Brahmamudi Weekly Roundup: రాజ్ నాటకం కనిపెట్టిన కళ్యాణ్.. కావ్య ని చూసి మారిపోయానంటున్న స్వప్న!

రాజ్ కంపెనీకి వెళ్ళకూడదు అన్న సీతారామయ్య నిర్ణయాన్ని తప్పుపడుతుంది కావ్య. కోరిక మేరకు కంపెనీ బాధ్యతలు రాహుల్ కి అప్పగిస్తాను అంటాడు సీతారామయ్య. భార్యకి డబ్బు పిచ్చి పట్టుకుందని అందుకే తన తమ్ముడిని ఇంటికి పిలవడం లేదని కోప్పడతాడు అందుకు తను చేష్టలతో సరియైన సమాధానం చెబుతుంది కావ్య. తమ్ముడు ఇంటికి రావడం లేదని బాధపడుతున్న రాజ్ కి ఒక రోజు కోసం కళ్యాణ్ వాళ్ళని నేను రప్పిస్తాను అతడిని శాశ్వతంగా ఇంట్లో ఉంచే బాధ్యత నీదే అని చెప్తుంది ఇందిరా దేవి. వరలక్ష్మీ వ్రతం గురించి ఇంట్లో అందరికీ చెప్పి కళ్యాణ్ వాళ్ళని స్వయంగా ఆహ్వానిస్తారు సీతారామయ్య దంపతులు. అవమానం జరుగుతుందని తెలిసిన పెద్దవాళ్ల మాట కొట్టేయలేక ఇంటికి వస్తారు కళ్యాణ్ దంపతులు. ఇంటికి వచ్చిన అప్పు ని గుమ్మంలో నుంచే అవమానించడం ప్రారంభిస్తుంది ధాన్యలక్ష్మి.

ఆగస్టు 19 వ తేదీ నుంచి ఆగష్టు 24వ తేదీ వరకు.. 492 ఎపిసోడ్ నుంచి 497 వరకు ఏం జరిగిందంటే?

ఆగస్టు 19 వ తేదీ 492 ఎపిసోడ్‌లో సీతారామయ్య తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతుంది కావ్య. ఆమెని సపోర్ట్ చేస్తుంది ఇందిరా దేవి.రుద్రాణి కోరిక మేరకు రాహుల్ కి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తాడు సీతారామయ్య. మరోవైపు కళ్యాణ్ కి గతంలో ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు మంచి కథలు రాస్తే పబ్లిష్ చేస్తానని చెప్తాడు ఒక పబ్లిషర్. సీతారామయ్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వటమే కాకుండా కుటుంబం ముక్కలైపోకుండా చూసుకునే బాధ్యతని కూడా తీసుకుంటుంది ఇందిరాదేవి. మరోవైపు సీతారామయ్య నిర్ణయాన్ని తప్పు పట్టినందుకు భార్యపై కోప్పడతాడు రాజ్. అంతేకాకుండా నీకు ఆస్తి మీద ఆశ పెరిగినట్లుంది అంటూ ఆమె చిన్నబుచ్చుకునేలా మాట్లాడుతాడు రాజ్. మరోవైపు పబ్లిషర్ చెప్పిన విషయం అప్పుకి చెప్తాడు కళ్యాణ్. నువ్వు ఏ పనైనా చేయగలవు, చెయ్యు అంటూ భర్తని ఎంకరేజ్ చేస్తుంది అప్పు.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 19th to August 24th episode Story

