Brahmamudi weekly roundup: రాజ్ ప్రేమను రిజెక్ట్ చేసిన కావ్య.. యామిని ప్లాన్ తిప్పికొట్టిన కళావతి
Photo Courtesy: JioHotstar
తను తల్లిని కాబోతున్న విషయం తెలిస్తే బాగోదని కావ్య నిజం దాచిపెట్టి రాజ్ ప్రేమను నిరాకరిస్తుంది. స్వరాజ్‌ను రేవతికి అప్పగిస్తుంది రేవతి. నా ఫ్రెండ్ నన్ను సొంత మనవడిలా చూసుకుందని, నాకు అమ్మమ్మ ఎందుకు లేదని కొడుకు అడగటంతో రేవతి బాధపడుతుంది. కావ్య తల్లి కాబోతున్న విషయం తెలిసి అపర్ణ, ఇందిరలు సంతోషిస్తాడు. తన ప్రేమను కావ్య నిరాకరించిందన్న బాధలో రోడ్డుపై పిచ్చోడిలా తిరుగుతున్న రాజ్‌కి యాక్సిడెంట్ అవుతుంది. మా బావ రాత్రి నుంచి ఇంటికి రాలేదని దుగ్గిరాల వారింట్లో యామిని రచ్చ చేస్తుంది. రాజ్ గురించి కావ్య టెన్షన్ పడుతుండగా తమ్ముడు నా ఇంట్లోనే ఉన్నాడని కావ్యకి రేవతి ఫోన్ చేసి చెబుతుంది. దాంతో రాజ్‌ని కావ్య తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. కావ్యకి నీ మీద ప్రేమ లేదని రాజ్ మనసు విరిగేలా యామిని మాట్లాడటంతో అతను మండిపడతాడు. తన ప్రెగ్నెన్సీ గురించి డాక్టర్‌కి చూపించుకోవడానికి కావ్య ఆసుపత్రికి వెళ్తుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఆగస్ట్ 4వ తేదీ నుంచి ఆగస్ట్ 9వ తేదీ వరకు .. 791వ ఎపిసోడ్ నుంచి 796 వరకు ఏం జరిగిందంటే?
ఆగస్ట్ 4వ తేదీ 791వ ఎపిసోడ్‌లో ..
ఒక్కసారిగా వాంతులు కావడంతో వాష్ రూమ్‌లో చెక్ చేసుకున్న కావ్యకు తాను తల్లిని కాబోతున్నట్లు తెలిసి సంతోషించి.. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు పరుగులు తీస్తుంది. అయితే తనకు ప్రపోజ్ చేయడానికి వస్తున్న రాజ్‌కి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడని తెలిసి తనలో తాను కుమిలిపోతుంది. ఇంతలో లోపలికి వచ్చిన అప్పూకి విషయం చెప్పి ఆమెను హత్తుకుంటుంది. నేను స్వరాజ్‌ని రేవతి గారికి అప్పగించి వస్తానని, నువ్వేం టెన్షన్ పడొద్దని చెబుతుంది అప్పూ. స్వరాజ్‌ని తీసుకెళ్తుండగా తనను రాహుల్ ఫాలో అవుతున్నట్లు గుర్తించి రివర్స్‌లో ప్లాన్ చేస్తుంది అప్పూ. ఎన్నో ఆశలతో కావ్యకి రాజ్ ప్రపోజ్ చేయగా.. తన మనసుని చంపుకుని రాజ్ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది కావ్య.
ఆగస్ట్ 5వ తేదీ 792వ ఎపిసోడ్‌లో ..
కావ్య తనకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని, పెళ్లి చేసుకోవాలని కలలు కన్న రాజ్‌కు కళావతి నిర్ణయం గుండెల్ని పిండేస్తుంది. కావ్య తీరుతో రగిలిపోయిన అపర్ణ ఆమెను లాగిపెట్టి కొట్టబోతుండగా రాజ్ అడ్డుకుంటాడు. తనకు ఇష్టం లేకుండా ఏం చేయనని.. తనని బలవంతం చేయొద్దని ఏడుస్తూ బయటికి వెళ్లిపోతాడు రాజ్. ఇంట్లో జరిగినదంతా యామినికి చెబుతుంది రుద్రాణి. కావ్య - రాజ్‌లు విడిపోవడంతో యామిని గాల్లో తేలుతుంది. రేవతికి స్వరాజ్‌ను అప్పగించి వెళ్లిపోతుంది అప్పూ. మా ఫ్రెండ్ నన్ను సొంత మనవడిలా బాగా చూసుకుందని, నాకు అమ్మమ్మ లేదా? అని పిల్లాడు అడగటంతో రేవతి కంటతడి పెడుతుంది. బాధపడుతూ ఇంటికి వచ్చిన రాహుల్‌కు ఇంట్లో జరిగినదంతా చెబుతుంది రుద్రాణి.

Photo Courtesy: JioHotstar
ఆగస్ట్ 6వ తేదీ 793వ ఎపిసోడ్‌లో ..
