Brahmamudi weekly roundup: కావ్య చేతిలో రుద్రాణికి చావు దెబ్బ... రాజ్- కావ్యల హత్యకు రేఖ కుట్ర
Photo Courtesy: JioHotstar
అప్పూ- కళ్యాణ్‌లు కిడ్నాప్ కావడంతో వాళ్లు తిరిగొచ్చే వరకు ఇంట్లోకి రాబోమని కావ్య- రాజ్‌లు వెళ్లిపోతారు. మినిస్టర్‌ను అడ్డుపెట్టుకుని దుగ్గిరాల వారింట్లో అడుగుపెట్టబోతున్నట్లు రాహుల్- రేఖలకు చెబుతుంది రుద్రాణి. అప్పూ- కళ్యాణ్‌లను దాచిపెట్టిన ప్లేస్‌కి వెళ్లి ఇద్దరినీ వెతుకుతున్న కావ్యకు అనుమానం వచ్చి వీడియో చూడగా.. మరో ప్లేస్‌లో వాళ్లిద్దరూ ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్తారు. అప్పూకి నెలలు నిండటంతో నొప్పులు మొదలవుతాయి.. కళ్యాణ్ ఎంత ప్రాధేయపడినా విడిచిపెట్టకపోవడంతో రాజ్- కావ్యలు వచ్చి కాపాడతారు. ఆసుపత్రిలో అప్పూకి పండంటి ఆడబిడ్డ పుట్టడంతో అంతా సంతోషిస్తారు. తన కూతురు బారసాల కార్యక్రమానికి రావాల్సిందిగా దుగ్గిరాల ఫ్యామిలినీ మినిస్టర్ ఆహ్వానిస్తాడు. పాపపై అటాక్ చేసిన వారి నుంచి ఈ కుట్ర వెనుక రుద్రాణి వుందని తెలుసుకుంటారు అప్పూ- కావ్య. దాంతో వారిద్దరికి యాక్సిడెంట్ చేయిస్తుంది రుద్రాణి. స్వల్పగాయాలతో బయటపడిన అప్పూ- కళ్యాణ్‌లు మినిస్టర్ ఇంటికి వెళ్లి రుద్రాణి చేసిన దారుణాలన్నీ చెబుతారు. దాంతో రుద్రాణిని చెప్పుతో కొడుతుంది కావ్య. పగతో రగిలిపోతున్న రుద్రాణి.. మొత్తం దుగ్గిరాల కుటుంబాన్ని చంపేయాలని ప్లాన్ చేస్తుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు .. 957వ ఎపిసోడ్ నుంచి 962వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
ఫిబ్రవరి 16వ తేదీ 957వ ఎపిసోడ్‌లో ..
ఎన్ని కష్టాలు ఎదురైనా సీతారామయ్య గారి ట్రస్ట్ కల ఎలాగైనా నెరవేర్చాలని రాజ్‌తో చెబుతుంది కావ్య. కళ్యాణ్‌కు సగం ఆస్తి రాసిస్తే.. ధాన్యలక్ష్మీ గారు ఏ గొడవ చేయరని కావ్య సలహా ఇవ్వడంతో లాయర్‌తో మాట్లాడి అలాగే చేస్తాడు రాజ్. ధాన్యలక్ష్మీ చేతిలో ఆస్తిని కళ్యాణ్ పేరు మీద రాసినట్లు పేపర్లు పెడుతుండగా ఆమెకు ఓ వీడియో వస్తుంది. అక్కడ నా కొడుకు, కోడల్ని కిడ్నాప్ చేసి.. నా చేతిలో ఆస్తి పేపర్లు పెడతారా అని రాజ్- కావ్యలపై ధాన్యం మండిపడుతుంది. రాజ్ సార్ వీళ్లని కిడ్నాప్ చేయమన్నారని రౌడీలు మాట్లాడటం వీడియోలో వినిపించడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మా మీద పడిన నిందని మేమే చెరిపేస్తాం.. అప్పూ - కళ్యాణ్‌ల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు మేం కూడా ఇంట్లో అడుగుపెట్టమని వెళ్లిపోతారు రాజ్ - కావ్య. రేవతి ఇంటికి వెళ్లి జరిగినదంతా చెబుతారు రాజ్ - కావ్య. ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొట్టేలా రాజ్- కావ్యలు ఆ రేవతి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారని చెబుతాడు రాహుల్. ఆ మాటలు విన్న ధాన్యం.. ఇంటిలో పెద్ద గొడవ చేస్తుంది.
ఫిబ్రవరి 17వ తేదీ 958వ ఎపిసోడ్‌లో..
