Brahmamudi weekly roundup: రాజ్‌ని చూసిన ప్రకాశం.. కావ్య ప్లాన్‌కు యామిని చిత్తు , రాజ్‌పై యామిని నిఘా
సీతారాముల కళ్యాణం కోసం గుడికి వెళ్తుంది దుగ్గిరాల కుటుంబం. రాజ్ లేకపోవడంతో భర్త ఫోటో పెట్టుకుని కళ్యాణం జరిపిస్తుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ ఉన్న గుడికే రాజ్ రావడాన్ని గమనించిన కావ్య షాక్ అవుతుంది. రాజ్‌ను ప్రకాశం చూడటంతో ఇంట్లో వాళ్లకి చెప్పాలని పరుగు పరుగు వస్తూ మరిచిపోతాడు . తన కుటుంబం రాజ్‌ను చూసినట్లుగా కలగన్న కావ్య ఉలిక్కిపడుతుంది. రాజ్‌ను ఎలాగైనా అక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటుంది.
కావ్యను, దుగ్గిరాల ఫ్యామిలీని చూసిన యామిని .. రాజ్‌ను తీసుకుని బయటికి వెళ్లిపోతుంది. కావ్యని కలిసేందుకు లోపలికి వచ్చిన రాజ్.. యామిని చూడకుండా కళావతిని తీసుకుని స్టోర్ రూమ్‌లోకి వెళ్తాడు. పూజారి ఆ గదికి తాళం వేయడంతో ఇద్దరూ సీతారాముల కళ్యాణం అక్కడే జరిపిస్తారు. రాజ్ కారుకి జీపీఎస్ పెట్టిన యామిని అతను స్వరాజ్ కంపెనీకి వెళ్లడంతో షాకై వెంటనే బయల్దేరుతుంది. కావ్యని కలిసిన రాజ్ తానెవరు? తన గతం ఏంటీ ? చెప్పమని అడుగుతాడు. తనను యామిని ఫాలో అవుతున్న విషయం తెలుసుకున్న రాజ్ మండిపడతాడు.

బ్రహ్మముడి ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు.. 689 ఎపిసోడ్ నుంచి 694 వరకు ఏం జరిగిందంటే?
ఏప్రల్ 7వ తేదీ 689వ ఎపిసోడ్‌లో ... తాను సీతారాముల కళ్యాణం చేయించాలని అనుకుంటున్నానని వెంటనే రెడీ అవ్వాల్సిందిగా దుగ్గిరాల ఫ్యామిలీలో చెబుతుంది కావ్య. గుడికి వెళితే, రాజ్ గురించి అడిగితే ఏం చెబుతావని రుద్రాణి ప్రశ్నించగా.. నేను చూసుకుంటానని అంటుంది కావ్య. ఆమె బలవంతం చేసేసరికి దుగ్గిరాల ఫ్యామిలీ గుడికి బయల్దేరుతుంది. రుద్రాణి చెప్పినట్లుగానే పంతులు గారు రాజ్ ఎక్కడ అని దుగ్గిరాల ఫ్యామిలీని అడుగుతారు. ఆయన ఓ కారణం వల్ల గుడికి రాలేదని.. రాజ్ గారు వచ్చాక ఇద్దరం కలిసి రాములవారి దర్శనం చేసుకుంటామని చెబుతుంది కావ్య. కాసేపటికీ యామిని కూడా రాజ్‌ని అదే గుడికి తీసుకొస్తుంది. పీటలపై కావ్య కూర్చోబోతుండగా ఇది దంపతులు చేయాలని రుద్రాణి ఆమెను అడ్డుకోవడంతో రాజ్ ఫోటో తీసుకుని వస్తుంది కావ్య.
ఏప్రిల్ 8వ తేదీ 690వ ఎపిసోడ్‌లో ... ఫోటోలతో పూజలు, వ్రతాలు చేయకూడదని రుద్రాణి చెప్పడంతో రామాయణంలో బంగారు సీతను పెట్టుకుని రాములవారు యాగాన్ని పూర్తి చేశారని గుర్తుచేస్తుంది కావ్య. కళావతికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలని అనుకుని ఆమెకు కాల్ చేస్తాడు రాజ్. తాను ముఖ్యమైన పనిలో ఉన్నానని తర్వాత చేస్తానని చెబుతుంది కావ్య. బయటి నుంచి వస్తూ రాజ్‌ను చూస్తాడు ప్రకాశం. ఈ విషయం వెంటనే అందరికీ చెప్పాలని వస్తూ ఓ వ్యక్తికి తగలడంతో అంతా మరిచిపోతాడు. ఇంతలో రుద్రాణికి రాజ్ కనిపించడంతో ఆమె మైక్ అందుకుని రాజ్‌ను చూశానని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. వెనక్కి తిరిగి చూడగానే రాజ్ కనిపించడంతో కుటుంబం మొత్తం రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఆ వెంటనే మీరంతా ఎవరని ప్రశ్నిస్తాడు రాజ్.
