Brahmamudi weekly roundup: రాజ్ బిజినెస్ దెబ్బకొట్టిన రాహుల్... పాప కేసులో అప్పూకి క్లూ
Photo Courtesy: JioHotstar
పాప మిస్సింగ్ కేసు వదిలేసి ఎమ్మెల్యే గారి మేనల్లుడి ఇంట్లో బంగారం చోరీ కేసును తీసుకోమని అప్పూకి తేల్చిచెబుతాడు సీఐ. పెన్‌డ్రైవ్‌కి సంబంధించిన రహస్యం కోసం చోటు, మోటులు మారు వేషాలు వేసుకుని రాజ్, కావ్యల చుట్టూ తిరుగుతారు. పాప దొరకకపోవడంతో రేణుక ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఆమెకు అప్పూ ధైర్యం చెప్పి బయటకు వస్తుండగా.. ఓ పాప వచ్చి అంజలి చనిపోలేదని, బతికే ఉందని నేను చూశానని చెప్పడంతో అప్పూ షాక్ అవుతుంది. మీ ఫ్రెండ్‌ని నేను వెతికి తీసుకొస్తానని చెబుతుంది. కావ్య దగ్గరి నుంచి దొంగిలించిన డిజైన్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా స్వప్నని తీసుకొచ్చి ఆమెతోనే ఫోటో షూట్ చేయిస్తాడు రాహుల్. అలాగే డిజైన్స్‌తో స్వరాజ్ కంపెనీ క్లయింట్స్‌ని తన వైపుకు తిప్పుకుంటాడు.
పెన్‌డ్రైవ్ కోసం రాజ్, కావ్యలను చోటు మోటు కిడ్నాప్ చేయగా పోలీసులు వారిద్దరినీ రక్షిస్తారు. రాహుల్ చేసిన మోసాన్ని శృతి ద్వారా తెలుసుకున్న సుభాష్.. రాహుల్‌ని లాగిపెట్టి కొడతాడు. ఆ డిజైన్స్ అన్ని నేను కష్టపడి వేసుకున్నానని చెబుతాడు దానికి స్వప్న కూడా సాక్ష్యంగా ఉంటుంది. కావ్యకు నయం కాలేదని తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ వారిద్దరీనీ నిలదీస్తుంది. మీ అందరి కోసం ఇలా చేశామని.. కానీ ఇప్పుడు కావ్యకి పూర్తిగా నయమైపోయిందని రాజ్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. రాహుల్ చేసిన మోసాన్ని ఆధారాలతో పట్టుకుంటానని అపర్ణకి చెబుతాడు సుభాష్.
బ్రహ్మముడి డిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు.. 898వ ఎపిసోడ్ నుంచి 903 వరకు ఏం జరిగిందంటే?
డిసెంబర్ 8వ తేదీ 898వ ఎపిసోడ్‌లో..
చోటు, మోటులు రాజ్ దగ్గరికి వచ్చి ఆ డానియేల్ గాడు ఇచ్చిన పెన్‌డ్రైవ్‌ని ఇవ్వమని గొడవ పడతారు. దాంతో రాజ్ లాగి పీకుతాడు. పెన్‌డ్రైవ్ తీసుకురాకపోవడంతో చోటు, మోటులపై వాళ్ల బాస్ మురుగన్ మండిపడతాడు. అది నా చేతికి దొరక్కపోతే నన్ను చంపేస్తారని, నా ప్రాణాలే పోతాయని చెబుతాడు మురగన్. ఇంతకీ ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందని చోటు, మోటులు అడగ్గా.. ఎమ్మెల్యే తాలూకా అమ్మాయితో గడిపిన వీడియో ఉంటుంది. అమ్మాయి సెట్ అయ్యింది, కక్కుర్తి పడ్డానని మురుగన్ చెప్పగా.. ఇది ఆ ఎమ్మెల్యే చేతికి దొరికితే వాడు నన్ను చంపేస్తాడని అంటాడు. రేణుక పాప మిస్సింగ్ కేసును వదిలేసి ఎమ్మెల్యే గారింట్లో బంగారం చోరీ కేసు చూసుకోవాలని అప్పూకి సీఐ ఆర్డర్స్ వేస్తాడు. కావ్య వేసిన డిజైన్లను రుద్రాణికి చూపిస్తాడు రాహుల్. దుగ్గిరాల ఫ్యామిలీనే కాదు నన్ను ఇన్నాళ్లుగా అవమానించిన స్వప్నని కూడా వదలను... దాని ఆస్తి మొత్తాన్ని లాక్కుంటానని ప్లాన్ చేస్తాడు రాహుల్.
