Brahmamudi Weekly Roundup : నందగోపాల్ వెనుక అనామిక.. కావ్యకి కుటుంబం దూరమవుతుందా?
ఆడిటింగ్ చేయించడం వల్లే ఇంట్లో ట్రాన్సాక్షన్స్ ఆపిసినట్లు చెబుతాడు రాజ్. తాతయ్య కోమాలోకి వెళ్లిన విషయాన్ని అప్పూకి చెబుతాడు కళ్యాణ్. కార్ల రెంట్ కట్టలేక వాటిని తిప్పి పంపించేస్తుంది కావ్య. దొరికిందే ఛాన్స్ అన్నట్లు రుద్రాణి .. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి ఇంట్లో గొడవ పెడుతుంది. అనామిక - సామంత్‌లను నందగోపాల్ వచ్చి కలుస్తాడు. మేం చెప్పినట్లు వింటే ఫారిన్‌లో లగ్జరీగా బతకొచ్చని వారిద్దరూ మాయమాటలు చెబుతారు. ఎస్ఐ నందగోపాల్ లోకేషన్ పెట్టడంతో కావ్య - రాజ్‌లు కార్‌లు బయల్దేరతారు. గెస్ట్‌హౌస్‌లో రాజ్- కావ్యలను చూసిన నందగోపాల్ షాక్ అయి రాజ్ చేతిలో దెబ్బలు తిన్నా తప్పించుకుంటాడు. ఇంట్లో అంతా తన మాట వినాల్సిందేనని కావ్య ఆర్డర్స్ వేయడంతో ప్రకాశం నొచ్చుకుంటాడు. రాజ్ చేతిలో తప్పించుకున్న నందగోపాల్‌ను అనామిక లాగి పీకుతుంది. రాజ్‌ను దెబ్బకొట్టడానికి కావ్య వేసే డిజైన్లు తనకు కావాలని సామంత్‌ను అడుగుతుంది.
డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు .. 606 ఎపిసోడ్ నుంచి 611 వరకు ఏం జరిగిందంటే?
డిసెంబర్ 30వ తేదీ 606వ ఎపిసోడ్‌లో రాజ్ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది కంపెనీ ఖాతాలో డబ్బులు లేవా? లేక నిజంగానే ఆడిటింగ్ నిర్వహించారా ? అని రుద్రాణి - ధాన్యలక్ష్మీలు మాట్లాడుకుంటూ ఉంటారు. తాతయ్య హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలో తెలియక కుమిలిపోతున్న రాజ్‌కి కావ్య తన నగలు ఇచ్చి తాకట్టు పెట్టమంటుంది. ట్రైనింగ్‌కు వెళ్లి ఇన్ని రోజులు గడుస్తున్నా తనను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అలిగిన అప్పూకి కళ్యాణ్ తన తాతయ్య కోమాలోకి వెళ్లిన నిజం బయటపెడతాడు. ఉదయాన్నే అద్దె కారుల వాడకానికి సంబంధించిన బిల్లు రావడంతో రాజ్ షాక్ అవుతాడు. దీంతో కావ్య అతనికి ధైర్యం చెప్పి.. అద్దె కార్లను ఓనర్‌కి పంపేద్దామని చెబుతుంది.

డిసెంబర్ 31వ తేదీ 607 ఎపిసోడ్‌లో కాఫీ కోసం ఉదయాన్నే పనిమనిషి శాంతతో గొడవ పడుతుంది రుద్రాణి. ఇంతలో కావ్య - రాజ్‌లు బయటికి వచ్చి ఇంట్లో ఉన్న అద్దెకారులను వెనక్కి పంపడాన్ని చూస్తుంది. జగదీష్ చంద్రప్రసాద్ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కావాల్సిన పెట్టుబడి లేకపోవడంతో రాజ్ ఆందోళన పడుతుంటాడు. ఇంతలో జగదీష్ చంద్రప్రసాద్ వచ్చి అడ్వాన్స్‌గా 5 కోట్లు ఇస్తాడు. మీ కండీషన్ గురించి కావ్య ఫోన్ చేసి చెప్పిందని అనడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ వెంటనే భార్యని ఎత్తుకుని గాల్లో తిప్పుతాడు. కావ్య అద్దె కారులను పంపేసిన విషయాన్ని సాకుగా చూపించి ఇంట్లో చిచ్చుపెట్టాలని ప్లాన్ చేస్తుంది రుద్రాణి. నేరుగా ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి షాపింగ్‌కి వెళ్దామని చెప్పి తీసుకొస్తుంది. ఇంటి బయటికి వచ్చేసరికి గ్యారేజ్‌లో ఒక్క కారు కూడా లేకపోవడంతో రాహుల్ వచ్చి కార్లను కావ్య పంపేసిన విషయాన్ని ధాన్యలక్ష్మీకి చెబుతాడు. ఆ మాట వినగానే ధాన్యలక్ష్మీ ఇంట్లో రచ్చ చేస్తుంది.
జనవరి 1వ తేదీ 608వ ఎపిసోడ్‌లో అద్దె కార్ల సంగతి తేల్చేయాలని రుద్రాణి - ధాన్యలక్ష్మీలు పట్టుబట్టడంతో ఆఫీసు నుంచి వచ్చాక అన్ని విషయాలు కనుక్కుంటానని అంటుంది అపర్ణ. జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు పెట్టుబడి అవసరాల కోసం మాత్రమే డబ్బును వాడాలని మేనేజర్‌కి కళావతి ఆర్డర్స్ వేస్తుంది. స్వరాజ్ కంపెనీ లాస్‌ల్లో ఉందని, మనకి జీతాలు ఇవ్వడం కూడా కష్టమేనని చులకనగా మాట్లాడిన స్టాఫ్‌కి చీవాట్లు పెడుతుంది కావ్య. అనామిక- సామంత్‌లను నందగోపాల్ వచ్చి కలుస్తాడు. 3 నెలలు అండర్ గ్రౌండ్‌లో ఉంటే నీ గురించి జనం మరిచిపోతారని , తర్వాత కోట్ల రూపాయలతో ఫారిన్‌లో సెటిల్ అవ్వొచ్చని అతనికి ఆశ పెడతారు. మన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టిన ఆ నందగోపాల్‌ని పట్టుకోవాలని రాజ్‌తో అంటుంది కావ్య. ఇంతలో ఎస్ఐ ఫోన్ చేసి నందగోపాల్ లోకేషన్ చెప్పడంతో ఇద్దరూ కారులో బయల్దేరతారు.