ఏప్రిల్ 9వ తేదీ 691వ ఎపిసోడ్‌లో ... దుగ్గిరాల ఫ్యామిలీ ఎక్కడ రాజ్‌ను తన నుంచి దూరం చేస్తుందోనని భయపడ్డ యామిని వాళ్లతో గొడవ పడుతుంది. ఇతను రాజ్ కాదు నా బావ రామ్ అని చెబుతుంది. కావ్య మౌనంగా ఉండటం చూసిన అపర్ణ.. నీ భర్తని చూసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నావని నిలదీస్తుంది. ఆయన రామ్ కాదు రాజ్ అని , నా భర్త గతం మరిచిపోయాడని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతాడు. ఆయనకు గతం గుర్తుచేయాలని చూస్తే బ్రెయిన్‌పై ప్రెజర్ పడి ఆయన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పిన విషయాన్ని కావ్య అందరికీ చెబుతుంది. యామిని కుటుంబం, దుగ్గిరాల కుటుంబం రాజ్ కోసం గొడవ పడుతుండగా రాజ్ స్పృహ తప్పిపడిపోతాడు. ఆ వెంటనే కావ్య ఉలిక్కిపడి లేచి ఇదంతా కల అని .. ఇలా జరగకూడదని యామినిని రెచ్చగొట్టి రాజ్‌ను ఇక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటుంది.
ఏప్రిల్ 10వ తేదీ 692వ ఎపిసోడ్‌లో ... కావ్యతో సహా దుగ్గిరాల ఫ్యామిలనీ చూసిన యామిని ఎలాగైనా రాజ్‌ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలని అనుకుంటుంది. అత్తాపూర్‌లో వేరే గుడిలో రాములవారి కళ్యాణం జరుగుతుందని.. అక్కడైతే మొదటి వరుసలో కూర్చోవచ్చని రాజ్‌తో చెప్పి బలవంతంగా తీసుకెళ్తుంది యామిని. యామిని, ఆమె తల్లిదండ్రుల పోరు తట్టుకోలేక ఇష్టం లేకపోయినా వెళ్లిపోతాడు. అయితే రుద్రాణి బయటే ఉండటంతో భయపడిన కావ్య.. రాజ్ కోసం వెతుకుతుంది. రాజ్ కూడా కావ్యని కలవాలని అనుకుని మళ్లీ గుడిలోకి వస్తాడు. ఇంతలో యామిని రావడంతో కావ్యని తీసుకుని స్టోర్ రూమ్‌లోకి వెళ్తాడు రాజ్. ఇంతలో పూజారి ఆ గదికి తాళం వేయడంతో ఇద్దరూ ఇరుక్కుపోతారు. కావ్యతో ఆ గదిలోనే సీతారాముల కళ్యాణం చేయిస్తాడు రాజ్.

ఏప్రిల్ 11వ తేదీ 693వ ఎపిసోడ్‌లో ... ఉదయాన్నే కావ్య వచ్చి ఆఫీసుకి వెళ్తున్నానని , తాతయ్య గారికి వేయాల్సిన టాబ్లెట్స్‌ను ఇందిరకి ఇస్తుంది. దొంగచాటుగా కాకుండా ఫాలో అవ్వక్కర్లేదని, నా కారులోనే ఆఫీసుకి తీసుకెళ్తానని రుద్రాణితో అంటుంది కావ్య. కళావతిని కలవాలని ఉదయాన్నే రెడీ అయి బయల్దేరతాడు రాజ్. యామినిని కూడా తీసుకెళ్లమని వైదేహి రాజ్‌తో చెప్పగా బావని ఒంటరిగానే వెళ్లనివ్వమని అంటుంది యామిని. అల్లుడుగారిని అలా వదిలేశావ్ నిన్ను చూస్తే షాక్‌గా ఉందని యామినిని తల్లిదండ్రులు అంటారు. కారులో జీపీఎస్ పెట్టానని రామ్ ఎక్కడికి వెళ్తున్నాడో నా ఫోన్‌లో తెలుసుకుంటానని చెబుతుంది యామిని. రాజ్ కారు దుగ్గిరాల వారి కంపెనీ దగ్గరికి వెళ్లినట్లుగా లోకేషన్ చూపించడంతో యామిని షాక్ అవుతుంది. రాజ్ ఆఫీసులోకి రావడాన్ని సీసీ కెమెరాలో చూసిన కావ్య అతనిని దూరంగా తీసుకెళ్తుంది.
ఏప్రిల్ 12వ తేదీ 694వ ఎపిసోడ్‌లో ... ఎందుకు నన్ను కలవాలని అనుకున్నారు? ఏమైనా మాట్లాడాలా? అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. మిమ్మల్ని ఎక్కడో చూశానని, నాకు గతం గుర్తులేదని, మీరు నాకు ఏమవుతారో చెప్పమని అడుగుతాడు రాజ్. భర్త మాటలకు సమాధానం చెప్పలేక కన్నీటితో అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య. రాజ్‌ను వెతుక్కుంటూ స్వరాజ్ గ్రూప్ కంపెనీ దగ్గరికి వస్తుంది యామిని. రాజ్ కారు బయటే ఉండటంతో లోపలికి వెళ్లాడని అనుకుని బయటికి తీసుకురావాలని అనుకుంటుంది.
ఆఫీసులో శృతితో మాట్లాడుతుండగా యామిని కారు చూసిన రాజ్, ఆమెకు ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్ కోసం వెళ్తుండగా నీ కారు కనిపించడంతో ఆగానని అబద్ధం చెబుతుంది యామిని. అపర్ణ పుట్టినరోజు చేయాలని ఇంట్లో వాళ్లు అనుకుంటుండగా రాజ్ లేనప్పుడు అలాంటివి కరెక్ట్ కాదని అంటుంది రుద్రాణి. భోజనం కూడా చేయకుండా వెళ్లిపోయిన అపర్ణని చూసి బాధపడుతుంది అప్పూ. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










