Brahmamudi weekly roundup: చిక్కుల్లో రాజ్- కావ్య... రాహుల్ చేతికి డిజైన్లు, అప్పూ ఇన్వెస్టిగేషన్
Photo Courtesy: JioHotstar
అప్పూని పోలీస్ స్టేషన్‌ని తీసుకెళ్లడానికి గుడికి వెళ్తున్నానని ధాన్యలక్ష్మీకి అబద్ధం చెబుతాడు కళ్యాణ్. రాజ్ కావ్యలు స్వరాజ్ కంపెనీ కోసం కొత్త డిజైన్లు వేస్తుండగా వాటిని కొట్టేయాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. గుడిలో కావ్య కళ్లు తిరిగి పడిపోవడంతో అబార్షన్ చేయించుకోమంటే వినలేదని భార్యపై మండిపడతాడు. వీరి మాటలను విన్న పూజారి.. కావ్య సమస్యకు కేరళలో ఆయుర్వేద చికిత్స చేస్తారని చెప్పడంతో రాజ్, కావ్యలు కేరళ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అప్పూని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లడానికి రాజ్, కావ్యల కేరళ ట్రిప్‌ను వాడుకుంటాడు కళ్యాణ్. స్వరాజ్ కంపెనీలో కావ్య వేసిన డిజైన్లను మేనేజర్ మూర్తి కొట్టేసి వాటిని రాహుల్‌కి ఇస్తాడు. కేరళలో ఆయుర్వేద వైద్యుడు కావ్యని పరీక్షించి తాను నయం చేస్తానని చెప్పడంతో రాజ్ చాలా సంతోషిస్తాడు. రాజ్, కావ్యలు వస్తుండగా వారి కారుని ఢీకొట్టి ఓ వ్యక్తి పడిపోతాడు. రాజ్ జేబులో పెన్‌డ్రైవ్ వేసి చనిపోతాడు. దాని కోసం రాజ్ - కావ్యలను రౌడీలు వెంటాడతారు

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు.. 892వ ఎపిసోడ్ నుంచి 897 వరకు ఏం జరిగిందంటే?
డిసెంబర్ 1వ తేదీ 892వ ఎపిసోడ్‌లో..
దుగ్గిరాల ఫ్యామిలీలో అందరూ భోజనం చేస్తుండగా.... మేనేజర్ సతీష్ మేటర్ బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు రాహుల్. వెంటనే రాజ్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెబుతాడు. రాజ్‌కి ఒక్క మాట కూడా చెప్పకుండా మేనేజర్ సతీష్‌ని నీ దగ్గర ఎందుకు చేర్చుకున్నావని రాహుల్‌పై సుభాష్ మండిపడతాడు. కానీ రాజ్ ఈ విషయాన్ని చాలా కూల్‌గా తీసుకుంటాడు. రాహుల్‌కి అనుభవం లేదు.. వాడు కంపెనీలో ఎదగాలంటే సతీష్ లాంటి అనుభవం ఉన్న మేనేజర్ రాహుల్ దగ్గర ఉండటం కరెక్ట్ అని చెబుతాడు రాజ్. నువ్వు ఇలా ప్రతీదానిని లైట్ తీసుకోవడం వల్లే చిన్నాచితకా కంపెనీలు కూడా మనకు పోటీ వచ్చే స్థాయికి చేరుకున్నాయని సీరియస్ అవుతాడు సుభాష్. రేణుక భర్తని కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పూకి కాల్ చేస్తాడు. దాంతో ఎలాగైనా తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని కళ్యాణ్ హెల్ప్ అడుగుతుంది అప్పూ. దాంతో అప్పూని ఆసుపత్రిలో చెకప్ కోసం తీసుకెళ్తున్నట్లు ధాన్యలక్ష్మీ దగ్గర అబద్ధం ఆడి బయటికి తీసుకెళ్తాడు కళ్యాణ్. రాజ్, కావ్యలు కొత్త డిజైన్లు వేస్తుండగా వాటిని ఎలాగైనా కొట్టేయాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు.
డిసెంబర్ 2వ తేదీ 893వ ఎపిసోడ్‌లో..
