Brahmamudi weekly roundup: కిడ్నాప్ మిస్టరీ ఛేదించిన అప్పూ.. రాహుల్‌ను దెబ్బకొట్టిన రాజ్
Photo Courtesy: JioHotstar
ఇంటికొచ్చింది యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ కాదు పరోటాల వాడని తెలియడంతో రాజ్ బాధపడతాడు. కావ్య ప్రోత్సాహంతో తనే ఆ యాడ్ డైరెక్ట్ చేసి అద్భుతంగా తీస్తాడు. పాప మిస్సింగ్ వెనుక అసలు సూత్రధారి రేణుక భర్తేనని అప్పూ తెలుసుకుని వాడిని పట్టుకుని పాపని కాపాడుతుంది అప్పూ. తనను మోసం చేసి పోలీస్ డ్యూటీ చేసినందుకు అప్పూపై ధాన్యం సీరియస్ అవుతుంది. జీవితంలో ఇక పోలీస్ యూనిఫాం వేయడానికి వీల్లేదని ఆర్డర్స్ వేస్తుంది. ధాన్యం మనసుని మార్చి ఆమెకు అప్పూ మీద ప్రేమ కలిగేలా చేస్తారు రాజ్, కావ్య. పోయిన్ బిజినెస్ తిరిగి సంపాదించి రాష్ట్రంలోనే నెంబన్ వన్ కంపెనీగా స్వరాజ్ గ్రూప్‌ని నిలబడతారు రాజ్, కావ్య. కళావతి నిద్రపోతుండగా దుగ్గిరాల నిలయం కాలిపోతున్నట్లుగా పీడకల రావడం, రాజ్ హారతి ఆరిపోవడంతో ఆమె మనసు కీడు శంకిస్తుంది. రాజ్‌ని దెబ్బతీయడానికి దొంగ బంగారం అమ్మేవాడితో చేతులు కలుపుతాడు రాహుల్.
బ్రహ్మముడి డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు.. 910వ ఎపిసోడ్ నుంచి 915 వరకు ఏం జరిగిందంటే?
డిసెంబర్ 22 తేదీ 910వ ఎపిసోడ్‌లో..
రాహుల్ చెప్పినట్లుగానే యాడ్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో రాజ్ టైం మొత్తం వేస్ట్ చేస్తాడు పరోటావాడు. ఇంతలో పనిమనిషి పరోటాలు సరిగా చేయడం లేదని వాసన ద్వారా పసిగట్టి వంట గదిలోకి పరిగెడతాడు. పరోటాలు ఎలా వేయాలో పనిమనిషికి చేసి చూపిస్తాడు. అతను తీరు, ప్రవర్తన చూసిన దుగ్గిరాల ఫ్యామిలీకి అనుమానం వస్తుంది. వాడు అసలు యాడ్ డైరెక్టర్ కాదని, పరోటా మాస్టర్ అని ప్రకాశం చెబుతాడు.. చెప్పడమే కాదు స్వయంగా నిరూపిస్తాడు. డబ్బు కోసం ఇదంతా చేశానని పరోటాల వాడు చెప్పి పారిపోతాడు. తన కష్టం, టైం వేస్ట్ కావడంతో రాజ్ బాధపడతాడు. దాంతో కావ్య భర్తని ఓదార్చి.. మీకు డిజైన్స్ పైనా, యాడ్ ఎలా తీయాలో అవగాహన ఉంది కాబట్టి వాళ్లు వీళ్లు వద్దు మీరే డైరెక్షన్ చేయండి అని చెబుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. పరోటా వాడితో వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్‌ని పిలిచి హల్ప్ చేయమని అడుగుతుంది కావ్య. నాకు కొన్ని యాడ్ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఉందని.. మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతానని చెబుతాడు ఆ వ్యక్తి. అలాగే కెమెరామెన్ కూడా సాయం చేస్తానంటాడు. అందరి సహకారంతో రాజ్ స్వయంగా యాడ్ డైరెక్ట్ చేస్తాడు. రాజ్ తీసిన యాడ్ గురించి రుద్రాణి కంగారు పడుతుండగా రాహుల్ వచ్చి ఓదారుస్తాడు.
డిసెంబర్ 23వ తేదీ 911వ ఎపిసోడ్‌లో..