రాజ్ - కావ్యలు అప్పూ- కళ్యాణ్‌లను వెతక్కుండా రేవతి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారని ధాన్యం నానామాటలు అనడంతో అపర్ణ, సుభాష్‌లు సీరియస్ అవుతారు. తమ ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ కావడంతో రాహుల్, రేఖలతో కలిసి మందు తాగుతూ రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. ఆస్తి పంపకాలని, ట్రస్ట్ ఏర్పాటును అడ్డుకున్నప్పటికీ త్వరలో ఆ మంత్రిని అడ్డం పెట్టుకుని దుగ్గిరాల వారింట్లో అడుగుపెట్టడమే నా టార్గెట్ అని చెబుతుంది రుద్రాణి. పాపకి బాగా జ్వరం రావడంతో స్వప్న కంగారుపడుతుంది. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రాహుల్‌కి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది స్వప్న. ఆఫీసులో బాగా బిజీగా ఉన్నానని.. రావడానికి లేట్ అవుతుందని అబద్ధం చెబుతాడు రాహుల్. దాంతో ఏం చేయాలో తెలియక.. పాపను ఎలా కాపాడుకోవాలో తెలియక కావ్యకి ఫోన్ చేయడంతో స్వప్న కోసం పరుగు పరుగున ఆసుపత్రికి వెళ్తారు రాజ్- కావ్య. స్వప్నని తీసుకుని సుభాష్ హాస్పిటల్‌కు వచ్చి కావ్య, రాజ్‌లకు ధైర్యం చెబుతాడు. పాప కోలుకోవడంతో మీరు లేకపోతే నా పాప ఏమయ్యేదోనని కావ్య- రాజ్‌లకు థ్యాంక్స్ చెబుతుంది స్వప్న. ఇంతలో అప్పూ- కళ్యాణ్‌లను రౌడీలు దాచిపెట్టిన ప్లేస్ ఆచూకీ తెలిసినట్లు ఎస్ఐ లోకేషన్ పెట్టడంతో అక్కడికి వెళ్తారు రాజ్ - కావ్య.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 18వ తేదీ 959వ ఎపిసోడ్‌లో..
అప్పూ - కళ్యాణ్‌ల ఆచూకీని వెతుకుతూ ఓ ఇంట్లో వచ్చిన కావ్య - రాజ్‌లకు కిడ్నాపర్లు పంపిన వీడియోలో చూసిన ఇల్లు ఇది కాదని అనుమానం వస్తుంది. ఆ వీడియోను పరీక్షగా చూడగా అందులో దొరికిన ఫోన్ నెంబర్ ఆధారంగా అడ్రస్ కనిపెడతారు. మరోవైపు.. అప్పూకి నెలలు నిండటంతో నొప్పులు మొదలవుతాయి.. భార్య పరిస్ధితి చూసి కంగారుపడిన కళ్యాణ్ తమను వదిలేస్తే కోరినంత డబ్బు ఇస్తామని రౌడీలను బతిమలాడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాజ్- కావ్యలు.. రౌడీల కన్నుగప్పి అప్పూ- కళ్యాణ్‌లను విడిపిస్తుండగా రౌడీలు వచ్చి రాజ్‌ను చితకబాదుతారు. దాంతో రాజ్ స్పృహతప్పి పడిపోతాడు. అప్పూ- కళ్యాణ్‌లు తప్పించుకున్నారని రుద్రాణికి రౌడీలు ఫోన్ చేసి చెప్పడంతో ఆమెకు చెమటలు పడతాయి. వాళ్లిద్దరూ తప్పించుకుంటే నేను దొరికిపోతాను, వాళ్లను చంపేయమని చెబుతుంది. అప్పూని రౌండప్ చేసిన రౌడీలు చంపబోతుండగా రాజ్ వచ్చి అడ్డుకుని అందరినీ చితకబాదుతాడు. అనంతరం అప్పూని ఆసుపత్రికి తరలిస్తారు. ఈ విషయం తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం అక్కడికి వస్తుంది. మీరే కిడ్నాప్ చేయించి.. మీరే కాపాడినట్లు నటిస్తున్నారని రాజ్- కావ్యలను ధాన్యం నానామాటలు అనడంతో కళ్యాణ్ క్లాస్ పీకుతాడు.
ఫిబ్రవరి 19వ తేదీ 960వ ఎపిసోడ్‌లో..