ఆలయంలో కావ్యని మాత్రమే పంతులుగారు పలకరించడంతో రాజ్ కుళ్లుకుంటాడు. ఇంతలో కావ్య కళ్లు తిరిగి పడిపోబోతుంది. దాంతో నువ్వు ఎంత చెప్పినా అబార్షన్ చేయించుకోలేదని... దాని ఫలితం చూస్తున్నావుగా అని మండిపడతాడు. నా కోసం లోకం చూడని బిడ్డను చంపడం పాపమని వాదిస్తుంది కావ్య. వీరిద్దరి మాటలు విన్న పంతులు గారు.. ఏం జరిగింది? అమ్మాయిని ఎందుకు అబార్షన్ చేయించుకోమని చెబుతున్నావని ప్రశ్నిస్తాడు. బిడ్డను చంపడం దారుణమని, ఎంతోమంది తల్లిదండ్రులు కావాలని ఎందరో దేవుళ్లకు మొక్కుకుంటున్నారని హితవు పలుకుతాడు. దాంతో కావ్య ఆరోగ్య పరిస్ధితి మొత్తం చెబుతాడు రాజ్. ఈ మాటలు విన్న పంతులుగారు.. మా అమ్మాయికి కూడా ఇలాగే జరిగిందని కేరళలో ఈ సమస్యకు ఆయుర్వేద చికిత్స ఉందని పంతులు చెబుతారు. దాంతో రాజ్ కావ్యలు కేరళ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఆఫీస్‌లో కొత్త డిజైన్లను శృతి చేతికి ఇచ్చి జాగ్రత్తలు చెబుతారు రాజ్, కావ్య. నేను, కళావతి కేరళ టూర్‌కి వెళ్తున్నామని దుగ్గిరాల ఫ్యామిలీకి చెబుతాడు రాజ్. ఈ మాటలన్నీ విన్న రాహుల్.. రాజ్, కావ్యలు తిరిగొచ్చేసరికి దుగ్గిరాల కంపెనీని నా కాళ్ల కిందకి తెచ్చుకోవాలని అనుకుంటాడు.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 3వ తేదీ 894వ ఎపిసోడ్‌లో..
రేణుక పాప సిరి మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను అప్పూ చెక్ చేస్తుండగా అక్కడికి ప్రకాశం, ధాన్యం వచ్చి బెడ్ మీదున్న ఫైల్స్ చూసి షాక్ అవుతారు. అప్పూ మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యిందా అని ధాన్యం మండిపడుతుంది. దాంతో తాను కొత్త పాట రాస్తున్నానని, అది పోలీస్ స్టేషన్, కేసులు చుట్టూ ఉంటుందని అందుకే ఆ ఫైల్ చూస్తున్నానని కవర్ చేస్తాడు కళ్యాణ్. అప్పూ పోలీస్ ఆఫీసర్ కాబట్టి పోలీస్ టెర్మినాలజీ అర్ధం కాకపోవడంతో తన హెల్ప్ తీసుకున్నానని చెబుతాడు. రాజ్, కావ్యలు ఇచ్చిన కొత్త డిజైన్స్ కొట్టేయాల్సిందిగా మేనేజర్ సతీష్‌కు చెబుతాడు రాహుల్. తన పాప సిరి కనిపించిందంటూ రేణుక అప్పూకి కాల్ చేసి చెబుతుంది. దాంతో తనను బయటికి తీసుకెళ్లమని కళ్యాణ్‌ని అడుగుతుంది అప్పూ. రాజ్, కావ్యలు కేరళకు వెళ్తుండగా... కళ్యాణ్, అప్పూలు వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో మేం డ్రాప్ చేస్తామని ధాన్యలక్ష్మీకి మస్కా కొడతారు. కేరళకు బయల్దేరుతూ... దుగ్గిరాల నిలయం వైపు చూస్తూ రాజ్, కావ్యలు ఎమోషనల్ అవుతారు.
డిసెంబర్ 4వ తేదీ 895వ ఎపిసోడ్‌లో..
