Brahmamudi Weekly Roundup : రాజ్‌ను గట్టెక్కించిన కావ్య .. ఇంట్లో తుఫాన్ సృష్టించిన రుద్రాణి
దుగ్గిరాల కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టిన నందగోపాల్‌ను రాజ్ వెతుకుతుండగా.. ఓ పోలీస్ ఆఫీసర్ అతనిని మోసం చేస్తాడు. ఇంట్లో వాళ్లు లక్షలకు లక్షలు అడుగుతుండటంతో తాళాలను అత్తగారికి ఇచ్చేస్తుంది కావ్య. సీతారామయ్య గారి సాయం కోసం వచ్చిన ఓ పేద కుటుంబానికి రాజ్ రూ.5 లక్షలు ఇప్పిస్తాడు. బ్యాంక్ వాళ్లు ఇంటికొచ్చి గొడవ చేసినట్లుగా కల రావడంతో రాజ్ ఉలిక్కిపడి లేస్తాడు. కావ్య సాయంతోనే ఈ సమస్య నుంచి గట్టెక్కాలని అనుకున్న రాజ్ ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. బెడ్ రూంలో కావ్యతో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న రాజ్‌ను చూసిన రుద్రాణి .. వాళ్లిద్దరిని విడగొట్టాలని ధాన్యలక్ష్మీకి చెబుతుంది. కళ్యాణ్ తనను పట్టించుకోకపోవడంతో అప్పూ బాధపడుతుంది. కోడలికి దగ్గరవుతున్న రాజ్‌ను చూసి అపర్ణ - సుభాష్‌లు సంతోషిస్తారు. సీతారామయ్య ష్యూరిటీ , బ్యాంక్ వాళ్లు ఇచ్చిన టైం గురించి కావ్యకి చెప్పి బాధపడతాడు రాజ్. 100 కోట్లను ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కట్టడానికి బ్యాంక్ వాళ్లని ఒప్పిస్తుంది కావ్య.
డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు .. 594 ఎపిసోడ్ నుంచి 599 వరకు ఏం జరిగిందంటే?
డిసెంబర్ 16వ తేదీ 594వ ఎపిసోడ్‌లో దుగ్గిరాల కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టిన చిట్‌ఫండ్ కంపెనీ ఓనర్ నందగోపాల్‌ను వెతుకుతూ వెళ్తాడు రాజ్. అతని అడ్రస్ కనుక్కొని వెళ్తుండగా తన ఫ్రెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్‌కి విషయం చెబుతాడు. అయితే అతను నందగోపాల్ మనిషి కావడంతో రాజ్ వస్తున్నట్లు అలర్ట్ చేసి పారిపోమంటాడు. ఇంట్లో డబ్బు కోసం రుద్రాణి, ధాన్యలక్ష్మీలు కావ్యని నానా మాటలు అంటుంటారు. ఎవరికి వారు లక్షలకు లక్షలు అడుగుతుండటంతో ఇంటి బాధ్యతలు మోయటం తన వల్ల కాదని నిర్ణయించుకుని రాజ్‌కి తాళాలు ఇచ్చేయాలని అనుకుంటుంది.

డిసెంబర్ 17వ తేదీ 595వ ఎపిసోడ్‌లో సీతారామయ్య చదివిస్తున్న ఓ కుర్రాడి కుటుంబం ఆర్ధిక సాయం కోసం దుగ్గిరాల వారింటికి రాగా రుద్రాణి వారిని తిట్టి పంపేస్తుంది. వాళ్లు బాధపడుతూ వెళ్తుండగా రాజ్ చూసి వాళ్లని లోపలికి పిలిపిస్తాడు. కావ్యని పిలిచి నానమ్మ చేతుల మీదుగా వారికి రూ.5 లక్షలు ఇప్పిస్తాడు. మరోవైపు .. భర్త తనను పట్టించుకోకపోవడంతో కళ్యాణ్‌కి ఫోన్ చేస్తుంది అప్పూ. సుభాష్, ప్రకాశం, రాహుల్ సహా ఇంట్లో వాళ్లంతా ఇష్టమొచ్చినట్లుగా డబ్బులు అడుగుతూ ఉండటంతో కావ్య భయపడిపోతుంది. 100 కోట్లను బ్యాంక్ వాళ్లకి ఎలా కట్టాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో కావ్య కాఫీ తీసుకొచ్చి విసిగించడంతో ఆమెపై కోప్పడతాడు రాజ్. దీంతో అత్తగారి దగ్గరికి వెళ్లి ఆమెకి తాళాలు ఇచ్చేస్తుంది కళావతి.
డిసెంబర్ 18వ తేదీ 596వ ఎపిసోడ్‌లో ఇంటి వాళ్ల దెబ్బకి కంగారు పడిపోయిన కావ్యకి అపర్ణ ధైర్యం చెప్పి తిరిగి తాళాలు ఇస్తుంది. తాతయ్య పేరు చెప్పుకుని ఇంట్లో నుంచి లక్షలు కొట్టేయాలని రాహుల్ ప్లాన్ వేయడంతో అది తెలుసుకున్న రుద్రాణి, స్వప్నలు తిడతారు. ఉదయాన్నే తనకు కాఫీ కూడా ఇవ్వకపోవడంతో కావ్యపై కేకలు వేస్తుండగా రాజ్ కోసం ఇంతలో పోలీస్ ఆఫీసర్ రావడంతో రాజ్ సీక్రెట్‌గా మాట్లాడతాడు. ఆ సమయంలో కాఫీ తీసుకొచ్చిన కావ్యని రాజ్ కసురుకోవడంతో అపర్ణ కోప్పడి కోడలికి క్షమాపణలు చెప్పిస్తుంది. అయితే భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన కావ్య ఆయన ఏదో సమస్యలో ఉన్నాడని అర్ధం చేసుకుంటుంది. ఉదయాన్నే బ్యాంక్ వాళ్లు వచ్చి సీతారామయ్య పెట్టిన ష్యూరిటీ సంతకం గురించి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు.

