Brahmamudi Weekly Roundup : పీకల్లోతు సమస్యల్లో కావ్య - రాజ్.. దుగ్గిరాల కుటుంబం రోడ్డున పడుతుందా?
తనను పెద్ద గండం నుంచి గట్టెక్కించినందుకు కావ్యకి రాజ్ థ్యాంక్స్ చెబుతాడు. బ్యాంక్ వారికి వాయిదా కట్టగా ఆఫీస్‌లు డబ్బులు మొత్తం ఖాళీ అయిపోవడంతో ఎలా బండిని నడపాలో తెలియక రాజ్- కావ్యలు తలపట్టుకుంటారు. ఇకపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కారణం చెప్పాలని కావ్య ఆర్డర్స్ వేస్తుంది. పనిమనిషి శాంతను పిలిపించిన కావ్య రోజుకొక టిఫిన్, ఒకటే కర్రీ వండమని చెబుతుంది. రుద్రాణి - ధాన్యలక్ష్మీలు ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ చేస్తుండటంతో వాళ్ల క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ చేస్తుంది కావ్య. తాతయ్య హాస్పిటల్ బిల్ కోసం ఇచ్చిన చెక్ క్లియర్ కాకపోవడంతో పాటు ఆఫీస్ అకౌంట్‌లో ఉన్న డబ్బు మాయం కావడంతో రాజ్ - కావ్యలు షాక్ అవుతారు. రూ.10 లక్షలు ఖరీదు చేసే గోల్డ్ నెక్లెస్ కొనుక్కున్న స్వప్నని అడ్డుపెట్టుకుని కావ్యని టార్గెట్ చేస్తారు రుద్రాణి - ధాన్యం. దీంతో స్వప్నని కావ్య నిలదీయడంతో ఆమె నగలు ఇచ్చేసి వెళ్లిపోతుంది. తాతయ్య గారి హాస్పిటల్ బిల్ క్లియర్ కాకపోవడంతో కావ్యని సుభాష్ ప్రశ్నిస్తాడు. ఆఫీస్‌లో ఆడిటింగ్ జరుగుతుండటంతో నేనే అకౌంట్స్ బ్లాక్ చేయించానని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
డిసెంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు .. 600 ఎపిసోడ్ నుంచి 605 వరకు ఏం జరిగిందంటే?
డిసెంబర్ 23వ తేదీ 600వ ఎపిసోడ్‌లో బ్యాంక్ వాళ్లని ఒప్పించి తనను, తన కంపెనీని, తన కుటుంబాన్ని పెద్ద గండం నుంచి గట్టెక్కించినందుకు కావ్యకి థ్యాంక్స్ చెబుతాడు రాజ్. ఇప్పటికైతే రూ.20 కోట్లు కట్టేశామని .. మిగిలిన రూ.80 కోట్ల గురించి ఆలోచిస్తుండగా రాజ్‌కు కావ్య భరోసా ఇస్తుంది. ఆ వెంటనే మేనేజర్‌ను పిలిచి వర్క్ వీలైనంత వేగంగా చేయాలని రాజ్ ఆర్డర్స్ వేయగా.. ఆఫీస్ బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తుచేస్తాడు మేనేజర్. రాజ్ - కావ్య కలిసిపోతున్నారని ఆ తర్వాత మనం టీ అమ్ముకుని బతకాల్సిందేనని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. ఇంతలో తనకు రూ.4 లక్షలు ఇవ్వాలని స్వప్నతో గొడవ పెట్టుకుంది . తన వల్ల కావ్యకి మాట వస్తుందని భయపడ్డ స్వప్న .. అత్తగారు అడిగినంత ఇవ్వబోతుండగా కావ్య వచ్చి అడ్డుకుంటుంది. ఇకపై ఎవరైనా డబ్బులు తీసుకుంటే సరైన కారణం చెప్పాలని , పెట్రోల్ పోయించుకున్నా బిల్ చూపించాలని ఆర్డర్స్ వేస్తుంది.

డిసెంబర్ 24వ తేదీ 601 ఎపిసోడ్‌లో ఈ రోజు నుంచి ఇంట్లో అంతా తాను చెప్పినట్లే నడవాలని కావ్య శాసనం చేసేసరికి రుద్రాణి, ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. రాజ్ కూడా కళావతికే సపోర్ట్ చేయడంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. తాను గెంటేసిన పనిమనిషి శాంత తిరిగి రావడంతో రుద్రాణి ఆమెపై మండిపడుతుంది. ఇంతలో కావ్య వచ్చి శాంతకు జీతం ఇచ్చేది నేను ఆమెను పొమ్మనే అధికారం ఎవరికీ లేదని చెబుతుంది. ఆసుపత్రిలో కోమాలో ఉన్న సీతారామయ్య ఎప్పుడు కోలుకుంటాడని ఇందిర డాక్టర్‌ను నిలదీస్తుంది. ఉదయాన్నే టిఫిన్‌లో ఇడ్లీలు తప్పించి మరో వెరైటీ ఉండకపోవడంతో శాంతపై రుద్రాణి, ధాన్యలక్ష్మీలు మండిపడతారు. ఇంతలో కావ్య వచ్చి ఇకపై రోజుకొక వెరైటీ మాత్రమే ఉంటుందని తేల్చిచెబుతుంది. ప్రకాశం తన వర్క్‌లో బిజీగా ఉండగా ధాన్యలక్ష్మీ వచ్చి కావ్య మమ్మల్ని ఇడ్లీలు తినమని చెప్పిందని అనడంతో అతను మండిపడతాడు.
డిసెంబర్ 25వ తేదీ 602వ ఎపిసోడ్‌లో ఇంట్లో రోజురోజుకి కావ్య పెత్తనం పెరిగిపోవడంతో ప్రకాశంపై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. గార్డెన్‌లో అత్తగారి దగ్గరికి వెళ్లిన కావ్య నేను ఇంత కఠినంగా ఉండటానికి కారణం ఏంటన్నది టైం వచ్చినప్పుడు చెబుతానని అంటుంది కావ్య. ఇంట్లో ఇడ్లీలకు బదులుగా రుద్రాణి - ధాన్యలక్ష్మీలు బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు. వీళ్లని ఎలాగైనా కంట్రోల్ చేయాలని భావించిన కావ్య వాళ్ల క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ చేస్తుంది. తాతయ్య హాస్పిటల్ బిల్ కట్టడం కోసం ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పాటు ఆఫీసు అకౌంట్‌లోనూ డబ్బు విత్ డ్రా అయినట్లు తెలియడంతో కావ్య - రాజ్‌లు షాక్ అవుతారు. ఆకలికి తట్టుకోలేక శాంత వండిన భోజనాన్ని తినడానికి వెళ్తారు ధాన్యం - రుద్రాణి.

