి నుంచి నీ జీవితం ఎలా ఉంటుందోనని సెటైర్లు వేస్తుంది. నేను సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నా.. పరిస్ధితులు అనుకూలించాలి కదా అని ఇందూ అనడంతో ఐశ్వర్య షాక్ అవుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup April 6th to April 11th episode Story

Photo Courtesy: JioHotstar

ఏప్రిల్ 10వ తేదీ 1003వ ఎపిసోడ్‌లో..
ఇందూ గారితో పెద్ద మనుషుల ముందు చేయించుకుంటే దానిని వీడియో తీసి ఆధారంలా పెట్టుకోమని రేఖకు లాయర్లు సలహా ఇస్తారు. అంత భయపడాల్సిన అవసరం లేదు, మా రేఖని ఎదిరించి ఇందూ బతకలేదని చెబుతుంది భ్రమరాంబ. ఇంతలో రేఖకి మీడియాకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీరు ఇందూగారితో బలవంతంగా ఆస్తి రాయించుకోబోతున్నారని, దానిని ఆపమని దుగ్గిరాల వారి నిలయం నుంచే ఫోన్ వచ్చిందని చెబుతాడు. దాంతో రేఖ షాక్ అవుతుంది. వెంటనే మీడియా వాళ్లెవరూ ఇటువైపు రాకుండా చేయమని చెబుతుంది రేఖ. అపర్ణ, సుభాష్‌ల దగ్గరికి వెళ్లిన రేఖ.. కోపంతో ఊగిపోతుంది. మనవరాలి చేతిలో ఆస్తిని పెట్టడానికి మీడియాకి నా మీద కంప్లయంట్ చేస్తావా అని సీరియస్ అవుతుంది. మీడియాకు ఫోన్ చేసింది నేను.. వాళ్లకు ఏం తెలియదని సుభాష్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేనంటే భయం పోయింది.. ఇంత తప్పు చేశాక మీరు బతకకూడదని రేఖ అంటుంది. దాంతో నేను సంతకం పెడతాను, మా నానమ్మ- తాతయ్యలని వదిలేయమని చెబుతుంది ఇందూ. కేక్ కట్ చేసిన ఇందూ.. దుగ్గిరాల కుటుంబానికి చెందిన ఆస్తి, కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్నీ రేఖ ఆంటీకి అప్పగిస్తున్నట్లు అందరి ముందు కీలక ప్రకటన చేస్తుంది. మనవరాలి నిర్ణయంతో సుభాష్, రేఖలు షాక్ అవుతారు

ఏప్రిల్ 11వ తేదీ 1004వ ఎపిసోడ్‌లో..
ఇందూతో కేక్ కట్ చేయించిన అనంతరం ఆస్తి పేపర్ల మీద వేలిముద్రలు వేయించుకుంటూ ఉండగా ఎలా కిడ్నాప్ చేయాలా? అని ఆలోచిస్తుంటాడు రాజ్. ఆ వెంటనే స్మోక్ బాంబు విసరగా.. లక్కీ గెస్ట్‌ల మొత్తానికి స్మోక్ వదులుతాడు. అందరూ మత్తులో పడిపోగానే ఇందూని తీసుకుని వెళ్లిపోతారు రాజ్- లక్కీ. ఇందూ బయటకు వెళ్లగానే లగేజ్ బ్యాగ్ తెచ్చుకోవడంతో వాళ్లిద్దరికీ ఏం అర్ధం కాదు. ఇందూకి మత్తు మందు ఇచ్చి తమ డెన్‌కి తీసుకెళ్తారు లక్కీ- స్వరాజ్. మత్తులోంచి లేచిన శేషం.. అందరూ పడిపోవడం చూసి ఒక్కొక్కరిని లేపుతాడు. ఇంతలో ఐశ్వర్య వచ్చి ఇందూని ఎవరో ఇద్దరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా చూశానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఐశ్వర్యకి రాజ్ ఫోన్ చేసి రేఖ నుంచి కోటి రూపాయలు కొట్టేస్తానని చెబుతాడు. ఇందూ కనిపించకపోవడంతో పోలీసులను ఇంటికి పిలిపించి ఎంక్వైరీ చేయిస్తుంది రేఖ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X