కొడుకు - కోడల్ని అలా చూసేసరికి తట్టుకోలేక మిమ్మల్ని అనరాని మాటలు అన్నానని రాజ్- కావ్యలకు క్షమాపణలు చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో అప్పూకి డెలివరీ జరిగి పండంటి ఆడపిల్ల పుట్టినట్లు డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. మన కుటుంబానికి ఎవరో శత్రువులు ఉన్నారని.. ఏమాత్రం ఆలస్యమైనా అప్పూ ప్రమాదంలో పడేదని కావ్య అనడంతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇద్దరు చిన్నారుల రాకతో దుగ్గిరాల ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇంతలో మినిస్టర్ ధర్మేంద్ర వచ్చి జరిగినదానికీ అందరికీ క్షమాపణలు చెప్పి తన కూతురు బారసాల ఫంక్షన్‌కి రమ్మని ఆహ్వానిస్తాడు. కావ్యను అడ్డు తప్పించి నాతో పెళ్లి చేస్తానని చెప్పావు.. అప్పూ - కళ్యాణ్‌లను చంపలేకపోయావని రాహుల్, రేఖలు రుద్రాణిపై కోప్పడతారు. నేను త్వరలోనే దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టబోతున్నానని, ఇందుకు మినిస్టర్‌ను వాడుకోబోతున్నట్లు చెబుతుంది రుద్రాణి. అప్పూకి తనను కిడ్నాప్ చేయించినవాళ్లు, పాప మీద అటాక్ చేయించినవాళ్లు ఎవరో కనుక్కునే పనిలో ఉందని రేఖ చెప్పడంతో దాని సంగతి నేను చూసుకుంటానని చెబుతుంది రుద్రాణి.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 20వ తేదీ 961వ ఎపిసోడ్‌లో..
మినిస్టర్ ఇంట్లో బారసాల ఫంక్షన్‌కి అప్పూ- కళ్యాణ్‌లు రెడీ అవుతుండగా అప్పూకి ఎస్ఐ ధనుంజయ్ ఫోన్ చేసి పాప మీద అటాక్ చేసిన రౌడీలను ఎక్కువ రోజులు సీక్రెట్‌గా దాయలేమని చెబుతాడు. దాంతో తనను అక్కడికి తీసుకెళ్లమని అప్పూ అడగటంతో కళ్యాణ్ ఒప్పుకుంటాడు. కావ్య పాపకు ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారని అడుగుతుంది ఇందిర. నీ పేరుని బట్టి ఇందు అని పెడదామని అనుకుంటున్నానని చెబుతాడు రాజ్. ఆ మాటలతో ఇందిర ఎమోషనల్ అవుతుంది. మేం గుడికి వెళ్లి ఫంక్షన్‌కు వస్తామని పెద్దవాళ్లకి చెప్పి కళ్యాణ్ - అప్పూలు రౌడీల్ని దాచిన ప్లేస్‌కి వెళ్తారు. ఈ విషయాన్ని రుద్రాణికి చెబుతుంది రేఖ. దాంతో వాళ్లిద్దరినీ చంపేస్తానని రేఖతో అంటుంది రుద్రాణి. తెలివిగా నాటకం ఆడి రౌడీల నుంచి నిజం రాబడుతుంది అప్పూ. మాకు డబ్బులచ్చింది ఒక లేడీ అని.. ఫోన్‌లో రుద్రాణి ఫోటో తీసి చూపించడంతో అప్పూ- కళ్యాణ్‌లు షాక్ అవుతారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మినిస్టర్ ఇంటికి వస్తుంది. తన బిడ్డకు ప్రాణం పోసిన నువ్వే ఊయలలో వేయాలని కావ్యతో అంటుంది తులసి. అప్పూ- కళ్యాణ్‌లు వస్తున్న కారుకు యాక్సిడెంట్ అవుతుంది.
ఫిబ్రవరి 21వ తేదీ 962వ ఎపిసోడ్‌లో ..
మినిస్టర్ ఇంటికి రుద్రాణి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మిమ్మల్ని మినిస్టర్ గారు ఈ ఫంక్షన్‌కు పిలుస్తారని నాకు తెలుసు... మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చానని రుద్రాణి దొంగనాటకాలు ఆడుతుంది. ఇంతలో అప్పూ- కళ్యాణ్‌లు గాయాలతో ప్రత్యక్షం కావడంతో రుద్రాణి, దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది. అక్క పాపని మార్చించి, మమ్మల్ని కిడ్నాప్ చేయించింది, చివరికి ఈరోజు యాక్సిడెంట్ చేసి చంపాలని అనుకున్నది ఈ రుద్రాణియే అని అప్పూ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది. జరిగింది మొత్తం మినిస్టర్ చెప్పడంతో రుద్రాణిని చెప్పుతో కొడుతుంది కావ్య. నా కళ్లముందు కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. తనకు జరిగిన అవమానానికి రుద్రాణి రగిలిపోతూ.. కత్తితో పొడుచుకుని చనిపోవాలని అనుకుంటుంది. ఇంతలో రాహుల్ - రేఖలు వచ్చి ఆపుతారు. ఆ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దామని చెప్పడంతో సరేనని అంటుంది రుద్రాణి. రుద్రాణి చేసింది తలచుకుంటూ దుగ్గిరాల ఫ్యామిలీ బాధపడుతుండగా రాహుల్, రేఖలు బ్యాగులు సర్దుకుని కిందకి వచ్చి మేం ఇంట్లోంచి వెళ్లిపోతామని చెబుతారు. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