డిసెంబర్ 26వ తేదీ 603వ రుద్రాణి - ధాన్యలక్ష్మీ ముందు నెక్లెస్, ఒంటి నిండా బంగారంతో స్వప్న దిగుతుంది. అంత డబ్బు నీకు ఎక్కడిదని వాళ్లు ప్రశ్నించగా.. మా చెల్లి ఇచ్చిందని స్వప్న ఆన్సర్ ఇస్తుంది. మా కార్డ్స్ అన్ని బ్లాక్ చేసి వాళ్ల అక్కకి మాత్రం కావ్య రూ.10 లక్షలు ఇచ్చిందని సుభాష్ - అపర్ణల దగ్గరికి వెళ్లి గొడవ చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ. ఆఫీస్ నుంచి వచ్చిన కావ్యతో రుద్రాణి - ధాన్యలక్ష్మీలు గొడవ పడతారు. మాకు డబ్బు ఇవ్వకుండా మీ అక్కకి మాత్రం రూ.10 లక్షలు ఇచ్చి నెక్లెస్ కొనిస్తావా అని నిలదీస్తారు. దాంతో స్వప్నపై మండిపడిన కావ్య.. నీకు డబ్బు ఎవరిచ్చారు అని అడగ్గా, నువ్వేగా చెక్ ఇచ్చావ్ అంటుంది స్వప్న. దీంతో రుద్రాణి- ధాన్యంలు మరింత రెచ్చిపోతారు. అయితే రాజ్ జోక్యం చేసుకుని అసలు నిజం స్వప్నతోనే చెప్పిస్తాడు. అక్క అని కూడా చూడకుండా తనను ఇంత మంది అవమానిస్తావా అంటూ కావ్యపై కోప్పడిన స్వప్న నగలు మొత్తం చెల్లెలి చేతిలో పెట్టి వెళ్లిపోతుంది.
డిసెంబర్ 27వ తేదీ 604వ ఎపిసోడ్‌లో రుద్రాణి, ధాన్యలక్ష్మీలకు క్లాస్ పీకి తన భార్యను లోపలికి తీసుకెళ్తాడు రాజ్. తనను అందరి ముందు అవమానించిందని కావ్యపై రగిలిపోతుంది స్వప్న. దీంతో ఆమెను తమ దారిలో తెచ్చుకోవాలని రాహుల్ - రుద్రాణిలు మాయ మాటలు చెబుతుండగా స్వప్న షాక్ ఇస్తుంది. తర్వాత కావ్య దగ్గరికి వెళ్లి నన్ను ఎందుకు అవమానించావని అడుగుతుంది స్వప్న. కానీ కావ్య నుంచి అదే ఆన్సర్ రావడంతో స్వప్న బాధపడుతుంది. నువ్వు స్వప్నతో అంత కఠినంగా ఎందుకు ఉంటున్నావని కావ్యని ప్రశ్నిస్తాడు రాజ్. తాతయ్య హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలో తెలియక కావ్య - రాజ్‌లు ఆలోచిస్తుంటారు. ఉదయాన్నే ఆస్తి పంపకాల గురించి సుభాష్‌ని అడగమని ప్రకాశ్‌ని రెచ్చగొడుతుంది ధాన్యలక్ష్మీ.

డిసెంబర్ 28వ తేదీ 605వ ఎపిసోడ్‌లో సుభాష్ దగ్గరికి వచ్చి కావ్య పెట్టిన రూల్స్ గురించి కంప్లయంట్ చేస్తాడు ప్రకాశం. సీతారామయ్య హాస్పిటల్ బిల్ క్లియర్ కాలేదని ఫోన్ రావడంతో కావ్యని పిలిచి అడుగుతాడు సుభాష్. ఆ వెంటనే రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఆమెను రౌండప్ చేస్తారు. ఇంతలో రాజ్ కలగజేసుకుని రాహుల్ ఉన్నప్పుడు జరిగిన లెక్కలకు సంబంధించి ఆఫీస్‌లో ఆడిటింగ్ జరుగుతోందని అందుకే అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేశామని చెబుతాడు. గార్డెన్‌లో ఒంటరిగా బాధపడుతున్న ఇందిరను ఓదారుస్తుంది కావ్య. రాజ్ దగ్గరికి వచ్చిన సుభాష్ నువ్వు ఏదో సమస్యల్లో ఉన్నట్లుగా అనిపిస్తోందని అదేంటో చెప్పాలని అంటాడు. రాజ్ మాటలు తేడాగా ఉండటంతో రుద్రాణి - ధాన్యలక్ష్మీలు చెవులు కొరుక్కుంటూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