కేసు విచారణలో భాగంగా అప్పూ కానిస్టేబుల్స్‌తో మాట్లాడుతుండగా ఒక మహిళను కొందరు రౌడీలు తరుముకుంటూ రావడంతో ఆమె పరుగులు తీస్తూ వస్తుంది. ఆప్పూ దగ్గరికి వచ్చి తనను దొంగలు వెంటాడుతున్నారని కాపాడమని అంటుంది. దాంతో మీకేం భయం లేదని స్వయంగా లిఫ్ట్ ఇస్తుంది అప్పూ. ఆ మహిళ అప్పూని కాఫీ తాగడానికి పిలుస్తుంది. అప్పూ కి ఆ ఇంట్లో రేణుక భర్త ఈమెతో ఉన్న ఫోటో కనిపించడంతో షాక్ అవుతుంది. అతను ఎవరు అని అప్పూ అడగ్గా.. నా భర్త అని, ఈ మధ్యే పెళ్లి అయ్యిందని చెబుతుంది. నా భర్త కొన్నాళ్ల క్రితం చనిపోతే.. అశోక్ సోషల్ మీడియాలో పరిచయమై నన్ను, నా కూతురికి అండగా నిలవడంతో పెళ్లి చేసుకున్నామని చెబుతుంది. దాంతో అప్పూకి అశోక్ ఎవరో? ఎలాంటివాడో అర్ధమవుతుంది. వెంటనే అతనిని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి తనదైన శైలిలో ఎంక్వైరీ చేయగా అశోక్ మొత్తం కిడ్నాప్ డ్రామా బయటపెడతాడు. రాజ్ తీసిన యాడ్‌ని దుగ్గిరాల ఫ్యామిలీ చూసి మెచ్చుకుంటుంది. ఆ మాటలతో రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. కిడ్నాప్ గ్యాంగ్‌ని పట్టుకున్న అప్పూ మీడియాతో మాట్లాడుతుండగా టీవీలలో చూసిన రుద్రాణి వెంటనే దుగ్గిరాల ఫ్యామిలీని పిలిచి చూపించగా కోడలిని పోలీస్ డ్రెస్‌లో చూసి ధాన్యం రగిలిపోతుంది.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 24వ తేదీ 912వ ఎపిసోడ్‌లో..
తన పర్మిషన్ లేకుండా, తన కళ్లుగప్పి డ్యూటీలో తిరిగి ఎందుకు జాయిన్ అయ్యావని అప్పూపై ధాన్యం మండిపడుతుంది. ఒక తల్లి కన్నీళ్లు తుడవటానికి, తల్లీ బిడ్డలని కలపడానికి అప్పూ ఈ నిర్ణయం తీసుకుందని కావ్య సర్ది చెప్పాలని చూస్తోంది. నన్ను మోసం చేసినందుకు గాను అప్పూకి శిక్షపడాలని, జీవితాంతం పోలీస్ యూనిఫాం వేయడానికి వీల్లేదు, వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆర్డర్స్ వేస్తోంది. తన కలలు, ఆశయాలు కళ్లెదుటే కూలిపోవడంతో అప్పూ కంటతడి పెడుతుంది. దాంతో ఆమెను రాజ్, కావ్యలు ఓదార్చి.. తప్పు మా వల్ల జరిగింది కాబట్టి మేమే సరిదిద్దుతామని చెబుతారు. ఆ వెంటనే ఇందిరతో కలిసి అప్పూ, రాజ్‌లు స్కెచ్ వేస్తారు. గుడిలో అన్నదానం చేసేందుకు డబ్బులు ఇస్తున్న ధాన్యలక్ష్మీని అడ్డుకుంటుంది ఇందిర. అత్తగారిగా నాకు ఒక్కమాట కూడా చెప్పవా అని మండిపడుతుంది. మంచి పని చేస్తున్నప్పుడు ఎవ్వరినీ అడగాల్సిన అవసరం కానీ, పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కానీ లేదని అంటుంది ధాన్యం. మరి అప్పూ చేసింది కూడా మంచి పనే కదా అని చెబుతుంది ఇందిర.
డిసెంబర్ 25వ తేదీ 913వ ఎపిసోడ్‌లో..
నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన నాటి నుంచి మీ మాటను, మావయ్య గారి మాటను ఎప్పుడూ జవదాటలేదు, ఇకపైనా జవదాటలేదు. నేను ఇస్తానన్న విరాళాన్ని ఆపేస్తున్నాను, అన్నదానం కూడా ఆపేస్తున్నానని చెప్పి వెళ్లిపోతుంది ధాన్యం. తన ప్లాన్ రివర్స్ కావడంతో ఇందిర షాక్ అవుతుంది. వెంటనే పంతులు గారిని కలిసిన రాజ్.. అన్నదానం జరిపించమని చెబుతాడు. ఇంతలో రేణుక, తన కూతురిని తీసుకుని వస్తుంది. ఇలాంటి కోడలు ఉన్నందుకు నిజంగా మీరు అదృష్టవంతురాలిని ధాన్యలక్ష్మీని మెచ్చుకుంటుంది. నేను పెద్దయ్యాక మీలాగే పోలీస్ అవుతానని.. మీరు ఎప్పటికీ పోలీస్ యూనిఫాంలోనే ఉండాలని పాప చెప్పిన మాటలతో అప్పూ, దుగ్గిరాల ఫ్యామిలీ ఎమోషనల్ అవుతుంది. రేణుక అన్న మాటలతో ధాన్యం బాధపడుతుండగా ప్రకాశం వచ్చి క్లాస్ పీకుతాడు. కావ్య వేసిన కొత్త డిజైన్స్‌కి మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ వచ్చినట్లు శృతి చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. రాహుల్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్‌ని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అతను రగిలిపోతాడు. ఇది గమనించిన రుద్రాణి.. రాజ్, కావ్యలను ఎమోషనల్‌గా దెబ్బ కొట్టాలని కొడుక్కి చెబుతుంది.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 26వ తేదీ 914వ ఎపిసోడ్‌లో..
తాను ఇంకెప్పుడూ పోలీస్ యూనిఫాం వేసుకోలేనని అప్పూ బాధపడుతుండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఓదారుస్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి నీ నిజాయితీ ఏంలో ఆ తల్లిని బిడ్డల్ని ఒక్కటి చేశావని మెచ్చుకుంటుంది. నువ్వు ఖాకీ డ్రెస్‌కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని.. ఇలాగే పేదలకు న్యాయం చేయమని ధాన్యం చెబుతుంది. కాకపోతే డెలివరీ అయి, నా చేతుల్లో బిడ్డను పెట్టే వరకు మాత్రం ఉద్యోగం చేయొద్దని అంటుంది. ధాన్యలక్ష్మీ - అప్పూ కలిసిపోవడం, కోడలిని అత్తగారు క్షమించడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. రాజ్, కావ్యలు కష్టపడి స్వరాజ్ కంపెనీ సేల్స్ భారీగా పెంచుతారు. రాష్ట్రంలోనే స్వరాజ్ కంపెనీ నెంబర్ వన్‌గా మారిందని, పాత క్లయింట్స్ మళ్లీ వెతుక్కుంటూ వస్తున్నారని కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. రాజ్‌లాగా నిజాయితీతో, విలువలతో బిజినెస్ చేస్తే నీకు వ్యాపారంలో తిరుగుండదని రాహుల్‌కు సుభాష్ క్లాస్ పీకుతారు. రాహుల్ ఎవరినో మోసం చేసి ఇలా ఎదిగాడా? అని సుభాష్ మాటలపై స్వప్న మండిపడుతుంది. అయితే కావ్య ఈ గొడవను చాకచక్యంగా కూల్ చేస్తుంది.
డిసెంబర్ 27వ తేదీ 915వ ఎపిసోడ్‌లో..
దుగ్గిరాల నిలయం మంటల్లో కాలిపోతున్నట్లుగా పీడకల రావడంతో కావ్య ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. కావ్యకి ఏం జరిగిందోనని రాజ్ అడగ్గా.. తనకొచ్చిన కల గురించి చెబుతుంది కళావతి. నిద్రపోయే ముందు ఇంటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ఆలోచనల వల్ల అలాంటి కల వచ్చిందని చెప్పి నిద్రపుచ్చుతాడు. రాజ్, కావ్యల బిజినెస్ స్ట్రాటజీలతో నువ్వు పోటీపడలేవు కాబట్టి ఎమోషనల్‌గా వాళ్లని దెబ్బతీయాలని చెబుతుంది రుద్రాణి. దాంతో దొంగ బంగారం సప్లయ్ చేసే వ్యక్తికి రాహుల్ ఫోన్ చేసి రాజ్ ఆఫీస్‌కి వెళ్లి కలిసి వస్తే నీ బంగారం మొత్తం నేనే కొంటానని చెబుతాడు. రాజ్ హారతి తీసుకుంటుండగా అది ఆరిపోవడంతో అపర్ణ, ఇందిర, కావ్యలు భయపడతారు. ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్లొద్దని చెప్పినా వినకుండా రాజ్ వెళ్తాడు రాజ్. అప్పూని సివిల్స్ ప్రీపేర్ అవ్వమని ధాన్యం బుక్స్ ఇవ్వడంతో అప్పూ ఎమోషనల్ అవుతుంది. రాహుల్ చెప్పినట్లుగానే దొంగ బంగారం అమ్మేవాడు రాజ్‌ని కలుస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications










