Brahmamudi weekly roundup: రాజ్- కావ్యలను దెబ్బకొట్టిన రాహుల్.. పాప కేసులో అప్పూకి చిక్కులు

Photo Courtesy: JioHotstar

అవార్డ్ ఫంక్షన్‌లో ప్రదర్శించిన డిజైన్స్ తమవేనని తెలుసుకున్న రాజ్, కావ్యలు షాక్ అవుతారు. రాహుల్ అంతుచూస్తానని రాజ్ ఆవేశంగా వెళ్లగా స్వప్న కనిపించడంతో ఆమె ముఖం చూసి వదిలేస్తాడు. అప్పూని పోలీస్ స్టేషన్‌కి పంపడానికి కళ్యాణ్ నానాతంటాలు పడి తండ్రికి దొరికిపోతాడు. రాజ్- కావ్యలను ఊహించని దెబ్బ కొడతానని రుద్రాణితో అంటాడు రాహుల్. కంపెనీలో రాహుల్‌కు సాయం చేసింది ఎవరో తెలుసుకోవడానికి కావ్య ప్లాన్ చేస్తుంది. దాంతో ఆ వ్యక్తి కావ్య ట్రాప్‌లో చిక్కుకుంటాడు. కావ్య వేసిన కొత్త డిజైన్ కోసం యాడ్ ఫిల్మ్ తీస్తుండగా మోడల్‌ని రానివ్వకుండా రాహుల్ అడ్డుపడతాడు. దాంతో కావ్యనే మోడల్‌గా ఉండటానికి ఒప్పిస్తాడు రాజ్. దుగ్గిరాల ఫ్యామిలీ అందరితో కలిసి యాడ్ ఫిల్మ్ చేయడానికి అంగీకరిస్తుంది కావ్య. దాంతో దీనిని చెడగొట్టడానికి ఓ పరోటాలు వేసుకునేవాడిని యాడ్ డైరెక్టర్‌గా తీసుకొస్తాడు రాహుల్.

బ్రహ్మముడి డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు.. 904వ ఎపిసోడ్ నుంచి 909 వరకు ఏం జరిగిందంటే?

డిసెంబర్ 15 తేదీ 904వ ఎపిసోడ్‌లో..
కావ్య రిపోర్ట్స్ చూసి దుగ్గిరాల ఫ్యామిలీ నిలదీయగా.. తన భార్యకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని కేరళలో ఆయుర్వేద వైద్యంతో మా సమస్యలన్నీ తీరిపోయాయని చెబుతాడు రాజ్. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. ఇంతలో రాహుల్ అతి తక్కువ కాలంలో బిజినెస్ బాగా చేసినందుకు అతనికి అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేశామని ఖచ్చితంగా రావాలని అసోసియేషన్ వారు రాజ్‌కి ఫోన్ చేసి చెబుతారు. దాంతో రాజ్, కావ్యలు సంతోషిస్తారు. ఇలాంటి విజయం ఎందుకు చెప్పలేదని రాహుల్‌ని అడుగుతారు. ఆ మాటలతో రాహుల్ చేసిన మోసం గుర్తొచ్చి సుభాష్, అపర్ణలు రగిలిపోతుంటారు. పాప కేసులో ఇన్విస్టిగేషన్ కోసం అప్పూని దొంగచాటుగా ఇంటి వెనుక నుంచి పంపిస్తూ ప్రకాశానికి దొరికిపోతాడు కళ్యాణ్. అప్పూ బయటకి వెళ్లిపోయినా బెడ్‌రూంలోనే ఉందని ధాన్యానికి అబద్ధం చెబుతాడు కళ్యాణ్. అవార్డ్ ఫంక్షన్‌కి వచ్చిన రాజ్, కావ్యలు.. చాలా త్వరగా క్లయింట్స్‌ని పట్టుకుని బిజినెస్ చేశావని రాహుల్‌ని మెచ్చుకుంటారు. రాహుల్ ఎంతో కష్టపడ్డాడని, అసలు నిద్ర కూడా పోలేదని తన భర్త గురించి గొప్పగా చెబుతుంది స్వప్న.

డిసెంబర్ 16వ తేదీ 905వ ఎపిసోడ్‌లో..
అవార్డ్ ఫంక్షన్‌లో రాహుల్ వేయించిన డిజైన్లను అక్కడి స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేస్తారు. అది చూసిన రాజ్, కావ్యలు షాక్ అవుతారు. మన డిజైన్లు దొంగిలించి, మనకే వెన్నుపోటు పొడుస్తాడా అంటూ రాజ్ ఆవేశంతో ఊగిపోతుండగా కావ్య ఆపుతుంది. రాజ్ చేతుల మీదుగానే తనకు అవార్డ్ ఇప్పించాల్సిందిగా రాహుల్ అడగటంతో నిర్వాహకులు రాజ్‌ని వేదిక మీదకి పిలిచి అవార్డ్ ఇప్పిస్తారు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా పాప రీ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ రావడంతో అప్పూ ఉలిక్కిపడుతుంది. అసలు చనిపోయింది రేణుక పాప కాదని తెలియడంతో ఈ విషయం సీఐకి చెబుతుంది. అసలు క్లోజ్ అయిపోయింది అనుకున్న కేసుని రీ ఓపెన్ చేసి చాలా బాగా డీల్ చేశావని అప్పూని మెచ్చుకుంటాడు సీఐ. అప్పూకి భోజనం ఇచ్చేందుకు ధాన్యలక్ష్మీ పైకి వస్తుంది. అక్కడ మంచం మీద అప్పూ ప్లేస్‌లో ప్రకాశం పడుకుని ఉంటాడు. దాంతో వచ్చింది అప్పూనే అనుకుంటాడు కళ్యాణ్. ఆ వెంటనే తండ్రిని చూసి ఉలిక్కిపడతాడు. ఎంతో నమ్మి.. రిస్క్ చేసి వాడికంటూ ఓ కంపెనీ ఉండాలని ఇంత చేస్తే రాహుల్ మనల్ని మోసం చేశాడని రాజ్ రగిలిపోతాడు. వాడి అంతు తేలుస్తానని ఆవేశంతో వెళ్తున్న రాజ్‌కి స్వప్న ఎదురై నీ మేలు ఈ జన్మకి మరిచిపోలేనని ఏడుస్తూ అతనికి దండం పెడుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup December 15th to December 20th episode Story

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 17వ తేదీ 906వ ఎపిసోడ్‌లో..
మా అక్క నీ మీద ఎంత కృతజ్ఞత చూపిస్తుందో చూశారా? తన భర్త ఎదిగాడని మురిసిపోతుంది.. ఇప్పుడు మీరు వెళ్లి రాహుల్‌ని నిలదీస్తే మా అక్క తట్టుకోలేదని చెబుతుంది కావ్య. దాంతో రాజ్ ఆవేశం తగ్గించి ఇంటికి బయల్దేరతారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తూ ప్రకాశంకు దొరికిపోతుంది అప్పూ. మా నాన్నకి మొత్తం తెలిసిపోయిందని చెబుతాడు కళ్యాణ్. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుందని వార్నింగ్ ఇస్తాడు ప్రకాశం. ఏం జరిగినా కాపాడటానికి నువ్వు ఉన్నావు కదా అని అంటాడు కళ్యాణ్. అవార్డ్స్ ఫంక్షన్‌లో రాహుల్ తనను మోసం చేసిన విషయం బయటపడిందని దుగ్గిరాల ఫ్యామిలీకి చెబుతాడు రాజ్. కేవలం స్వప్న కోసం ఆ రాహుల్‌ని క్షమించానని చెబుతాడు రాజ్. కానీ నేనంటే ఏంటో రాహుల్‌కి చూపించి వాడికి బుద్ధి చెబుతానని అంటాడు రాజ్. తను గెలిచిన అవార్డ్‌ని తీసుకొచ్చి తల్లికి చూపించగా రాహుల్‌ని రుద్రాణి మెచ్చుకుంటుంది. త్వరలో నేను కొట్టబోయే దెబ్బకు రాజ్- కావ్యలకు చుక్కలు కనిపిస్తాయని అంటాడు రాహుల్.

డిసెంబర్ 18వ తేదీ 907వ ఎపిసోడ్‌లో..
కంపెనీకి వెన్నుపోటు పొడిచిన ఉద్యోగిని పట్టుకోవడానికి కావ్య ఓ ప్లాన్ వేస్తుంది. కొత్త డిజైన్స్ వేశానని.. ఈసారి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. దాంతో ఉద్యోగుల్లో ఉన్న రాహుల్ మనిషి ఆ డిజైన్లు కొట్టేయాలని రాజ్ గదిలోకి వెళ్లి కావ్య, రాజ్‌లకు పట్టుబడతాడు. పాప కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా రేణుక భర్త అశోక్‌ని పోలీస్ స్టేషన్‌కి పిలిపిస్తుంది అప్పూ. చనిపోయింది మీ పాప కాదని, మీ కూతురు బతికే ఉందని అప్పూ చెప్పడంతో అతనికి చెమటలు పడతాయి. దాంతో అతనిపై ఓ కన్నేసి ఉంచమని పోలీసులకు చెబుతుంది అప్పూ. కంపెనీ కోసం తిరిగి కొత్త డిజైన్లు తయారు చేస్తుంది కావ్య. దీనిని మోడల్ ద్వారా యాడ్ షూట్ చేయించి రెండ్రోజుల్లో పబ్లిసిటీ చేస్తానని చెబుతాడు రాజ్. ఇదంతా విన్న రాహుల్.. యాడ్ షూటింగ్‌కి మోడల్‌ను రాకుండా ట్రాప్ చేస్తాడు. ఆమెకు 10 లక్షలు ఇచ్చి సైడ్ చేస్తాడు. చివరి నిమిషంలో మోడల్ కనిపించకుండా పోవడంతో రాజ్ చేయాల్సిన యాడ్ షూటింగ్ ఆగిపోతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup December 15th to December 20th episode Story

