Brahmamudi Weekly Roundup : ఆస్తి కావ్య చేతికి.. రాజ్ పీకలపై 100 కోట్ల గండం, కావ్యను వాడేస్తోన్న రుద్రాణి

ఆస్తుల కోసం తన ముందే వారసులు కొట్టుకుంటూ ఉండటంతో ఇందిర ఆసుపత్రికి వెళ్లి భర్త బెడ్ వద్ద కూర్చొని ఏడుస్తుంది. అప్పూ ఎస్ఐ ట్రైనింగ్‌కు సెలెక్ట్ అయినట్లు తెలుసుకున్న కావ్య చాలా సంతోషిస్తుంది. రోజూ ధాన్యలక్ష్మీ - రుద్రాణిలు ఆస్తి కోసం పెట్టే టార్చర్ భరించలేక ఆస్తి పంపకాలు చేసేస్తానని సుభాష్ సంచలన నిర్ణయం తీసుకుంటాడు. ఆస్తిని ముక్కలు చేయొద్దని సుభాష్, రాజ్‌లను కావ్య ప్రాధేయపడుతుంది. ఉదయాన్నే లాయర్ వచ్చి సీతారామయ్య రాసిన వీలునామాను బయటపెట్టి ఆస్తి మొత్తం కావ్య పేరిట రాసినట్లు చెప్పడంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. ఆస్తి, ఇంటి బాధ్యతలు మోయడం తన వల్ల కాదని కావ్య భయపడగా రాజ్ ధైర్యం చెబుతాడు. సీతారామయ్య 100 కోట్లకు ష్యూరిటీ సంతకం చేశారని ఆ డబ్బు కట్టకుంటే మీ ఆస్తిని జప్తు చేస్తామని బ్యాంక్ వాళ్లు బెదిరించడంతో రాజ్ షాక్ అవుతాడు. కుటుంబ పరువు పోకూడదని రాజ్ సంతకం చేసి 10 రోజులు గడువు తీసుకుంటాడు.

డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు .. 588 ఎపిసోడ్ నుంచి 593 వరకు ఏం జరిగిందంటే?

డిసెంబర్ 9వ తేదీ 588వ ఎపిసోడ్‌లో తన భర్త, ఇంటి పెద్ద సీతారామయ్య ఆసుపత్రి పాలైతే కొంచెం కూడా జాలి చూపించకపోగా.. తనముందే కుటుంబ సభ్యులంతా ఆస్తి కోసం కొట్టుకుంటూ ఉండటంతో ఇందిర కోప్పడుతుంది. వారి మాటలు తట్టుకోలేక భోజనం చేయకుండా లేచి వెళ్లిపోతుంది. దీంతో పెద్దావిడకి అపర్ణ, కావ్యలు భోజనం తీసుకుని వెళ్లగా గదిలో ఇందిర కనిపించదు. ఆసుపత్రిలో నిర్జీవంగా పడివున్న భర్త పక్కన కూర్చొని ఏడుస్తున్న నాయనమ్మని చూసి కళ్యాణ్ బాధపడతాడు, ఇంతలో అక్కడికి భోజనం తీసుకుని కావ్య వస్తుంది. తాతయ్య కోమాలో నుంచి ఎప్పుడొస్తాడో తెలియదని కావ్యకి కళ్యాణ్ షాకింగ్ న్యూస్ చెబుతాడు. ఇక అప్పూ ఎస్ఐ ట్రైనింగ్‌కి సెలెక్ట్ అయ్యిందని తెలుసుకున్న కావ్య చాలా సంతోషిస్తుంది. కళ్యాణ్ పేరిట రాయించిన ఆస్తి పేపర్లు చూసుకుంటూ ఉండగా ధాన్యలక్ష్మీపై మండిపడతాడు ప్రకాష్. కిచెన్‌లో నేలపై పడుకున్న కావ్యని చూసిన అపర్ణ షాకై వెంటనే రాజ్‌ను పిలుస్తుంది. వారిద్దరూ కళావతికి చీవాట్లు పెడతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup December 9th to December 14th episode Story

డిసెంబర్ 10వ తేదీ 589వ ఎపిసోడ్‌లో కిచెన్‌లో పడుకున్న కావ్యని తల్లి చీవాట్లు పెట్టడంతో బెడ్ రూంలోకి తీసుకెళ్తాడు రాజ్. కానీ బెడ్‌ను రెడ్ కలర్ టేపుతో రెండుగా విడగొట్టి నువ్వు నా వైపు రావొద్దని చెబుతాడు. ఆ మాటలతో బాధపడిన కావ్య.. చాప, దిండు తెచ్చుకుని నేలపై పడుకుంటుంది. ఆస్తిని ముక్కలు చేయడానికి రాహుల్- రుద్రాణి కలిసి కొత్త పథకం రచిస్తారు. ఉదయాన్నే ఓ ఖాళీ చెక్ తీసుకెళ్లి రాజ్‌ను 2 కోట్లు అడుగుతాడు రాహుల్. దీంతో రాజ్, ప్రకాశంలు చీవాట్లు పెట్టి పంపేస్తారు. ఆ వెంటనే రాహుల్‌ని వెంట బెట్టుకుని ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. నువ్వే రాజ్‌ని అడిగి నా బిజినెస్‌కి హెల్ప్ చేయమని అడుగుతాడు రాహుల్. ఇంతలో ధాన్యలక్ష్మీ ఏదో ఆలోచిస్తుండగా రుద్రాణి ఆమెను రెచ్చగొట్టి రాజ్ దగ్గరికి పంపిస్తుంది.