డిసెంబర్ 9వ తేదీ 899వ ఎపిసోడ్‌లో..
రెస్టారెంట్‌లో రాజ్, కావ్యల జంటను చుట్టుపక్కల వాళ్లు మెచ్చుకుంటారు. పెన్‌డ్రైవ్ కోసం చోటు, మోటులు వెయిటర్స్‌లా వేషం మార్చి రాజ్, కావ్యలు ఏం మాట్లాడుకుంటున్నారో వింటారు. ఆ తర్వాత కావ్య, రాజ్‌లు ఉంటున్న గదిలోకి వెళ్లి అంతా గాలించినా ప్రయోజనం దొరకదు. దీంతో మోటు గడ్డం పెట్టుకుని.. కావ్య, రాజ్‌లు ఉన్న టేబుల్ దగ్గర తన ఫోన్ పెడతాడు. ఈ విషయాన్ని గమనించిన రాజ్.. ఆ పెన్‌డ్రైవ్‌ని శృతికి ఇచ్చావా అని కావ్యని కావాలని అడుగుతాడు. శృతికి పెన్‌డ్రైవ్ ఇచ్చినట్లు చెప్పడంతో అదే నిజం అనుకుని సంబరపడిపోతారు చోటు, మోటు. వెంటనే ఆ ఫోన్ విసిరి కొడతాడు రాజ్. కావ్య వేసిన డిజైన్‌లు తనవని నిరూపించుకోవడానికి ప్లాన్ చేస్తాడు రాహుల్. ఆమె మెడలో హారం వేసి బుట్టలో వేసుకుంటాడు. నేను చాలా డిజైన్లు తయారు చేయించానని వీటిలో నీకు నచ్చినవి సెలెక్ట్ చేయమని రాహుల్ అడగటంతో స్వప్న ఎమోషనల్ అవుతుంది.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 10వ తేదీ 900వ ఎపిసోడ్‌లో..
పాప మిస్సింగ్ కేసుని వదిలేయమని సీఐ చెప్పడంతో అప్పూ ఆ ఫైల్ విసిరికొడుతుంది. ఇది చూసిన కళ్యాణ్ భార్యకి ధైర్యం నూరిపోస్తాడు. ఇంతలో రేణుక ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఫోన్ రావడంతో అప్పూ హుటాహుటిన అక్కడికి వెళ్తుంది. నా మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఇక తల్లిగా నేను బతికి ప్రయోజనం లేదని, నా పాపని తిరిగి చూస్తానో లేదోనని బాధపడుతుంది. రేణుకని ఓదార్చి అప్పూ బయటకు వస్తుండగా ఓ పాప వచ్చి అంజలి చనిపోలేదని, నేను చూశానని, ఆమె బతికే ఉందని చెబుతుంది. ఆ మాటలతో పాప బతికే ఉందని అప్పూ గట్టి నిర్ణయానికి వస్తుంది. పెన్‌డ్రైవ్ కొట్టేయడానికి రాజ్, కావ్యల రూమ్‌లోకి చోటు, మోటులు వెళ్లగా వారిద్దరినీ రాజ్ చితకబాదుతాడు. ఇక మాటలతో లాభం లేదని.. రాజ్, కావ్యలను కిడ్నాప్ చేసి మన బాస్ ముందు నిలబెడితే అంతా ఆయనే చూసుకుంటారని చోటు, మోటులు ప్లాన్ చేస్తారు.
డిసెంబర్ 11వ తేదీ 901వ ఎపిసోడ్‌లో..