జనవరి 2వ తేదీ 609వ ఎపిసోడ్‌లో నందగోపాల్ కోసం వెళ్తుండగా ఓ వ్యక్తి వారిద్దని లిఫ్ట్ అడుగుతాడు. రాజ్ కారులోకి ఎక్కించుకున్న వ్యక్తి తన పేరును సావిత్రి అని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ షాక్ అవుతారు. ఇంతలోనే అతనికి తన హోమ్ లోన్ రావడంతో పాటు కోర్టులో ఎప్పటి నుంచో నలుగుతున్న కేసు గెలవడంతో కావ్య వల్ల తనకు అదృష్టం పట్టిందని ఆనందపడతాడు సావిత్రి. హాస్పిటల్‌లో తాతయ్య బెడ్ పక్కన ఉండగా అప్పూతో గడిపిన జ్ఞాపకాలు కళ్యాణ్‌కు గుర్తొస్తాయి. ఇంతలో ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ రావడంతో ఆమెని చూసి అప్పూయేనని భ్రమపడతాడు . నందగోపాల్ ఫాంహౌస్ దగ్గరికి వచ్చి వాచ్‌మెన్‌కి డబ్బు ఇచ్చి తన ప్రియురాలిని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. కావ్యతో సావిత్రి క్లోజ్‌గా ఉండటం చూసిన రాజ్ కుళ్లుకుంటూ ఉండగా ఇన్స్‌పెక్టర్ ఫోన్ చేసి నందగోపాల్ లోకేషన్ పెడతాడు.
జనవరి 3వ తేదీ 610వ ఎపిసోడ్‌లో కారులో తన భార్యతో క్లోజ్‌గా ఉంటున్న సావిత్రికి తాము కిడ్నాపర్లమని , నిన్ను కిడ్నాప్ చేశామని రాజ్ చెప్పడంతో పారిపోతాడు సావిత్రి. నందగోపాల్ కోసం అతని గెస్ట్‌హౌస్ దగ్గరికి రాగా.. వాచ్‌మెన్ పంపించకపోవడంతో మీ సార్‌కి డబ్బులు ఇవ్వడానికి వచ్చానని చెబుతాడు రాజ్. దీంతో వాచ్‌మెన్ వారిద్దరినీ లోపలికి పంపించగా.. గెస్ట్‌హౌస్‌లో ఏర్పాట్లు చూసి కావ్యకి బూత్ బంగ్లా గుర్తొచ్చి రాజ్‌పై అనుమానం వ్యక్తం చేస్తుంది. అపర్ణ - ఇందిరలు సీతారామయ్యని చూడటానికి హాస్పిటల్‌కి బయల్దేరతారు . దీనిని సాకుగా చూపించి రుద్రాణి - ధాన్యలక్ష్మీలు మరోసారి కావ్య వైఖరి గురించి గొడవ స్టార్ట్ చేస్తారు. గెస్ట్‌హౌస్ లోపల రాజ్ - కావ్యలను చూసిన నందగోపాల్ .. రాజ్ చేతిలో దెబ్బలు తిని అతని బారి నుంచి తప్పించుకుంటాడు.

జనవరి 4వ తేదీ 611వ ఎపిసోడ్‌లో రాజ్ - కావ్యలు ఇంటికి రాగానే కార్లు పంపించేసిన విషయాన్ని గురించి నిలదీస్తారు రుద్రాణి - ధాన్యలక్ష్మీ. తాను ఎవ్వరి అనుమతి తీసుకోవాల్సిన అనుమతి లేదని.. మీకు నచ్చినా నచ్చకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని అంటుంది కావ్య. ఆ మాటలతో ప్రకాశం నొచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో నువ్వు అందరికీ శత్రువుగా మారిపోతున్నావని రాజ్ కావ్యతో అంటాడు. కావ్య వైఖరితో ప్రకాశం కూడా రుద్రాణి వైపు వెళ్లే ప్రమాదం ఉందని ఇందిర భయపడుతుంది. కావ్య- రాజ్‌లతో మాట్లాడాలని సుభాష్ - అపర్ణలు ఎంత ప్రయత్నించినా వారిద్దరూ బాగా బిజీగా ఉంటారు. రాజ్ నుంచి తప్పించుకున్న నందగోపాల్‌ను లాగి పీకుతుంది అనామిక. కావ్య వేసిన డిజైన్లను నాకు కావాలని సామంత్‌ను అడుగుతుంది . తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











