Brahmamudi Weekly Roundup : కోమాలోకి సీతారామయ్య .. రుద్రాణి, ధాన్యలక్ష్మీ ప్లాన్ గ్రాండ్ సక్సెస్?
రాజ్ అపాయింట్ చేసిన వంట మనిషి స్టెల్లా ఇంట్లో వాళ్లకి చుక్కలు చూపెడుతుంది. రాహుల్‌తో సరసలాడుతున్న స్టెల్లాను చీపురు కట్టతో కొట్టి బయటికి గెంటేస్తుంది స్వప్న. సుభాష్‌కి అపర్ణ విడాకుల నోటీసు పంపడంతో దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. దీంతో తల్లికి రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి కనకం ఇంటికొచ్చి కావ్యకి విడాకుల నోటీసు ఇస్తాడు రాజ్. వెంటనే సీతారామయ్య మనవడి చెంప పగులగొట్టి నీకు నచ్చినా , నచ్చకున్నా కావ్య దుగ్గిరాల వారింట్లోనే ఉంటుందని చెబుతాడు. అపర్ణ, కావ్యలు వచ్చేసరికి ధాన్యలక్ష్మీ ఉరేసుకోబోతుంది.. ఇంట్లో ఈ గొడవ చూసి సీతారామయ్య గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పిస్తారు. అప్పూ ఎస్ఐ ట్రైనింగ్‌కి సెలెక్ట్ కావడంతో కళ్యాణ్ చాలా సంతోషించి ఆమెను పంపిస్తాడు. సీతారామయ్య కోమాలోకి వెళ్లిపోయినట్లు చెప్పడంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. భోజనాల దగ్గర రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఆస్తి కోసం మరోసారి గొడవ పడతారు.
డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు .. 582 ఎపిసోడ్ నుంచి 587 వరకు ఏం జరిగిందంటే?
డిసెంబర్ 2వ తేదీ 582వ ఎపిసోడ్‌లో రాజ్ లక్ష రూపాయాల జీతంతో అపాయింట్ చేసిన చెఫ్ స్టెల్లా తనను తాను పరిచయం చేసుకుంటుంది. తాను అన్ని వెరైటీలు చేస్తానని చెప్పడంతో దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా తలా ఒక వెరైటీ చెబుతారు. అన్ని చేసి పెడతాను కానీ తనకు అసిస్టెంట్స్ కావాలని చెబుతుంది. రేపు అసిస్టెంట్స్‌ని ఏర్పాటు చేస్తానని.. ఈ రోజుకు సర్దుకోవాలని రాజ్ చెబుతాడు. అసిస్టెంట్స్ లేకుండా తన వల్ల కాదని స్టెల్లా చెప్పడంతో రాజ్, రాహుల్, ప్రకాశ్‌లు హెల్ప్ చేస్తారు. అయితే వండిన వంటకాలను కిచెన్‌లోకి తీసుకురమ్మని ఆర్డర్స్ వేయడంతో స్టెల్లాపై రాజ్ మండిపడతాడు. ఇంతలో సీతారామయ్య, ఇందిర, సుభాష్‌లకు భోజనం వడ్డిస్తుంది కావ్య. తాను చేసిన వెరైటీలు పది నిమిషాల్లో తినకుంటే పడైపోతాయని స్టెల్లా చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.

డిసెంబర్ 3వ తేదీ 583వ ఎపిసోడ్‌లో స్టెల్లా డైరెక్షన్‌లో చేయించిన ఫుడ్ తినగానే రాజ్, ప్రకాష్, రాహుల్‌కి కడుపులో ఏదేదో అవుతుంది. అయినప్పటికీ కావ్య ముందు వాళ్లంతా తింటున్నట్లుగా నటిస్తారు. ఇంతలో కిచెన్‌లో స్టెల్లా దగ్గరికొచ్చిన రాహుల్.. తనకు మసాజ్ చేయమంటూ డబ్బులిస్తాడు. వెంటనే స్టెల్లాను గదిలోకి తీసుకెళ్లి తలకి మసాజ్ చేయించుకుంటూ ఉండగా స్వప్న చూస్తుంది. పట్టరాని కోపంతో ఇద్దరినీ చీపురు కట్టతో చితకబాది స్టెల్లాను ఇంట్లో నుంచి తరిమేస్తుంది. ఇంతలో పోస్ట్‌మెన్ వచ్చి లెటర్ ఇస్తాడు. అది చదివిన రాజ్ అమ్మ నీకు విడాకుల నోటీస్ పంపిందని సుభాష్‌కు చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆఘమేఘాలపై ఇంటికి వెళ్లిన కావ్య అపర్ణపై కేకలు వేస్తుంది. మీరు మా కోసం మావయ్యగారిని ఇబ్బంది పెడుతున్నారని, మీ కాపురంలో సమస్యలు తెచ్చుకుంటున్నారని ఫైర్ అవుతుంది.
డిసెంబర్ 4వ తేదీ 584వ ఎపిసోడ్‌లో అమ్మని ఇంటికి తీసుకొస్తానని చెప్పిన రాజ్ ఉదయాన్నే కనకం ఇంటికెళ్లి కావ్య చేతిలో విడాకుల నోటీసు పెడతాడు. నువ్వు నా మీద వదిలిన అస్త్రాన్ని నేను నీ మీదకే ప్రయోగించానని అపర్ణతో అంటాడు. 5 నిమిషాల్లో నువ్వు ఇంటికి రాకపోతే ఇక ఎప్పటికీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదని తల్లికే వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో సీతారామయ్య వచ్చి మనవడి చెంప పగులగొడతాడు. కావ్య ఎప్పటికీ దుగ్గిరాల ఇంటి కోడలని, నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆమె నా ఇంట్లోనే ఉంటుందని తెగేసి చెబుతాడు. రాజ్ వెళ్లిపోగానే కనకం, కృష్ణమూర్తిలు సీతారామయ్యకి చేతులెత్తి మొక్కుతారు. తన మీద సీతారామయ్య, ఇందిరలు చూపిస్తున్న ప్రేమతో కరిగిపోయిన కావ్య ఇంటికి రావడానికి అంగీకరిస్తుంది.

