Brahmamudi Weekly Roundup నేను వేసిన బ్రహ్మముడిని తెంపేసి వెళ్లిపో.. కావ్యకు రాజ్ షాక్!

మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు, హమీదా ఖాతూన్ తదితరులు నటించిన బ్రహ్మముడి సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్నది. ఈ టెలివిజన్ సీరియల్‌లో రాజ్ తన ఇంటికి ఓ బిడ్డను తేవడం భారీ ట్విస్టుకు తెర తీసింది. బిడ్డ కారణంగా కంపెనీ ఎండీ పదవికి రాజీనామా చేయడం.. ఆ బాధ్యతలను కల్యాణ్‌కు అప్పగించడంతో సీరియల్ మరో మలుపు తిరిగింది. గతవారం అంటే.. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ సిరియల్‌లో ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్‌లో:ఇంట్లోకి ఓ బిడ్డను రాజ్ తీసుకురావడం సుమిత్ర ఫ్యామిలీలో కలకలం రేగుతుంది. అయితే ఆ బిడ్డకు వారసత్వం లభించదు అనే వాదన తెరపైకి రావడంతో తాను ఎండీగా వ్యవహరిస్తున్న కంపెనీకి రాజీనామా చేసి కల్యాణ్‌కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకొంటాడు. కల్యాణ్ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ, చెక్ పవర్ రాస్తాడు. అయితే ఆస్తి మొత్తం రాసిచ్చినా అభ్యంతరం లేదు కానీ ఆ పదవిలో రాజ్ మాత్రమే ఉండాలనే అభిప్రాయం ఫ్యామిలీలో కొందరి నుంచి వస్తుంది.

Brahmamudi Telugu Serial Weekly Roundup April 8th to April 13th episode Story

ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్‌లో:రాజ్ తన పదవికి రాజీనామా చేసి ఆ పేపర్లను కల్యాణ్‌కు ఇస్తాడు. బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. ప్రత్యర్థులు ఎప్పుడూ మన కంపెనీని దెబ్బ తీసేందుకు రెడీగా ఉంటారు. కాబట్టి ఎల్లప్పడూ అప్రమత్తంగా ఉండాలి అంటూ తన సోదరుడికి వ్యాపార టిప్స్ రాజ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే రాజ్ వదలిన పదవికి నేను అర్హుడిని కాదు. ఆ సీటులో కూర్చొనే అర్హత నాకు లేదు అంటూ పక్కనే మరో సీటు వేసుకొని కల్యాణ్ కూర్చొంటాడు.

ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్‌లో:రాజ్ రాజీనామా చేయడంతో ఇంటిలో ఆ పదవికి పోటీ పెరుగుతుంది. కల్యాణ్, రాహుల్‌కు సపోర్ట్ ఇస్తూ కుటుంబం రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తుంది.అయితే రాజ్ తీసుకొచ్చిన బిడ్డ.. తన చిన్ననాటి స్నేహితురాలు వెన్నెలకు పుట్టిన వాడేనా? అనే అనుమానం కావ్యలో పెరుగుతుంది. వెన్నెల ఆచూకీ గురించి ఆరా తీస్తుంటుంది.

ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్‌లో:బిడ్డను తీసుకు రావడం, కంపెనీ ఎండీ పదవికి రాజీనామా చేయడంపై రాజ్ తీసుకొన్న నిర్ణయంపై కుటుంబ సభ్యుల మధ్య చర్చ భారీగానే జరుగుతుంది. అయితే తాను ఇంత చేసినా భార్య కావ్య తనపై ఇంకా ప్రేమ చూపించడంపై రాజ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. నాకు దూరంగా వెళ్లిపో.. నేను మంచి వాడిని కాదు. నేను వేసిన బ్రహ్మముడిని విప్పుకొని వెళ్లిపో అని రాజ్ సలహా ఇస్తాడు. అయితే వెళ్తాను కానీ.. ఇలా కాదు. ఆ బిడ్డకు తల్లి ఎవరనే విషయం తెలిసిన తర్వాతే వెళ్తాను అంటూ కావ్య అంటుంది.

Brahmamudi Telugu Serial Weekly Roundup April 8th to April 13th episode Story

ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్‌లో:వెన్నెలను కలువడానికి ప్రయత్నాలు చేస్తున్న కావ్య.. ఓ ప్లాన్ వేస్తుంది. రాజ్ టెన్త్ క్లాస్ రీ యూనియన్‌కు ప్లాన్ చేస్తుంది. అయితే తాను ఆ రీ యూనియన్‌కు వెళ్లవద్దని రాజ్ అంటే.. ఆయన స్నేహితులందరితో కాల్స్ చేయించి అతడిని ఒప్పించేలా చేస్తారు. అయితే వేరే బిడ్డను తీసుకొస్తే ప్రశ్నించాల్సింది పోయి.. ఆ బిడ్డకు సేవలు చేస్తుందా అంటూ కావ్యపై ధాన్యలక్ష్మీ కోపగించుకొంటుంది.

ఏప్రిల్ 13వ తేదీ ఎపిసోడ్‌లో:టెంన్త్ క్లాస్ రీయూనియన్ పార్టీకి కావ్యను ఆహ్వానించాలని రాజ్ ప్లాన్ చేస్తాడు. అందరూ భార్యలతో వస్తున్నారు. నీవు కూడా రావాలని రాజ్ అంటే.. నేను ఏ హోదాలో రావాలి? మొదటి భార్యగానా? రెండో భార్యగానా? అని ప్రశ్నిస్తుంది. చివరకు వాదనలు జరిగిన తర్వాత పార్టీకి రావడానికి ఒప్పుకొంటుంది. అత్తా, ఇతర సభ్యులతో కావ్య మాట్లాడుతూ.. నన్ను వదలించుకోవడానికి బిడ్డను తెచ్చాడా? లేదా ఆ బిడ్డ వెన్నెలకు పుట్టిన బిడ్డేనా అని తేలితే.. నేను ఈ ఇంటికి రావడం ఇదే చివరి రోజు అని కావ్య చెబుతుంది.

More from Filmibeat

Read more about: brahmamudi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X