Brahmamudi weekly roundup: రాజ్‌ని కోరుకున్న రేఖ.. కావ్య బిడ్డని చంపేందుకు రుద్రాణి కుట్ర

Photo Courtesy: JioHotstar
తన మనిషి రాజ్‌ను కలవడంతో అతనిని ఇరికించేందుకు రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఫారిన్ నుంచి వచ్చిన రుద్రాణి కూతురు రేఖ.. రాజ్‌ను ఇష్టపడటంతో వారిద్దరినీ ఒక్కటి చేయడానికి కావ్య కడుపుని పొగొట్టమని చెబుతాడు రాహుల్. కూతురి కోసం కావ్య కడుపుని పొగొట్టేందుకు పసరు మందుని తీసుకొచ్చి కళావతి తాగే కషాయంలో కలుపుతుంది రుద్రాణి. ఇంట్లోనే తిని కూర్చుంటే మాకు బోర్ కొడుతుందని కావ్య, అప్పూలు చెప్పడంతో రాజ్, కావ్యలు ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేసి ఇంటిల్లిపాదితో రకరకాల స్కిట్స్ చేయిస్తారు. రాజ్ కారు తాళాలు కొట్టేసిన రాహుల్.. అందులో దొంగ బంగారం పెట్టేందుకు తగిన టైం కోసం వెయిట్ చేస్తాడు. అప్పూ, కావ్యలను పుట్టింటికి తీసుకెళ్లడానికి కనకం రాగా.. కొన్నిరోజులు కోడళ్లు ఇక్కడే ఉంటారని చెబుతారు ఇందిర, అపర్ణ. తన కూతుళ్లని ప్రేమగా చూసుకుంటున్న దుగ్గిరాల కుటుంబాన్ని మెచ్చుకుంటుంది కనకం

బ్రహ్మముడి డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు .. 916వ ఎపిసోడ్ నుంచి 921 వరకు ఏం జరిగిందంటే?

డిసెంబర్ 29వ తేదీ 916వ ఎపిసోడ్‌లో ..
రాహుల్ చెప్పినట్లుగానే దొంగ బంగారం అమ్మే వ్యక్తి.. నేరుగా రాజ్‌ని కలుస్తాడు. అతని డీల్ వినగానే రాజ్‌కి పట్టరాని కోపం వచ్చి బయటకు గెంటేస్తాడు. ఆ వ్యక్తి .. రాహుల్‌కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా రాహుల్ చాలా సంతోషిస్తాడు. నా కోసం నువ్వు నాలుగు రోజులు జైళ్లో ఉంటే నీకు అండగా నిలుస్తానని మాట ఇస్తాడు. తనకొచ్చిన కల, అపశకులన గురించి గుడిలో పూజారి గారికి చెబుతుంది కావ్య. ఈసారి ఈ కష్టాలను దాటడం అంత తేలిక కాదని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో దుగ్గిరాల వారింటికి రుద్రాణి కూతురు రేఖ ఫారిన్ నుంచి వస్తుంది. ఆమెను చూడగానే అంతా షాక్ అవుతారు. రాజ్ మంచి మాటలు, ప్రవర్తన చూసి బావని ఇష్టపడుతుంది రేఖ.

డిసెంబర్ 30వ తేదీ 917వ ఎపిసోడ్‌లో ..
రాజ్ బావని అప్పుడే నాకిచ్చి పెళ్లి చేసుంటే నా జీవితం మరోలా ఉండేదాని రుద్రాణితో గొడవ పడుతుంది రేఖ. అర్ధరాత్రి మందు తాగుతున్న రేఖని రాహుల్ మందలిస్తుండగా రాజ్ వచ్చి నీకు ఈ ఇంట్లో ఏం కావాలన్నా నన్ను అడుగు.. అనవసరం డిప్రెషన్‌లోకి వెళ్లొద్దని చెబుతాడు. కావ్యని రాజ్ కేరింగ్‌ చూసుకోవడం చూసిన రేఖ కుళ్లుకుంటుంది.. రాజ్ తీసుకొస్తున్న జ్యూస్‌ని కావాలని తాగేస్తుంది. కావ్యకి మందులు ఇవ్వకుండా పాస్తా చేస్తున్న పనిమనిషిపై ఇందిర, అపర్ణలు మండిపడతారు. దాంతో బాధపడుతున్న రేఖని రాజ్ ఓదార్చి పాస్తా ఆర్డర్ చేసి ఇస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup December 29th to january 3rd episode Story

Photo Courtesy: JioHotstar

డిసెంబర్ 31వ తేదీ 918వ ఎపిసోడ్‌లో ..
రాజ్- రేఖలు క్లోజ్‌గా ఉండటం చూసిన కావ్య.. కావాలని రాజ్‌ని ఏడిపిస్తుంది. నా మనవడు శ్రీరామచంద్రుడు.. వాడిని టార్చర్ చేయొద్దని అడుగుతుంది ఇందిర. మీ మనవడిని ఆడుకునే అదృష్టం వచ్చింది.. ఈసారి మాత్రం వదలనని చెబుతుంది కావ్య. రాజ్ కారులో రాహుల్ దొంగ బంగారం పెట్టేందుకు ప్లాన్ చేస్తుండగా అప్పూ చేసి ప్రశ్నించడంతో రాహుల్‌కు చెమటలు పడతాయి. ఇంతలో స్వప్న రావడంతో రాహుల్ బతికిపోతాడు. నాకు రాజ్ బావ కావాలని రేఖ మారాం చేయడంతో రుద్రాణి తలపట్టుకుంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి.. కావ్య కడుపు పొగొడితే రేఖ కోరిక తీరుతుందని ప్లాన్ చెబుతాడు.