డిసెంబర్ 11వ తేదీ 590వ ఎపిసోడ్‌లో రుద్రాణి, రాహుల్‌లు రెచ్చగొట్టడంతో ధాన్యలక్ష్మీ చెక్ తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్లి రూ.2 కోట్లు అడుగుతుంది. వాళ్లకి ఇవ్వలేదని నిన్ను రెచ్చగొట్టి పంపిస్తారా అని సుభాష్ మండిపడతాడు. రుద్రాణికి ఇస్తారో ఇవ్వరో నాకు అనవసరమని.. నాకు మాత్రం ఆస్తి పంచాల్సిందేనని ధాన్యలక్ష్మీ గొడవ పడుతుంది. నాన్న తిరిగి వచ్చాక చూసుకుందామని సుభాష్ చెబుతుండగా.. ఒకవేళ నాన్న తిరిగి రాకపోతే అని రుద్రాణి ఎదురు ప్రశ్నిస్తుంది. దీంతో ఇందిర వచ్చి ఆమె చెంప పగులగొడుతుంది. ఈ గొడవని చూసిన సుభాష్ మీలాంటి వాళ్లతో కలిసి ఉండలేనని రేపే లాయర్‌ని పిలిపించి మొత్తం ఆస్తిని వాటాలు వేయిస్తానని సంచలన నిర్ణయం తీసుకుంటాడు. ఆస్తి పంపకాలు జరగకుండా చూడాలని మావయ్యని, రాజ్‌ను బతిమలాడుతుంది కావ్య.

Brahmamudi Telugu Serial Weekly roundup December 9th to December 14th episode Story

డిసెంబర్ 12వ తేదీ 591వ ఎపిసోడ్‌లో తాతయ్య తనకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకున్నాడని.. నిన్ను సీఈవోని చేసేటప్పుడు నన్ను ఒక్క మాట కూడా అడగలేదని కావ్యతో రాజ్ అంటాడు. ఎవరికీ కలిసి ఉండాలని లేదని, ఆస్తే ముఖ్యమని నేను ఏం చేయలేనని చెబుతాడు. ఆస్తి పంపకాలకి సుభాష్ నిర్ణయం తీసుకోవడంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణిలు సంబరాల్లో తేలిపోతుండగా ప్రకాష్ వచ్చి ఇద్దరికీ చీవాట్లు పెడతాడు. ఉదయాన్నే లాయర్ రావడంతో ఆస్తిని ముక్కలు చేయాలని నిర్ణయించుకున్నామని సుభాష్ చెబుతాడు. మీకు ఆ అధికారం లేదని మీ నాన్నగారు కొద్దిరోజుల క్రితమే వీలునామా రాశారని నిజం బయటపెడతారు లాయర్. ఆ వీలునామాలో ఆస్తి మొత్తం కావ్యకు రాస్తున్నట్లు సీతారామయ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దీనిని తాను ఒప్పుకునేది లేదని నాకు న్యాయం జరగడానికి కోర్టుకెక్కుతానని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది.

డిసెంబర్ 13వ తేదీ 592వ ఎపిసోడ్‌లో ఆస్తి పేపర్లు, ఇంటి తాళాలను సంతోషంగా కావ్య చేతిలో పెడతారు ఇందిర, సుభాష్, అపర్ణ. ఈ దెబ్బకు కళావతి భయపడి నేరుగా రాజ్ దగ్గరికి వెళ్లి నా వల్ల కాదని భర్తకు చెబుతుంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో నీ దగ్గరే ఆస్తి , తాళాలు సేఫ్‌గా ఉంటాయని .. తాతయ్య నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టమని కావ్యని అడుగుతాడు రాజ్. ఆస్తి మొత్తం కావ్య చేతికి వచ్చేసరికి ఏం చేయాలో తెలియక రాహుల్, రుద్రాణిలు సీరియస్‌గా ఆలోచిస్తుంటారు. ధాన్యలక్ష్మీ కూడా ఆస్తిని తనకు వచ్చేలా చేయాలంటూ లాయర్‌తో మాట్లాడుతుంది. ఉదయాన్నే ఇందిరను పరామర్శిద్దామని కనకం రాగా.. ఆమెను రుద్రాణి, ధాన్యలక్ష్మీలు నానామాటలు అని కనకం మనసు ముక్కలు చేస్తారు.

Brahmamudi Telugu Serial Weekly roundup December 9th to December 14th episode Story

డిసెంబర్ 14వ తేదీ 593వ ఎపిసోడ్‌లో రాజ్ ఆఫీస్‌లో ఉండగా కొందరు బ్యాంక్ అధికారులు సరాసరి లోపలికి వచ్చేస్తారు. మీ తాతయ్య గారు ఓ చిట్ ఫండ్ కంపెనీకి రూ.100 కోట్లు ష్యూరిటీ సంతకం పెట్టారని.. ఆ కంపెనీ ఇప్పుడు దివాళా తీయడంతో వాళ్లు మాకు కట్టాల్సిన డబ్బును మీ తాతయ్యకి బదులుగా మీరు కట్టాలని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. 10 రోజులు టైం ఇస్తున్నామని.. ఈలోగా 100 కోట్లు కట్టకుంటే మీ ఆస్తుల్ని జప్తు చేస్తామని బెదిరించడంతో రాజ్ షాక్ అవుతాడు. డబ్బు కోసం కావ్యను నానా మాటలు అంటుంటారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ. గడువులోగా 100 కోట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక రాజ్ రోడ్డుపై పిచ్చోడిలా తిరుగుతుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X