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 19వ తేదీ 908వ ఎపిసోడ్‌లో..
యాడ్ షూటింగ్ ఆగిపోవడంతో చిరాకులో ఉన్న రాజ్‌ దగ్గరికి వచ్చి కావ్య ఏదేదో మాట్లాడటంతో భార్యపై అరుస్తాడు. అయితే కట్టుబొట్టుతో చూడటానికి ఎంతో బాగున్న కావ్యని చూసి ముచ్చటపడతాడు రాజ్. ఇంట్లో ఇంత అందమైన భార్య ఉండగా బయటి వాళ్ల కాళ్లను ఎందుకు పట్టుకోవాలి కళావతితోనే మోడలింగ్ చూపించాలని అనుకుంటాడు రాజ్. వెంటనే ఈ విషయాన్ని కావ్యతో చెప్పగా ఆమె ససేమిరా అంటుంది. పాప మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా రేణుకని, ఆమె భర్తని పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తుంది అప్పూ. పాపకు అసలు తండ్రి ఎవరు అని అప్పూ నిలదీయగా.. అశోక్ నాకు రెండో భర్త అని నిజం చెబుతుంది. మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి నిజం నా దగ్గర ఎందుకు దాచారని అప్పూ మండిపడుతుంది. భోజనాల దగ్గర రాజ్ ఉండగా.. యాడ్ షూటింగ్ ఎలా జరిగిందని రాజ్‌ని రెచ్చగొడతాడు రాహుల్. మోడల్ లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చిందని రాజ్ చెప్పడంతో మరేం చేస్తావని ప్రశ్నిస్తాడు రాహుల్. ఇంట్లోనే మోడల్ ఉంది కానీ, ఒప్పుకోవడం లేదని రాజ్ చెప్పగా ఆ మోడల్ ఎవరని అంతా అడుగుతారు. ఆ మోడల్ ఎవరో కాదు.. కళావతే అని చెబుతాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. కావ్యని మోడలింగ్ చేయమని ఫ్యామిలీ అంతా ఒత్తిడి చేస్తారు. ఇంతలో ధాన్యలక్ష్మీ అందంగా రెడీ అయి మోడలింగ్ చేస్తానని చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup December 15th to December 20th episode Story

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 20వ తేదీ 909వ ఎపిసోడ్‌లో..
కావ్యతో రాజ్ తీయబోయే యాడ్ ఫిల్మ్‌ని చెడగొట్టాలని అనుకుంటాడు రాహుల్. పరోటాలు చేసుకునే వాడికి డబ్బులు ఎరగా వేసి వాడిని యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌గా తన ఇంటికి రమ్మని చెబుతాడు. అలాగే డైరెక్టర్స్‌‌ని తీసుకొచ్చే బ్రోకర్‌ని కూడా డబ్బులతో కొనేస్తాడు. ఇంట్లో చాలా మంది యాడ్ ఫిల్మ్ చేయగలరని చెప్పి ఇందిర- సీతారామయ్య, అపర్ణ - సుభాష్‌లు తమ కాన్సెప్ట్‌లు చెప్పి రాజ్‌ను విసిగిస్తారు. ఇదంతా చూసిన కావ్య నవ్వుకుంటూ యాడ్‌లో నటించడానికి ఒప్పుకుంటుంది. ఇంతలో పరోటాలు వేసుకునే వాడొచ్చి డైరెక్టర్‌గా తిక్కతిక్కగా మాట్లాడతాడు. దాంతో అసలు నువ్వు డైరెక్టర్‌వేనా అని దుగ్గిరాల ఫ్యామిలీకి అనుమానం వస్తుంది. తమ ప్లాన్ వర్కవుట్ కావడంతో రాహుల్, రుద్రాణిలు సంతోషిస్తారు. నెక్ట్స్ ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X