ఆగస్టు 20 వ తేదీ 493 ఎపిసోడ్‌లో అప్పు చేసిన వంట గురించి కాసేపు మాట్లాడుకుని తర్వాత పబ్లిషరీ ఇచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో ప్లాన్ చేసుకుంటారు కళ్యాణ్ దంపతులు. మరోవైపు అప్పు కోసం బాధపడుతున్న కనకం తో పప్పు తల రూమ్ లోనే ఉందని వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పి సంతోషపెడుతాడు బంటి. మరోవైపు కావ్య తన భర్త కోసం చేసిన ప్రతి పనికి డబ్బులు అడుగుతుంది ఎందుకు అంటే నేను డబ్బు మనిషిని కదా అందుకు అని సమాధానం ఇస్తుంది కావ్య ప్రవర్తనకి అందరూ ఆశ్చర్యపోతుంటే అసలు విషయం చెప్పాలనుకుంటుంది కావ్య కానీ రాజ్ చెప్పనివ్వడు. మరి నన్ను ఎందుకు అంత మాట అన్నారు, నా పుట్టిన రోజు కష్టంలో ఉన్నప్పుడు కూడా మీ డబ్బులు నేను తీసుకోలేదు కదా అంటుంది కావ్య.

ఆగస్ట్ 21 వ తేదీ 494 ఎపిసోడ్ లో ప్రతిరోజు తను ఇంట్లో చేసే పనులను గురించి పడుతున్న కష్టం గురించి చెప్తున్నా కావ్యతో నువ్వు మా ఇంటికి వచ్చిన దేవతవి నేనే నోరు జారి అలా అన్నాను అంటాడు రాజ్. ఇకపై నిద్రలో కూడా నోరు జారరు అని భర్తను చూసి నవ్వుకుంటుంది కావ్య. మరోవైపు మాయ చేసి కళ్యాణ్ కి డబ్బులు అందేలా చేయాలనుకుంటాడు రాజ్. కానీ అన్న నాటకం గ్రహించిన కళ్యాణ్ అందుకు ఒప్పుకోడు. ఇంటికి వెళ్దాం తమ్ముని పిలిచినా రానంటాడు కళ్యాణ్. అసలు నిన్ను ఇలా తయారు చేసినందుకు నాకు అలావేతని అనాలి తన వల్లే నువ్వు ఇలా తయారయ్యావు రాజ్. తర్వాత తమ్ముడు కోసం బాధపడుతున్న రాజ్ తో వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పి ఒక రోజు కోసం నేను వాడిని ఇంటికి రప్పిస్తాను వాడిని శాశ్వతంగా ఇంట్లో ఉంచేసే బాధ్యత నీది అంటుంది ఇందిరా దేవి. సరే అంటాడు రాజ్. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళందరి ముందు వరలక్ష్మీ వ్రతం గురించి చెప్తుంది ఇందిరా దేవి.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 19th to August 24th episode Story

ఆగష్టు 22వ తేదీ 494ఎపిసోడ్ లో కళ్యాణ్ వాళ్ళు ఇంట్లోకి రావడానికి కారణం నేనే అని ఎవరైనా అంటే అని ప్రశ్నిస్తుంది కావ్య వాళ్ళ దుమ్ము దులిపేయమని సలహా ఇస్తుంది అపర్ణ. అయినా కళ్యాణ్ ఒప్పుకొని రావాలి కదా అంటుంది ధాన్యలక్ష్మి. మేము వెళ్లి పిలుస్తాము అంటారు సీతారామయ్యదంపతులు. తర్వాత అపర్ణ కనకం దంపతులను కూడా వ్రతానికి ఫోన్లో ఆహ్వానిస్తుంది. కానీ తనకు భర్తతో మాట్లాడుతూ రేపు అక్కడ ఎంత గొడవ జరుగుతుందో నేను ఎలా రియాక్ట్ అవుతాను అంతకంటే వెళ్లకపోవడం మంచిది అంటుంది కనకం. మరోవైపు ధాన్య లక్ష్మి అప్పుని అవమానించడం కోసమే ఇంటికి రావడానికి ఒప్పుకుందని తెలుసుకున్న రుద్రాణి ఆమె తెలివితేటల్ని పొగుడుతుంది. తర్వాత సీతారామయ్య దంపతులు కళ్యాణ్ దంపతులను పూజ విషయం చెప్పి ఆహ్వానిస్తారు. మరోవైపు రేపు కళ్యాణ్ వాళ్ళు ఒక్కరోజు కోసమే కాదు శాశ్వతంగా ఇక్కడే ఉండి పోయే ఏర్పాట్లు చేస్తున్నాను అంటాడు రాజ్. ఏం గొడవ జరగబోతుందో అని కంగారుపడుతుంది కావ్య. మరోవైపు రేపు ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు నిన్ను అవమానిస్తారు అని అప్పు తో అంటాడు కళ్యాణ్.