డిసెంబర్ 19వ తేదీ 597వ ఎపిసోడ్‌లో సీతారామయ్య గారు పెట్టిన ష్యూరిటీని అనుసరించి ఆస్తిని జప్తు చేస్తున్నామని బ్యాంక్ వాళ్లు చెప్పడంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఒప్పుకోరు. మాకు రావాల్సిన వాటాను దక్కించుకోవడానికి కోర్టుకెక్కుతామని బెదిరిస్తారు. వారి మాటలతో ఇందిర తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో కుప్పకూలిపోతుంది . ఆ దెబ్బతో నానమ్మ అంటూ నిద్రలోంచి రాజ్ ఉలిక్కిపడి లేస్తాడు. ఈ కల నిజం కాకూడదంటే బ్యాంక్ లోన్ తీసుకుని రూ.100 కోట్లు కట్టేయాలని అనుకుని మేనేజర్‌కి ఫోన్ చేస్తాడు రాజ్. ఆస్తి కావ్య పేరిట ఉండటంతో ఆమెను తీసుకుని రమ్మని చెప్పడంతో ఆమెను ఇంప్రెస్ చేయడానికి రాజ్ ప్రయత్నిస్తుంటాడు. కూరలలో ఉప్పు తగ్గడంతో కావ్యని నానా మాటలు అంటారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. ఇంతలో రాజ్ వచ్చి కావ్య వంటను మెచ్చుకుంటూ ఉండగా ధాన్యం, రుద్రాణి మాటలతో భోజనం మధ్యలోనే లేచి వెళ్లిపోతాడు.
డిసెంబర్ 20వ తేదీ 598వ ఎపిసోడ్‌లో ఎస్ఐ ట్రైనింగ్‌లో దూరంగా ఉంటే కళ్యాణ్ తనని పట్టించుకోకపోవడంపై అప్పూ బాధపడుతుంది. మరోవైపు బ్యాంక్ లోన్, షూరిటీ గురించి కావ్యకి చెప్పి పరిష్కారం వెతకాలని రాజ్ తెగ ట్రై చేస్తుంటాడు. వంట గదిలో కావ్యతో కబుర్లు చెబుతుండగా అపర్ణ వచ్చి రాజ్‌లో వచ్చిన మార్పును చూసి సంతోషిస్తుంది. తర్వాత బెడ్ రూమ్‌లోకి వచ్చి నేను బూజు దులుపుతానని చెప్పి కాలు జారి కావ్యపై పడతాడు. భార్యాభర్తలిద్దరూ రొమాంటిక్ మూడ్‌లో ఉండటం చూసిన రుద్రాణి, ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. రాజ్ - కావ్యలను విడదీయాలని ధాన్యాన్ని రెచ్చగొడుతుంది రుద్రాణి. రాజ్‌లో వచ్చిన మార్పు గురించి సుభాష్‌తో అపర్ణ చెబుతుండగా కావ్య వింటుంది.

డిసెంబర్ 21వ తేదీ 599వ ఎపిసోడ్‌లో కావ్య లోపల ఉండగా రాజ్ తలుపు గడియ వేసి ఆమెతో మాట్లాడతాడు. దుగ్గిరాల వంశ ప్రతిష్టకి, స్వరాజ్ గ్రూప్ మనుగడకే ఓ పెద్ద సమస్య వచ్చిందని ష్యూరిటీ గురించి చెప్పి తనకు సాయం చేయమని కావ్యని అడుగుతాడు రాజ్. భర్తను అలాంటి స్థితిలో చూడని కావ్య షాక్ అవుతుంది. అయినా నేనున్నానంటూ ధైర్యం చెప్పడంతో కావ్యని హగ్ చేసుకుంటాడు రాజ్. ఉదయాన్నే ఆఫీస్‌కి కలిసి వెళ్తున్న రాజ్- కావ్యలను చూసి సుభాష్ - అపర్ణలు సంతోషిస్తారు. వెళ్తూ వెళ్తూ ఇంటి తాళాలను స్వప్నకి ఇస్తుంది కావ్య. భార్యాభర్తలిద్దరూ కలిసిపోవడంతో రుద్రాణి కుళ్లుకుంటుంది. రాజ్- కావ్యలు కలిసిపోయినట్లుగా కనకానికి చెబుతుంది అపర్ణ. మరోవైపు.. మీకు కట్టాల్సిన 100 కోట్లను ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కడతామని కావ్య బ్రతిమలాడటంతో బ్యాంక్ వాళ్లు ఓకే చెబుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