జనవరి 1వ తేదీ 919వ ఎపిసోడ్‌లో ..
రాహుల్ చెప్పిన ప్లాన్ నచ్చడంతో కూతురి భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకుంటుంది రుద్రాణి. కావ్య కడుపులోని బిడ్డను చంపడం కోసం ఓ అడవి మనిషి నుంచి పసరు మందు కొనుగోలు చేస్తుంది. ఆ మందుని కావ్య తాగే కషాయంలో కలిపేస్తుంది. కావ్య, అప్పూలకు నెలలు నిండటంతో ఇంట్లో వాళ్లు వారిద్దరికీ ఏ పనులు చెప్పరు. దాంతో అక్కాచెల్లెళ్లకు బోర్ కొట్టి తాడోపేడో తేల్చుకోవాలని రాజ్- కళ్యాణ్‌ల దగ్గరికి వెళ్లి విషయం చెబుతారు. అయితే మీకు రేపటి నుంచి ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని అన్నదమ్ములిద్దరూ అంటారు. ఆఫీసుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న సుభాష్, ప్రకాశంలను ఆపిన రాజ్.. ఈరోజు మీకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని చెబుతాడు.

Brahmamudi Telugu Serial Weekly roundup December 29th to january 3rd episode Story

Photo Courtesy: JioHotstar

జనవరి 2వ తేదీ 920వ ఎపిసోడ్‌లో ..
కావ్య, అప్పూలకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి ఇంటిల్లిపాదిని ఒకచోట కూర్చోబెట్టి చీటీలు వేస్తారు రాజ్, కళ్యాణ్. అందులో ఎవరికీ ఏం వస్తే అది చేయాల్సి ఉంటుంది. దాంతో సీతారామయ్య, అప్పూ- కళ్యాణ్, ఇందిర - అపర్ణ, ప్రకాశం - ధాన్యలక్ష్మీ, స్వప్న - రాహుల్, సుభాష్, స్వప్న, రుద్రాణిలు రకరకాల టాస్క్‌లు చేస్తారు. చివరికి రేఖ చీటి తీయగా డ్యూయెట్ చేయాలని వస్తుంది. దాంతో నేను రాజ్ బావతో కలిసి డ్యూయెట్‌కి డ్యాన్స్ చేస్తానని రేఖ మారాం చేయడంతో చేసేది లేక రేఖతో కలిసి డ్యాన్స్ చేస్తాడు రాజ్. ఇంతలో కావ్యకి తన చేతితో కషాయం కలిపి తీసుకొస్తాడు రాజ్. రాజ్ లాంటి భర్త దొరికినందుకు కావ్య అదృష్టవంతురాలని ఇంట్లో వాళ్లు మెచ్చుకోవడంతో రేఖ కుళ్లుకుంటుంది.

జనవరి 3వ తేదీ 921వ ఎపిసోడ్‌లో ..
రాజ్ బావతో కలిసి డ్యాన్స్ చేశానని రేఖ మురిసిపోతుంది. ఇంతలో రాజ్ కారు తాళాలు తీసుకొని రాహుల్ వచ్చి.. వాడి కారుతో దొంగ బంగారం పెట్టి జైలుకు పంపిస్తానని చెబుతాడు. ఆ మాటలు విన్న రేఖ షాక్ అవ్వగా.. అలా చేయకపోతే రాజ్ మన కంట్రోల్‌లోకి రాడని చెబుతుంది రుద్రాణి. ఉదయాన్నే దుగ్గిరాల వారింటికి కనకం వచ్చి కావ్య, అప్పూలను పురిటి కోసం పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పగా అపర్ణ, ఇందిరలు బాధపడతారు. పిల్లలు కొన్నిరోజులు ఇక్కడే ఉంటారని చెప్పడంతో కనకం సరేనని అంటుంది. శ్రీమంతం ఖర్చుల్లో తాము సంపాదించిన డబ్బు కూడా కలపమని కనకం అడగటంతో రాజ్ సరేనని అంటాడు. అప్పూ కోసం కళ్యాణ్ చీర తీసుకోగా.. అప్పూ తన తల్లి తెచ్చిన చీరను చూసి మురిసిపోతుంది. కళ్యాణ్ చీరను గమనించిన అప్పూ.. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. మీ అమ్మనాన్నల తర్వాతే నేను అని కళ్యాణ్ చెప్పడంతో అప్పూ బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X