కావ్యే నా జీవితం అనుకున్నానని.. కానీ చివరికి తను ఇలా చేస్తుందని అనుకోలేదని ఇందిర, అపర్ణల వద్ద బాధపడతాడు రాజ్. మేమంతా మాట్లాడతామని, కావ్యతో నీ పెళ్లి చేస్తామని వాళ్లిద్దరూ రాజ్‌కు మాట ఇస్తారు. ఎంతో ఆశతో వచ్చిన భర్త ప్రేమను నిరాకరించి ఒంటరిగా బాధపడుతున్న కావ్యపై అపర్ణ, ఇందిరలు రగిలిపోతారు. దీంతో తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కావ్య బయటపెడుతుంది. ఈ విషయాన్ని అప్పుడే చెబితే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవాళ్లం కదా అని కావ్య, అపర్ణలు చెబుతారు. మీ అబ్బాయి దృష్టిలో నేను పెళ్లి కానీ అమ్మాయినని, నేను తల్లిని కాబోతున్నట్లు తెలిస్తే ఆయన తట్టుకోలేరని చెబుతుంది కావ్య. నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? ఇదంతా ఎప్పుడు జరిగిందని అడితే ఆయనకు నిజం చెప్పాల్సి వస్తుందని బాధపడుతుంది కావ్య. నేను నా జీవితంలో మళ్లీ ఆయనకు ఎదురుపడనని తేల్చిచెబుతుంది కావ్య. కళావతి గురించే బాధపడుతూ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న రాజ్‌ని కారు ఢీకొడుతుంది.
ఆగస్ట్ 7వ తేదీ 794వ ఎపిసోడ్‌లో ..
రాజ్ ప్రేమను నిరాకరిస్తూ కావ్య తీసుకున్న నిర్ణయాన్ని సీతారామయ్య తప్పుపడతాడు. బంగారం లాంటి అవకాశాన్ని కాదనుకున్నావని, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా ఇది మాత్రం తప్పేనని మనవరాలికి చెబుతాడు. రాజ్ కనిపించకపోవడంతో దుగ్గిరాల వారింటికి వస్తుంది యామిని. మా బావ అంటే నాకు ప్రాణం.. ఆ ప్రాణానికి ఏమైనా జరిగితే మీ ఇంట్లో ఎవ్వరినీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది యామిని. ఆ మాటలకు రగిలిపోయిన అపర్ణ.. నా కొడుకుని మాయ చేసి నీ ఇంట్లో పెట్టుకున్న నిన్ను మేం ఏం చేయాలని మండిపడుతుంది. నిన్ను జైలుకు పంపి చిప్పకూడు తినిపించడం నాకు నిమిషం పని అని వార్నింగ్ ఇస్తుంది. కావ్య ప్రేమను రిజెక్ట్ చేసిందన్న బాధతో రాజ్ ఏమైనా చేసుకున్నాడేమో అని రుద్రాణి చెప్పడంతో అంతా టెన్షన్ పడతారు. రాజ్ ఫోటో చూస్తూ బాధపడుతున్న కావ్యని అపర్ణ, ఇందిర ఓదారుస్తారు. ఇంతలో కావ్యకి రేవతి ఫోన్ చేసి రాజ్ నా దగ్గర క్షేమంగా ఉన్నాడని ఫోన్ చేసి చెప్పడంతో కళావతి సంతోషిస్తుంది.

Photo Courtesy: JioHotstar
ఆగస్ట్ 8వ తేదీ 795వ ఎపిసోడ్‌లో ..
కావ్య కంగారుగా బయటికి వెళ్లడంతో ఏం జరిగిందోనని దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రాజ్‌కి ఏదో జరిగి ఆస్తి మొత్తం తన చేతికి వచ్చేసిందని రుద్రాణి సంబరపడిపోతుంది. కావ్య ఎందుకు అలా కంగారుగా వెళ్లిందని సుభాష్ అడగటంతో రాజ్ దొరికాడని అపర్ణ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. రాజ్‌కి గతాన్ని గుర్తుచేస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సుభాష్ చెప్పడంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది. ఈ విషయాన్ని వెంటనే యామినికి చెప్పి.. నువ్వు ఆలస్యం చేస్తే నీకు రాజ్ ఈ జన్మలో దక్కడని హెచ్చరిస్తుంది. రాజ్‌ను వెతుక్కుంటూ రేవతి ఇంటికి వస్తుంది కావ్య. తర్వాత రాజ్‌తో గొడవపడి అతనిని ఇంటికి బలవంతంగా లాక్కెళ్తుంది. నువ్వు ఏమై పోయావోనని మాకు కాలు చేయి ఆడలేదని అపర్ణ, ఇందిర చెప్పడంతో రాజ్ బాధపడతాడు. ఇంతలో యామిని వచ్చి నీ వల్లే నా బావ ఇలా అయిపోయాడని మండిపడుతుంది.
ఆగస్ట్ 9వ తేదీ 796వ ఎపిసోడ్‌లో ..
నువ్వు రిజెక్ట్ చేశావన్న బాధలో బావ ప్రాణాలకు ఏమైనా అయ్యుంటే అని యామిని అనడంతో ఆ మాటలతో మండిపడిన కావ్య ఆమెను లాగికొడుతుంది. ఆయన గురించి ఇంకో మాట మాట్లాడితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఆయన ఎక్కడున్న సంతోషంగా ఉండాలి.. ఇందుకోసం అవసరమైతే నా ప్రాణాలైనా పణంగా పెడతానని చెబుతుంది. తనపై కావ్య చూపిస్తున్న ప్రేమకు రాజ్ పొంగిపోతాడు. యామిని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా రాజ్ రానని చెబుతాడు. మా ఇద్దరి మధ్య ఉన్నది బ్రహ్మముడి అని, దానిని ఎవ్వరూ విడదీయలేరని యామినికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇంటికొచ్చిన రాజ్‌తో నీ మీద కావ్యకి ప్రేమ లేదని, నువ్వంటే తనకి ఇష్టం లేదని చెబుతుంది యామిని. దాంతో రాజ్ కోప్పడతాడు. తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉదయాన్నే కావ్య డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