డిసెంబర్ 5వ తేదీ 585వ ఎపిసోడ్‌లో కళ్యాణ్ నీ దగ్గర నిజం దాచిపెట్టాడని.. రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర మూడేళ్లు పనిచేస్తానని అగ్రిమెంట్ రాసిచ్చాడని అప్పూకి చెబుతుంది అనామిక. నీ కొడుక్కి న్యాయం జరిగి, ఆస్తి దక్కించుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. కావ్య, అపర్ణ గడప దాటి లోపలికి అడుగుపెట్టే సరికి ధాన్యలక్ష్మీ ఉరేసుకుంటూ కనిపిస్తుంది. అపర్ణ, ఇందిర ఎంత నచ్చచెబుతున్నా వినిపించుకోకుండా ధాన్యలక్ష్మీ ఉరితాడు పట్టుకుంటుంది. ఆస్తి కోసం కుటుంబ సభ్యులంతా కొట్టుకుంటూ ఉండటాన్ని చూసి సీతారామయ్య తట్టుకోలేక కుప్పకూలిపోతాడు. దీంతో పెద్దాయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తారు.
డిసెంబర్ 6వ తేదీ 586వ ఎపిసోడ్‌లో చావు బతుకుల మధ్య ఉన్న సీతారామయ్య.. కావ్యతో మాట్లాడాలని అనుకుంటున్నాడని డాక్టర్ చెప్పడంతో ఆమె లోపలికి వెళ్తుంది. ఏం జరిగినా సరే, ఎవరెన్ని మాటలు అన్నా సరే ఇంటిని విడిచిపెట్టి వెళ్లొద్దని కావ్య దగ్గరి నుంచి సీతారామయ్య మాట తీసుకుంటాడు. మీ తాతగారికి సీరియస్‌గానే ఉందని ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని రాజ్‌తో డాక్టర్ చెప్పడంతో అతను షాక్ అవుతాడు. ఎస్ఐ ట్రైనింగ్‌కి సెలెక్ట్ అయినట్లుగా అప్పూకి లెటర్ వస్తుంది .. అది చూసి కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు. భార్యను ట్రైనింగ్‌కు పంపుతుండగా కావ్య ఫోన్ చేసి తాతయ్య గురించి చెబుతుంది. అప్పూని ఒంటరిగా స్టేషన్‌కి పంపి తాను హడావుడిగా ఆసుపత్రికి బయల్దేరతాడు

డిసెంబర్ 7వ తేదీ 587వ ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కి వచ్చిన కళ్యాణ్ తాతయ్య ఆరోగ్యం గురించి ఆరా తీస్తుండగా పెద్దాయన కోమాలోకి వెళ్లినట్లు చెబుతాడు డాక్టర్. సీతారామయ్యకి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసిన విషయం తెలుసుకున్న కృష్ణమూర్తి , కనకం చాలా బాధపడతారు. ఒంటరిగా కూర్చొని భర్త ఫోటోను చూస్తూ బాధపడుతున్న ఇందిరను కావ్య ఓదార్చి భోజనానికి తీసుకెళ్తుంది. ఆస్తి కోసం రుద్రాణి, ధాన్యలక్ష్మీలు మరోసారి గొడవ చేస్తారు. దీంతో అపర్ణ, కావ్య, ప్రకాష్, సుభాష్‌లు వారికి కౌంటరిస్తారు. ఈ గొడవని చూసిన ఇందిర కోప్పడి ఆపమని అందరిపై కేకలు వేస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











