Brahmamudi Weekly Roundup: ధాన్య లక్ష్మీ నిర్ణయానికి షాకైన కుటుంబ సభ్యులు.. రోడ్డుమీద బొమ్మల అమ్ముకుంటున్న కళ్

అందరినీ వదిలి అప్పు ని తీసుకొని వెళ్ళిపోతాడు కళ్యాణ్. నువ్వు పిలిస్తే కళ్యాణ్ వస్తాడు పిలువు అని భార్యతో చెప్తాడు రాజ్ కానీ ఆమె పిలవటానికి అంగీకరించదు. రాజ్ ఫోన్ చేసి కళ్యాణ్ ని పిలిస్తే తనని ఇంకెప్పుడూ పిలిచి ఇబ్బంది పెట్టొద్దు అంటాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మి ముందు కొడుకు మాత్రమే కావాలి అప్పు వద్దు అంటుంది. కానీ రుద్రాణి సలహా మీద అప్పుని కూడా ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటుంది. మరోవైపు కావ్య కళ్యాణ్ వాళ్ళకి తను ప్రమేయం ఉందని తెలియకుండా వాళ్ళ యోగక్షేమాలు చూస్తుంది. ధాన్యలక్ష్మి చెప్పటంతో రాజ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి పిలుస్తాడు కానీ అతని కోరిక తిరస్కరిస్తాడు కళ్యాణ్. తన కొడుకు కష్టపడుతున్నాడని, రాజ్ భోగాలు అనుభవిస్తున్నాడని ఇంట్లో గొడవ పెట్టుకుంటుంది ధాన్యలక్ష్మి.

ఆగస్టు 12 వ తేదీ నుంచి ఆగష్టు 17వ తేదీ వరకు.. 486 ఎపిసోడ్ నుంచి 491 వరకు ఏం జరిగిందంటే?

ఆగస్టు 12 వ తేదీ 486 ఎపిసోడ్‌లో అలిగిన భర్తకి అబద్ధం చెప్పి భోజనం తినిపిస్తుంది కావ్య. అది చూసి కోడల్ని మెచ్చుకుంటుంది అపర్ణ. కళ్యాణ్ ని పిలవడానికి భార్య ఇష్టపడటం లేదని ఆమెని తిట్టుకుంటాడు రాజ్. ఆ మాటలు విన్న కావ్య నేను పిలిస్తే ఇంట్లో వాళ్ళందరూ మా ముగ్గురు అక్క చెల్లెళ్లని కలిపి ఆడుకుంటారు అంటుంది. నేనే ఫోన్ చేసి పిలుస్తాను అంటూ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తాడు రాజ్. కానీ కళ్యాణ్ రావడానికి ఒప్పుకోడు, సరి కదా మళ్ళీ ఫోన్ చేసి తనని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్తాడు. తర్వాత చలిలో పడుకున్న అప్పు ఫ్రెండ్స్ ని చూసి మనం ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం లేదంటే వాళ్ళు ఇబ్బంది పడతారు అని అప్పుతో చెప్తాడు కళ్యాణ్.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 12th to August 17th episode Story

ఆగస్టు 13 వ తేదీ 487 ఎపిసోడ్‌లో అప్పు ఫ్రెండ్స్ కి వేరే రూమ్ దొరికిందని అబద్ధం చెప్పి రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు కళ్యాణ్ దంపతులు. మరోవైపు నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడనే బాధ, తిరిగి తీసుకురావాలని ఆలోచన ఎవరికీ లేదు అని ఇంట్లో గొడవ పెడుతుంది ధాన్యలక్ష్మి. నేను వెళ్లి తీసుకు వస్తాను అంటాడు రాజ్. నాకు అప్పు వద్దు నేను తనని కోడలుగా ఒప్పుకోను కళ్యాణ్ మాత్రమే తీసుకురా, కావాలంటే అప్పు కి కావలసినంత డబ్బు ఇచ్చేద్దాం అంటుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలకి భార్యపై కోప్పడతాడు ప్రకాష్. మరోవైపు కళ్యాణ్ ని పిలవమంటే పిలవలేదని భార్యతో గొడవపడతాడు రాజ్. మీ పిన్ని తనని కోడలుగా ఒప్పుకోరు, అయినా అప్పు నాలాగా సర్దుకుపోయే రకం కాదు అని చెప్తుంది కావ్య.

ఆగస్ట్ 14 వ తేదీ 488 ఎపిసోడ్ లో అప్పు వాళ్ల కి తెలియకుండా బంటి ద్వారా బంటి రూమ్ లోనే ఉండే ఏర్పాట్లు చేస్తుంది కావ్య. దేవుడికి దండం పెట్టుకుంటూ కవి గారు బయట ఉంటేనే స్వశక్తితో ఎదుగుతారు, భార్యని పోషించుకోవడానికైనా బ్రతుకు తెరువు చూసుకుంటారు. దానికి నీ ఆశీస్సులు తోడవ్వాలి అని భగవంతుడిని ప్రార్థిస్తుంది కావ్య. మరోవైపు ధాన్య లక్ష్మీ దగ్గరికి వచ్చిన రుద్రాణి నువ్వు కొడుకుతో పాటు కోడల్ని కూడా ఇంట్లోకి రావడానికి ఒప్పుకో, తర్వాత అప్పుని ఇంట్లోంచి పంపించేయటానికి నీకు నేను తోడుగా ఉంటాను అని సలహా ఇస్తుంది. ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్ళతో కళ్యాణ్ తో పాటు అప్పుని కూడా ఇంట్లోకి తీసుకురావడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి రాజ్ తో కళ్యాణ్ వాళ్ళని తీసుకురమ్మని చెప్తుంది. ఆమె నిర్ణయాన్ని ఇంట్లో వాళ్ళందరూ అనుమానిస్తారు. కానీ రాజ్ ఏదైతేనేం, పిన్ని ఒప్పుకుంది కదా వెళ్లి తీసుకువద్దాం రా అని భార్యని పిలుస్తాడు. కానీ ఆమె ఒప్పుకోదు.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 12th to August 17th episode Story