రేణుక పాప సిరి మిస్సింగ్ కేసుకు సంబంధించి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేస్తుంది అప్పూ. నేను పాపను ఇక్కడే చూశానని, అంతలోనే వెళ్లిపోయిందని అప్పూతో అంటుంది రేణుక. ఇంతలో ఆమె భర్త వచ్చి పాప చనిపోయి ఏడాది అవుతోందని, మా బిడ్డ బతికే ఉందని రేణుక భ్రమల్లో ఉందని... ఏడాదిగా ప్రతిరోజూ నాకు ఇది అలవాటేనని చెబుతాడు. ఇప్పుడిప్పుడే బాధను మరిచిపోతుండగా మీరొచ్చి మళ్లీ ఆశలు కల్పించారని రేణుక భర్త అప్పూపై సీరియస్ అవుతాడు. ఇరుగుపొరుగు వారిని ఎంక్వైరీ చేసినా పాప చనిపోయిందని చెప్పడంతో అప్పూ ఆలోచనలో పడుతుంది. స్వరాజ్ కంపెనీలో కావ్య వేసిన డిజైన్లను కొట్టేసి రాహుల్‌కి ఇస్తాడు మేనేజర్. కావ్య, రాజ్‌లు కేరళలోని ఆయుర్వేద వైద్యశాలలో గురువుగారిని కలుస్తారు. కావ్యని పరీక్షించిన గురువుగారు.. ఆమెకు ఏ ఇబ్బంది లేదని, తప్పకుండా తగ్గుతుందని చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. రాజ్, కావ్యలు వెళ్తుండగా ఓ వ్యక్తిని రౌడీలు వెంటాడుతుండగా అతను రాజ్ కారు కింద పడి చనిపోతాడు.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 5వ తేదీ 896వ ఎపిసోడ్‌లో..
రాజ్, కావ్యల కారు తగిలి ఓ వ్యక్తి పడిపోతాడు. అప్పటికే తీవ్రగాయాలతో ఉన్న ఆ వ్యక్తి చనిపోతూ చనిపోతూ.. రాజ్‌కి ఏదో చెప్పబోతూ.. అతని జేబులో ఒక పెన్‌డ్రైవ్ వేస్తాడు. ఆ పెన్‌డ్రైవ్ కోసమే అతనిని వెంటాడుతున్న రౌడీలు.. రాజ్, కావ్యల దగ్గరికి వచ్చి డానియేల్ గాడు ఇచ్చిన పెన్‌డ్రైవ్ ఎక్కడ అని అడుగుతారు. మేం మంచినీళ్లు ఇచ్చేలోపు వాడు చనిపోయాడని రాజ్, కావ్యలు చెబుతారు. రేణుక ఇంటి నుంచి ఆలస్యంగా వచ్చిన అప్పూ- కళ్యాణ్‌లను ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. కళ్యాణ్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ధాన్యానికి అనుమానం వస్తుంది. దాంతో కొడుకు, కోడలిని ప్రకాశం కాపాడతాడు. తన కళ్ల ముందే ఓ వ్యక్తి చనిపోవడంతో కావ్య దాని గురించే ఆలోచిస్తూ ఉండటంతో రాజ్ ఓదారుస్తాడు. గురువుగారు ఇచ్చిన కషాయం చేదుగా ఉండటంతో నేను తాగలేనంటూ కావ్య మారాం చేస్తుంది. దాంతో రాజ్ ఓ పాట పాడి ఆమెను బుజ్జగిస్తాడు.
డిసెంబర్ 6వ తేదీ 897వ ఎపిసోడ్‌లో..
రేణుక కూతురు సిరి ఆచూకీ దొరకకపోవడంతో అసలు నిజంగా పాప బతికే ఉందా? చనిపోయిందా? అని అప్పూ డైలమాలో పడగా కళ్యాణ్ ధైర్యం చెబుతాడు. ఇక కేరళలో రాజ్, కావ్యలు గుడికి వెళ్లి ట్రీట్‌మెంట్ బాగా జరగాలని దేవుడిని కోరుకుంటారు. ఇంతలో రాజ్ కారు దగ్గర చనిపోయిన డానియేల్ అన్నయ్య శామ్యూల్ వచ్చి.. మా తమ్ముడు మీతో ఏమైనా చెప్పాడా? ఏదైనా పెన్‌డ్రైవ్ ఇచ్చాడా అని అడుగుతాడు. వాడేం చెప్పలేదు.. ఏ పెన్‌డ్రైవ్ ఇవ్వలేదని రాజ్, కావ్యలు కోపంగా వెళ్లిపోతారు. శామ్యూల్‌తో వారిద్దరూ మాట్లాడటాన్ని రౌడీలు చూసి రాజ్, కావ్యలను వెంబడిస్తారు. కావ్య వేసిన డిజైన్లను మరో డిజైనర్‌తో వేయిస్తాడు రాహుల్. అయితే డిజైన్లు సరిగా రాకపోవడంతో అతనిపై రాహుల్ సీరియస్ అవుతాడు. ఇక ఆ డిజైన్లు తన డిజైన్లే అని స్వప్నని నమ్మించడానికి క్యారియర్ పేరుతో ఆఫీసుకు రప్పిస్తాడు రాహుల్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