డిజైన్స్ చూసుకుంటూ వర్క్‌లో బిజీగా ఉన్న రాహుల్ దగ్గరికి స్వప్న అందంగా ముస్తాబై వచ్చి అతనిని టెంప్ట్ చేస్తుంది. ఆ అందానికి ఫిదా అయిన రాహుల్.. స్వప్నని ముద్దు పెట్టుకుంటూ ఆగిపోతాడు. ఏం జరిగిందని స్వప్న అడగ్గా.. ఎంతో కష్టపడి డిజైన్లు చేయించాను కానీ నా డిజైన్స్ పబ్లిసిటీ చేయడానికి నా దగ్గర డబ్బు లేదని చెబుతాడు రాహుల్. నువ్వు ఒకప్పుడు మోడల్‌గా చేశావు కాబట్టి నా కంపెనీకి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. నాకు పెళ్లయి, ఓ పాప కూడా ఉందని ఇలాంటి పనులు చేయనని స్వప్న చెప్పగా రాహుల్ ఆమెను ఒప్పిస్తాడు. రాజ్‌కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ కేరళలో తారసపడతాడు. ఇంతలో రాజ్ - కావ్యలకి పెన్‌డ్రైవ్‌ని ఇవ్వమని రూమ్ బాయ్ తన మనిషిని పంపించగా.. అతను పొరపాటున పోలీస్ ఆఫీసర్‌కి ఇస్తాడు. రాజ్- కావ్యలను చోటు, మోటులు కిడ్నాప్ప చేయడాన్ని ఆ పోలీస్ చూసి వెంబడిస్తాడు. రాహుల్ చెప్పినట్లే స్వప్న కొత్త డిజైన్స్‌కి మోడలింగ్ చేస్తుంది. స్వరాజ్ కంపెనీకి చెందిన క్లయింట్స్‌ని రాహుల్ మాయ చేసి తనవైపుకు తిప్పుకుంటాడు.

Photo Courtesy: JioHotstar
డిసెంబర్ 12వ తేదీ 902వ ఎపిసోడ్‌లో..
రేణుకను, ఆమె భర్తను స్టేషన్‌కి పిలిపించి ఎంక్వైరీ చేస్తుంది అప్పూ. మీ పాప బతికే ఉందని.. చనిపోయిన పాప ఎవరో తేల్చుకోవడానికి రీ పోస్ట్‌మార్టం చేస్తున్నామని అప్పూ చెప్పడంతో అతను వణికిపోతాడు. దాంతో అప్పూకి రేణుక భర్తపై అనుమానం మొదలవుతుంది. ట్రీట్‌మెంట్‌కి ఆఖరి రోజు కావడంతో ఎలాగైనా బయటపడాలని అనుకున్న రాజ్.. పక్కనే ఉన్న బీర్ బాటిల్ పగులగొట్టి దానితో కట్లు విప్పుకుంటాడు. కావ్యని తీసుకుని పారిపోతుండగా మురుగన్ గన్‌తో బెదిరిస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి రాజ్- కావ్యలను రక్షిస్తారు. స్వరాజ్ కంపెనీకి రాహుల్ చేసిన నమ్మక ద్రోహం గురించి.. కావ్య డిజైన్లను దొంగిలించిన విషయం గురించి సుభాష్‌కి చెబుతుంది శృతి. ఆ మాటలు వినగానే సుభాష్ షాక్ అవుతాడు. ఇంటి దగ్గర రాహుల్ డిజైన్స్‌ని అందరూ మెచ్చుకుంటూ ఉండగా సుభాష్ వచ్చి రాహుల్‌ని లాగిపెట్టి కొడతాడు. కావ్య వేసిన డిజైన్స్‌ని ఎందుకు దొంగిలించావని సుభాష్ నిలదీయగా.. నిద్రాహారాలు మాని, డిజైనర్‌తో చెప్పి వేయించానని చెబుతాడు రాహుల్. దానికి స్వప్న కూడా సాక్ష్యం చెప్పడంతో సుభాష్ సైలెంట్ అయిపోతాడు.
డిసెంబర్ 13వ తేదీ 903వ ఎపిసోడ్‌లో..
నీ భార్యకు 99 శాతం నయమైపోయిందని గురువుగారు చెప్పడంతో రాజ్, కావ్యలు సంతోషిస్తారు. పనిమనిషి రాజ్ బెడ్‌రూమ్ క్లీన్ చేస్తుండగా కావ్య ట్రీట్‌మెంట్ ఫైల్ బయటపడుతుంది. అది చూసిన రుద్రాణి.. కావ్యకు ఇంకా నయం కాలేదని గుర్తించి అందరికీ విషయం చెబుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రాజ్, కావ్యలు అప్పుడే కేరళ నుంచి ఇంటికి రాగా మమ్మల్ని ఎందుకు మోసం చేశావంటూ అపర్ణ మండిపడుతుంది. మీ అందరిలో సంతోషం చూడాలని, ఆనందంగా చనిపోవాలని కళావతి చెప్పడంతో ఇలా చేశామని రాజ్ చెబుతాడు. అయినా కావ్యకి ఇప్పుడు తగ్గిపోయిందని, ఆనందంగా పిల్లల్ని కనొచ్చని రాజ్ చెప్పగా దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. రాహుల్ చేసిన మోసాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అపర్ణతో చెబుతాడు సుభాష్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