ఆగష్టు 15వ తేదీ 489 ఎపిసోడ్ లో తనతో పాటు రానంటున్న భార్యని కోప్పడతాడు రాజ్. తనని ఎందుకు ఇబ్బంది పెడతావు, నువ్వు ఒక్కడివే వెళ్లి కళ్యాణ్ వాళ్ళని తీసుకురా అని చెప్తుంది అపర్ణ. సరే అని బయలుదేరుతాడు రాజ్. మరోవైపు బంటి రూం కి వచ్చిన అప్పు దంపతులు ఆ రూమ్ క్లీన్ గా లేకపోవడం చూసి ఇద్దరూ కలిసి క్లీన్ చేసుకుంటారు. అప్పుడే అప్పు ఫ్రెండ్స్ పెళ్లి గిఫ్ట్ అంటూ చాలా సామాన్లు తీసుకువస్తారు. అప్పుడే రాజ్ కూడా అక్కడికి వచ్చి పిన్ని ఒప్పుకుంది పదండి మన ఇంటికి వెళ్దాం అని కళ్యాణ్ దంపతులతో చెప్తాడు. ఆ ఇంట్లో ఇష్టం లేని కోడళ్ళు సుఖపడరు, వదిన ఇన్నాళ్లు ఎంత కష్టపడిందో నాకు తెలుసు అప్పు ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అని ఇంటికి రావడానికి ఒప్పుకోడు కళ్యాణ్.

ఆగస్టు 16 వ తేదీ 490 ఎపిసోడ్‌లో ఒంటరిగా ఇంటికి వచ్చిన రాజ్ ని కళ్యాణ్ వాళ్ళు వేరే అని అడుగుతారు ధాన్యలక్ష్మి దంపతులు. నువ్వు పిలిచావంటే కళ్యాణ్ నమ్మడం లేదు అని ధాన్యలక్ష్మితో అంటాడు రాజ్. అసలు వాడికి ఏమైంది అని బాధపడతాడు ప్రకాష్. సంసారంలో మరో మనిషి జోక్యం చేసుకుంటే ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో వాడికి తెలిసి వచ్చింది అంటుంది ఇందిరాదేవి. నా కొడుకుని నా నుంచి దూరం చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడరు అని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. తర్వాత నీ కొడుకు ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడో చూపిస్తాను అని ధాన్యలక్ష్మిని తనతో తీసుకువెళుతుంది రుద్రాణి అప్పుడే కళ్యాణ్ రోడ్డు మీద వేరే వ్యక్తికి సాయం చేయడం కోసం బొమ్మలు అమ్ముతూ కనిపిస్తాడు. అది చూసి బాధపడుతున్న ధాన్యలక్ష్మితో ఇప్పుడు వెళ్లి ఇంట్లో వాళ్ళని నిలదీయు అని రెచ్చగొడుతుంది రుద్రాణి. మరోవైపు రాజ్ భార్యపై కోప్పడుతూ నువ్వు కళ్యాణి పిలవడానికి ఇష్టపడకపోయినా నేను వాళ్లకు చేయవలసిన సాయం చేస్తాను అంటాడు రాజ్.అలా అయితే కవిగారి గొప్పతనం ఏముంటుంది, ఆయన స్వయంగానే ఎదగాలి అనుకుంటుంది కావ్య.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 12th to August 17th episode Story

ఆగస్టు 17 వ తేదీ 491 ఎపిసోడ్‌లో రోడ్డుమీద తన కవితల పుస్తకం చూసి కొనుక్కోవాలి అనుకుంటాడు కళ్యాణ్. కానీ డబ్బులు లేకపోవడంతో ఆగిపోతాడు. అయితే షాపతను కళ్యాణ్ కి ఆ పుస్తకం ఇచ్చి అతడిని ఎంకరేజ్ చేసి పంపిస్తాడు. మరోవైపు ఇంటికి వచ్చిన ధాన్యలక్ష్మి నా కొడుకు కష్టాలు పడుతుంటే ఇక్కడ రాజ్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు అంటూ ఆస్తిని ముక్కలు చేయమని చెప్తుంది. ఈ వయసులో ఇదేం బుద్ధి అంటూ ఇంట్లో వాళ్ళు మందలిస్తారు. ఇదంతా మా అత్త ట్రైనింగు అంటుంది స్వప్న. నేను బ్రతికుండగా ఇంట్లో ఇలాంటి ముసలం చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఆస్తి అనుభవించడానికి తప్ప అమ్ముకోటానికి వీల్లేదు, ఒక తల్లిగా నీ బాధని అర్థం చేసుకున్నాను కాబట్టి కళ్యాణ్ ఇంటికి వచ్చేవరకు రాజ్ కంపెనీ వ్యవహారాల నుంచి తప్పకుండాడు అంటాడు సీతారామయ్య. కానీ తాతగారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది కావ్య. అందుకు కావ్య పై ఫైర్ అవుతాడు రాజ్.తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X