ఆగస్టు 23 వ తేదీ 495 ఎపిసోడ్‌లో అక్కడ ఎంతగా అవమానం జరిగినా నేనేమీ మాట్లాడను,అక్కడ నావల్ల ఎలాంటి గొడవ జరగదు అమ్మమ్మ తాతయ్య పిలిచాక వెళ్లకపోతే బాగోదు అని కళ్యాణ్ ని ఒప్పిస్తుంది అప్పు. మరోవైపు పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్న కావ్యని చూసి చెల్లెలికి జరగబోయే అవమానం గురించి తెలియక తెగ హడావిడి చేస్తుంది అంటుంది ధాన్యలక్ష్మి. తర్వాత ఇంటికి వచ్చిన తప్పుని గుమ్మంలోనే చీర కట్టుకొని రాలేదని అవమాన పరుస్తుంది ధాన్యలక్ష్మి. అది భరించలేని కళ్యాణ్ తిరిగి వెళ్ళిపోతానంటే అతడిని ఒప్పించి లోపలికి తీసుకువస్తుంది కావ్య. చీర కట్టుకోమన్న స్వప్నతో ఇప్పుడు అవసరమా అని అప్పు అంటే అవసరమే అని నచ్చ చెప్తుంది స్వప్న అప్పుడే లోపలికి వచ్చిన కావ్య నా మీద కోపంగా ఉందని అడుగుతుంది లేదు అర్థం చేసుకున్నాను అంటూ ఆమెని హగ్ చేసుకుంటుంది అప్పు. ఎంతైనా మీరిద్దరూ ఒక్కటే అయినా పెద్దదాన్ని కదా క్షమించేస్తాను అంటుంది స్వప్న నువ్వు బాగా మారిపోయావు అక్క అంటుంది అప్పు.కావ్య ని చూసి మారిపోయాను అంటుంది స్వప్న.

Brahmamudi Telugu Serial Weekly Roundup August 19th to August 24th episode Story

ఆగస్టు 24 వ తేదీ 497 ఎపిసోడ్‌లో చెల్లెలి అభిమానానికి కన్నీరు పెట్టుకుంటుంది కావ్య. తను కూడా ఇంట్లోనే ఉంటే బాగుండేది అని బాధపడుతున్న కోడలికి త్వరలోనే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని ధైర్యం చెబుతుంది అపర్ణ. మరోవైపు కళ్యాణ్ కి బట్టలు ఇచ్చిన ఇందిరా దేవితో అమ్మ నాకు మాత్రమే బట్టలు కొన్నది అంటాడు కళ్యాణ్. అతడిని కన్విన్స్ చేసి రెడీ అవ్వమని చెప్పి బయటికి వస్తారు రాజ్, ఇందిరా దేవి. మరోవైపు చీర కట్టుకొని కావ్య వాళ్లతో పనిచేస్తున్న అప్పుని చూపించి చూసావా అందరూ ఇంట్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అందుకే ఇంట్లో ఉండిపో అని కళ్యాణ్ ని కన్వెన్స్ చేస్తాడు రాజ్. తర్వాత వచ్చిన పేరంటాల మీద అప్పు డ్రింక్ వల్లకబోసిందని అందరి ముందు అప్పుని అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. ఆమెను కోప్పడి అప్పుని వెనకేసుకొస్తుంది ఇందిరా దేవి. తర్వాత మూడు జంటల చేత పూజ చేయిస్తారు పంతులుగారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X